Kevin Pietersen
-
అదంతా అబద్దం.. మాకంటూ ఓ విధానం ఉంది: మెకల్లమ్ ఫైర్
కామెంటేటర్లు రవి శాస్త్రి(Ravi Shastri), కెవిన్ పీటర్సన్ వ్యాఖ్యలపై ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ బ్రెండన్ మెకల్లమ్(Brendon Mccullum) మండిపడ్డాడు. వీరిద్దరు మాట్లాడిన మాటల్లో ఏమాత్రం నిజం లేదంటూ కొట్టిపారేశాడు. ఆట విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో తమకంటూ ఓ విధానం ఉందని.. ఫలితాలు అనుకూలంగా లేనపుడు ఇలాంటివి సహజమేనని పేర్కొన్నాడు.అసలేం జరిగిందంటే.. టీమిండియా(India vs England)తో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పొట్టి ఫార్మాట్ సిరీస్‌లో సూర్యసేన చేతిలో 4-1తో చిత్తైన బట్లర్ బృందం.. రోహిత్ సేనతో వన్డేల్లో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది.తద్వారా ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆరంభానికి ముందు గట్టి ఎదురుదెబ్బను చవిచూసింది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ వేదికగా భారత్‌తో ఇంగ్లండ్ మూడో వన్డే సందర్భంగా.. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒకే ఒక్క నెట్ సెషన్ఈ సిరీస్ కోసం సన్నద్ధమయ్యే క్రమంలో ఇంగ్లండ్ ఒకే ఒక్క నెట్ సెషన్లో పాల్గొన్నదంటూ బట్లర్ బృందం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆట పట్ల అంకితభావం లేదంటూ విమర్శలకు దిగారు. ఈ విషయంపై ఇంగ్లండ్ హెడ్‌కోచ్ బ్రెండన్ మెకల్లమ్ తాజాగా స్పందించాడు.టాక్స్పోర్ట్తో మాట్లాడుతూ.. ‘‘మేము అసలు శిక్షణా శిబిరంలో పాల్గొననేలేదన్న వారి మాటలు పూర్తిగా అవాస్తవం. సిరీస్ ఆసాంతం మేము నెట్ సెషన్స్‌లో బిజీగా ఉన్నాం.అంతకు ముందు కూడా మా వాళ్లు వరుస సిరీస్‌లు ఆడారు. ఎదుటివారి విషయంలో ఆధారాలు లేకుండా ఇష్టారీతిన మాట్లాడటం సులువే. ఫలితాలు మాకు అనుకూలంగా లేవు కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.మాకంటూ ఒక విధానం ఉందిఏ ఫార్మాట్లో ఎలా ఆడాలో మాకంటూ ఒక విధానం ఉంది. దానినే మేము అనుసరిస్తాం. ఇక ఇప్పటికే జట్టులోని చాలా మంది ఆటగాళ్లు గాయపడ్డారు. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మాకు తెలుసు. ముందుగా చెప్పినట్లు వాళ్లు మాట్లాడిన మాటలు అబద్దాలు’’ అని మెకల్లమ్ రవిశాస్త్రి, పీటర్సన్ వ్యాఖ్యలను తిప్పికొట్టాడు.ఇక ఇప్పటికే ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ సైతం వీరి మాటలను ఖండించిన విషయం తెలిసిందే. సుదీర్ఘ ప్రయాణాలు, బిజీ షెడ్యూల్ కారణంగా ఒకటీ రెండు సెషన్లు మాత్రమే మిస్సయ్యామని తెలిపాడు. అంతేతప్ప రవిశాస్త్రి, పీటర్సన్ అన్నట్లుగా తామేమీ పూర్తిగా ప్రాక్టీస్‌కు దూరంగా లేమని పేర్కొన్నాడు.కాగా టెస్టుల్లో ‘బజ్‌బాల్’ విధానంతో దూకుడైన ఆటను పరిచయం చేసిన బ్రెండన్ మెకల్లమ్.. టీమిండియాతో సిరీస్ సందర్భంగా ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కోచ్‌గానూ నియమితుడయ్యాడు. అయితే, తొలి ప్రయత్నంలోనే ఘోర పరాజయాలతో విమర్శలు మూటగట్టుకున్నాడు.చదవండి: CT 2025: సురేశ్ రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్‌కప్ వీరులకు నో ఛాన్స్! -
ఛాంపియన్స్ ట్రోఫీ.. భారత తుది జట్టు ఇదే! ఆ స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్?
క్రికెట్ మికులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు సమయం అసన్నమైంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఈ ఐసీసీ మహాసంగ్రామానికి తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లు కరాచీ వేదికగా తలపడనున్నాయి. ఈ మెగా టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గోనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉండగా.. గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, అప్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి. ఈ ఈవెంట్లో భారత జట్టు తమ మ్యాచ్‌లను దుబాయ్ వేదికగా ఆడనుంది. సెమీ ఫైనల్స్, ఫైనల్స్‌కి వెళ్తే ఆ మ్యాచ్‌లు కూడా దుబాయ్‌లోనే జరగనున్నాయి. ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు పీసీబీ అంగీకరించింది. తొలుత మొండి పట్టుపట్టినప్పటికి ఐసీసీ డిమాండ్లకు పీసీబీ తలొగ్గింది.ఇక ఈ మెగా ఈవెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 19న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడునుంది. ఆ తర్వాత ఈ నెల 23న దాయాది పాకిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. అయితే భారత్‌కు జస్ప్రీత్ బుమ్రా గాయం రూపంలో గట్టి ఎదురు దెబ్బ తగలింది. బుమ్రా గాయం కారణంగా ఈ ఐసీసీ టోర్నీకి దూరమయ్యాడు. అతడి స్ధానాన్ని హర్షిత్ రాణాతో సెలక్టర్లు భర్తీ చేశారు. అదేవిధంగా ఆఖరి నిమిషంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని కూడా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను ఇంగ్లండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్ ఎంపిక చేశాడు. పేసర్ హర్షిత్ రాణా, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, స్పిన్ ద్వయం వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్‌లను పీటర్సన్ పట్టించుకోలేదు. ఓపెనర్లగా రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్‌లకు తన జట్టులో పీటర్సన్ చోటిచ్చాడు. అదేవిధంగా విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌లకు ఫస్ట్ డౌన్, సెకెండ్ డౌన్లో అతడు అవకాశమిచ్చాడు.మిడిలార్డర్లో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను పీటర్సన్ సెలక్ట్ చేశాడు. ఫినిషర్లగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలకు ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఫాస్ట్ బౌలర్ల కోటాలో అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ.. స్పెషలిస్టు స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ను పీటర్సన్ ఎంపిక చేశాడు. కాగా ఈ మెగా టోర్నీకి ముందు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో భారత క్లీన్ స్వీప్ చేసింది. ఇదే జోరును ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది.ఛాంపియన్స్ ట్రోఫీకి పీటర్సన్ ఎంపిక చేసిన భారత తుది జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.చదవండి: ప్లీజ్.. నన్ను కింగ్ అని పిలవకండి: బాబర్ ఆజం -
సెమీస్‌కు చేరే జట్లు ఇవే.. పప్పులో కాలేసిన ఇంగ్లండ్ దిగ్గజం
ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy) కు మరో ఐదు రోజుల్లో తెరలేవనుంది. ఫిబ్రవరి 19 నుంచి కరాచీ (పాకిస్తాన్) వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గోనే అన్ని జట్లు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. ఎనిమిదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ఎలాగైనా ఛాంపియన్స్‌గా నిలవాలని ఆయా జట్లు పట్టుదలతో ఉన్నాయి.ఈ మినీ వరల్డ్‌కప్ కోసం టీమ్స్ ఒక్కొక్కటిగా పాకిస్తాన్‌కు చేరుకుంటున్నాయి. పాకిస్తాన్ 1996 వన్డే ప్రపంచకప్ తర్వాత ఓ ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వనుండడం ఇదే మొదటి సారి. ఇక భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. టీమిండియా తమ మొత్తం మ్యాచ్‌లు దుబాయ్‌లోనే ఆడనుంది.కాగా ఈ మెగా టోర్నీకి సమయం దగ్గరపడుతుండడంతో ఏయే టీమ్స్ సెమీస్ చేరుతాయి, విజేత ఎవరన్నది? మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ చేరాడు. భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు సెమీస్‌కు చేరుతాయని పీటర్సన్ చెప్పుకొచ్చాడు.అదేలా సాధ్యం కెవిన్?అయితే ఇక్కడే పీటర్సన్ పప్పులో కాలేశాడు. ఎందుకంటే కెవిన్ ఎంచుకున్న జట్లలో మూడు టీమ్స్ ఒకే గ్రూపులో ఉన్నవి కావడం గమనార్హం. ఈ మినీ వరల్డ్‌కప్‌లో మొత్తం 8 జట్లు పాల్గోంటున్నాయి. వీటిని రెండు గ్రూప్‌లుగా విభజించారు. అందులో గ్రూప్-ఎలో పాకిస్థాన్, భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. గ్రూప్-బిలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, అప్ఘానిస్థాన్, ఇంగ్లండ్‌లు ఉన్నాయి. ప్రతి గ్రూప్ నుండి పాయింట్ల పట్టికలో తొలి రెండు రెండు స్ధానాల్లో నిలిచిన జట్లు మాత్రమే సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయి. కానీ ఈ ఇంగ్లండ్ దిగ్గజం మాత్రం గ్రూపు-ఎ నుంచే మూడు జట్లు సెమీస్‌కు చేరుకుంటాయని అంచనావేశాడు.మ్యాథమెటికల్‌గా ఒకే గ్రూపు నుంచి మూడు జట్లు సెమీస్‌కు చేరడం సాధ్యం కాదు. దీంతో నెటిజన్లు పీటర్సన్‌ను ట్రోలు చేస్తున్నారు. కాగా ఈ మెగా టోర్నీకి టీమిండియా స్టార్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్ధానాన్ని హర్షిత్ రాణాతో బీసీసీఐ భర్తీ చేసింది.ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిచదవండి:Champions Trophy 2025: ఫేక్ అక్రెడిటేషన్‌తో కరాచీ స్టేడియానికి.. భద్రతపై సందేహాలు -
ఇంగ్లండ్‌తో వన్డేలు: రోహిత్, కోహ్లి ఫామ్‌లోకి వస్తారా?
నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్(India vs England)తో గురువారం ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత్ సంసిద్ధమవుతోంది. త్వరలో ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్(ICC Champions Trophy) జరగనున్న నేపథ్యంలో ఇరుజట్లకు ఇది కీలకంగా మారింది. అయితే టీమిండియా అభిమానుల దృష్టి మాత్రం సీనియర్ బ్యాటర్లు కెప్టెన్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీల పైనే ఉంది. మామూలుగా అయితే వారిద్దరి ఎంపిక ఎప్పుడూ చర్చనీయాంశం కాదు. కానీ ప్రస్తుతం వారిద్దరూ పేలవమైన ఫామ్ తో వరుసగా విఫలమవుతూదండటంతో అందరి దృష్టి వారిపైనే ఉంది.సీనియారిటీ పరంగా వారిద్దరూ జట్టులో చాల కీలకం కావడం కూడా ఇందుకు ప్రధాన కారణం. వారిద్దరూ ఆడటం ప్రారంభిస్తే జట్టులో ఉత్తేజం మామూలు స్థాయిలో ఉండదు. ఇక అందరికీ కోహ్లీ సంగతి తెలిసిందే. అతడు ఫీల్డ్ లో మెరుపు తీగలా కలయ తిరుగుతూ జట్టు సభ్యులని ఉత్తేజపరుస్తాడు. రోహిత్ శర్మ జట్టు సారథి. జట్టుని ముందుండి నడిపించాల్సిన ఆటగాడు వరుసగా విఫలమవుతూ ఉంటే అది తప్పనిసరిగా అతని నాయకత్వ తీరు పై ప్రభావం చూపిస్త ఉందనడంలో సందేహం లేదు.పైగా వారిద్దరి వయస్సు కూడా ముప్పై అయిదు సంవత్సరాలు దాటడంతో ఈ ఇద్దరి పై ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం వారిద్దరూ మళ్ళీ ఫామ్ లోకి వస్తే తప్ప విమర్శలకి చెక్ పెట్టడం సాధ్యం కాదు. వరుసగా విఫలమవుతూ ఒత్తిడిలో ఉన్న వారిద్దరూ రిటైర్మెంట్ గురుంచి ఆలోచిస్తున్నారని వాదనలు కూడా వినిపిస్తున్నాయి.కోహ్లిని వెంబడిస్తున్న బలహీనతఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పర్యటన లో ఘోరంగా విఫలమైన రోహిత్, కోహ్లీ దేశవాళీ రంజీ ట్రోఫీ లో రాణిస్తారని అందరూ ఆశించారు. కానీ అక్కడ కూడా వారి ఆటతీరు ఆశించిన స్థాయిలో లేదు. రోహిత్, కోహ్లీ ఆగస్టులో శ్రీలంక పర్యటనలో చివరిసారిగా వన్డే క్రికెట్లో ఆడారు. ఆ సిరీస్‌లో రోహిత్ 141.44 స్ట్రైక్ రేట్‌తో మూడు ఇన్నింగ్స్‌లలో 157 పరుగులు చేశాడు.అయితే కోహ్లీ మాత్రం మూడు మ్యాచ్‌లలో కేవలం 58 పరుగులు మాత్రమే సాధించాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీకి దీర్ఘకాలంగా ఉన్న బలహీనత మళ్లీ బయటపడింది. అతను ఆఫ్-స్టంప్ దిశగా వచ్చే బంతుల్ని ఛేజ్ చేస్తూ ఏకంగా ఎనిమిది సార్లు అవుట్ అయ్యాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్ నుంచి వైదొలగడానికి ముందు ఐదు ఇన్నింగ్స్‌లలో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు.బ్యాటింగ్ దిగ్గజాలని గౌరవించండిఇంగ్లాండ్ లెజెండ్ కెవిన్ పీటర్సన్ మాత్రం విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మల కు మద్దతుగా నిలిచాడు. ఇటీవల కాలంలో కోహ్లీ, రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ తో ఇబ్బంది పడటం వాస్తవమే అయినా వారిద్దరూ రిటైర్మెంట్ కావాలని కోరడం అన్యాయమని చెప్పాడు. ప్రతి ఆటగాడు తమ కెరీర్లో కఠినమైన దశలను ఎదుర్కొంటాడనీ.. విరాట్, రోహిత్ లు 'రోబోలు కాదని భారత్ అభిమానులు గుర్తించాలని పీటర్సన్ పేర్కొన్నాడు."నా కెరీర్లో కూడా ఇలాంటి సవాళ్ళే ఎదురయ్యాయి. రోహిత్, విరాట్ రోబోలు కాదు. వారు బ్యాటింగ్ చేసిన ప్రతిసారీ సెంచరీ చేయడం సాధ్యం కాదు. ఆస్ట్రేలియా పర్యటనలో వారిద్దరూ విఫలమై ఉండవచ్చు. అంత మాత్రం వారిద్దరూ ఇంక అంతర్జాతీయ క్రికెట్ కి పనికిరారని ముద్ర వేయడం సరికాదు’’ అని పీటర్సన్ అన్నాడు. వారిద్దరి రికార్డులని దృష్టిలో ఉంచుకొని వారి పట్ల సానుభూతి చూపాలని పీటర్సన్ భారత్ అభిమానులకి పిలుపునిచ్చాడు.సచిన్ రికార్డుపై కోహ్లీ కన్నుభారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డేల్లో సాధించిన రికార్డుకు విరాట్ కోహ్లీ అతి చేరువలో ఉన్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 14 వేల పరుగుల మైలురాయి ని సాధించిన బ్యాటర్‌గా సచిన్ సాధించిన రికార్డ్ కి కోహ్లీ కేవలం 94 పరుగుల దూరంలో ఉన్నాడు. సచిన్ఈ మైలురాయి ని చేరాడనికి 350 ఇన్నింగ్స్ లు తీసుకోగా కోహ్లీ ప్రస్తుతం 283 వన్డే మ్యాచ్ లలో 58.18 సగటుతో 13,906 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ తో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్ లో కోహ్లీ మరో 94 పరుగులు సాధించి ఈ రికార్డ్ ని అధిగమిస్తాడని భారత్ అభిమానులు ఆశిస్తున్నారు.చదవండి: Ind vs Eng: తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. వెటరన్ ప్లేయర్ రీఎంట్రీ -
వాళ్లిద్దరు మరో రెండేళ్లు టీమిండియాకు ఆడతారు: కెవిన్ పీటర్సన్
టీమిండియా దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma)లకు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్(Kevin Pietersen) మద్దతు పలికాడు. వీరిద్దరు మరో రెండేళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతారని అంచనా వేశాడు. ఇప్పటికే తామేంటో ‘విరాహిత్’ ద్వయం నిరూపించుకున్నారని.. కొత్తగా వాళ్లు చేయాల్సిందేమీ లేదని పేర్కొన్నాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. వన్డేలు, టెస్టుల్లో కొనసాగుతున్న ఈ ఇద్దరు గత కొన్నినెలలుగా రోహిత్-విరాట్ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా రెడ్‌బాల్ క్రికెట్లో రోహిత్, కోహ్లి విఫలమవుతున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరు ఇక ఆటకు సెలవిచ్చి యువ క్రికెటర్లకు మార్గం సుగమం చేయాలనే డిమాండ్లూ వినిపించాయి. ఇక టీ20 రిటైర్మెంట్ తర్వాత వీరిద్దరు శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో మాత్రమే పాల్గొన్నారు. తాజాగా మరోసారి ఇంగ్లండ్‌తో వన్డేలకు సిద్ధమయ్యారు.సొంతగడ్డపై జరగుతున్న ఈ సిరీస్ అనంతరం.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీతో కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి విరాట్ కోహ్లి బిజీ అవుతారు. ఈ మ్యాచ్‌లలో వీరి ఆట తీరు ఆధారంగానే భవిష్యత్తు ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కెవిన్ పీటర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.మరో రెండేళ్లు టీమిండియాకు ఆడతారు‘‘ఎవరి ముందు వీరు ఇంకా నిరూపించుకోవాల్సిందేమీ ఏమీలేదు. ఇద్దరూ దిగ్గజాలే. అద్భుతమైన బ్యాటింగ్‌తో ఎన్నో ఏళ్లుగా క్రికెట్ ప్రేమికులను అలరిస్తున్నారు. వారి వయసు 36- 37. అయినా సరే.. మరో రెండేళ్ల పాటు టీమిండియా తరఫున కొనసాగ గల సత్తా వారికి ఉంది.ఇక కోహ్లి విషయానికొస్తే.. భారత్ తరఫున అత్యుత్తమ చేజింగ్ కింగ్ అతడే. అంతేకాదు.. ప్రపంచంలో అతడి లాంటి ఆటగాడు మరొకరు లేరు. చేజింగ్‌లో దేశానికి ఇన్ని విజయాలు సాధించి పెట్టినవారూ లేరు. అతడు ఫామ్‌లోకి వచ్చాడంటే.. ఎవరూ ఆపలేరు.కోహ్లి- రోహిత్ ఆటను చూస్తే ముచ్చటేస్తుంది. రోహిత్ ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఆ తర్వాత అతడు ఎదిగిన తీరు అమోఘం’’ అని పీటర్సన్ కొనియాడాడు. కాగా ఫిబ్రవరి 6 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య నాగ్‌పూర్ వేదికగా వన్డే సిరీస్ మొదలుకానుంది. కటక్ వేదికగా ఫిబ్రవరి 9న రెండో వన్డే, అహ్మదాబాద్‌లో ఫిబ్రవరి 12న మూడో వన్డే జరుగుతుంది. ఇంగ్లండ్‌తో మూడు వన్డేలకు టీమిండియారోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా.భారత్‌తో వన్డేలకు ఇంగ్లండ్ జట్టుజోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుండగా.. ఫిబ్రవరి 20న రోహిత్ సేన తమ తొలి మ్యాచ్ ఆడనుంది. తటస్థ వేదికైన దుబాయ్‌లో టీమిండియా తమ మ్యాచ్‌లు ఆడుతుంది. ఇక దాయాది పాకిస్తాన్‌తో ఫిబ్రవరి 23న మ్యాచ్ ఆడనున్న భారత్.. లీగ్ దశలో ఆఖరిగా మార్చి రెండున న్యూజిలాండ్‌తో తలపడుతుంది. -
అద్భుత బ్యాటర్.. లోయర్ ఆర్డర్లో పంపిస్తారా?: కెవిన్ పీటర్సన్
రాజ్‌కోట్ టీ20(Rajkot T20I)లో టీమిండియా ఆట తీరును ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ విమర్శించాడు. బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేకపోవడం వల్లే ఓటమి ఎదురైందని అభిప్రాయపడ్డాడు. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్, మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్ భారత్‌లో పర్యటిస్తోంది.ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ మొదలుకాగా.. కోల్‌కతా, చెన్నైలలో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. తద్వారా 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ క్రమంలో మంగళవారం రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో మూడో టీ20లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన సూర్యకుమార్ సేనకు పరాజయం ఎదురైంది.బ్యాటర్ల వైఫల్యం వల్లేఈ మ్యాచ్‌లో భారత్ ఇంగ్లండ్ చేతిలో 26 పరుగుల తేడా(England Beat India)తో ఓటమిని చవిచూసింది. ఇందుకు ప్రధాన కారణం టీమిండియా బ్యాటర్ల వైఫల్యమేనని చెప్పవచ్చు. గత రెండు మ్యాచ్‌లలో టీమిండియా టాపార్డర్ ఒకే విధంగా ఉంది. ఓపెనర్లుగా సంజూ శాంసన్- అభిషేక్ శర్మ.. వన్‌డౌన్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) వచ్చారు. ఇక నాలుగో స్థానంలో తిలక్ వర్మ బ్యాటింగ్ చేశాడు.హార్దిక్ ఐదో నంబర్లోమూడో టీ20లోనూ ఈ నలుగురి స్థానాలు మారలేదు. కానీ వరుస విరామాల్లో వికెట్లు పడిన వేళ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను మేనేజ్మెంట్ ప్రమోట్ చేసింది. ఐదో స్థానంలో అతడు బ్యాటింగ్‌కు దిగాడు. మరోవైపు.. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసం ఆ తర్వాతి స్థానాల్లో మరో ఇద్దరు ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్(6), అక్షర్ పటేల్(15)లను రంగంలోకి దించారు.ఎనిమిదో స్థానంలో జురెల్అదే విధంగా.. అచ్చమైన బ్యాటర్ అయిన ధ్రువ్ జురెల్‌ను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపారు. ఇక హార్దిక్ క్రీజులో నిలదొక్కుకునేందుకు ఇరవైకి పైగా బంతులు తీసుకుని.. మొత్తంగా 35 బంతుల్లో 40 పరుగులే చేశాడు. ఇదిలా ఉంటే.. ధ్రువ్ జురెల్ క్రీజులోకి వచ్చే సమయానికి.. టీమిండియా విజయలక్ష్యానికి ఓవర్‌కు పదహారు పరుగులు చేయాల్సిన పరిస్థితి.ఇలాంటి తరుణంలో ఒత్తిడిలో చిత్తైన జురెల్ నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులే చేసి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టపోయిన టీమిండియా 145 పరుగులకే పరిమితమైంది. తద్వారా ఇంగ్లండ్ విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పరాజయం పాలైంది.అద్భుత నైపుణ్యాలు ఉన్న బ్యాటర్‌ను పక్కనపెట్టిఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ.. టీమిండియా అనవసరంగా ఆల్రౌండర్లను ముందు పంపిందని అభిప్రాయపడ్డాడు. వారికి బదులు జురెల్‌ను పంపించి ఉంటే ఫలితం వేరేలా ఉండేదన్నాడు.ఈ మేరకు.. ‘‘ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ నాకు అస్సలు నచ్చలేదు. ఇది సరైంది కానేకాదు. ధ్రువ్ జురెల్ అచ్చమైన, స్వచ్ఛమైన బ్యాటర్. అద్భుత నైపుణ్యాలు ఉన్న ఆటగాడు. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసమని అతడిని లోయర్ ఆర్డర్లో పంపించడం సరికాదు. జట్టులోని అత్యుత్తమ బ్యాటర్లు కచ్చితంగా కాస్త టాప్ ఆర్డర్‌లోనే రావాలి’’ అని కెవిన్ పీటర్సన్ హిందుస్తాన్ టైమ్స్‌తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్- మూడో టీ20 స్కోర్లు👉టాస్: ఇండియా.. తొలుత ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన సూర్య👉ఇంగ్లండ్ స్కోరు: 171/9 (20)👉ఇండియా స్కోరు: 145/9 (20)👉ఓవరాల్ టాప్ రన్ స్కోరర్: బెన్ డకెట్(28 బంతుల్లో 51)👉టీమిండియా టాప్ రన్ స్కోరర్: హార్దిక్ పాండ్యా(35 బంతుల్లో 40)👉ఫలితం: ఇండియాపై 26 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: వరుణ్ చక్రవర్తి(5/24).చదవండి: అతడొక వరల్డ్‌క్లాస్ బౌలర్.. మా ఓటమికి కారణం అదే: సూర్య -
టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా కేపీ..?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో బ్యాటర్ల ఘోర వైఫల్యం నేపథ్యంలో భారత జట్టు బ్యాటింగ్ కోచ్ కోసం అన్వేషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి క్రిక్‌బజ్‌లో ఓ నివేదిక వచ్చింది. ఇందులో బీసీసీఐ భారత బ్యాటింగ్ విభాగంలో సహాయక సిబ్బందిని బలోపేతం చేయాలని చూస్తున్నట్లు పేర్కొని ఉంది. ఈ అంశాన్ని ఓ యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేయగా.. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ స్పందించాడు. భారత శిబిరంలో చేరడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.🚨 BATTING COACH FOR INDIA. 🚨- The BCCI exploring possibilities to add a batting coach to India's coaching staff. (Cricbuzz). pic.twitter.com/mIRTwPDxOX— Mufaddal Vohra (@mufaddal_vohra) January 15, 202544 ఏళ్ల కెవిన్ పీటర్సన్‌కు అద్భుతమైన బ్యాటర్‌గా పేరుంది. సౌతాఫ్రికాలో పుట్టిన కెవిన్.. 2004-2014 మధ్యలో మూడు ఫార్మాట్లలో ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇంగ్లండ్ తరఫున 104 టెస్ట్‌లు ఆడిన కేపీ.. 23 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీల సాయంతో 47.3 సగటున 8181 పరుగులు చేశాడు.తన కెరీర్లో 136 వన్డేలు ఆడిన కేపీ 9 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీల సాయంతో 40.7 సగటున 4440 పరుగులు చేశాడు. టీ20ల్లోనూ మంచి రికార్డు కలిగిన కేపీ.. 37 మ్యాచ్‌ల్లో 141.5 స్ట్రయిక్‌రేట్‌తో 1176 పరుగులు చేశాడు. ఆఫ్ స్పిన్ బౌలర్ కూడా అయిన కేపీ మూడు ఫార్మాట్లలో కలిపి 18 వికెట్లు తీశాడు.2009 నుంచి 2016 వరకు ఐపీఎల్ ఆడిన కేపీ వివిధ ఫ్రాంచైజీల తరఫున 36 మ్యాచ్‌లు ఆడి 134.7 స్ట్రయిక్‌రేట్‌తో 1001 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కేపీ తన ఐపీఎల్ కెరీర్లో ఏడు వికెట్లు కూడా తీశాడు.రిటైర్మెంట్ అనంతరం కేపీ వివిధ క్రికెట్ లీగ్‌ల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇంగ్లండ్ ఆస్ట్రేలియాలో యాషెస్ సిరీస్ (2010-11) సొంతం చేసుకున్న బృందంలో కేపీ కీలక సభ్యుడిగా ఉన్నాడు. 2012-13 భారత పర్యటనలోనూ కేపీ ఇరగదీశాడు. దూకుడు స్వభావం కలిగిన కేపీ తన కెరీర్లో ఎన్నో వివాదాల్లో తల దూర్చాడు. వివాదాలు ఎలా ఉన్నా కేపీ అన్నింటికీ బ్యాట్‌తో సమాధానం చెప్పేవాడు.కాగా, ప్రస్తుతం భారత కోచింగ్ బృందంలో ఐదుగురు సభ్యులు ఉన్నారు. గౌతమ్ గంభీర్ టీమిండియాకు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తుండగా.. మోర్నీ మోర్కెల్ బౌలింగ్ కోచ్‌గా, టి దిలీప్ ఫీల్డింగ్ కోచ్‌గా సేవలందిస్తున్నారు. ర్యాన్ టెన్ డస్కటే, అభిషేక్ నాయర్ అసిస్టెంట్ కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారు. భారత జట్టుకు ప్రత్యేకించి బ్యాటింగ్ కోచ్ లేడు. ఈ స్థానం కోసం ఎవరైనా అనుభవజ్ఞుడిని ఎంచుకుంటే టీమిండియాకు మేలు చేకూరే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే, ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ 1-3 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ మాత్రమే గెలిచిన భారత్ ఆతర్వాత దారుణంగా విఫలమై మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ప్రస్తుతం భారత్ ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రిపేర్ అవుతుంది. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతుంది.భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ షెడ్యూల్..జనవరి 22- తొలి టీ20(కోల్‌కతా)జనవరి 25- రెండో టీ20(చెన్నై)జనవరి 28- మూడో టీ20(రాజ్‌కోట్)జనవరి 31- నాలుగో టీ20(పుణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20(ముంబై, వాంఖడే)భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ షెడ్యూల్..ఫిబ్రవరి 6- తొలి వన్డే(నాగ్‌పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే(కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే(అహ్మదాబాద్)ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ షెడ్యూల్..ఫిబ్రవరి 20- బంగ్లాదేశ్ (దుబాయ్)ఫిబ్రవరి 23- పాకిస్తాన్ (దుబాయ్)మార్చి 2- న్యూజిలాండ్ (దుబాయ్) -
విరాట్ కోహ్లి ఆర్సీబీని వీడాలి.. ఆ జట్టులో చేరాలి: ఇంగ్లండ్ స్టార్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. మళ్లీ పాత కథే.. ఐపీఎల్-2024లో వరుసగా ఆరు పరాజయాలు.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి అవుటైనట్లే ఇక అనుకున్న సమయంలో అనూహ్య రీతిలో కమ్‌బ్యాక్.వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి టాప్-4లో అడుగు.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి ఎలిమినేటర్ మ్యాచ్‌కు అర్హత. ఈ గండం దాటితే క్వాలిఫయర్-2 ఆడొచ్చు. అక్కడా గెలిస్తే ఏకంగా ఫైనల్లో.. ఇక టైటిల్‌కు ఒకే ఒక్క అడుగు దూరం..ఆర్సీబీ జోరు చూస్తే ఈసారి కప్పు మనదే అనిపిస్తోందంటూ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు సైతం.. రాజస్తాన్ రాయల్స్‌ను ఆర్సీబీ ఎలిమినేట్ చేయడం ఖాయమంటూ జోస్యాలు చెప్పారు.అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రాజస్తాన్ అద్భుత ఆట తీరుతో ఆర్సీబీ ఆశలను గల్లంతు చేసింది. వరుసగా ఓటముల తర్వాత.. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.ఫలితంగా ఆర్సీబీ పదిహేడేళ్ల కల ఈసారికీ కలగానే మిగిలిపోయింది. అయితే, సీజన్ ఆసాంతం ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకోవడం ఒక్కటే అభిమానులకు కాస్త ఊరట కలిగిస్తోంది.దుమ్ములేపిన కోహ్లి.. కానీ ఏం లాభం?ఈ ఎడిషన్‌లో కోహ్లి 15 ఇన్నింగ్స్‌లో కలిపి 741 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి ఇప్పటికైనా ఆర్సీబీని వదిలేయాలని విజ్ఞప్తి చేశాడు.‘‘ఇంతకు ముందు చెప్పాను.. ఇప్పుడూ అదే చెప్తున్నా. ఇతర క్రీడల్లోని దిగ్గజాలు సైతం ఒకానొక సమయంలో తమ సొంత జట్లను వదిలి వేరే చోటకు వెళ్లి టైటిల్స్ సాధించారు.ఆర్సీబీని వీడటమే ఉత్తమంఇప్పటికే కోహ్లి ఎంతగానో ప్రయత్నించాడు. మరోసారి ఆరెంజ్‌క్యాప్ కూడా సొంతం చేసుకున్నాడు. ఫ్రాంఛైజీ కోసం ఎంతో చేస్తున్నాడు. కానీ ఈసారి కూడా ఆర్సీబీ టైటిల్ గెలవడంలో విఫలమైంది. బ్రాండ్‌వాల్యూ పరంగా ఫ్రాంఛైజీతో కోహ్లి బంధం ఎలాంటిదో తెలుసు. అయినప్పటికీ.. ట్రోఫీ ముద్దాడేందుకు కోహ్లి నూటికి నూరుపాళ్లు అర్హుడు. కాబట్టి టైటిల్ గెలిచే సత్తా ఉన్న టీమ్‌లోకి అతడు వెళ్లాలని కోరుకుంటున్నా’’ అని ఆర్సీబీ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ పేర్కొన్నాడు.ఢిల్లీకి ఆడాలివచ్చే ఏడాది కోహ్లి ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారిపోవాలని సూచించాడు. సొంతగడ్డకు చెందిన ఫ్రాంఛైజీకి అతడు ప్రాతినిథ్యం వహిస్తే చూడాలని ఉందని.. ఈ సందర్భంగా ఫుట్‌బాల్ దిగ్గజాలు బెక్హాం, క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ తదితరులు ఫ్రాంఛైజీలు మారి విషయాన్ని పీటర్సన్ ప్రస్తావించాడు. కాగా ఐపీఎల్ ఆరంభం నుంచి అంటే 2008 నుంచి కోహ్లి ఆర్సీబీతోనే ఉన్నాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో 8 వేలకు పైగా పరుగులు పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించాడు.చదవండి: Hardik Pandya: భార్యతో హార్దిక్ పాండ్యాకు విభేదాలు?.. అతడి వల్లే అంటూ నటాషా పోస్ట్ వైరల్ -
అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా విమర్శకులకు టీమిండియా మాజీ క్రికెటర్, కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతం గంభీర్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. పాండ్యా కెప్టెన్సీని తప్పుబట్టిన ఇంగ్లండ్ స్టార్ కెవిన్ పీటర్సన్, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా ఐపీఎల్-2024 నేపథ్యంలో ముంబై ఇండియన్స్ గూటికి చేరుకున్న హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే, ఆల్‌రౌండర్‌గా, సారథిగా అతడు పూర్తిగా నిరాశపరిచాడు.విమర్శల జల్లుగతేడాది రోహిత్ కెప్టెన్సీలో ప్లే ఆఫ్స్ చేరిన ముంబై.. ఈసారి పాండ్యా నాయకత్వంలో టాప్-4 నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. అందుబాటులో ఉన్న ఆటగాళ్ల సేవలను సరైన విధంగా ఉపయోగించుకోకపోవడం వల్లే ముంబైకి ఈ దుస్థితి ఎదురైందని విమర్శలు వెల్లువెత్తాయి.హార్దిక్ పాండ్యా అతి విశ్వాసం వల్లే ప్రతికూల ఫలితాలు వచ్చాయంటూ విశ్లేషకులు పెదవి విరిచారు. ఈ నేపథ్యంలో కెవిన్ పీటర్సన్, ఏబీ డివిలియర్స్ కూడా పాండ్యాను విమర్శించారు.వాళ్లు పెద్దగా పొడిచిందేమీ లేదుఈ నేపథ్యంలో తాజాగా గౌతం గంభీర్ స్పందిస్తూ.. వీళ్లిద్దరికీ కౌంటర్ ఇస్తూ హార్దిక్ పాండ్యాకు మద్దతునిచ్చాడు. ‘‘వాళ్లు కెప్టెన్‌గా ఉన్నపుడు ఏం సాధించారు? నాకు తెలిసి నాయకులుగా వాళ్లు పెద్దగా పొడిచిందేమీ లేదు.వాళ్ల రికార్డులు పరిశీలిస్తే మరే ఇతర కెప్టెన్‌కు కూడా అంతటి చెత్త రికార్డులు ఉండవు. ఇక ఏబీడీ ఐపీఎల్లో ఒక్క మ్యాచ్‌కైనా సారథ్యం వహించాడా?వ్యక్తిగత స్కోర్లు సాధించాడే గానీ.. జట్టు కోసం అతడి చేసిందేమీ లేదు. తను ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్‌ఇక హార్దిక్ పాండ్యా.. ఇప్పటికే తను ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్. కాబట్టి ఇలాంటి వాళ్లతో అతడికి పోలిక కూడా అవసరం లేదు’’ అంటూ గంభీర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.కాగా పీటర్సన్, ఏబీ డివిలియర్స్ గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించారు. పీటర్సన్ 2009లో ఆరు మ్యాచ్‌లలో ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించి కేవలం రెండు విజయాలు అందుకున్నాడు.సారథిగా పీటర్సన్ విఫలంఇక 2014లో ఢిల్లీ ఫ్రాంఛైజీ సారథిగా బాధ్యతలు చేపట్టిన పీటర్సన్ కెప్టెన్సీలో జట్టు కేవలం రెండు విజయాలు సాధించి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. మరోవైపు.. గుజరాత్ టైటాన్స్‌ను 2022లో విజేతగా నిలపడంతో పాటు గతేడాది రన్నరప్‌గా నిలిపిన ఘనత హార్దిక్ పాండ్యా సొంతం. ఈ నేపథ్యంలో గంభీర్ స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ.. ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.చదవండి: Virat Kohli: అదే జరిగితే.. ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ కోహ్లినే! -
టీ20 వరల్డ్‌కప్‌లో రోహిత్, కోహ్లి ఆడుతారా? ఇంగ్లండ్ లెజెండ్ సమాధానమిదే
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి గత కొంత కాలంగా అతర్జాతీయ టీ20లకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత వీరిద్దరూ టీమిండియా తరపున టీ20ల్లో కన్పించలేదు. వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో ఓటమి తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ నుంచి కూడా వీరిద్దరూ తప్పుకున్నారు. దీంతో రోహిత్, కోహ్లి త్వరలోనే అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించనున్నారని తెగ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విరాట్, రోహిత్ వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ వరకు కొనసాగితే బాగుంటుందని చాలా మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "టీ20 వరల్డ్‌కప్ జట్టులోకి వచ్చేందుకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇద్దరికి ఛాన్స్ ఉంది. వారిద్దరూ ఐపీఎల్లో ఎలా ఆడుతారో చూడాలి. ఐపీఎల్లో వారు ఆట తీరు చాలా ముఖ్యం. వారిద్దరూ చాలా కాలం నుంచి భారత జట్టుకు తమ సేవలు అందిస్తున్నారు. కాబట్టి వారికి అందుకు తగ్గ గౌరవం ఇవ్వాలి. వాళ్ల ఫామ్ చూసి, వాళ్లకు అవకాశం ఇవ్వాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకోవాలి. ఇద్దరూ కూడా అద్బుతమైన క్రికెటర్లే. ఐపీఎల్లో వీరిద్దరూ మెరుగైన ప్రదర్శన చేస్తే కచ్చితంగా జట్టులో ఉండాలి. ఎందుకంటే ఐపీఎల్ ఫైనల్‌కు టీ20 వరల్డ్‌కప్ ప్రారంభానికి మధ్య పెద్దగా గ్యాప్ ఉండదు. వేచి చూద్దం ఏమి జరుగుతుందో" అని పీటీఈకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీటర్సన్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2024: అతడొక ఫినిషర్.. వేలంలో తీవ్ర పోటీ! రూ.13 కోట్లకు -
సురేశ్ రైనా మెరుపులు.. కెవిన్ పీటర్సన్ పోరాటం వృధా
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 ఎడిషన్‌లో భాగంగా గురువారం (నవంబర్ 23) జరిగిన మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్ సారథ్యం వహిస్తున్న ఇండియా క్యాపిటల్స్‌పై సురేశ్ రైనా నాయకత్వంలోని అర్భన్‌రైజర్స్ హైదరాబాద్ స్వల్ప తేడాతో (3 పరుగులు) విజయం సాధించింది. ఈ టోర్నీలో అర్భన్‌రైజర్స్ వరుసగా రెండో విజయం సాధించగా.. ఇండియా క్యాపిటల్స్ వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అర్భన్‌రైజర్స్.. గుర్కీరత్ సింగ్ (54 బంతుల్లో 89; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), సురేశ్ రైనా (27 బంతుల్లో 46; 6 ఫోర్లు, సిక్స్), పీటర్ ట్రెగో (20 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అర్భన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో డ్వేన్ స్మిత్ (3), మార్టిన్ గప్తిల్ (2), స్టువర్ట్ బిన్నీ (1)నిరాశపరిచారు. ఇండియా క్యాపిటల్స్ బౌలర్లలో ఇసురు ఉడాన 2 వికెట్లు పడగొట్టగా.. రస్టీ థీరన్, మునాఫ్ పటేల్, కేపీ అప్పన్న తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 190 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన క్యాపిటల్స్.. గెలుపు కోసం ఆఖరి బంతి వరకు పోరాడి, స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ (48 బంతుల్లో 77; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), ఆష్లే నర్స్ (25 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) క్యాపిటల్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో రికార్డో పావెల్ (26) పర్వాలేదనిపించగా.. గౌతమ్ గంభీర్ (0), హషీమ్ ఆమ్లా (5), బెన్ డంక్ (5) విఫలమయ్యారు. అర్భన్‌రైజర్స్ బౌలర్లలో క్రిస్ మోఫు 2 వికెట్లు పడగొట్టగా.. పీటర్ ట్రెగో, టీనో బెస్ట్, పవన్ సుయల్ తలో వికెట్ దక్కించుకున్నారు. టోర్నీలో భాగంగా ఇవాళ (నవంబర్ 24) మణిపాల్ టైగర్స్, భిల్వారా కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. -
వరల్డ్‌కప్‌లో ఆ జట్టుతో జాగ్రత్త.. టీమిండియా కూడా ఫేవరేట్: పీటర్సన్
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను 2-3 తేడాతో దక్షిణాఫ్రికా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలి రెండు వన్డేల్లో ప్రోటీస్ ఓటమి పాలైనప్పటికీ.. ఆఖరి మూడు వన్డేల్లో మాత్రం దుమ్ము రేపింది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా జట్టుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ప్రశంసల వర్షం కురిపించాడు. వన్డే ప్రపంచకప్-2023 టైటిల్ రేసులో దక్షిణాఫ్రికా కచ్చితంగా ఉంటుందని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా ఆసీస్‌తో నాలుగో వన్డేల్లో మెరుపు సెంచరీ సాధించిన హెన్రిస్ క్లాసెన్‌ను కూడా పీటర్సన్ పొగడ్తలతో ముంచెత్తాడు. "ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా అద్బుతమైన సిరీస్ విజయం సాధించింది. ఈ గెలుపుతో ప్రపంచకప్ టైటిల్ ఫేవరేట్‌గా ప్రోటీస్ జట్టు మారిపోయింది. క్లాసెన్ వారికి ప్రధాన ఆస్తి. అతడు బ్యాట్‌తో విధ్వంసం సృష్టించగలడు. అయితే ఆసియాకప్‌ను కైసవం చేసుకున్న భారత జట్టు కూడా టైటిల్ బరిలో ఉంటుంది. అదే విధంగా వారి స్వదేశంలో ఈ టోర్నీ జరగనుంది. మరోవైపు పాకిస్తాన్ నుంచి కూడా మిగితా జట్లకు ముప్పు పొంచి ఉంది. ఫేవరెట్ ట్యాగ్ పరంగా చూస్తే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు భారత్ తర్వాతే ఉంటాయని" ట్విటర్(ఎక్స్)లో పీటర్సన్ పేర్కొన్నాడు. ఇక ఈ మెగా ఈవెంట్లో ఆక్టోబర్ 5న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. చదవండి: #Mohammed Shami: వరల్డ్‌కప్‌కు ముందు మహ్మద్ షమీకి బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు South Africa become contenders for the CWC after their win against Aus. Klaasen is the major asset. India favourites at home with Asia Cup win. Pakistan is always a threat. ALWAYS! England sitting just under India, in terms of favourites tag. And Australia, well they’ll be… — Kevin Pietersen🦏 (@KP24) September 18, 2023 -
బౌలింగ్‌లోనూ 'కింగే'.. చెక్కుచెదరని బౌలింగ్ రికార్డు విరాట్ సొంతం
ప్రపంచ క్రికెట్లో ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్లలో ఒకడిగా, రికార్డుల రారాజుగా కీర్తించబడే రన్‌మెషీన్ విరాట్ కోహ్లి.. బౌలింగ్ విభాగంలోనూ తనదైన రికార్డు మార్కు చూపించాడు. అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా (2023 ఆగస్ట్ 18) ఈ ఆసక్తికర రికార్డు వివరాలు మీ కోసం. బాల్ వేయకుండానే వికెట్ తీసుకున్న ఏకైక క్రికెటర్‌గా.. 2011లో ఇంగ్లండ్‌తో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో తొలిసారి బంతి పట్టిన విరాట్.. బంతి వేయకుండానే తన ఖాతాలోకి వికెట్‌ను జమ చేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇప్పటికీ ఇది ఓ రికార్డే. అంతర్జాతీయ క్రికెట్లో (అన్ని ఫార్మాట్లలో) ఇప్పటివరకు ఏ క్రికెటర్ కూడా ఈ ఘనత సాధించలేదు. హేమాహేమీలైన బౌలర్లకు కూడా ఇది సాధ్యపడలేదు. బంతి వేయకుండానే వికెట్ ఎలా..? ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ కెవిన్ పీటర్సన్ బ్యాటింగ్ చేస్తుండగా.. నాటి కెప్టెన్ ఎంఎస్ ధోని బంతి విరాట్‌కు ఇచ్చాడు. విరాట్ తన అంతర్జాతీయ కెరీర్లో తొలి బంతినే వైడ్ బాల్‌గా వేయగా.. అది కూడా అతనికి కలిసొచ్చింది. లెగ్‌సైడ్ వెళ్తున్న బంతిని ధోని అద్భుతంగా అందుకుని, షాట్ ఆడే క్రమంలో క్రీజ్ దాటిన పీటర్సన్‌ను స్టంపౌట్ చేశాడు. ఇలా బంతి కౌంట్లోకి రాకుండానే ఓ పరుగు ఇచ్చి ఓ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు విరాట్. ఇదిలా ఉంటే, 2008లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌తో కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో అతను గౌతమ్ గంభీర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లి 22 బంతులు ఎదుర్కొని కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. అయితే కాలక్రమంలో కోహ్లి ఏరకంగా రాటుదేలాడో.. ఎన్ని పరుగులు, రికార్డులు,సెంచరీలు చేశాడో విశ్వం మొత్తం చూసింది. -
ఢిల్లీ క్యాపిటల్స్‌కు కోహ్లి! అగ్గిమీద గుగ్గిలం అవుతున్న ఆర్సీబీ ఫ్యాన్స్
IPL 2023- RCB- Virat Kohli: ఒక్క టైటిల్.. ఒకే ఒక్క ట్రోఫీ.. అంటూ ఐపీఎల్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు గత పదిహేనేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. క్యాష్ రిచ్ లీగ్ ప్రతి ఎడిషన్ ఆరంభం నుంచే ‘‘ఈసారి కప్ మనదే’’ అంటూ సందడి చేసే ఫ్యాన్స్‌కు ఎప్పటిలాగే ఈసారి కూడా చేదు అనుభవమే ఎదురైంది. ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే ఆర్సీబీ ఐపీఎల్-2023 ప్రయాణం ముగిసిపోయింది. ముఖ్యంగా ఈసారి విరాట్ కోహ్లి వింటేజ్ కింగ్‌ను గుర్తు చేస్తూ వరుస సెంచరీలతో అలరించినా ఫలితం లేకుండా పోయింది. గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం నాటి ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. వాళ్లపైనే ఆధారపడి ఈ మ్యాచ్‌లో కోహ్లి చేసిన అజేయ సెంచరీ వృథాగా మిగిలిపోయింది. ‘కేజీఎఫ్’(కోహ్లి, గ్లెన్, ఫాఫ్) రూపంలో తమకు లభించిన ఈ ముగ్గురు ఆటగాళ్లపైనే ప్రతిసారీ ఆధారపడటం.. బౌలింగ్‌లోనూ సిరాజ్ మినహా మిగతా వాళ్లు మరీ అంతగా ఆకట్టుకోలేకపోవడం తీవ్ర ప్రభావం చూపింది. ఇక కోహ్లికి ఆర్సీబీతో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి అదే జట్టుకు ఆడుతున్న కింగ్.. నేటికీ బంధం కొనసాగిస్తున్నాడు. కెప్టెన్‌గానూ సేవలు అందించాడు. ఆర్సీబీ ముఖచిత్రంగా మారాడు. బ్యాటర్‌గా తనపై భారం పడితే జట్టుకు నష్టం చేకూరుతుందేమోనన్న ఆలోచనతో గతేడాది సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగాడు. ఆ ఒక్క లోటు అయితే, క్యాష్ రిచ్ లీగ్‌లో ఎన్ని రికార్డులు సాధించినా.. శతకాల వీరుడిగా పేరొందినా.. ఒక్కసారి కూడా ఆర్సీబీ చాంపియన్‌గా నిలవలేదన్న లోటు ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. తాజా సీజన్లోనూ అదే పునరావృతమైంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కోహ్లిని ఉద్దేశించి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఢిల్లీకి మారాల్సిన సమయం వచ్చేసింది! గుజరాత్ చేతిలో ఆర్సీబీ ఓటమి అనంతరం.. ‘‘ విరాట్ రాజధాని నగరానికి మారాల్సిన సమయం ఆసన్నమైంది’’ అంటూ పీటర్సన్ ట్వీట్ చేశాడు. కోహ్లి స్వస్థలం ఢిల్లీకి చెందిన జట్టుకు ఆడాల్సిందిగా పరోక్షంగా సూచన చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారితేనైనా రాత మారుతుందేమోనని అభిప్రాయపడ్డాడు. ఆర్సీబీ ఫ్యాన్స్ ఫైర్ అయితే, ఢిల్లీ అభిమానులకు పీటర్సన్ ట్వీట్ విపరీతంగా నచ్చేయగా.. ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ‘‘అసలేం మాట్లాడుతున్నావు. కోహ్లి లేని ఆర్సీబీని ఊహించను కూడా ఊహించలేం. పోయి పోయి ఢిల్లీకి మారాలా? నీ ట్వీట్‌కు అర్థం ఏమిటి? ఐపీఎల్ ఆడటం మానేసినపుడే కోహ్లి ఆర్సీబీని వీడతాడు. లేదంటే తనకిష్టమైన ధోని సారథ్యంలోని సీఎస్కేకు ఆడతాడు. అంతేగానీ.. నీ చెత్త సలహాలు ఎవరికీ అవసరం లేదు’’ అంటూ పీటర్సన్‌ను ట్రోల్ చేస్తున్నారు. కాగా ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోయినా.. ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ, ఫ్యాన్‌బేస్ మాత్రం తగ్గడం లేదు. ఇందుకు ప్రధాన కారణంగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఐపీఎల్-2023లో కోహ్లి మొత్తంగా 14 ఇన్నింగ్స్‌లో కలిపి 639 పరుగులు చేశాడు. ఇందులో 6 అర్ధ శతకాలు, రెండు సెంచరీలు ఉన్నాయి. ఇక ఆర్సీబీ ఆరో స్థానంతో సీజన్‌ను ముగించింది. చదవండి: ముంబై కోసమే గిల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.. సచిన్ ట్వీట్ వైరల్ #Shubman Gill: కాస్తైనా సిగ్గుండాలి! ఆమె మిమ్మల్ని ఏమీ అనలేదుగా? ఇంతలా దిగజారి.. Time for VIRAT to make the move to the capital city…! #IPL — Kevin Pietersen🦏 (@KP24) May 22, 2023 -
'అంతా అబద్దం.. నేను ధోని తొలి వికెట్‌ను కాదు'
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కొద్దిరోజులుగా సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి ట్విటర్లో ట్వీట్స్ చేస్తూ వస్తున్నాడు. అయితే ఇదంతా కేవలం సరదా కోసం మాత్రమే. ధోనీ తీసిన తొలి టెస్ట్ వికెట్ తనది కాదని ఈసారి వీడియో సాక్ష్యాన్ని కూడా బయటపెట్టాడు. నిజానికి ఈ ఇద్దరి మధ్య 2017 ఐపీఎల్ సందర్భంగా తొలిసారి సరదా ఫైట్ జరిగింది. అప్పుడు ధోనీ రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ టీమ్ తరఫున ఆడుతున్నాడు. ఆ సమయంలో మైక్ పెట్టుకొని ఫీల్డింగ్ చేస్తున్న మనోజ్ తివారీతో.. ధోనీ కంటే నేను మంచి గోల్ఫర్ ని అని పీటర్సన్ అన్నాడు. దీనికి ధోనీ రిప్లై ఇస్తూ.. నువ్వే నా తొలి టెస్ట్ వికెట్ అని అదే మైక్ ద్వారా కేపీకి సమాధానమిచ్చాడు. కానీ ఆ రోజు డీఆర్ఎస్ తో నిర్ణయాన్ని అంపైర్ వెనక్కి తీసుకున్నట్లు పీటర్సన్ గుర్తు చేశాడు. ఇక తాజాగా మంగళవారం (మే 16) వీడియో సాక్ష్యంతో మరో ట్వీట్ చేశాడు. 2011లో ఇంగ్లండ్‌లో పర్యటించింది టీమిండియా. ఆ టూర్లో ఒక మ్యాచ్‌లో ధోనీ బౌలింగ్ చేశాడు. ధోని వేసిన బంతి పీటర్సన్‌ను దాటుకొని వికెట్ కీపర్ ద్రవిడ్ చేతుల్లో పడింది. అందరూ అప్పీల్ చేయడంతో అంపైర్ ఔటిచ్చాడు. కానీ పీటర్సన్ వెంటనే రివ్యూ చేయడంతో అసలు బంతి.. బ్యాట్ కు తగల్లేదని తేలింది. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఈ వీడియోనే పీటర్సన్ షేర్ చేస్తూ.. "స్పష్టమైన సాక్ష్యం ఉంది. అదంతా ఫేక్.. నేను ధోనీ తొలి వికెట్ కాదు. కానీ ధోని నుంచి మాత్రం అది మంచి బంతి" అని క్యాప్షన్ పెట్టాడు పీటర్సన్. అంతటితో ఆగకుండా బుధవారం (మే 17) మరో ట్వీట్ చేశాడు. నిజానికి తానే ధోనీ వికెట్ తీశానంటూ ఆ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ మ్యాచ్ 2007లో ఓవల్ లో జరిగింది. అప్పటికే 92 పరుగులు చేసి సెంచరీపై కన్నేసిన ధోనీని పీటర్సన్ ఔట్ చేశాడు. అయితే ఇలా రెండు రోజులుగా పీటర్సన్ తనను ట్రోల్ చేస్తున్నా ధోనీ నుంచి మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి సమాధానం లేదు. The evidence is CLEAR! I was NOT Dhoni’s first Test wicket. Nice ball though, MS! 😂😂😂 Thanks for sending this through, @SkyCricket 🙏🏽 pic.twitter.com/XFxJOZG4me — Kevin Pietersen🦏 (@KP24) May 16, 2023 MS Dhoni c Cook b Pietersen pic.twitter.com/UdtXJH37xM — Kevin Pietersen🦏 (@KP24) May 17, 2023 చదవండి: హైదరాబాద్ బిర్యానీ మస్తుంది.. ఎస్ఆర్హెచ్ పని పడతం' -
ధోనికి సీఎస్కే అంటే ప్రాణం! ఆ జట్టులో ఉన్నపుడు ఉద్వేగానికి లోనయ్యేవాడు!
