Additional JC
-
యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి: ఏజేసీ
ఏలూరు (మెట్రో): జిల్లాలో అధికారులు ఆయా శాఖలకు సంబంధించి నియోజకవర్గాల వారీగా అభివృద్ధి కార్యక్రమాల యాక్షన్ ప్లాన్ రూపొందించి అందించాలని అదనపు జాయింట్ కలెక్టర్ ఎంహెచ్ షరీఫ్ ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం జిల్లా అధికారులతో జరిగన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతేడాది సాధించిన విజయాలు, ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించుకున్న లక్ష్యాలు, ఇప్పటి వరకు సాధించిన ప్రగతి, ఇతర అంశాలను నియోజకవర్గాల వారీగా ప్రభుత్వం రూపొందించిన ఫ్రొఫార్మాలో అందించాలన్నారు. నియోజకవర్గాల్లో జరిగిన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను శాఖల వారీగా వారు చేపట్టిన పనులను శాఖాధికారులే స్వయంగా ప్రొఫార్మాలో అందించాలన్నారు. సీపీవో కె.సత్యనారాయణ, డీఈవో మధుసూదనరావు, ఉంగుటూరు ఎంపీడీవో రేణుక, డీఎస్వో డి.శివశంకరరెడ్డి, ప్రణాళికా అసిస్టెంట్ డైరెక్టర్లు అప్పలకొండ, సాంబశివరావు, డెప్యూటీ స్టాటిస్టికల్ అధికారి బదరీనారాయణ, వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ వై.సాయిలక్ష్మీశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
అమ్మానాన్న లేరు.. ఆదుకోండి సారు..
రెవెన్యూ దర్బార్‌లో అదనపు జేసీకి చిన్నారుల వినతి నవాబుపేట: ‘మా అమ్మ, నాన్న చనిపోయారు. ఎందుకు చనిపోయారో తెలియదు. ఇద్దరం మా నానమ్మ దగ్గర ఉండి చదువుకుంటున్నాం.. మమ్మల్ని ఆదుకోండి సారూ..’’ అంటూ ఇద్దరు చిన్నారులు రెవెన్యూ దర్భార్‌లో అదనపు జేసీ బాలాజీ రంజిత్‌ప్రసాద్‌కు విన్నవించుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం హన్మసానిపల్లిలో గురువారం ఏర్పాటు చేసిన రెవెన్యూ దర్బార్‌కు చిన్నారులు వంశీ(11), మురళి(8) వచ్చారు. వీరి తల్లి యాదమ్మ నాలుగేళ్ల క్రితం ఉరేసుకుంది. తండ్రి యాదయ్య(41) రెండేళ్ల క్రితం పురుగుమందు తాగి చనిపోయాడు. ఆనాటి నుంచి ఆ పిల్లలను నాయనమ్మ అంజమ్మ చేరదీసి చదివిస్తోంది. అయితే ఆమెకు వయస్సు పైబడింది. దీంతో చిన్నారులు రెవెన్యూ దర్బార్‌కు వచ్చి మొరపెట్టుకున్నారు. దీనికి చలించిన ఏజేసీ ఆ చిన్నారుల ను రెసిడెన్షియల్ పాఠశాలలో చదివించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆ కుటుంబానికి అంత్యోదయకార్డు అందిస్తున్నట్లు ఆర్డీవో తెలిపారు.