Danielle Wyatt
-
T20 WC 2024: ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. సీనియర్లపై వేటు
మహిళల టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ కోసం ఇంగ్లండ్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. యూఏఈ వేదికగా జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్ కోసం ఎంపిక చేసిన పదిహేను మంది సభ్యుల వివరాలను మంగళవారం వెల్లడించింది. వరల్డ్‌కప్‌లో పాల్గొనబోయే జట్టులో ముగ్గురు ప్లేయర్లకు తొలిసారిగా చోటిచ్చింది.సీనియర్లపై వేటుహీథర్ నైట్ కెప్టెన్సీలోని ఈ టీమ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ బెస్ హీత్, ఆల్‌రౌండర్ ఫ్రేయా కెంప్, రైటార్మ్ పేసర్ డేనియెల్ గిబ్సన్లకు జట్టులో స్థానం కల్పించింది. గత ఎడిషన్‌లో ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్లుగా ఉన్న వీరు ఈసారి ప్రధాన జట్టులోకి రావడం విశేషం. అయితే, అనూహ్యంగా సీనియర్లు కేట్ క్రాస్, టామీ బీమౌంట్లపై వేటు పడింది. కాగా ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ మహిళా టీ20 జట్టు సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది. గత నాలుగు ద్వైపాక్షిక సిరీస్‌లలోనూ అద్భుత విజయాలు సాధించింది.సూపర్ ఫామ్‌లో ఇంగ్లండ్ఆఖరిగా.. న్యూజిలాండ్‌తో రెండు, ఇండియా, పాకిస్తాన్‌తో ఒక్కో మ్యాచ్‌లో గెలుపు బావుటా ఎగురవేసింది. ఈ క్రమంలో వరల్డ్‌కప్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఇంగ్లండ్ ఈసారి బరిలోకి దిగనుంది. ఇక జట్టు ప్రకటన సందర్భంగా హెడ్‌కోచ్ జాన్ లూయీస్ మాట్లాడుతూ.. అనుభవజ్ఞులైన, యువ ఆటగాళ్లతో తమ జట్టు సమతూకంగా ఉందని పేర్కొన్నాడు.ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకే పెద్దపీట వేశామని.. ఈ క్రమంలో దురదృష్టవశాత్తూ కొందరిపై వేటు పడిందన్న లూయీస్.. యూఏఈ పరిస్థితులకు తగ్గట్లుగా రాణించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని తెలిపాడు. వరల్డ్‌కప్ అంటేనే ప్రత్యేకమైన ఈవెంట్ అని.. ఇందుకు తాము సన్నద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. కాగా గత ఎడిషన్‌లో ఇంగ్లండ్ మహిళా జట్టు గ్రూప్ స్టేజ్‌లో అజేయంగా నిలిచింది.ముందుగానే అబుదాబికి హీథర్ బృందంఅయితే, ఆతిథ్య సౌతాఫ్రికాతో సెమీ ఫైనల్లో ఆరు పరుగుల స్వల్ప తేడాతో ఓడి ఇంటిబాట పట్టింది. ఈసారి ఆ తప్పులను పునరావృతం చేయకుండా ముందడుగు వేయాలని పట్టుదలగా ఉంది. కాగా మహిళా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీని బంగ్లాదేశ్‌లో నిర్వహించాల్సి ఉండగా.. అక్కడ అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో వేదికను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు మార్చారు.అక్టోబరు 3 నుంచి ఈ ఈవెంట్ ఆరంభం కానుండగా.. ఇంగ్లండ్ సెప్టెంబరు 13- 14 వరకు అబుదాబిలో వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. షార్జా వేదికగా అక్టోబరు 5న బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ద్వారా ప్రపంచకప్-2024 ప్రయాణం మొదలుపెట్టనుంది.టీ20 ప్రపంచకప్-2024 కోసం ఇంగ్లండ్ మహిళా జట్టుహీథర్ నైట్ (కెప్టెన్), లారెన్ బెల్, మాయా బౌచియర్, ఆలిస్ క్యాప్సే, చార్లీ డీన్, సోఫియా డంక్లే, సోఫీ ఎక్లెస్టోన్, డేనియల్ గిబ్సన్, సారా గ్లెన్, బెస్ హీత్, అమీ జోన్స్, ఫ్రేయా కెంప్, నాట్ స్కివర్-బ్రంట్, లిన్సే స్మిత్, డానీ వ్యాట్.చదవండి: యూఏఈలో అక్టోబర్ 3 నుంచి 20 వరకు టోర్నీ టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు ప్రకటన -
కోహ్లికి ప్రపోజ్ చేసిన క్రికెటర్.. ప్రేయసితో ఘనంగా పెళ్లి (ఫొటోలు)
-
కోహ్లికి ప్రపోజ్ చేసిన క్రికెటర్.. ప్రేయసితో ఘనంగా పెళ్లి
ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియెల్ వ్యాట్ పెళ్లి బంధంలో అడుగుపెట్టింది. తన చిరకాల ప్రేయసి జార్జీ హోడ్జ్‌ను వివాహమాడింది. ఓల్డ్ టౌన్ హాల్ వీరి పెళ్లి వేడుకకు వేదికైంది.కాగా జార్జీ వ్యాట్ దగ్గర స్పోర్ట్స్ ఏజెంట్‌గా పనిచేసింది. ఈ క్రమంలో వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. చాలా కాలం పాటు డేటింగ్ చేసిన ఈ జంట.. సౌతాఫ్రికాలో ఎంగేజ్మెంట్ చేసుకుంది.గతేడాది మార్చిలో ఈ విషయాన్ని బహిర్గతం చేసింది డానియెల్ వ్యాట్. తాను జార్జీకి ప్రపోజ్ చేయగా అందుకు తను సానుకూలంగా స్పందించిందంటూ హర్షం వ్యక్తం చేసింది. ‘‘తను ఎల్లప్పుడూ నాకే సొంతం’’ అంటూ ప్రియురాలిని ముద్దాడిన ఫొటోను షేర్ చేసింది.ఈ క్రమంలో పెళ్లికి సిద్ధమైన వ్యాట్- జార్జీ చెల్సియా ఓల్డ్ టౌన్ హాల్లో ఉంగరాలు మార్చుకుని తమ బంధాన్ని అధికారికం చేసుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఇరువురూ సోషల్ మీడియాలో షేర్ చేశారు.కాగా ఇంగ్లండ్‌కు చెందిన ఆల్‌రౌండర్ డానియెల్ వ్యాట్ 2014లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లికి ప్రపోజ్ చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. వ్యాట్ క్రికెటర్‌గా బిజీగా ఉండగా.. జార్జీ వుమెన్ ఫుట్‌బాల్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది.ఇక ఇంగ్లండ్ తరఫున డానియెల్ వ్యాట్ రెండు టెస్టులు, 110 వన్డేలు, 156 టీ20 మ్యాచ్‌లు ఆడింది. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన ఆమె రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్ కూడా! View this post on Instagram A post shared by Georgie Hodge (@georgiehodge) -
కోహ్లికి షాకిచ్చిన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్..!
ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వాట్.. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లికి షాకిచ్చింది. కోహ్లి గతంలో గిఫ్ట్‌గా ఇచ్చిన బ్యాట్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. కోహ్లి బ్యాట్‌పై భారీ అంచనాలు ఉండినప్పటికీ.. దాన్ని కేవలం రెండు సార్లు మాత్రమే వినియోగించానని పేర్కొంది. మహిళల ఐపీఎల్లో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన వాట్ కోహ్లి గిఫ్ట్‌గా ఇచ్చిన బ్యాట్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. మహిళల ఐపీఎల్లో యూపీ వారియర్జ్‌కు ఆడుతున్న ఈ 32 ఏళ్ల ఆల్‌రౌండర్.. గతంలో కోహ్లిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంది. 2014లో ఆమె బహిరంగంగానే కోహ్లికి మ్యారేజ్ ప్రపోజల్ పంపింది. నాటి ట్విటర్లో ఆమె.. కోహ్లి మ్యారీ మీ అంటూ పోస్ట్ చేసింది. ద క్వింట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాట్ మరిన్ని ముచ్చట్లను కూడా షేర్ చేసుకుంది. తన ఫేవరెట్ పిచ్ ముంబైలోని బ్రబోర్న్ స్టేడియమని.. ఫేవరెట్ అపోజిషన్ భారత్ అని.. ఫేవరెట్ ఫుడ్ బటర్ చికెన్, మసాలా ఛాయ్ అని పేర్కొంది. కాగా, డానీ వాట్ ఇంగ్లండ్ తరఫున 2 టెస్ట్‌లు, 105 వన్డేలు, 151 టీ20లు ఆడి 4600కు పైగా పరుగులు చేసి 73 వికెట్లు పడగొట్టింది. ఈమె ఖాతాలో 4 సెంచరీలు, 19 అర్దసెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, కొద్ది రోజుల కిందట (ఫిబ్రవరి 15న) విరాట్ కోహ్లి-అనుష్క శర్మ దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. ఈ బిడ్డకు విరుష్క దంపతులు అకాయ్ అని నామకరణం చేశారు. అకాయ్‌కు ముందు కోహ్లి దంపతులకు కుమార్తె పుట్టింది. ఆమెకు వామిక అని నామకరణం చేశారు. మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్ రేపటి నుంచి (ఫిబ్రవరి 23) ప్రారంభంకానుంది. -
అప్పుడు విరాట్ కోహ్లీకి ప్రపోజల్.. ఇప్పుడు తన ప్రేయసితో ఎంగేజ్మెంట్!
ఇంగ్లండ్ మహిళా స్టార్ క్రికెటర్ డేనియల్ వ్యాట్ సంచలన ప్రకటన చేసింది. వ్యాట్.. తన ప్రేయసి, ఇంగ్లండ్ మహిళల ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ జార్జీ హెడ్గేతో నిశ్చితార్థం చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా వ్యాట్ షేర్ చేసింది. దీనికి ‘మైన్ ఫరెవర్’ అంటూ వ్యాట్ క్యాప్షన్‌గా ఇచ్చింది. కాగా గత కొన్నేళ్ల నుంచి వీరిద్దరూ రిలేషిన్‌షిప్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని 2020లో వ్యాట్ ప్రపంచానికి తెలియజేసింది. కాగా అంతకుముందు 2014లో వ్యాట్ టీమిండియా స్టార్ విరాట్ కోహ్లికి సోషల్ మీడియా ద్వారా మ్యారేజ్ ప్రపోజ్ చేసింది. ‘కోహ్లీ మ్యారీ మీ!!!’ అంటూ సరదాగా ఆమె ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్‌కు కోహ్లి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఇంతకుముందు ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ నటాలీ స్కివర్ కూడా తన సహాచర ప్లేయర్ కేథరీన్ బ్రంట్ స్వలింగ వివాహం చేసుకోగా.. మరో క్రికెటర్ లారెన్ విన్ఫీల్డ్-హిల్, కోర్ట్నీ హిల్‌ను ఈ విధంగానే వివాహం చేసుకుంది. అదే విధంగా న్యూజిలాండ్ మహిళా క్రికెటర్లు లీ తహుహు, అమీ సాటర్త్‌వైట్, దక్షిణాఫ్రికాకు చెందిన డేన్ వాన్ నీకెర్క్ , మారిజానే కాప్, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మేగాన్ షుట్,జెస్ జోనాసెన్ కూడా స్వలింగ వివాహం చేసుకున్న వారే. చదవండి: Ind Vs Aus 3rd Test: ఎట్టకేలకు బోణీ కొట్టిన ఆస్ట్రేలియా.. రోహిత్ సేనపై 9 వికెట్ల తేడాతో విజయం Mine forever 😍💍❤️ pic.twitter.com/cal3fyfsEs — Danielle Wyatt (@Danni_Wyatt) March 2, 2023 -
మహిళా క్రికెటర్‌తో సచిన్ తనయుడు.. వైరలవుతున్న ఫొటోలు
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు, ముంబై ఇండియన్స్ యువ క్రికెటర్ అర్జన్ టెండూల్కర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్‌తో అతను సన్నిహితంగా ఉన్న ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఈ ఫోటోల్లో అర్జున్.. వ్యాట్‌తో కాస్త చనువుగా ఉన్నట్లు కనిపించడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు.. సచిన్ తనయుడు ఇంగ్లీష్ పిల్ల బుట్టలో పడ్డాడా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో విషయం తెలీకుండా తప్పుగా కామెంట్లు చేస్తున్న వారికి చురకలంటిస్తున్నారు. మొత్తానికి ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ మహిళా జట్టు ఆల్‌రౌండర్ అయిన వ్యాట్ అర్జున్ తండ్రి సచిన్‌కు వీరాభిమాని. తండ్రి తనయులు ఎప్పుడు లార్డ్స్ మైదానానికి వచ్చినా ఆమె వారిని తప్పకుండా కలిసేది. 2009 నుంచి సచిన్, అర్జున్‌లతో తనకు పరిచయం ఉందని వ్యాట్ గతంలో పలు సందర్భాల్లో పేర్కొంది. 31 ఏళ్ల వ్యాట్ ఇంగ్లండ్ తరఫున 93 వన్డేలు, 124 టీ20 ఆడింది. వ్యాట్.. తన కెరీర్లో మొత్తం 4 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీల సాయంతో 3400కు పైగా పరుగులు సాధించింది. హాఫ్ స్పిన్ బౌలర్ అయిన వ్యాట్ రెండు ఫార్మాట్లలో కలిపి 73 వికెట్లు పడగొట్టింది. చదవండి: అతన్ని ఓపెనర్‌గా పంపండి.. సెహ్వాగ్‌లా సక్సెస్ అవుతాడు..! -
CWC 2022: అద్భుత సెంచరీతో మెరిసిన డానియెల్ వ్యాట్.. ఫైనల్లో ఇంగ్లండ్
Update: ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ఫైనల్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 137 పరుగులతేడాతో విజయం సాధించింది. డేనియల్ వ్యాట్ అద్భుత ఇన్నింగ్స్‌తో తుదిపోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ తలపడనుంది. ICC Women World Cup 2022 Eng Vs SA: ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022 టోర్నీలో భాగంగా ఇంగ్లండ్ బ్యాటర్ డానియెల్ వ్యాట్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. 125 బంతుల్లో 129 పరుగులు చేసి సత్తా చాటింది. క్రైస్‌చర్చ్ వేదికగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో సెంచరీతో మెరిసింది. కాగా ప్రపంచకప్-2022 రెండో సైమీ ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా తలపడుతున్నాయి. View this post on Instagram A post shared by ICC (@icc) ఇందులో భాగంగా టాస్ గెలిచిన సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఆరంభంలోనే ఓపెనర్ టామీ బీమౌంట్(7) వికెట్ కోల్పోయింది. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ హీథర్‌నైట్ 19 బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో డానియెల్ వ్యాట్ పట్టుదలగా నిలబడింది. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ క్రమంలో శతకం పూర్తి చేసుకుంది. ఆమెకు ఇది రెండో వన్డే సెంచరీ కావడం విశేషం. ఇక వ్యాట్‌కు తోడు సోఫియా డంక్లే 60 పరుగులతో రాణించడంతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 293 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నిం ఇస్మాయిల్‌కు మూడు, మరిజానే క్యాప్‌నకు రెండు, అయబోంగా ఖాకాకు ఒకటి, మసబాట క్లాస్‌కు రెండు వికెట్లు దక్కాయి. చదవండి: RCB Vs KKR: ఒక్కసారి మైదానంలోకి దిగితే అంతే.. ఆ సెలబ్రేషన్స్ అందుకే: హసరంగ -
World Cup 2022: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి.. సెమీస్ చేరిన ఇంగ్లండ్.. ఇక భారత్!
ICC Women World Cup 2022: ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ సెమీస్‌కు చేరింది. బంగ్లాదేశ్‌పై 100 పరుగుల తేడాతో విజయం సాధించి సగర్వంగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తర్వాత సెమీస్ చేరిన మూడో జట్టుగా హీథర్‌నైట్ బృందం నిలిచింది. న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్ వేదికగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ క్రమంలో ఆదిలోనే డానియెల్ వ్యాట్(6) వికెట్ కోల్పోయినప్పటికీ... ఓపెనర్ బీమౌంట్ 33 పరుగులతో పర్వాలేదనిపించింది. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ హీథర్‌నైట్ సైతం 6 పరుగులకే నిష్క్రమించడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటర్ నటాలీ సీవర్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడింది. 40 పరుగులతో రాణించింది. View this post on Instagram A post shared by ICC (@icc) మరోవైపు వికెట్ కీపర్ అమీ జోన్స్ ఆమెకు అండగా నిలబడింది. ఇక 72 బంతుల్లో 67 పరుగులు సాధించిన సోఫియా డంక్లే ఇంగ్లండ్ మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఆఖర్లో బ్రంట్ 24, ఎక్లెస్‌స్టోన్ 17 పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు షమీమా సుల్తానా, షర్మిన్ అక్తర్ చెరో 23 పరుగులు సాధించి శుభారంభం అందించారు. View this post on Instagram A post shared by ICC (@icc) అయితే మిడిలార్డర్ దీనిని కొనసాగించలేకపోయింది. దీంతో 48 ఓవర్లలో కేవలం 134 పరుగులు మాత్రమే చేసి బంగ్లా జట్టు ఆలౌట్ అయింది. దీంతో విజయం ఇంగ్లండ్ సొంతమైంది. సరిగ్గా వంద పరుగుల తేడాతో హీథర్‌నైట్ బృందం గెలుపొందింది. విజయంలో కీలక పాత్ర పోషించిన ఇంగ్లండ్ బ్యాటర్ సోఫియా డంక్లేకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో భారత్ గెలిస్తేనే ఇంగ్లండ్‌తో పాటు టాప్-4లో నిలుస్తుంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప- 2022 ఇంగ్లండ్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ స్కోర్లు ఇంగ్లండ్- 234/6 (50) బంగ్లాదేశ్- 134 (48) View this post on Instagram A post shared by ICC (@icc) -
World Cup 2022: పాక్‌ను చిత్తు చేసి.. టాప్-4లోకి దూసుకెళ్లిన ఇంగ్లండ్
ICC Women World Cup 2022: ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022లో సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా గురువారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. పాక్‌ను చిత్తు చేసి టాప్-4లోకి చేరి సెమీస్ అవకాశాలు మరింత మెరుగుపరుచుకుంది. కాగా పాకిస్తాన్ మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు ఇంగ్లండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఆదిలోనే ఓపెనర్ నహీదా ఖాన్ అవుట్ కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ మరూఫ్ 9 పరుగులకే పెవిలియన్ చేరింది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ అమీన్ 32 టాప్ స్కోరర్‌గా నిలిచింది. మిగతా వాళ్లంతా ఘోరంగా విఫలమయ్యారు. దీంతో 105 పరుగులకే పాక్ ఆలౌట్ అయింది. ఇక స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు స్టార్ ఓపెనర్ టామీ బీమౌంట్ 2 పరుగులకే నిష్క్రమించడం షాకిచ్చింది. అయితే మరో ఓపెనర్ డానియెల్ వ్యాట్ ఒంటి చేత్తో జట్టును విజయతీరాలకు చేర్చింది. మరో ఎండ్‌లో కెప్టెన్ హీథర్‌నైట్ సహకారం అందించడంతో 76 పరుగుల(68 బంతుల్లో- 11 ఫోర్ల సాయం)తో అజేయంగా నిలిచి ఇంగ్లండ్‌కు సునాయాస విజయం అందించింది. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్‌తో 19.2 ఓవర్లలో కేవలం ఒకే ఒక వికెట్ నష్టపోయి ఇంగ్లండ్ పాక్‌పై గెలుపొందింది. డానియెల్ వ్యాట్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన ఇంగ్లండ్ మరో మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022 ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ స్కోర్లు: పాకిస్తాన్- 105 (41.3 ఓవర్లు) ఇంగ్లండ్- 107/1 (19.2 ఓవర్లు) View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: World Cup Super League: దక్షిణాఫ్రికాపై సంచలన విజయం.. వరల్డ్‌కప్ సూపర్ లీగ్ టాప్‌లో బంగ్లాదేశ్! టీమిండియా ఎక్కడ? View this post on Instagram A post shared by ICC (@icc) -
'రషీద్ బాగున్నావు.. నీ ప్యాలెస్ సూపర్‌గా ఉంది'
కాబుల్: అప్ఘనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ రంజాన్ మాసం సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. నీలం రంగు కుర్తా, ప్యాంట్ వేసుకొని రాజసం ఉట్టిపడేలా రషీద్ ఇచ్చిన ఫోజు.. దానికి తోడూ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్యాలెస్‌లో రెండు వైపులా మెట్లు కనిపించడం.. నేల మీద పరిచి ఉన్న తివాచీ ఆ ఫోటోకు మరింత అందాన్నిచ్చింది. కాగా రషీద్ షేర్ చేసిన ఫోటోపై ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్ స్పందించింది. ''వారెవ్వా వాటే ప్యాలెస్.. రషీద్ నీ డ్రెస్సింగ్ సూపర్..'' అంటూ కామెంట్ చేసింది. టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా రషీద్ ఫోటోపై కామెంట్ చేశాడు.''క్యా బాత్ హై.. రషీద్.. ఇలాంటి ఫోటోలు మరిన్ని ఉంటే నాకు పంపించు.. ఎదురుచూస్తున్నా'' అంటూ పేర్కొన్నాడు. ఇక ఎస్ఆర్హెచ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న రషీద్ ఖాన్ ఐపీఎల్ 14వ సీజన్లో తన ప్రదర్శనతో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 7 మ్యాచ్‌లాడిన రషీద్ 10 వికెట్లు మాత్రమే తీశాడు.. ఎకానమీ రేటు మాత్రం ఎక్కువ లేకుండా చూసుకున్నాడు. ఇక ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో దారుణ ప్రదర్శన నమోదు చేసింది. ఏడు మ్యాచ్‌ల్లో ఒక్కటి మాత్రమే గెలిచి.. మిగతా ఆరు ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఇక బయోబబూల్కు కరోనా సెగ తగలడంతో ఐపీఎల్ సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. కాగా లీగ్‌లో ఇప్పటివరకు 29 మ్యాచ్‌లు జరగ్గా.. మరో 31 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. చదవండి: పాకిస్తాన్‌కు ఆడాల్సింది కాదు.. తప్పు చేశా View this post on Instagram A post shared by Rashid Khan (@rashid.khan19) -
‘బౌలింగ్ చేయమంటే భయపెట్టేవాడు’
లండన్: యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌ను ఎదుర్కొవడం చాలా కష్టమని ఇంగ్లండ్ మహిళల క్రికెటర్ డానియల్ వ్యాట్ పేర్కొన్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వారసుడునై అర్జున్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఏడాదిలో ఎక్కువ నెలలు ఇంగ్లండ్‌లో గడుపుతూ ఆటలో నిష్ణాతుడు కావడానికి ప్రయత్నిస్తున్నాడు. దీంతో ఆదేశ క్రికెటర్లతో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ మెరుగవుతున్నాడు. అంతేకాకుండా ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టుతోనూ అర్జున్ ప్రాక్టీస్ చేసిన సందర్బాలు కూడా ఉన్నాయి. ఇక ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌వుమన్ డానియల్ వ్యాట్, అర్జున టెండూల్కర్లు మంచి స్నేహితులు అనే విషయం అందిరికీ తెలిసిందే. అయితే అర్జున్ బౌలింగ్ గురించి వ్యాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ('తండ్రిగా నా కోరికలు నెరవేర్చుకుంటున్నా') ‘అర్జున్, నేను మంచి స్నేహితులం. లార్డ్స్ మైదానానికి ప్రాక్టీస్ చేయడానికి అతడు వస్తుండేవాడు. అప్పుడు కొత్త బంతితో నాకు బౌలింగ్ చేయాలని అడిగితే అర్జున్ భయపెట్టేవాడు. నేను వేసే బౌన్సర్లు నీ తలకు తగులుతాయి అని హెచ్చరించేవాడు. దీంతో అతడి బౌలింగ్‌లో బ్యాటింగ్ చేసేందుకు ఇష్టపడను. అంతేకాకుండా అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం. ఆటగాడిగా మెరుగవుతున్నాడు. త్వరలోనే అంతర్జాతయ క్రికెట్లో అతడిని చూసే అవకాశం ఉంది. ఇక అర్జున్ వాళ్ల అమ్మ అంజలితో తరుచూ మాట్లాడతా. చాలా మంచి వ్యక్తి. సచిన్, అంజలిలు ఇంగ్లండ్‌కు వచ్చిన ప్రతీసారి వారిని కలుస్తాను’ అని డానియల్ వ్యాట్ వ్యాఖ్యానించారు. ఇక మహిళల ప్రపంచకప్ -2017 గెలిచిన ఇంగ్లండ్ జట్టలో వ్యాట్ కీలక ప్లేయర్ అన్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ తరుపును ఆమె ఇప్పటివరకు 74 వన్డేలు, 109 టీ20లకు ప్రాతినిథ్యం వహించారు. (‘అప్పుడు సుశాంత్‌కు ఎన్నో గాయాలయ్యాయి’) -
చహల్‌ను టీజ్ చేసిన మహిళా క్రికెటర్
లండన్: సోషల్ మీడియాలో భారత క్రికెటర్లు చేసే పోస్ట్‌లకు ఎక్కువగా స్పందించే మహిళా క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే అది ఇంగ్లండ్‌కు చెందిన డానియెల్లి యాట్ మాత్రమే. విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనిల పోస్ట్‌లకు యాట్ సరదాగా రిప్లై ఇస్తూ భారత క్రికెటర్లపై ప్రేమను చాటుకుంటూ ఉంటారు. ఇటీవల జస్ప్రీత్ బుమ్రా జిమ్ చేస్తున్న ఫొటోను ఒకటి పోస్ట్ చేయగా, దానికి చిన్న పిల్లల ఎక్సర్సైజ్లు చేస్తున్నావేంటి అంటూ యాట్ ఆట పట్టించారు. తాజాగా భారత స్పిన్నర్ యజేంద్ర చహల్ చేసిన ఒక పోస్ట్‌కు సైతం అదే తరహాలో స్పందించారు యాట్. వెస్టిండీస్‌తో చెన్నైలో జరిగిన తొలి వన్డే తర్వాత కుల్దీప్ యాదవ్‌తో కలిసి దిగిన ఫొటోను ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో చహల్ పోస్ట్ చేశారు. ఇక్కడ చహల్-కుల్దీప్లు తమ ఎత్తు చూసుకుంటూ ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. దాన్నే ఉద్దేశిస్తూ యాట్ కామెంట్ చేశారు. ‘ నా కంటే కూడా నువ్వే తక్కువ ఎత్తు’ అని టీజ్ చేసిన యాట్.. అందుకు లాఫింగ్ ఎమోజీని జత చేశారు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌కు కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కగా, చహల్‌కు అవకాశం దక్కలేదు. ఈ మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. భారత్ నిర్దేశించిన 288 పరుగుల టార్గెట్‌ను విండీస్ 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హెట్మెయిర్, షాయ్ హోప్‌లు సెంచరీలతో కదం తొక్కి విండీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. దాంతో మూడు వన్డేల సిరీస్‌లో విండీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే విశాఖలో బుధవారం జరుగనుంది. -
బుమ్రాను ఆట పట్టించిన మహిళా క్రికెటర్
లండన్: వెన్ను గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌కు దూరమైన టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా కోలుకుంటున్నాడు. న్యూజిలాండ్‌తో డిసెంబర్లో జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్ నాటికి బుమ్రా గాడిలో పడే అవకాశం కనబడుతోంది. దీనిలో భాగంగా జిమ్‌లో బుమ్రా ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. టీమిండియా జట్టుతో త్వరలోనే జాయిన్ అవుతా అనే అర్థం వచ్చేలా ‘కమింగ్ సూన్’ అంటూ తన ఫోటోకు క్యాప్షన్ జత చేశాడు. దీనిపై ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియెల్లి యాట్ తనదైన శైలిలో స్పందించారు. ఎప్పుడు విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనిల గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో కామెంట్లు చేసే యాట్.. ఈసారి బుమ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కమింగ్ సూన్ కామెంట్‌పై ఫన్నీగా రిప్లై ఇచ్చారు. బుమ్రా వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్‌సైజ్‌లను ప్రస్తావిస్తూ చిన్న పిల్లలు చేసే ఎక్సర్సైజ్లు చేస్తున్నావా అంటూ చమత్కరించారు. అవి బేబీ వెయిట్స్ కదా అంటూ బుమ్రాను ఆట పట్టించారు. గత కొన్ని రోజుల క్రితం బుమ్రా గాయానికి శస్త్ర చికిత్స అవసరమని భావించినా అది అవసరం కాలేదు. ప్రస్తుతం తేలికపాటి ఎక్స్ర్సైజులు చేస్తున్నాడు బుమ్రా. అదే సమయంలో రన్నింగ్ ప్రాక్టీస్‌ను కూడా తన దినచర్యలో భాగం చేశాడు. ఈ మేరకు బెంగళూరులోని క్రికెటర్ల పునరావస కేంద్రం నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో బమ్రా శిక్షణ తీసుకుంటున్నాడు. అక్కడ జిమ్‌లో ఎక్స్‌ర్‌సైజ్‌లో చేస్తూ తీసుకున్న ఫొటోను బుమ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దానికి కమింగ్ సూన్ అనే క్యాప్షన్ ఇచ్చాడు. -
ధోని హెయిర్ స్టైల్‌కు మహిళా క్రికెటర్ ఫిదా!
బెంగళూరు : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని పెళ్లి చేసుకోమంటూ వార్తల్లో నిలిచిన ఇంగ్లండ్ క్రికెటర్ డానియెల్లి వ్యాట్.. ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని హెయిర్‌స్టైల్ సూపర్ అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై నెటిజన్లు వినూత్నంగా స్పందిస్తున్నారు. గత బుధవారం జరిగిన బెంగళూరు-చెన్నై మ్యాచ్‌లో ధోని వినూత్న హెయిర్ స్టైల్‌తో కనిపించాడు. ఈ హెయిర్ స్టైల్‌కు ఫిదా అయిన డానియెల్లి ‘ధోని హెయిర్ కట్ అయితే.. సూపర్’ అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు ఓ అభిమాని ‘ఈ దిగ్గజ క్రికెటర్ దగ్గర కొన్ని టిప్స్ తీసుకో’ అని బదులిచ్చాడు. దీనికి డానియెల్లి స్పందిస్తూ.. ‘నా హెలిక్యాప్టర్ షాట్ ఎంత దూరం వెళ్తుందో నేను ఖచ్చితంగా చెప్పలేను’ అని సరదాగా బదులిచ్చింది. దీనికి చాలా దూరం వెళ్తుందని.. కొందరంటే.. మా కింగ్ ధోనిని తదేకంగా చూడకు అని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ధోని అద్భుత ఇన్నింగ్స్‌తో చెన్నై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇటీవల వన్డే ట్రై సిరీస్ కోసం భారత్‌కు వచ్చిన డానియెల్లీ భారత మహిళల జట్టుపై సెంచరీ సాధించింది. -
మహిళా క్రికెటర్‌కు రషీద్ ఖాన్ సవాల్
సాక్షి, హైదరాబాద్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ గురువారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో జట్టును గెలిపించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు పొందిన విషయం తెలిసిందే. రషీద్ ప్రదర్శనకు ఫిదా అయిన సన్‌రైజర్స్ జట్టు.. ‘4 ఓవర్లు బౌలింగ్ చేసి 18 డాట్ బాల్స్ వేసి వికెట్ తీసిన బౌలర్ రషీద్ ఖాన్‌కు అభినందనలు’ అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు స్పందించిన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియల్ వ్యాట్... ‘బాగా బౌలింగ్ చేశావు మాంత్రికుడా’ అంటూ ట్వీట్‌తో అతడిని అభినందించింది. రషీద్ ఖాన్.. ‘ఇంగ్లీషు కౌంటీలో నీకు కూడా బౌలింగ్ చేస్తాను. సిద్ధంగా ఉండు’ అంటూ ఆమెను చాలెంజ్ చేశాడు. అతడి సవాల్‌కు దీటుగా స్పందించిన డానియల్ ‘ఓకే’ అంటూ #6runsతో ట్యాగ్ చేసింది. ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ప్రపోజ్ చేసి వార్తల్లో నిలిచిన డానియల్ ప్రస్తుతం.. భారత్‌లో ఉంది. టి20 ట్రైసిరీస్, వన్డే సిరీస్‌లో ఆడింది. -
కోహ్లి బ్యాట్‌తో 15 ఫోర్లు.. 5 సిక్సులు.!
సాక్షి, ముంబై : ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత మహిళా జట్టు మరో ఓటమి చవిచూసింది. స్మృతి మంధాన, మిథాలీలు హాఫ్ సెంచరీలతో 199 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించినా పర్యాటక మహిళా జట్టు సునాయసంగా విజయం సాధించింది. ఇంగ్లండ్ ఓపెనర్ డానియెల్లి యాట్ 124 (64 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ శతకంతో చెలరేగడంతో భారత మహిళల లక్ష్యం చిన్నబోయింది. డానియెల్లికి అండగా టామీ బీయుమెంట్ 35(23 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సు) నిలిచింది. చివర్లో టామీ అవుటైనా హెథర్ (8) టార్గెట్‌ను పూర్తి చేసింది. దీంతో ఇంగ్లండ్ 8 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకోంది. టీ20ల్లో ఇది అత్యధిక పరుగుల ఛేదనగా రికార్డుకెక్కగా.. 52 బంతుల్లోనే డానియెల్లి రెండో వేగవంతమైన శతకం నమోదు చేసింది. ఇక భారత మహిళలకు ఇది వరుసగా ఐదో పరాజయం. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో తొలి మ్యాచ్‌లో కంగుతిన్న టీమిండియా.. అంతకు ముందు ఆస్ట్రేలియాతో మూడు వన్డే సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయింది. ఈ పరాజయంతో భారత్ ఈ ట్రైసిరీస్ ఫైనల్ చేరడం కష్టంగా మారనుంది. డానియెల్లి యాట్ ఈ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బహుమతిగా ఇచ్చిన బ్యాట్‌తో ఆడుతానని చెప్పిన విషయం తెలిసిందే. ఆ బ్యాట్‌తోనే కోహ్లిలా డానియెల్లి 15 ఫోర్లు, 5 సిక్సర్లతో వీరవిహారం చూపించింది. భారత్ స్కోర్ 198/4 (20 ఓవర్లలో) ఇంగ్లండ్ స్కోర్ 199/3( 18.4 ఓవర్లలో) -
అనుష్క చూస్తుంది.. వ్యాట్ బీ కేర్‌ఫుల్!
