అంబేడ్కర్ ఆలోచనే ఊపిరిగా...
- కొత్త కోణం
అంబేడ్కర్ బౌద్ధాన్ని స్వీకరించడాన్ని సాంస్కృతిక విప్లవంగా ఎలినార్ అభివర్ణించారు. అంబేడ్కర్‌పై ఆరెస్సెస్‌కు అంత గౌరవం ఉంటే... హిందూమతాన్ని వదిలి అది బౌద్ధాన్ని స్వీకరించాలనీ, అదే అన్ని సమస్యలకు పరిష్కారమని అన్నారు.
‘‘పద్నాలుగో ఏట నుంచే ఆఫ్రో-అమెరికన్ నల్లజాతి ఉద్యమాలను సమర్థిస్తున్న నాలో సహజంగానే భారత దేశంలోని అంటరాని కులాల పోరాటం గురించి తెలుసు కోవాలనే ఆసక్తి పెరిగింది. అలా నేను అంబేడ్కర్ ఆలో చన, ఆచరణల పట్ల ఆకర్షితు రాలినయ్యాను’’ పదిరోజుల క్రితం కన్నుమూసిన ఇలి నార్ జెలియట్ (89) మాటలివి. అమెరికాలోని కార్లె టన్ విశ్వవిద్యాలయంలో 30 ఏళ్ల పాటు చరిత్ర అధ్యాపకు రాలిగా పనిచేసిన ఆమె అంబేడ్కర్ ఆలోచనకు పడమటి ప్రపంచపు ద్వారాలను తెరిచిన విశిష్ట వ్యక్తి.
జెలియట్ మొదటిసారిగా, 1962లో భారతదేశానికి వచ్చి, పూనాలోని దక్కన్ కాలేజీలో చేరి రెండేళ్ల పరిశో ధనకు అనుమతి పొందారు. స్థానిక అంబేడ్కర్ ఉద్యమ కార్యకర్తలతో కలసి సైకిల్‌పై పూనా చుట్టుపక్కల ప్రాంతా లలో తిరుగుతూ, స్థానిక దళితవాడలలో గడుపుతుండే వారు. ఆమె 1965లో తిరిగి ఆమెరికా వెళ్ళారు. 1969లో ఆమె పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరే ట్‌ను పొందారు. అంతటితో ఆమె అంబేడ్కర్‌పై తన అధ్య యనాన్ని ఆపివేయలేదు. ఆ తర్వాత చాలాసార్లు భారత దేశానికి వచ్చారు. అంబేడ్కర్ పోరాటాలతో పాటు, తద నంతర కాలపు దళిత పోరాటాలను తన వ్యాసాలలో పొందుపరిచారు. దాదాపు 80కి పైగా వ్యాసాలు, మూడు పుస్తకాలు ఇందులో చెప్పుకోదగినవి. ఒక రకంగా చెప్పా లంటే, అమెరికా సహా పశ్చిమ దేశాలకు అంబేడ్కర్ ఉద్య మాన్ని ఒక సమగ్ర దృక్పథంతో పరిచయం చేసిన వారిలో మొదటి స్థానం ఇలినార్‌దే. అంబేడ్కర్ కేంద్రంగా రచ నలు సాగించిన ఇలినార్ మన దళిత ఉద్యమంతో పాటూ, ఆ ఉద్యమ ప్రజాస్వామ్య దృక్పథాన్ని, అంబేడ్కర్ సాగిం చిన సైద్ధాంతిక పోరాటాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు.
అమెరికాలో విద్యాభ్యాస కాలంలో అంబేడ్కర్‌ను ప్రభావితం చేసిన వ్యక్తులను, సిద్ధాంతాలను గురించి తెలి యజెప్పినవారు ఇలినార్ ఒక్కరే. ‘‘అమెరికాలో విద్యా భ్యాసం అంబేడ్కర్‌లో కార్యదీక్షను రగిలించింది. ఆశావా దాన్ని పెంపొందించింది’’ అని ఇలినార్ వ్యాఖ్యానిం చారు. అక్కడ ఆయన భారతదేశంలో బ్రిటిష్ పాలన చెడు ఫలితాలపై చేసిన పరిశోధనను ఆమె స్వతంత్ర పరిశోధ నగా పేర్కొన్నారు. మానుష శాస్త్రంలో ఆయన కులాల పుట్టుకపై సాగించిన అధ్యయనం కూడా పాశ్చాత్య ప్రపం చాన్ని నివ్వెర పరిచింది. అంబేడ్కర్ పరిశోధనల వల్ల ఆయనకు సామ్యవాద భావాలున్నట్టు తెలుస్తుందిగానీ వాటిని అమలుచేసే అవకాశం ఆయనకు లభించలేదని ఇలినార్ అన్నారు. ఆయన ఆశించినట్టు ప్రణాళికా సంఘా నికి నేతృత్వం వహించి ఉంటే తన భావాలను ఆచరణలో పెట్టే అవకాశం లభించేదని ఆమె అభిప్రాయపడ్డారు.
