యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి: ఏజేసీ
Published Wed, Jul 20 2016 8:13 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
ఏలూరు (మెట్రో): జిల్లాలో అధికారులు ఆయా శాఖలకు సంబంధించి నియోజకవర్గాల వారీగా అభివృద్ధి కార్యక్రమాల యాక్షన్ ప్లాన్ రూపొందించి అందించాలని అదనపు జాయింట్ కలెక్టర్ ఎంహెచ్ షరీఫ్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా అధికారులతో జరిగన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతేడాది సాధించిన విజయాలు, ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించుకున్న లక్ష్యాలు, ఇప్పటి వరకు సాధించిన ప్రగతి, ఇతర అంశాలను నియోజకవర్గాల వారీగా ప్రభుత్వం రూపొందించిన ఫ్రొఫార్మాలో అందించాలన్నారు. నియోజకవర్గాల్లో జరిగిన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను శాఖల వారీగా వారు చేపట్టిన పనులను శాఖాధికారులే స్వయంగా ప్రొఫార్మాలో అందించాలన్నారు. సీపీవో కె.సత్యనారాయణ, డీఈవో మధుసూదనరావు, ఉంగుటూరు ఎంపీడీవో రేణుక, డీఎస్‌వో డి.శివశంకరరెడ్డి, ప్రణాళికా అసిస్టెంట్ డైరెక్టర్లు అప్పలకొండ, సాంబశివరావు, డెప్యూటీ స్టాటిస్టికల్ అధికారి బదరీనారాయణ, వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ వై.సాయిలక్ష్మీశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement