బ్యాంకు ఖాతాలోని డబ్బు మాయం
- అంగన్వాడీ కార్యకర్తకు టోకరా
- రూ. 5500 లూటీ
వేల్పూర్ : వేల్పూర్ మండలం అక్లూర్ గ్రామంలోని అంగన్వాడీ కార్యకర్త బాయమ్మను ఓ వ్యక్తి మోసం చేసి బ్యాంకు ఖాతాలో నుంచి రూ.5500 మాయం చేసి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం ప్రకారం.. ఆదివారం ఒక అపరిచిత వ్యక్తి ఫోన్ చే సి.. ‘వేల్పూర్ బ్యాంకు మేనేజరును మాట్లాడుతున్నా, ఏటీఎం నంబరులో తేడా ఉంది.. ఓ సారి చెప్పు’ అని అడిగాడు. ఇలా నాలుగైదు సా ర్లు ఫోన్ చేసి హిందీలో మాట్లాడడంతో బాయమ్మభర్త నిజమేనని నమ్మి పిన్ నంబర్ చెప్పాడు.
ఆ తర్వాత కాసేపటికే బాయమ్మ ఖాతాలోనుంచి రూ.5500 డ్రా చేసినట్టు సెల్‌ఫోన్‌కు మె స్సేజ్ వచ్చింది. 9570950579 అనే ఫోన్ నం బరు వాడినట్లు కూడా మెసేజ్ వచ్చిందని బాధితులు పేర్కొన్నారు. అరుుతే ఏటీఎం కార్డు తనవద్దనే ఉందని, డబ్బు ఎలా తీశారో తెలియడం లేదని వారు వాపోయూరు. సోమవారం వేల్పూ ర్ బ్యాంకుకు వెళ్లి ఈ విషయం తెలియజేయగా, ఆదివారం బ్యాంకుకు సెలవు ఉంటుందని, తా ము ఎందుకు ఫోన్ చేస్తామని వారు అనడంతో బాయమ్మ దంపతులు విస్తుపోయారు. మోసగించిన వ్యక్తి నంబరుకు బ్యాంకు సిబ్బంది ఫోన్‌చేస్తే ఎటువంటి మాట మాట్లాడకుండా ఫోన్ కట్ చేస్తున్నాడని పేర్కొన్నారు. ఈ విషయమై వేల్పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.