MS Dhoni- CSK: టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనికి చెన్నై అన్నా.. అక్కడి మనుషులన్నా మహా ఇష్టమని.. నగరంతో అతడి అనుబంధం విడదీయలేనిదని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపైనా మిస్టర్ కూల్‌కు అమితమైన ప్రేమ ఉందని పేర్కొన్నాడు. అదే విధంగా ధోని పట్ల కూడా చెన్నై ప్రజలకు ఉన్న ప్రేమ వెలకట్టలేదని.. చెపాక్‌లో ఆదివారం నాటి దృశ్యాలే ఇందుకు నిదర్శనమని పీటర్సన్ పేర్కొన్నాడు. ఐపీఎల్-2023 లీగ్ దశలో సీఎస్కే ఆదివారం తమ ఆఖరి మ్యాచ్ ఆడేసింది. ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అన్న వార్తల నేపథ్యంలో.. మైదానంలో చోటుచేసుకున్న దృశ్యాలు ఇందుకు బలాన్ని చేకూర్చాయి. అరుదైన దృశ్యాలు కేకేఆర్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమి తర్వాత ధోని ముందుండి నడుస్తుండగా సీఎస్కే బృందం అతడిని అనుసరించింది. ఈ సందర్భంగా ధోని తాను సంతకం చేసిన టెన్నిస్ బంతులను స్టాండ్స్‌లోకి విసరగా.. వాటిని అందుకునేందుకు అభిమానులు పోటీపడ్డారు. ఇక టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ అయితే ఏకంగా తన షర్టు మీద ఆటోగ్రాఫ్ తీసుకోవడం హైలైట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో పీటర్సన్ మాట్లాడుతూ ధోనితో తనకు ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు. అలాంటి కెప్టెన్ ఉంటే ‘‘ధోని ఆటగాళ్లందరికీ స్ఫూర్తిదాయకం. అతడి కోసమైనా మనమంతా జట్టుగా బాగా ఆడాలి అనే ఫీలింగ్ వస్తుంది. అతడి కెప్టెన్సీ అలా ఉంటుంది మరి! గత కొన్నేళ్లుగా మిస్టర్ కూల్‌ను చూస్తూనే ఉన్నాం. జట్టు పట్ల, ఆటగాళ్ల పట్ల అతడు పూర్తి బాధ్యతగా వ్యవహరిస్తాడు. అలాంటి కెప్టెన్ ఉంటే ప్లేయర్లంతా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతారు’’ అని పీటర్సన్ ధోనిపై ప్రశంసలు కురిపించాడు. ధోని ఉద్వేగానికి లోనయ్యేవాడు ఇక రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌కు ఆడే సమయంలో ధోనిని దగ్గరగా గమనించానన్న పీటర్సన్.. ధోనికి సీఎస్కే అంటే ఎంతో ఇష్టమని, ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ అతడు భావోద్వేగానికి లోనయ్యేవాడని గుర్తు చేసుకున్నాడు. కేవలం క్రికెటర్‌గానే కాకుండా వ్యక్తిగా కూడా ధోని ఒక అద్భుతం అంటూ కొనియాడాడు. ‘‘ధోని చూసేందుకు జనాలు ఎలా ఎగబడుతున్నారో చూడండి. తనని తాకేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. కేవలం ఓ క్రికెటర్‌గానే కాదు మనిషిగానూ అతడిది అసాధారణ వ్యక్తిత్వం. ఈ అద్భుత దృశ్యాలు ఇందుకు నిదర్శనం. భావోద్వేగ క్షణాలు. చూడటానికి ఎంతో బాగుంది’’ అని పీటర్సన్ ఉద్వేగపూరితంగా మాట్లాడాడు. కాగా ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో సీఎస్కేపై నిషేధం విధించగా.. 2016, 2017 సీజన్లలో ధోని పుణె ఫ్రాంఛైజీకి మారిన ధోని కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలో పీటర్సన్ ధోనితో కలిసి ఆడాడు. చదవండి: ‘వివాదాస్పద సాఫ్ట్ సిగ్నల్’ రూల్ రద్దు! ఆ మ్యాచ్ నుంచే అమలు! 𝙔𝙚𝙡𝙡𝙤𝙫𝙚! 💛 A special lap of honour filled with memorable moments ft. @msdhoni & Co. and the ever-so-energetic Chepauk crowd 🤗#TATAIPL | #CSKvKKR | @ChennaiIPL pic.twitter.com/yHntEpuHNg — IndianPremierLeague (@IPL) May 14, 2023 -
'కేఎల్ రాహుల్ బ్యాటింగ్ పరమ బోర్ కొట్టించింది'
ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ కెవిన్ పీటర్సన్ లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుధవారం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 32 బంతులెదుర్కొని 39 పరుగులు చేశాడు. టి20 క్రికెట్లో అటాకింగ్ గేమ్ ఆడాల్సింది పోయి వన్డే తరహాలో స్ట్రైక్ రొటేట్ చేస్తూ కేవలం నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ మాత్రమే కొట్టి ఔటయ్యాడు. ఈ సీజన్ ఆరంభం నుంచి వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో రాహుల్ ఆటతీరు ఇలాగే కొనసాగుతుంది. ఇక రాజస్తాన్, లక్నో మ్యాచ్‌కు కెవిన్ పీటర్సన్ కామెంటేటర్‌గా వ్యవహరించాడు. లైవ్ కామెంటరీలో పీటర్సన్ మాట్లాడుతూ.. ''కేఎల్ రాహుల్ బ్యాటింగ్ నాకు ఇంతకముందు ఎన్నడూ లేనట్లుగా పరమ బోరింగ్‌గా అనిపించింది.'' అంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం పీటర్సన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ''పీటర్సన్ అన్న మాటలు అక్షరాల నిజం.. కేఎల్ రాహుల్ టి20ల్లో వన్డే, టెస్టు బ్యాటింగ్‌ను తలపిస్తున్నాడు''..'' నిజమేగా.. రాహుల్ తన జిడ్డు బ్యాటింగ్‌తో విసిగిస్తున్నాడు.'' అంటూ కామెంట్ చేశారు. చదవండి: బులెట్ కన్నా వేగంగా.. అక్కడుంది శాంసన్ బ్రో! Oh man.. Kevin Pietersen said this in live commentary "Watching KL Rahul bat in the powerplay is the most boring thing I've ever done." pic.twitter.com/y8m4g2ZNT4 — Vishal. (@SPORTYVISHAL) April 19, 2023 -
ప్రధాని మోదీని కలిసిన కెవిన్ పీటర్సన్
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశాడు. కాగా పీటర్సన్ ఢిల్లీలో నిర్వహించిన రైసీనా డైలాగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ సందర్భంగా మొదట హోంమంత్రి అమిత్ షాతో పీటర్సన్ మాటామంతీ చేశాడు. అనంతరం ప్రధాని మోదీని కలిసిన పీటర్సన్.. ఈ విషయాన్ని ట్విటర్లో షేర్ చేసుకున్నాడు. ప్రధాని తన పుట్టిన రోజున చీతాలను తీసుకురావడం హర్షించదగిన విషయమన్నాడు. మోదీని కలవడాన్ని గొప్పగా భావిస్తున్నట్లు చెబుతూ పీటర్సన్ పోస్టు పెట్టారు. ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు 12 చీతాలు వచ్చాయి. వాయుమార్గం ద్వారా యుద్ధ విమానాల్లో మధ్యప్రదేశ్ గ్వాలియర్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌కు వీటిని తీసుకొచ్చారు. అనంతరం కునో నేషనల్ పార్కుకు హెలికాప్టర్లలో తరలించారు. ఈ 12 చీతాల్లో ఐదు మగవి కాగా.. ఏడు ఆడవి. భారత్‌లో అంతరించిపోతున్న చీతాల సంఖ్యను పెంచేందుకు ఆఫ్రికా దేశాలతో భారత్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే గతేడాది సెప్టెంబర్‌లో 8 చీతాలు నమీబియా నుంచి భారత్‌కు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న వీటిని కునో నేషనల్ పార్కులో విడుదల చేశారు. తాజాగా వచ్చిన చీతాలతో కలిపి కునో నేషనల్ పార్కులో మొత్తం చీతాల సంఖ్య 20కి చేరింది. చదవండి: IND Vs AUS: చిరాకు తెప్పించాలనుకున్నాడు.. అశ్విన్ చర్యకు మైండ్‌బ్లాక్ An honor to speak so passionately and warmly about the release of cheetahs on your birthday, Sir @narendramodi. Thank you for your infectious smile and firm handshake. I really look forward to seeing you again, Sir! 🙏🏽 pic.twitter.com/9gEe3e1wwV — Kevin Pietersen🦏 (@KP24) March 3, 2023 Met @KP24, former captain of the England cricket team. Had an engaging conversation with him on a wide range of topics. pic.twitter.com/gZzwJEWwrw — Amit Shah (@AmitShah) March 2, 2023 -
వన్డేలకు రిటైర్మెంట్ ఇస్తే.. టీ20ల నుంచి కూడా తప్పించారు!
Ben Stokes ODI Retirement- Eng Vs SA ODI Series: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్, వన్డే వరల్డ్‌కప్-2019లో తమ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు బెన్‌స్టోక్స్. ఇటీవలే అతడు ఇంగ్లండ్ టెస్టు జట్టు పగ్గాలు చేపట్టి స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌ను గెలవడంతో పాటు రీషెడ్యూల్డ్ టెస్టులో టీమిండియాను ఓడించి కెప్టెన్‌గా మధుర జ్ఞాపకాలు మిగుల్చుకున్నాడు. అందుకే ఇలా! అయితే, అనూహ్యంగా వన్డేలకు గుడ్‌బై చెబుతూ స్టోక్స్ తీసుకున్న నిర్ణయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తీరిక లేని షెడ్యూల్ కారణంగా.. మూడు ఫార్మాట్లలో ఆడటం కష్టమవుతోందన్న కారణంగానే తాను వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు స్పష్టం చేశాడు 31 ఏళ్ల స్టోక్స్. అంతేకాదు.. తాము కూడా మనుషులమేమని, పెట్రోల్ పోస్తే పరిగెత్తే కార్లు కాదని.. విశ్రాంతి లేకుండా ఆడటం ఎవరితరం కాదని ఇంగ్లండ్ బోర్డుకు చురకలంటించాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాసిర్ హుస్సేన్ సహా పలువురు మాజీ ఆటగాళ్లు ఐసీసీ, క్రికెట్ బోర్డుల తీరును తప్పుబడుతున్నారు. విశ్రాంతి లేకుండా ఆడిస్తే ఆటగాళ్లకు పిచ్చెక్కిపోయి ఇలాగే రిటైర్మెంట్ ప్రకటిస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ‘‘అప్పట్లో ఓసారి.. షెడ్యూల్ భయంకరంగా ఉంది.. నా వల్ల కాదని చెప్పాను. అందుకే వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాను. అయితే, ఈసీబీ నన్ను టీ20లు కూడా ఆడకుండా నిషేధం విధించింది’’ అంటూ పీటర్సన్ ఇంగ్లండ్ బోర్డు తీరును ఎండగట్టాడు. I once said the schedule was horrendous and I couldn’t cope, so I retired from ODI cricket & the ECB banned me from T20s too………….🤣 — Kevin Pietersen🦏 (@KP24) July 19, 2022 కాగా ఇంగ్లండ్ తరఫున 104 టెస్టులు, 136 వన్డేలు, 37 టీ20 మ్యాచ్‌లు ఆడాడు పీటర్సన్. ఈ మూడు ఫార్మాట్లలో వరుసగా 8181, 4440, 1176 పరుగులు సాధించాడు. అయితే, ఈసీబీతో అతడికి విభేదాలు తలెత్తగా బోర్డుపై తీవ్ర విమర్శలు చేసిన పీటర్సన్ ఆటకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో తాజా ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక 2013లో తన ఆఖరి వన్డే, టీ20 మ్యాచ్‌లు ఆడిన పీటర్సన్.. 2014లో చివరిసారిగా ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ ఆడాడు. స్టోక్స్ విషయానికొస్తే.. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో మంగళవారం(జూలై 18 )జరిగిన మొదటి వన్డే అతడికి చివరిది. ఈ మ్యాచ్‌లో స్టోక్స్ 5 పరుగులు మాత్రమే చేశాడు. టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్ ముగిసిన రోజు వ్యవధిలోనే ఇంగ్లండ్ ప్రొటిస్‌తో పోరుకు సిద్ధమైంది. వన్డేలతో పాటు టీ20, టెస్టు సిరీస్ ఆడనుంది. చదవండి: Eng Vs SA 1st ODI Series 2022: అదరగొట్టిన ప్రొటిస్ బౌలర్లు.. ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం! ఏకంగా.. 604 runs and 15 wickets on a sweltering day in Durham! Full highlights: https://t.co/AOpGzaJerX 🏴 #ENGvSA 🇿🇦 pic.twitter.com/VDjYwdNb0L — England Cricket (@englandcricket) July 20, 2022 -
'స్విచ్‌హిట్ బ్యాన్ చేస్తే ఎక్కువగా సంతోషించేది నేనే'
క్రికెట్లో కవర్‌డ్రైవ్, స్ట్రెయిట్ డ్రైవ్, స్క్వేర్డ్రైవ్, కట్‌షాట్, స్వీప్ షాట్, రివర్స్ స్వీప్, హుక్ షాట్.. ఇవన్నీ సంప్రదాయంగా వస్తున్నవి. ఇంకా చెప్పాలంటే క్రికెట్లో ఎక్కువ మంది బ్యాటర్స్ ఆడే షాట్లు. వీటితో పాటు ఇంకా ఎన్నో కళాత్మక షాట్లు ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో హెలికాప్టర్, స్విచ్‌హిట్ అనే పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్ ధోని హెలికాప్టర్ షాట్ కనిపెడితే.. స్విచ్ హిట్ షాట్‌కు మాత్రం పెట్టింది పేరు ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ కెవిన్ పీటర్సన్. సంప్రదాయ క్రికెట్లో స్విచ్‌హిట్ అనేది కాస్త వినూత్నమైనది.. బౌలర్ బంతి విడుదల చేయగానే బ్యాటర్ తన పొజీషన్‌ను రివర్స్ చేసి ఆడడమే స్విచ్‌హిట్. 2006లో కెవిన్ పీటర్సన్.. శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌పై స్విచ్‌హిట్ షాట్‌ను ఆడాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియన్ క్రికెటర్లు డేవిడ్ వార్నర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లు ఎక్కువ సందర్బాల్లో స్విచ్ హిట్ షాట్లు ఆడారు. అయితే స్విచ్‌హిట్ షాట్‌పై ఐసీసీకి పలుసార్లు ఫిర్యాదులు వెళ్లాయి. స్విచ్‌హిట్ షాట్ ఆడే సమయంలో పొజీషన్‌ను మార్చి.. ఆ షాట్ ఆడడం మిస్ అయితే ఎల్బీడబ్ల్యూ ఇచ్చే అవకాశం ఎందుకు లేదని కొందరు బౌలర్లు ప్రశ్నించారు. ఇటీవలే టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్విచ్‌హిట్ షాట్‌పై ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ''బ్యాట్స్‌మెన్ స్విచ్‌హిట్ ఆడడంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఒకవేళ స్విచ్‌హిట్ ఆడే సమయంలో బంతి మిస్ అయితే మాత్రం ఎల్బీగా ఇవ్వాల్సిందే. ఎల్బీ ఎందుకు ఇవ్వకూడదనేది నాకు చెప్పాలి. ఒక బ్యాటర్ బంతి వేయగానే పొజిషన్‌ను మార్చినప్పుడే బంతి వికెట్ల మీదకు వెళ్తుంది. కాబట్టి కచ్చితంగా ఎల్బీడబ్ల్యూకి ఆస్కారం ఉంటుంది.'' అని చెప్పుకొచ్చాడు. కాగా అశ్విన్ చేసిన వ్యాఖ్యలను న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ స్టైరిస్ సమర్థిస్తూనే తప్పులను ఎత్తిచూపాడు. '' అశ్విన్ చేసిన వ్యాఖ్యల్లో కొన్నింటిని సమర్థిస్తున్నా.. అదే సమయంలో కొన్నింటిని తప్పుబడతా. స్విచ్ హిట్ అనేది ఫన్నీగా కనిపిస్తున్నప్పటికి బౌలర్‌కు ఎప్పటికి ప్రమాదకరం. అందుకే స్విచ్హిట్ను పూర్తిగా బ్యాన్ చేస్తే అందరికంటే ఎక్కువగా సంతోషించేది నేనే. బ్యాట్స్‌మన్ తర్వాతి బంతిని స్విచ్ హిట్ ఆడుతాడని ఎవరూ ముందుగా ఊహించరు. క్రికెట్లో మిగతా షాట్స్ అంటే ఎలా కొట్టినా ఆన్‌సైడ్, ఆఫ్‌సైడ్‌లో ఎక్కువగా వెళ్తాయి. కాబట్టి ఫీల్డర్లను ముందుగానే సెట్ చేసుకోవచ్చు. కానీ స్విచ్‌హిట్ విషయంలో ఆ క్లారిటీ లేదు. బౌలింగ్ సైడ్ కెప్టెన్ లేదా బౌలర్ ఫీల్డర్స్‌ను ఎక్కడ ఉంచాలనేది తెలియదు. అందుకే బ్యాటర్స్, బౌలర్స్‌కు ఉపయోగంగా ఉండాలంటే స్విచ్హిట్ను బ్యాన్ చేయాల్సిందే. స్విచ్‌హిట్ లానే కనిపించే రివర్స్ స్వీప్.. రివర్స్ హిట్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి వీటిని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. అయితే స్విచ్‌హిట్ ఆడే క్రమంలో బ్యాటర్ తన పొజీషన్‌ను పూర్తిగా మర్చేయడం.. అదే సమయంలో ఆ షాట్ మిస్ అయితే కచ్చితంగా ప్యాడ్లకు తాకుతుంది. ఇక్కడే అశ్విన్ ఎల్బీడబ్ల్యూ ఇవ్వాలని వాదించాడు. కానీ స్విచ్హిట్ను పూర్తిగా బ్యాన్‌చేస్తే ఆ ఇబ్బందే ఉండదు కదా'' అంటూ ముగించాడు. -
IPL 2022: పంత్‌పై మాజీ క్రికెటర్ల విమర్శలు.. క్రీడాస్ఫూర్తిని మరిచావు!
IPL 2022 DC Vs RR No Ball Controversy: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌పై టీమిండియా మాజీ ఆటగాళ్లు, ఇతర మాజీ క్రికెటర్లు విమర్శలు కురిపిస్తున్నారు. జెంటిల్మెన్ గేమ్‌లో క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించడం ఏమిటని మండిపడుతున్నారు. ఏదేమైనా ఢిల్లీ సారథి పంత్, అసిస్టెంట్ కోచ్ ఆమ్రే ప్రవర్తించిన తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని విమర్శిస్తున్నారు. కాగా ఐపీఎల్-2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ శుక్రవారం తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఆఖరి ఓవర్లో రాజుకున్న నో- బాల్ వివాదం క్రీడావర్గాల్లో చర్చనీయాంశమైంది. అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన రిషభ్ పంత్, క్రీజులో ఉన్న తమ ఆటగాళ్లను వెనక్కి పిలవడం.. ఆమ్రే మైదానంలోకి దూసుకెళ్లడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై స్పందించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ట్విటర్ వేదికగా అసహనం వ్యక్తం చేశాడు. ‘‘ఢిల్లీ క్యాపిటల్స్ క్రీడాస్ఫూర్తిని మరచి చెత్తగా వ్యవహరించింది. జెంటిల్మెన్ గేమ్ అయిన క్రికెట్లో ఇలాంటివి అస్సలు ఆమోదయోగ్యం కాదు’’ అని పంత్ తీరుపై మండిపడ్డాడు. ఇక భారత జట్టు మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సైతం ఇదే తరహాలో స్పందించాడు. ఈఎస్‌పీఎన్‌క్రిక్ ఇన్ఫోతో అతడు మాట్లాడుతూ.. ‘‘రిషభ్ పంత్ తమ ప్లేయర్లను వెనక్కి పిలవడం సరికాదు. ఇలాంటివి పునరావృతం కాకపోతే మంచిది. ఆటను సాగనివ్వాలి. అంపైర్లు కొన్నిసార్లు తప్పిదాలు చేసే అవకాశం ఉంటుంది. అయితే, ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తిని ఇలా మరిచిపోవడం ఎంతవరకు సమంజసం’’ అని అసహనం వ్యక్తం చేశాడు. ఇక ఇంగ్లండ్ మాజీ సారథి, ఐపీఎల్ వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్ పంత్ వ్యవహారశైలిని తీవ్రంగా విమర్శించాడు. ‘‘ఇది క్రికెట్.. ఫుట్‌బాల్ కాదు. ఇక్కడ ఇలాంటివి చేయకూడదు. ఒకవేళ రిక్కీ పాంటింగ్ అక్కడ ఉండి ఉంటే గనుక ఇలా జరిగేది కాదు. మరోసారి ఇలాంటివి జరగకూడదు’’ అని పేర్కొన్నాడు. టీమిండియా మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ సైతం.. ‘‘పంత్ నుంచి ఇలాంటివి ఊహించలేదు. ఇది క్రికెట్ పంత్’’ అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. కాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ 15 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుని ఈ సీజన్లో నాలుగో పరాజయం నమోదు చేసింది. చదవండి👉🏾Rishabh Pant: అలా చేయడం తప్పే.. కానీ మేము నష్టపోయాం.. థర్డ్ అంపైర్ జోక్యం చేసుకోవాల్సింది: పంత్ Bad sportsman spirit on display by #DelhiCapitals Cricket is a game of gentlemen and this behaviour is completely unacceptable. #IPL20222 #DCvsRR — Mohammed Azharuddin (@azharflicks) April 22, 2022 Didn’t expect Pant could do that. Not cricket. #IPL20222 pic.twitter.com/ab5yRzDQqg — R P Singh रुद्र प्रताप सिंह (@rpsingh) April 22, 2022 That's that from Match 34. @rajasthanroyals take this home by a 15-run win. Scorecard - https://t.co/IOIoa87Os8 #DCvRR #TATAIPL pic.twitter.com/D2JXBfMTSp — IndianPremierLeague (@IPL) April 22, 2022 What is Pant thinking ? It’s a street game , calling his team back . pic.twitter.com/WDEZvpRnay — SKS (@TweetSailendra) April 22, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కోహ్లి కాదు.. ఇప్పుడు డుప్లెసిస్ స్టార్ అయ్యాడు! అతడు మాత్రం ఇంకా!
