సచిన్ కుమార్ సెంచరీ వృథా
సాక్షి, హైదరాబాద్: ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో పి.ఎన్.యంగ్‌స్టర్స్ 2 వికెట్ల తేడాతో ఆడమ్స్ ఎలెవన్‌పై గెలిచింది. ఆడమ్స్ బ్యాట్స్‌మెన్ సచిన్ కుమార్ (101), జయంత్ (80)లు వీరవిహారం చేసినప్పటికీ ప్రత్యర్థి ముందు భారీలక్ష్యాన్ని నిర్దేశించలేకపోవడంతో ఓటమి ఎదురైంది. మొదట ఆడమ్స్ జట్టు 5 వికెట్లకు 251 పరుగులు చేసింది. సచిన్ సెంచరీతో కదంతొక్కాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన పి.ఎన్.యంగ్‌స్టర్స్ 35.3 ఓవర్లలోనే 7 వికెట్లు కోల్పోరుు 252 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ శ్రీకాంత్ (96) మెరుపు ఆరంభాన్నివ్వ గా, నరసింహ (51), హసీబ్ (41) రాణించారు.
ఆడమ్స్ బౌలర్లలో దుర్గేశ్ 3, మాజిద్ 2 వికెట్లు తీశారు. మరో మ్యాచ్‌లో సీకే బ్లూస్ బౌలర్ అశ్వద్ రాజీవ్ (6/18) ధాటికి సఫిల్‌గూడ బ్యాట్స్‌మెన్ విలవిల్లాడారు. దీంతో సీకే బ్లూస్ జట్టు 254 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట సీకే బ్లూస్ 347 పరుగుల వద్ద ఆలౌటైంది. సుశాంత్ (110), సాయి సుశాంత్ (81), బాలకృష్ణ (56 నాటౌట్) చెలరేగారు. తర్వాత సఫిల్‌గూడ 93 పరుగులకే కుప్పకూలింది. అశ్వద్ రాజీవ్ 6, ప్రతీక్ 3 వికెట్లు తీశారు.
ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్ స్కోర్లు
క్లాసిక్ సీసీ: 36 (మహతాబ్ అలమ్ 6/20), డబ్ల్యూ ఎంసీసీ: 152/8 (అజయ్ సింగ్ 81 బ్యాటింగ్; నాగ నరసింహ 5/60).
ఎంసీసీ: 82 (ఫాతిమా రెడ్డి 5/17), తెలంగాణ సీసీ: 356/2 (ఫాతిమా రెడ్డి 55, రాకేశ్ నాయక్ 159, రాహుల్ 119 బ్యాటింగ్).
గ్రీన్‌టర్ఫ్: 265/9 డిక్లేర్డ్ (ఓవైస్ అబ్దుల్ వాహిద్ 37, సయ్యద్ షాబాజుద్దీన్ 51, అక్షయ్ కుమార్ 65; ఆశిష్ బాలాజీ 4/50), పీకేఎంసీసీ: 100/6 (వివేకానంద్ 44; త్రిశాంత్ గుప్తా 3/36).
చీర్‌ఫుల్ చమ్స్: 256/9 డిక్లేర్డ్ (అభిషేక్ 31, సాయి ప్రఫుల్ 78, మోహన్ కుమార్ 50; అక్తర్ 3/34, నితీశ్ కుమార్ 4/102), ఎలిగెంట్ సీసీ: 58/3 (నిఖిల్ రెడ్డి 31).
దక్కన్ బ్లూస్: 71 (సుమిత్ జోషి 3/10), నేషనల్ సీసీ:181/9 (సారుురాజ్ 78, వరుణ్ రెడ్డి 43 బ్యాటింగ్; సంపత్ కుమార్ 4/58).