ప్రభుత్వరంగ ఎన్‌టీపీసీ సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసిక నికరలాభం 21 శాతం క్షీణించి రూ.2,492 కోట్లుగా నమోదయ్యింది.
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఎన్‌టీపీసీ సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసిక నికరలాభం 21 శాతం క్షీణించి రూ.2,492 కోట్లుగా నమోదయ్యింది. గత సంవత్సరం ఇదే కాలానికి కంపెనీ రూ.3,142 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇదే సమయంలో ఆదాయం రూ.17,171 కోట్ల నుంచి రూ.17,059 కోట్లకు తగ్గినట్లు ఎన్‌టీపీసీ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఇంధన వ్యయాలు పెరగడమే ఆదాయం, లాభాలు తగ్గడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సమీక్షా కాలంలో ఇంధన వ్యయం రూ,9,932 కోట్ల నుంచి రూ.10,139 కోట్లకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ పేర్కొంది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.11,000 కోట్ల పెట్టుబడులు పెట్టగా దాన్ని ఈ ఏడాది రూ.21,000 కోట్లకు పెంచనుంది. ప్రస్తుతం ఎన్‌టీపీసీ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 41,684 మెగావాట్లుగా ఉంది.