
ప్రధాని మోదీని కలిసేందుకు సీఎం నో!
భువనేశ్వర్: రెండురోజుల ఒడిశా పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసే ఉద్దేశం తనకు లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ రాజకీయ లక్ష్యంతో రాష్ట్రంలో పర్యటిస్తున్నారని, అందుకే ఆయనను కలువాల్సిన అవసరం తనకు లేదని సీఎం నవీన్ విలేకరులతో చెప్పారు.
రెండురోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీతో సహా బీజేపీ అగ్రనేతలంతా భువనేశ్వర్ తరలివచ్చిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో నవీన్ పట్నాయక్‌ను సీఎం పీఠం నుంచి దింపడమే లక్ష్యమని బీజేపీ నేతలు ఈ సమావేశంలో ప్రతిన బూనారు. అయితే, బీజేపీ బెదిరింపులను సీఎం నవీన్ లైట్ తీసుకున్నారు. తమ పార్టీకి, ప్రభుత్వానికి బీజేపీ నుంచి ఎలాంటి ముప్పు లేదని పేర్కొన్నారు.