Ayodhya
-
చివరికి బకరాలుగా మిగిలేది రేవంత్, హరీష్: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని ప్రజలు గుర్తించారని, దీంతో బీజేపీపై ప్రజలకు నమ్మకం పెరిగిందని బీజేపి జాతీయ కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ బండారాన్ని మోదీ బయట పెట్టారన్న బండి.. అడ్డా మీది కూలీలను తెచ్చి కండువా వేస్తున్న బీఆర్ఎస్ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘సీట్ల విషయంలో కలిసి కట్టుగా చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మా లిస్ట్ ఢిల్లీకి వెళ్లింది.. కాంగ్రెస్ లిస్ట్ మాత్రం ప్రగతి భవన్‌కి వెళ్లింది. పెద్ద సార్ ఆమోదం కోసం వెయిట్ చేస్తున్న లిస్ట్. పాపం ఇది రేవంత్‌కి తెలీదు’’ అంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్ వచ్చే అవకాశం లేదు. వీరిద్దరికీ ఎంఐఎం మధ్యవర్తిత్వం వహిస్తుంది. అధికారం కోసం మూడు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. రేవంత్, హరీష్‌లు ఇద్దరు బలిచ్చే బకరాలు. కాంగ్రెస్‌లో బకరా రేవంత్ అయితే, బీఆర్ఎస్లో హరీష్ రావు’’ అని బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చదవండి: ఈటల రాజేందర్ సంచలన ప్రకటన -
జనవరి 21న అయోధ్య రామాలయం ప్రారంభం
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 21 నుంచి మూడు రోజులపాటు ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ ఆదివారం చెప్పారు. ఈ కార్యక్రమానికి లక్ష మందికిపైగా మత ప్రముఖులను ఆహా్వనించనున్నట్లు తెలిపారు. అయోధ్యలో రామ మందిర ప్రారం¿ోత్సవానికి సన్నాహకంగా ఈ ఏడాది సెపె్టంబర్ 30 నుంచి అక్టోబర్ 15 దాకా లక్షలాది గ్రామాల్లో ‘శౌర్యయాత్ర’లు నిర్వహించేందుకు బజరంగ్ దళ్ ఏర్పాట్లు చేస్తోంది. -
అయోధ్య రామమందిరానికి 400 కేజీల తాళం
అలీగఢ్ (యూపీ): అయోధ్యలో రామమందిరం కోసం అలీగఢ్‌కు చెందిన ఒక కళాకారుడు అరుదైన కానుకను రూపొందించాడు. చేతితో తాళాలు తయారు చేయడంలో సిద్ధహస్తుడైన సత్యప్రకాశ్ శర్మ రాముడి మందిరం కోసం ప్రత్యేకంగా 400 కేజీల తాళం తయారు చేశాడు. శ్రీరాముడికి వీరభక్తుడైన సత్యప్రకాశ్ ప్రపంచంలో చేత్తో తయారు చేసిన అతి పెద్ద తాళమని చెప్పారు. ఈ తాళం 10 అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అంగుళాల మందంతో ఉంది. తాళం చెవి నాలుగడుగుల పొడవుంది. సత్యప్రకాశ్ శర్మ కుటుంబం తరాలుగా ఈ తాళాల తయారీ వృత్తిలోనే ఉంది.ఈ ఏడాది మొదట్లో అలీగఢ్ ఎగ్జిబిషన్లో ఈ తాళాన్ని ఉంచారు. తాళం తయారు చేయడంలో తన భార్య రుక్మిణి కూడా సాయం చేశారని చెప్పారు. ఈ తాళం తయారీకి ఆయనకి రూ.2 లక్షల ఖర్చయింది. ఈ ఏడాది చివర్లో ఆయన ఈ తాళాన్ని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కి సమరి్పస్తారు. -
జనవరిలో అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట
అయోధ్య: అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించడానికి శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సన్నాహాలు చేస్తోంది. జనవరి 21, 22, 23 తేదీల్లో ఒక రోజు రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ శుక్రవారం వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి సాధువులు, హిందూ పీఠాధిపతులు కూడా హాజరుకానున్నారు. 136 పీఠాలకు చెందిన 25 వేల మందికి పైగా సభ్యుల్ని విగ్రహ ప్రతిష్టాపనకు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. జనవరి నెల అంతా అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. -
అయోధ్యలో ప్రతిష్టాపనకు ప్రధానికి ఆహ్వానం
అయోధ్య: అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. జనవరిలో జరుగనున్న ఆలయ ప్రారంబోత్సవానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఏర్పాట్లు చేస్తోంది. గర్భాలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. విగ్రహ ప్రతిష్టాపన వేడుకలో పాల్గొనాలని కోరుతూ ప్రధాని మోదీకి అధికారికంగా ఆహా్వనం పంపించినట్లు ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 15 నుంచి 24వ తేదీల మధ్య సమయం ఇవ్వాలని కోరామని, ఈ మేరకు ట్రస్టు అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ సంతకంతో లేఖ రాశామని తెలిపారు. ప్రతిష్టాపన కార్యక్రమానికి దేశ విదేశీ ప్రముఖులతోపాటు లక్షలాది మంది సామాన్య భక్తులు తరలివస్తారని, ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని ట్రస్టు భావిస్తోంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ 2020 ఆగస్టులో స్వయంగా భూమిపూజ చేశారు.