IPL 2022- Virat Kohli- RCB: టీమిండియా మాజీ కెప్టెన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లి ఐపీఎల్-2022లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. తన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. గత సీజన్‌తో ఆర్సీబీ కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన కోహ్లి.. ఇకపై బ్యాటర్‌గా జట్టుకు సేవలు అందిస్తానని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సారథ్య బాధ్యతల భారం తొలగిపోతే కోహ్లి బ్యాట్ ఝులిపించడం ఖాయమని, మునుపటి రన్‌మెషీన్‌ను చూడవచ్చని అభిమానులు ఆశపడ్డారు. కానీ అలా జరగడం లేదు. ఐపీఎల్ తాజా సీజన్లో ఒకటీ రెండు మినహా మిగతా మ్యాచ్‌లలో కోహ్లి చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయాడు. లక్నో సూపర్‌జెయింట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగి మరోసారి నిరాశపరిచాడు. ఇక ఈ ఎడిషన్‌లో ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో కోహ్లి చేసిన పరుగులు 119. అత్యధిక స్కోరు 48. ఈ గణాంకాలను బట్టి కోహ్లి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కెవిన్ పీటర్సన్ ఈ పరిణామాల నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కోహ్లి గురించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తాను ఇప్పుడు కెప్టెన్ కాదని, సాధారణ ఆటగాడిననే విషయాన్ని కోహ్లి త్వరగా గ్రహించాలని సూచించాడు. ఈ మేరకు.. ‘‘షో ఏదైనా తానే స్టార్‌గా ఉండాలని విరాట్ కోహ్లి కోరుకుంటాడు. అయితే, ఇప్పుడు ఫాఫ్ డుప్లెసిస్ స్టార్ అయ్యాడు. నావను సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. ఫాఫ్‌నకు హోటల్లో విలాసవంతమైన గది కేటాయించారో లేదో తెలియదు కానీ.. కోహ్లికి మాత్రం ఫాఫ్ కంటే పెద్ద గదినే ఇస్తారు. నిజానికి ఓ కెప్టెన్ మళ్లీ సాధారణ ఆటగాడిగా మారాలంటే కాస్త కష్టమే. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో నీ పాత్ర ఉండకపోవచ్చు. మునుపటిలా ఆధిపత్యం ప్రదర్శించే వీలు ఉండకపోవచ్చు. కెప్టెన్‌గా ఉన్నపుడు అభిమానులు, సహచర ఆటగాళ్లు నిన్ను చూసే విధానం వేరుగా ఉంటుంది. అయితే, ఓ సోల్జర్(ఆటగాడి)గా నువ్వు మళ్లీ జట్టులో ఇమిడిపోతావా లేదా అన్నది పెద్ద ప్రశ్న. నిజానికి అలా ఉండటం మనసుకు కష్టం’’ అని పీటర్సన్ పేర్కొన్నాడు. కోహ్లి ఇంకా పూర్తిగా ఫామ్‌లోకి రాలేదని, అందుకు ఇంకాస్త సమయం పడుతుందని అభిప్రాయపడ్డాడు. ఇక నెట్స్‌లో కోహ్లి వార్మప్ చేయడం చూశానన్న పీటర్సన్.. ‘‘తన పనేదో తాను చేసుకుంటున్నాడు. ఒక నవ్వు లేదు. హెలో చెప్పడాలు లేవు. ఎవరితోనూ పెద్దగా కలిసేది లేదు.. ప్రతిసారి.. ‘‘నేను ఆటపై దృష్టి పెట్టాను. సాధించి తీరాల్సిందే’’ అన్నట్లుగా సీరియస్‌గా ఉంటున్నాడు’’ అని వ్యాఖ్యానించాడు. కోహ్లి ఒత్తిడిలో కూరుకుపోయాడని, దానిని అధిగమిస్తేనే మునుపటిలా బ్యాట్ ఝులిపించగలడన్నాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో పీటర్సన్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఇక ఆర్సీబీ పగ్గాలు చేపట్టిన డుప్లెసిస్ ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా రాణిస్తూ అభిమానులు ప్రశంసలు అందుకుంటున్నాడు. లక్నోతో మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్(96 పరుగులు) ఆడి అతడు ఆర్సీబీని గెలిపించిన సంగతి తెలిసిందే. తాజా గెలుపుతో పాయింట్ల పట్టికలో బెంగళూరు రెండో స్థానాని(10 పాయింట్లు)కి చేరుకుంది. చదవండి: IPL 2022: సెంచరీ మిస్.. అయితేనేం జట్టును గెలిపించాడు! జోష్‌లో బెంగళూరు! That's that from Match 31.@RCBTweets win by 18 runs against #LSG. Scorecard - https://t.co/9Dwu1D2Lxc #LSGvRCB #TATAIPL pic.twitter.com/oSxJ4fAukI — IndianPremierLeague (@IPL) April 19, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఐపీఎల్ మెగావేలానికి వచ్చి పాన్‌కార్డ్ పోగొట్టుకున్న మాజీ క్రికెటర్
ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ కెవిన్ పీటర్సన్ పాన్‌కార్డును పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం స్టార్‌స్పోర్ట్ బ్రాడ్‌కాస్టర్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న పీటర్సన్ ఐపీఎల్ మెగావేలం కవర్ చేయడానికి భారత్‌కు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ మాజీ ఆల్‌రౌండర్ పాన్‌కార్డు పోగొట్టుకున్నట్లు తెలిపాడు. ఈ విషయంలో తనకు సహాయం చేయాలంటూ ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశాడు. చదవండి: అందుకే మా ఆయన్ని ఎవరూ కొనలేదు.. స్టార్ ఆల్‌రౌండర్ భార్య ''నా పాన్‌కార్డ్ ఎక్కడో పోయింది. ప్లీజ్ నాకు సాయం చేయండి. కొన్ని కార్యకలాపాల కోసం పాన్‌కార్డు అవసరం ఇప్పుడు చాలా ఉంది. అయితే పాన్‌కార్డును ఎలా పొందాలో తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా'' అంటూ ట్వీట్ చేశాడు. కాగా పీటర్సన్ ట్వీట్‌కు భారత ఆదాయపు పన్ను శాఖ స్పందించింది. ''డియర్ కెవిన్ పీటర్సన్.. మీకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మీ దగ్గర పాన్ వివరాలు ఉంటే మేము ఇచ్చే వెబ్సైట్ లింక్‌ను ఓపెన్ చేసి పాన్‌కార్డు రీ ప్రింట్కోసం ప్రయత్నించండి. ఒకవేళ పాన్‌కార్డు వివరాలు అందుబాటులో లేకపోతే రీప్రింట్ కోసం తమ శాఖకు దరఖాస్తూ చేసుకోవచ్చు'' అని తెలిపింది. దీంతో తన ట్వీట్‌కు స్పందించిన భారత ఆదాయపు పన్ను శాఖ అధికారులకు కెవిన్ పీటర్సన్ కృతజ్ఞతలు తెలిపాడు. ⚠️INDIA PLEASE HELP⚠️ I’ve misplaced my PAN card & travelling Mon to India but need the physical card for work. Can some PLEASE PLEASE direct me to someone who I can contact asap to help me? 🙏🏽 — Kevin Pietersen🦏 (@KP24) February 15, 2022 Dear @KP24, We are here to help you. If you have your PAN details with you, please visit these links for the procedure to apply for reprint of physical PAN Card: (1/2)https://t.co/M2RFFlDsCThttps://t.co/fySMs6nm62 — Income Tax India (@IncomeTaxIndia) February 15, 2022 -
చెలరేగిన అండర్సన్.. 8 సిక్స్‌లు, 7 ఫోర్లు.. ఛాంపియన్‌గా వరల్డ్ జెయింట్స్
లెజెండ్స్ లీగ్ క్రికెట్లో తొలి ఛాంపియన్‌గా వరల్డ్ జెయింట్స్ నిలిచింది. ఒమెన్ వేదికగా ఆసియా లయన్స్‌తో జరిగిన ఫైనల్లో వరల్డ్ జెయింట్స్ 25 పరుగులు తేడాతో విజయం సాధించింది. వరల్డ్ జెయింట్స్ విజయంలో కేవిన్ పీటర్సన్, కోరీ ఆండర్సన్ కీలకపాత్ర పోషించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వరల్డ్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల కోల్పోయి 256 పరుగుల భారీ స్కోరు సాధించింది. కాగా వరల్డ్ జెయింట్స్ బ్యాటర్ కోరీ అండర్సన్ విద్వంసం సృష్టించాడు. కేవలం 48 బంతుల్లో 93 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 సిక్స్‌లు, 7 ఫోర్లు ఉన్నాయి. అండర్సన్‌తో పాటు పీటర్సన్(48), బ్రాడ్ హాడిన్(37),సామీ(38) పరుగులతో రాణించారు. ఇక 257 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసియా లయన్స్ 8 వికెట్లు కోల్పోయి 231 పరుగులకే పరిమితమైంది. ఆసియా లయన్స్ బ్యాటర్లలో సనత్ జయసూర్య(38), మహ్మద్ యూసుఫ్(39), దిల్షాన్(25) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. వరల్డ్ జెయింట్స్ బౌలర్లలో ఆల్బీ మోర్కెల్ మూడు వికెట్ల పడగొట్టగా, మాంటీ పనేసర్ రెండు వికెట్లు సాధించాడు. చదవండి: Under 19 World Cup: రవి కుమార్ ‘స్వింగ్’.. సెమీస్‌లో యువ భారత్ -
టి20 ప్రపంచకప్ 2021: విజేత ఎవరో చెప్పిన పీటర్సన్
Kevin Pieterson Predicts Winner Of T20 World Cup 2021: టి20 ప్రపంచకప్ 2021 విజేతపై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు. ఈసారి ఆస్ట్రేలియా ఫెవరెట్‌గా కనిపిస్తుందని.. కచ్చితంగా కప్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ఇదే విషయమై పీటర్సన్ తన బ్లాగ్‌లో ఆసక్తికరంగా చెప్పుకొచ్చాడు. చదవండి: T20 WC 2021: ఆస్ట్రేలియతో ఫైనల్.. కాన్వే స్థానంలో ఎవరంటే ''న్యూజిలాండ్ ప్రస్తుతం అన్ని విభాగాల్లో(బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) బలంగా కనిపిస్తోంది. కానీ ఆస్ట్రేలియానే నా ఫెవరెట్. ఐసీసీ టోర్నీల్లో ఈ రెండు జట్లు ఫైనల్లో ఎదురుపడినప్పుడు ఆస్ట్రేలియా దుమ్మురేపిందని చరిత్ర చెబుతుంది. 2015 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో జరిగింది ఇదే. ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరితే బలంగా తయారవుతోంది.. అది ప్రత్యర్థి జట్టుకు ఒత్తిడిగా మారుతోంది. ఈ ఆదివారం ఆస్ట్రేలియా టి20 ప్రపంచకప్‌ను ఎత్తడం ఖాయం. ఇక డేవిడ్ వార్నర్ మంచి ఫామ్‌లో ఉండడం న్యూజిలాండ్‌కు ప్రమాదం. ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ తరపున తీవ్రంగా నిరాశపరిచిన వార్నర్ అక్కడ మరిచిపోయిన ఫామ్‌ను..కోపాన్ని ఈ టి20 ప్రపంచకప్‌లో చూపిస్తున్నాడు. అతనికి తోడూ గత మ్యాచ్‌లో వేడ్, స్టోయినిస్‌లు అద్భుతం చేసి చూపించారు.ఆస్ట్రలియా జట్టు పరిమిత ఓవర్లతో పాటు టెస్టు క్రికెట్‌ను కొన్నేళ్ల పాటు ఏలారు. తాజాగా టి20 ప్రపంచకప్‌ను గెలిస్తే ఇకపై టి20ల్లోనూ తమ బలాన్ని చూపించే అవకాశం ఉంది'' అంటూ తెలిపాడు. చదవండి: T20 WC 2021: పాపం కివీస్.. టి20 ప్రపంచకప్ కొట్టినా నెంబర్‌వన్ కాకపోవచ్చు