ఏర్కాడులో అన్నాడీఎంకే అభ్యర్థి ముందంజ | AIADMK leads in Yercaud of Tamil Nadu | Sakshi
Sakshi News home page

ఏర్కాడులో అన్నాడీఎంకే అభ్యర్థి ముందంజ

Published Sun, Dec 8 2013 10:44 AM | Last Updated on Sat, Sep 2 2017 1:24 AM

ఏర్కాడు నియోజకవర్గంలో అధికార అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థి విజయం దిశగా దూసుకు పోతున్నారు.

తమిళనాడు  ఏర్కాడు నియోజకవర్గంలో  అధికార అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థి విజయం దిశగా దూసుకుపోతున్నారు. డీఎంకే అభ్యర్థి వీ మారన్ పై అన్నా డీఎంకే అభ్యర్థి పి సరోజ 4800 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. 15729 ఓట్లు లెక్కింపు జరుపగా 432 ఓట్లు నోటా బటన్ ద్వారా వచ్చాయని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు.
 
డిసెంబర్ 4 తేదిన జరిగిన ఉప ఎన్నికల్లో ఏర్కాడు నియోజకవర్గంలో పదకొండు మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అన్నాడీఎంకే అభ్యర్థి సి పెరుమాల్ మృతితో ఉప ఎన్నిక జరిగింది. దాంతో పెరుమాల్ సతీమణి సరోజ ఎన్నికల బరిలో నిలిచారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement