న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన విందుకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. సిమ్లాకు పయనమయ్యే ముందు రాష్ట్రపతి భవన్ కు వచ్చిన మోడీ ప్రణబ్ ఇచ్చిన విందులో పాల్గొన్నారు. మే 26న ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రాష్ట్రపతితో విందు సమావేశంలో మోడీ పాల్గొన్నారు. ఈ ఇద్దరు నాయకుల మధ్య ఇది తొలివిందు సమావేశం కావడం విశేషం.
యూపీఏ హయాంలో నియమించిన గర్నవర్ల బదిలీ, కొత్త గవర్నర్ల నియామకంపై మోడీ సర్కారు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. విందు సమావేశానికి ముందు రాష్ట్రపతి భవన్ విశేషాలను ప్రధాని మోడీకి రాష్ట్రపతి కార్యదర్శి ఒమిత పాల్ వివరించారు.
ప్రధాని మోడీకి రాష్ట్రపతి విందు
Published Thu, Jul 3 2014 9:08 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement