ఖమ్మం వ్యవసాయం: వరదలు, వర్షాల కారణంగా తోటలకు తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండి తగు చర్యలు తీసుకోవాలని ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు- 1 జినుగు మరియన్న తెలిపారు. జిల్లాలో గోదావరి వరదలు, వర్షాల కారణంగా తెగుళ్లు సోకే అవకాశం ఉందని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన రైతులకు సూచించారు.
మిర్చి: భద్రాచలం ఏజెన్సీలోని భూములు మిర్చి సాగుకు అనుకూలంగా ఉండడంతో స్థానిక రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. భద్రాచలం, వెంకటాపురం, చర్ల, కూనవరం, కుక్కునూరు, బూర్గంపాడు, పినపాక, మణుగూరు, అశ్వాపురం, వేలేరుపాడు తదితర మండలాల్లో ఎక్కువగా మిర్చి చేపట్టారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలోని మిర్చి తొలిదశలో ఉంది. ముందుగా వేసిన మిర్చి కొమ్మల దశలో ఉండగా, కొన్ని ప్రాంతాల్లో మొక్క దశలో ఉంది.
మిర్చిలో ఆకుమచ్చ తెగులు: నీటి వలయాలతో కూడిన మచ్చలు ఆకులపై ఏర్పడి క్రమంగా ఆకులు మొత్తం అల్లుకొని ఆకులు పండుబారి రాలిపోతాయి. దీని నివారణకు 10 లీటర్ల నీటికి 30 గ్రాముల బ్లైటాక్స్ 1 గ్రాము టైప్రోసైక్లిన్ మందులను లీటరు నీటిలో కలిపి తెగులు ఉధృతిని బట్టి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
కొమ్మ ఎండు తెగులు: ప్రస్తుత వాతావరణంలో కొమ్మ, రెమ్మలపై నీటిలో నానిన విధంగా గోధుమ రంగు మచ్చలు ఏర్పడి తెగులు ఆశించిన భాగాలు కుళ్లి పోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల కాబ్రియోటప్ లేదా 1 మి.లీ ప్రాపికోనొజోల్ లేదా అర మి.లీ డైపిన్‌కోనోజోల్‌లను పిచికారీ చేయాలి.
ఎండు తెగులు: నీరు నిలిచిన దగ్గర ఈ తెగులు ఉధృతి అధికంగా ఉంటుంది చెట్టు ఏ దశలోనైనా ఈ తెగులు సోకితే నిలువునా ఎండిపోతుంది. అన్ని భాగాలపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి, కణజాలం దెబ్బతిని ఎదుగుదల ఉండక పూర్తిగా ఎండిపోతుంది. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల బ్లైటాక్స్ మందును చెట్ల వేర్లు తడిచేటట్లు పిచికారీ చేయాలి.
మామిడిలో ఆకుమచ్చ తెగులు: ఈ తెగులు ఉధృతి పెరిగే అవకాశం కలదు. ఆకులపై త్రిభుజాకారంలో చెదురు మొదురుగా మచ్చలు ఏర్పడి..మొత్తం వ్యాపించి పత్రహరితం కోల్పోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల సాఫ్ మందును కలిపి పిచికారీ చేయాలి.
జామలో ఎండు తెగులు: వేరుపై తెగులు ప్రారంభమైన కొద్దికాలంలోనే ఆకులు పసుపుపచ్చ రంగుకు మారతాయి. కొమ్మలు పై నుంచి కిందకు ఎండుతాయి. ఎక్కువగా చెట్టుకింది భా గం కొమ్మలు ఎండుతాయి. ఆకులు వడలిపోయి..రాలిపోతాయి. చె ట్టు కూడా మోడువారుతుంది. ఈ తెగులు తీవ్రతను తగ్గించేందుకు వర్షపునీరు, వరద నీటిని మొక్కల మొదళ్లలో నిల్వ ఉండకుండా చూడాలి. మొక్కకు కిలో చొప్పున సు న్నం, లేదా జిప్సం, పచ్చిరొట్ట ఎరువు లేదా పశువుల ఎరువును వేసుకోవాలి.
మొదళ్లలో కార్బండిజమ్ 1 గ్రాము లీటరు నీటిలో కలిపి తడపాలి. తె గులుతో ఎండిపోయిన మొక్కలను వేర్లతో సహా తొలగించాలి. చెట్టు చుట్టూ 1-1 1/2 మీటర్ల లో తు వరకు తవ్వి 2 శాతం ఫార్మాలిన్ ద్రావణంతో గుంతను తడపాలి. 14 రోజుల తర్వాత ఎండుటాకులను గుంతలో వేసి మంట పెట్టాలి. ఇలా చేసిన తర్వాత కొత్త మొక్కలను నాటుకోవాలి.
ఆంత్రక్నోన్ లేదా క్షీణింపు, కాయకుళ్లు
చెట్టుపై నుంచి రెమ్మలు, కొమ్మలు ఎండిపోతాయి. పూర్తిగా మాగిన పం డ్లపై గుండ్రటి గోధుమ రంగు మచ్చలు చిన్న చిన్న గుంతలుగా ఏర్పడతాయి. ఈ మచ్చలు మధ్యభాగం గులాబీ రంగును కలిగి ఉం టాయి. ఇలా ఏర్పడిన రెండు, మూడు రోజుల్లో పండ్లు కుళ్లిపోతాయి. దీని నివారణకు ఎండిన రెమ్మలను, కొమ్మలను కత్తిరించి కుళ్లిన పండ్లను తొలగించి, కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటిలో కలిపి కాయ తయారయ్యే సమయంలో 10-15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.
నిమ్మలో గజ్జి తెగులు: బ్యాక్టీరియా వల్ల సోకే ఈ తెగులు వల్ల ఆకులపై, కొమ్మలపై ఆఖరికి కాయలపై ఒక రకమైన పుం డ్లు, మచ్చలు ఏర్పడి, నష్టాన్ని కలిగిస్తాయి. నివారణకు 10 లీటర్ల నీటికి 30 గ్రాముల బైటాక్స్, 5 గ్రాముల ప్లాంటామైసిన్ కలిపి పిచికారీ చేయాలి.
ఎండు తెగులు: ఈ తెగులు బ్యాక్టీరియా వలన, శిలీంధ్రం వలన కలుగును. బ్యాక్టీరియా వల్ల అనగా కొమ్మ పంగలపై స్పష్టమైన బ్యాక్టీరియా వలన జిగురు ఏర్పడి కొమ్మలు పెరుగుదలను నిరోధిస్తుంది. కొమ్మల పెరుగుదలకు 10 లీటర్ల నీటిని 30 గ్రాముల బైటాక్స్, 5 గ్రాముల ప్లాంటామైసిన్ పిచికారీ చేయాలి. అలాగే శీలింధ్రం వలన ఎండుతెగులు సోకినట్లయితే మొదళ్ల వద్ద, ప్రధాన వేర్ల వద్ద జిగురు కారి చెట్లు చనిపోతాయి. ఈ తెగులు నివారణకు 10 లీటర్ల నీటికి రిడోమిల్ ఎం.జడ్.20 మిల్లీలీటర్లు లేదా 30 గ్రాముల బైటాక్స్ కలిపి పాదులో తేమ ఉన్నప్పుడు పోయాలి.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న తోటల్లో కాల్వలు ఏర్పాటు చేసి ప్రధానంగా మురుగు నీటిని పొలాల నుంచి తొలిగించే చర్యలు చేపట్టాలి.
‘ఉద్యానా’న్ని కాపాడుకోండి..
Published Mon, Sep 15 2014 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 PM
Advertisement
Advertisement