గాంధీతో సైద్ధాంతిక సంఘర్షణలో అంబేడ్కర్ చూపిన చొరవ ఆయనను భారత రాజకీయ చరిత్రలో ఒక యోధునిగా నిలిపిందని ఆమె అభిప్రాయం. రాజకీ యంగా, తాత్వికంగా గాంధీతో విభేదించి వైకోం సత్యా గ్రహం మొదలుకొని 1944 వరకు అంబేడ్కర్ నిరం తర సమరం సాగించారు. 1930-31 రౌండ్ టేబుల్ సమా వేశాల్లో గాంధీజీ అభిప్రాయాలను ఆయన చాలా దృఢంగా ఎదుర్కొన్నారు. 1937 ఎన్నికల్లో కాంగ్రెస్ పాత్రపై, 1942 ఎన్నికల్లో కాంగ్రెస్ వైఖరిపై ఒక పెద్ద పుస్తకమే రాశారు.
కవిత్వం, సాహిత్యం, చిత్రలేఖనం లాంటి విషయా లపై అంబేడ్కర్ ఉద్యమ ప్రభావం ఏ మేరకు ఉందో ఇలినార్ అధ్యయనం చేశారు. ముల్క్‌రాజ్ ఆనంద్‌తో కలసి ఆమె మరాఠీ సాహిత్యాన్ని ఇంగ్లిష్‌లోకి అనువ దించి, ప్రచురించారు. యోగిందర్ సికంద్‌కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలినార్ ‘‘ శ్వేతజాతీయులు నల్ల జాతి సంస్కృతి గురించి రాయలేరు. నల్లజాతి సామాజిక, ఆర్థిక, పరిస్థితుల గురించి రాయడానికి ప్రయత్నించ వచ్చు. భారతదేశంలో దళితేతరులు కూడా దళితుల సంస్కృతి మీద రచనలు చేయలేరు. దళిత సామాజిక, ఆర్థిక విషయాలపైన రచనలు చేయవచ్చు. దళితుల అభివృద్ధి కోసం కృషి చేయవచ్చు’’ అంటూ దళితేతర సమాజం నిర్వర్తించాల్సిన పాత్రను తాత్వికంగానూ, సోదాహరణంగానూ వివరించారు.
అంబేడ్కర్ బౌద్ధాన్ని స్వీకరించడాన్ని సాంస్కృతిక విప్లవంగా ఆమె అభివర్ణించారు. ఇటీవలి కాలంలో ప్రపం చంలో బౌద్ధం ఒక సామాజిక చైతన్యంగా ముందుకు సాగుతున్నదని, ఫ్రాన్స్, వియత్నాం, థాయ్‌లాండ్‌లలో జరుగుతున్న కార్యక్రమాలను ఇలినార్ పేర్కొనారు. దళిత ఉద్యమం, దళిత సంస్కృతి బ్రహ్మణవాద వ్యతిరేకతపై మాత్రమే నిర్మాణం కావనీ, దళిత చరిత్రలోని అనేక ప్రగతి శీల ఉద్యమాల స్ఫూర్తి, అనేక కుల వ్యతిరేక పోరాట అనుభవాల మీద మాత్రమే ఆధారపడాలని ఆమె సూచిం చారు. అంబేడ్కర్ తమ భావాలకు అనుగుణంగానే ఉన్నట్టు చూపాలని ఆరెస్సెస్ ప్రయత్నిస్తున్నదనీ, అంబే డ్కర్‌పై ఆరెస్సెస్‌కు గౌరవం ఉంటే, హిందూమతాన్ని వదిలి అది బౌద్ధం స్వీకరించాలనీ, అదే అన్ని సమస్యలకు పరిష్కారమవుతుందని ఇలినార్ సూచించారు.
ఎక్కడో పరాయి దేశంలో పుట్టి, మరో దేశంలోని ఒక పోరాట యోధుని గురించి, ఆయన సాగించిన ఉద్యమం, అతని తాత్వికతల సారాంశాన్ని ప్రపంచ ప్రజలకు పంచేందుకు ఇలినార్ జెలియట్ తన జీవన సర్వస్వాన్ని ధారపోశారు. ఆమె మన దేశంలోని మేధావులందరికీ ఆదర్శం కావాలి.
- మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
మొబైల్ : 97055 66213