లక్నో: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. దేశంలోని ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో మోదీ సర్కారు విఫలమైందన్నారు. శుక్రవారం బీఎస్పీ సమావేశంలో మాయావతి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో ఉన్న మోదీ ప్రభుత్వంతో పాటు, ఉత్తరప్రదేశ్ లోని సమాజ్ వాదీ ప్రభుత్వం కూడా ప్రజలకు శాంతియుత వాతావరణం కలగజేయడంలో ఘోర వైఫల్యం చెందాయన్నారు.
దేశంలోని దళితుల సమస్యలతో పాటు, మైనారిటీలు, అణగారిన వర్గాల అభివృద్దిపై పట్టించుకోకుండా ఈ రెండు పార్టీలు కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. ఉత్తరప్రదేశ్ లో శాంతి భద్రతులకు పూర్తిగా విఘాతం ఏర్పడిందంటూ అఖిలేష్ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు.