విజయసాయిరెడ్డి, మోపిదేవి, సబిత సహా ఇతర నిందితులు కూడా
సాక్షి, హైదరాబాద్: తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరయ్యారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మోపిదేవి వెంకట రమణారావు, ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, శామ్యూల్, డాక్టర్ మన్మోహన్‌సింగ్, గనుల శాఖ మాజీ డెరైక్టర్ వీడీ రాజగోపాల్, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, నిమ్మగడ్డ ప్రకాష్, ఐఆర్‌ఏఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డి, ఈశ్వర్ సిమెంట్స్ పూర్వ ఎండీ సజ్జల దివాకర్‌రెడ్డి, దాల్మియా సిమెంట్స్ అధికారులు సంజయ్ ఎస్.మిత్రా, నీల్‌కమల్‌బేరి, జయ్‌దీప్‌బసు తదితరులు కూడా హాజరయ్యారు.
కాగా, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్‌దాల్మియా, ఐఏఎస్ అధికారులు వెంకట్‌రామిరెడ్డి, శ్రీలక్ష్మి, రాంకీ సంస్థల అధినేత అయోధ్యరామిరెడ్డి తదితరుల హాజరునకు మినహాయింపు కోరుతూ వారి తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు అనుమతించింది. నిందితుల హాజరును నమోదు చేసుకున్న ప్రత్యేక కోర్టుల ఇన్‌ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేశారు.
కోర్టుకు హాజరైన జగన్
Published Fri, Nov 1 2013 3:02 AM | Last Updated on Sat, Jul 6 2019 12:52 PM
Advertisement