మరో ఉగ్రవాది హర్యానాలో అరెస్టు
న్యూఢిల్లీ: హర్యానాలో అల్ కాయిదా ఉగ్రవాదిని అరెస్టు చేశారు. మెవాత్ జిల్లాలో అబ్దుల్ సమి అనే వ్యక్తిని ఉగ్రవాద సంస్థ అల్ కాయిదాతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడి అనంతరం ఇది ఐదో అరెస్టు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తుల పట్టుకునే క్రమంలో జాతీయ దర్యాప్తు సంస్థతోపాటు ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగి అనువణువూ శోధిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే సోమవారం ఢిల్లీకి చెందిన ప్రత్యేక పోలీసులు మేవాత్ అనే ప్రాంతంలో సమిని అరెస్టు చేశారు. అనంతరం కోర్టుకు తరలించగా అతడికి ఫిబ్రవరి 1వరకు కోర్టు పోలీసుల కస్టడీకి అనుమతినిచ్చింది. సమిది జార్ఖండ్ లోని జంషెడ్ పూర్. ఇప్పటికే అరెస్టు అయిన మిగితా నలుగురు వ్యక్తులు ఉగ్రవాద కార్యకలాపాలకు ఒక్కోతీరుగా సహాయం చేసేవారని తెలిసింది.