సాక్షి, ముంబై: ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియెల్లీ వ్యాట్ గుర్తుందా?.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని.. నన్ను పెళ్లి చేసుకో అంటూ గతంలో ట్వీట్ చేసిన క్రికెటరే ఇ డానియెల్లీ వ్యాట్. నాలుగేళ్ల కింద ఆమె విరాట్‌కు ట్వీటర్ ద్వారా ప్రపోజ్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆపై ఆమెను కలుసుకున్న సందర్భంలో వ్యాట్‌కు కోహ్లి బ్యాట్ బహుమతిగా ఇచ్చాడు. తాజాగా కోహ్లి అభిమానులు మహిళా క్రికెటర్ వ్యాట్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. విషయం ఏంటంటే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఇండియాల మధ్య జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా వ్యాట్ ముంబైకి వచ్చారు. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్ తర్వాత వ్యాట్‌కి కాస్త విరామం దొరికింది. దీంతో ముంబైలోని ఎలిఫెంటా ఐలాండ్ వెళ్తున్నామని వ్యాట్ ట్వీట్ చేశారు. అంతే సంగతి! నిమిషాల్లో కోహ్లి అభిమానులు ట్వీటర్లో వ్యాట్‌కు స్వీట్ వార్నింగ్ ఇస్తూ కామెంట్లు చేస్తున్నారు. గతేడాది డిసెంబర్లో అనుష్కశర్మ, విరాట్ కోహ్లిల వివాహం జరిగిన విషయం తెలిసిందే. ‘కోహ్లి ఇంటికి కొద్ది దూరంలోనే నువ్వు ఉన్నావ్’ అతడి పక్కన అనుష్క ఉంటుంది జాగ్రత్త అంటూ క్రికెట్ ప్రేమికులు కొందరు వ్యాట్ పోస్టుకు రిప్లై ఇచ్చారు. అనుష్క నిన్ను గమనిస్తుంటుంది, జాగ్రత్తగా ఉండాలంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు. 2014లో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లినప్పుడు వ్యాట్, కోహ్లిని కలిసింది. ఈ సందర్భంగా విరాట్ ఆమెకు బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ బ్యాట్‌ను మార్చి 23న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో వాడనున్నట్లు వ్యాట్ తెలిపారు. Day off in Mumbai so we’re off to have a look at Elephanta Island ⛴ 🙋🏼♀️ pic.twitter.com/eaVlWCQoPj — Danielle Wyatt (@Danni_Wyatt) 21 March 2018 -
భారత్‌లో కోహ్లి బ్యాట్‌తోనే..
న్యూఢిల్లీ: గతంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియెల్లి యాట్ పెళ్లి ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లి ఆటకు ఫిదా అయిపోయిందో లేక ఇద్దరి కెరీర్ ఒకటే అనుకుందేమోగానీ ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియెల్లి మనోడ్ని పెళ్లి చేసుకుంటానంటూ సరదాగా ఓ ప్రతిపాదన చేసింది. దాదాపు నాలుగేళ్ల క్రితం'నన్ను పెళ్లి చేసుకుంటావా కోహ్లి' అని ట్వీట్ చేసి వార్తల్లో నిలిచింది డానియల్లి యాట్. ఆపై 2014లో టీమిండియా జట్టు ఇంగ్లండ్ లో పర్యటించినప్పుడు డానియెల్లికి కోహ్లి బ్యాట్‌ను కానుకగా ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. దాంతో మురిసిపోయిన యాట్.. ఇక ఆ బ్యాట్‌తోనే క్రికెట్ ఆడతానడంటూ పేర్కొంది. కాగా, ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా భారత్‌కు రానున్న యాట్.. త్వరలో చేపట్టబోయే భారత పర్యటనలో నేను కోహ్లి ఇచ్చిన బ్యాట్‌తోనే ఆడతానని మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన యాట్.. 'ఇప్పడు విదేశీ పర్యటనల్లో కూడా కోహ్లి బ్యాట్‌నే ఉపయోగిస్తున్నా. ఎందుకంటే నేను వాడే బ్యాట్ విరిగిపోయింది. భారత్‌తో సిరీస్‌లో కూడా కోహ్లి బ్యాట్‌తోనే ఆడతా’అని తెలిపింది. ముక్కోణపు టీ20 సిరీస్ మార్చి 23 నుంచి ప్రారంభం కానుంది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ట్రై సిరీస్‌లో పాల్గొనున్నాయి. -
అప్పుడు ప్రపోజల్..ఇప్పుడు విషెస్
లండన్: గతంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియెల్లి యాట్ పెళ్లి ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లి ఆటకు ఫిదా అయిపోయిందో లేక ఇద్దరి కెరీర్ ఒకటే అనుకుందేమోగానీ ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియెల్లి మనోడ్ని పెళ్లి చేసుకుంటానంటూ సరదాగా ఓ ప్రతిపాదన చేసింది. దాదాపు మూడేళ్ల క్రితం'నన్ను పెళ్లి చేసుకుంటావా కోహ్లి' అని ట్వీట్ చేసి వార్తల్లో నిలిచింది డానియల్లి యాట్. ఆపై 2014లో టీమిండియా జట్టు ఇంగ్లండ్ లో పర్యటించినప్పుడు డానియెల్లికి కోహ్లి బ్యాట్‌ను కానుకగా ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. దాంతో మురిసిపోయిన యాట్.. ఇక ఆ బ్యాట్‌తోనే క్రికెట్ ఆడతానడంటూ పేర్కొంది. కాగా, విరాట్ కోహ్లి వివాహం అనుష్క శర్మతో జరిగి పోవడంతో డానియెల్లి యాట్ స్పందించింది. ఇక చేసేది లేక కోహ్లికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసింది. పెళ్లితో ఒక్కటైన కొత్త జంట కోహ్లి-అనుష్కలకు అభినందలు తెలిపింది. Congratulations @imVkohli & @AnushkaSharma — Danielle Wyatt (@Danni_Wyatt) 11 December 2017 -
అంతా తెలిసే కోహ్లికి ప్రపోజ్ చేశా!
లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పేరు తెలియదా అంటూ ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియెల్లి యాట్‌పై క్రికెట్ ప్రేమికులతో పాటు నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. డానియెల్లి కూడా ఆ విషయంపై ఘాటుగా స్పందించారు. తనకు విరాట్ పేరు తెలుసు కనుక, గతంలో నేను అతడికి ప్రపోజ్ చేశానని చెప్పారు. కోహ్లీ అందించిన బ్యాట్‌పై ఉన్న పేరు (VIRAT KHOLI) రాసింది తాను కాదని, బ్యాట్ తయారు చేసిన వారిని అడిగితే బాగుంటుందని ఆమె ట్వీట్ చేయగా అది వైరల్‌గా మారింది. విరాట్ కోహ్లి ఆటపట్ల ఆకర్షితురాలైన ఇంగ్లండ్ క్రికెటరే ఈ డానియెల్లి యాట్. గతంలో 'కోహ్లి మేరీ మీ' అని తనకి ప్రపోజ్ చేసిన ఆమెకు విరాట్ బహుమతిగా ఓ బ్యాట్ కానుకగా ఇచ్చాడు. 2014లో టీమిండియా జట్టు ఇంగ్లండ్ లో పర్యటించినప్పుడు డానియెల్లికి ఇచ్చిన బ్యాట్‌ను ఇంకా వాడలేదని, త్వరలో ఈ బ్యాట్‌తో ప్రాక్టీస్ చేయనున్నట్లు డానియెల్లి ట్వీట్ చేశారు. బ్యాట్ కింద ఉన్న కోహ్లి పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ గమనించిన నెటిజన్లు.. కోహ్లి పేరు కూడా సరిగా తెలియదా అంటూ ఆమెను ప్రశ్నిస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు. 'ఇప్పుడు కూడా మీరు నాపై కామెంట్ చేస్తారా.. కోహ్లీ బ్యాట్లు తయారుచేసే వ్యక్తి ఈ పని చేశాను. నేను కాదంటూ' మరో ట్వీట్ ద్వారా వెల్లడించారు. Gets me trolled? 🤣🤣🤣His bat maker wrote it not me durrrrrrr 🙄 #wakeywakey — Danielle Wyatt (@Danni_Wyatt) 11 September 2017 Back training this week. Can't wait to use this beast 👌🏽💪🏽🔥 Thanks @imVkohli #ping #middlesbiggerthanme 🏏 pic.twitter.com/BknGjYx2Yj — Danielle Wyatt (@Danni_Wyatt) 10 September 2017 -
ఇక కోహ్లి ఇచ్చిన బ్యాట్ తోనే..
లండన్: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా విరాట్ కు అభిమానులు సంఖ్య ఎక్కువే. అందులో ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియెల్లి యాట్ కూడా ఉన్నారు. గతంలో కోహ్లికి మ్యారేజ్ ప్రపోజ్ చేసిన మహిళా క్రికెటరే డానియెల్లి. 'కోహ్లి మేరీ మీ' అని సోషల్ మీడియా ద్వారా సందేశం పంపి అప్పట్లో వార్తల్లో నిలిచిన మహిళా క్రికెటరే డానియెల్లి. అయితే ఆ మహిళా క్రికెటర్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఇందుకు కారణం ఆమెకు గతంలో విరాట్ బహుమతిగా ఇచ్చిన బ్యాటే కారణం. 2014లో టీమిండియా జట్టు ఇంగ్లండ్ లో పర్యటించినప్పుడు డానియల్లికి విరాట్ బ్యాట్ ను కానుకగా ఇచ్చారు. కాగా, ఆ బ్యాట్ ను ఇంతవరకూ ఆమె వాడలేదట. ఈ మేరకు ట్విట్టర్ లో విరాట్ ప్రజెంట్ చేసిన బ్యాట్ ను పోస్ట్ చేసిన డానియల్లి.. త్వరలోనే ఆ బ్యాట్ తో సాధన చేస్తానని పేర్కొన్నారు. ‘ఈ వారం తిరిగి క్రికెట్ శిక్షణలో పాల్గొంటున్నాను. ఆ బ్యాట్ ను ఇక ఉపయోగించకుండా ఉండలేను. బ్యాట్ ను కానుకగా ఇచ్చిన కోహ్లికి థాంక్స్' అని డానియల్లీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇటీవల ఇంగ్లండ్ గెలిచిన మహిళా వరల్డ్ కప్ లో డానియల్లి సభ్యురాలు. త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే యాషెస్ సిరీస్ కు ఆమె సన్నద్ధమవుతున్నారు. Back training this week. Can't wait to use this beast Thanks @imVkohli #ping #middlesbiggerthanme pic.twitter.com/BknGjYx2Yj — Danielle Wyatt (@Danni_Wyatt) 10 September 2017 -
కోహ్లి.. నన్ను పెళ్లి చేసుకో!
విరాట్ కోహ్లి ఆటకు ఫిదా అయిపోయిందో లేక ఇద్దరి కెరీర్ ఒకటే అనుకుందేమోగానీ ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియెల్లి వ్యాట్ మనోడ్ని పెళ్లి చేసుకుంటానంటూ సరదాగా ఓ ప్రతిపాదన చేసింది. శుక్రవారం సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి.. భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్‌ను చూసిన మత్తులో 22 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ ‘కోహ్లి... నన్ను పెళ్లి చేసుకో’ అని ట్వీట్ చేసింది. దీన్ని చూసిన ఎవరో ఓ వ్యక్తి ఉన్నఫలంగా మన ఢిల్లీ బ్యాట్స్‌మన్ ఎఫైర్‌ను బయటపెట్టేశాడు. ‘ఇప్పటికే కోహ్లి... బాలీవుడ్ నటి అనుష్క శర్మను బుక్ చేసుకున్నాడుగా’ అంటూ ట్వీట్ చేశాడు. అంతే ఒక్కసారిగా వ్యాట్ ‘అతను ఇతను కాడేమో’ అంటూ సానుభూతితో కూడిన బాధను వ్యక్తం చేసింది. పాపం... కోహ్లిపై ఎన్ని ఆశలు పెట్టుకుందో ఏమో!