Anand Raj
-
వాస్తవాన్ని వెంటాడుతూ గతం చేసిన యుద్ధమే ‘వీరఖడ్గం’
శ్రుతి ఢాంగే ప్రధానపాత్రధారిగా, సత్యప్రకాష్, ఆనంద్ రాజ్ ఇతర ముఖ్య తారాగాణంగా నటించిన చిత్రం ‘వీరఖడ్గం’. ఎంఏ చౌదరి దర్శకత్వంలో కె. కోటేశ్వరరావు నిర్మించిన ఈ రివెంజ్ బ్యాక్‌డ్రాప్ చిత్రం మార్చి మొదటి వారంలో రిలీజ్ కానుంది. ‘‘వాస్తవాన్ని వెంటాడుతూ గతం చేసిన యుద్ధమే ఈ ‘వీరఖడ్గం’ చిత్రం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. బ్రహ్మానందం, మదన్, తపస్వి, అపూర్వ పృధ్వీరాజ్ కీ రోల్స్ చేసిన ఈ చిత్రానికి సంగీతం: షయాక్పార్వాజ్, మాటలు: ఘటికాచలం, లైన్ ప్రొడ్యూసర్: మారిశెట్టి సునీల్‌కుమార్. -
నటుడి తమ్ముడి ఆత్మహత్య.. కేసులో కొత్త కోణం
పెరంబూరు : నటుడు ఆనంద్‌రాజ్ తమ్ముడు కనకసబై ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. పుదుచ్చేరిలోని స్వగృహంలో కనకసబై ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలిసిందే. అవివాహితుడైన కనకసభై వడ్డీ వ్యాపారం, చిట్టీల వ్యాపారం చేస్తాడనీ, వాటిలో నష్టం కారణంగానే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావించారు. అయితే కనకసబైకి వ్యాపారంలో ఎలాంటి నష్టాలు లేవని, అతని ఆత్మహత్యకు వేరే కారణాలు ఉండవచ్చనే అనుమానాన్ని నటుడు ఆనంద్‌రాజ్ వ్యక్తం చేశారు. తన తమ్ముడు ఇటీవల ఒక ఇంటిని కొనుగోలు చేశాడని, ఆ ఇంటిని కాజేయడానికి కొందరు వేసిన కుట్రలో చిక్కుకోవడంతో కనకసభై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు ఓ లేఖను కనుగొన్నారు. తన ఆత్మహత్యకు కారకులు తన అన్నయ్య భాస్కర్, అతని కొడుకు శివ చంద్రన్ అని కనకసబై పేర్కొన్నట్లు ఉన్న లేఖ పోలీసులకు దొరికింది. దీంతో పోలీసులు వారిద్దిరిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. అనంతరం జైలుకు తరలించారు. -
అమెరికాకు తలైవా
రాజకీయాల్లోకి వచ్చేశా..! అంటూ గత ఏడాది చివరి రోజునదక్షిణభారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీ కాంత్ తనఅభిమానులకు సంకేతాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. సొంత పార్టీతో ప్రజల్లోకి వెళ్దామని ఆయన ప్రకటించి నాలుగు నెలలుకావస్తోంది. ఈ కాలంలో అభిమాన సంఘాల్ని ఏకంచేసే పనిలో రజనీ నిమగ్నం అయ్యారు. రజనీ మక్కల్ మండ్రంను ప్రకటించి, కార్యవర్గాల ఎంపిక మీద దృష్టి పెట్టారు. జిల్లాల వారీగాకార్యవర్గాల ఎంపిక ముగింపు దశకు చేరింది. మక్కల్ మండ్రం శాఖలను రాష్ట్రంలో 65 వేలుగా ఏర్పాటు చేసి, సభ్యత్వ నమోదు కోటి లక్ష్యంగా రజనీకాంత్ నిర్ణయించారు. మక్కల్ మండ్రం మీదే పూర్తిస్థాయిలో దృష్టి సాగుతున్నా, పార్టీ ఎప్పుడెప్పుడెప్పుడా అన్నది మాత్రం దాటవేత ధోరణితో ముందుకుసాగుతోంది. తమిళ కొత్త సంవత్సరాది వేళ పార్టీ ప్రకటన చేయవచ్చన్న ప్రచారం తొలుత సాగింది. అయితే, ఆ రోజున రజనీ ఎలాంటి ప్రకటన చేయకపోగా, అసలు స్పందించనే లేదు. రాజకీయ పార్టీ కసరత్తులుసాగుతూనే ఉన్నాయని పదే పదేచెప్పుకుంటున్నా, ప్రకటన కోసం వేచి చూడాల్సిందేనని నాన్చుడు ధోరణిలో పడ్డారు. అదే సమయంలో ప్రజలసమస్యలపై స్పందిస్తూ, కావేరివ్యవహారంపై ప్రకటనలే కాదు, స్వయంగా వ్యాఖ్యల తూటాల్ని పేల్చుతూ వచ్చిన రజనీ కాంత్ మరి కొద్దిరోజుల్లో అమెరికా పయనానికి సిద్ధం అవుతుండడం గమనార్హం. సాక్షి, చెన్నై : త్వరలో తలైవా రజనీకాంత్ అమెరికా పయనం కానున్నారు. వారం రోజులకుపైగా అక్కడే ఆయన ఉంటారు. ఈ పర్యటన ఏర్పాట్ల సమాచారంతో ఇప్పట్లో రజనీ పార్టీ ప్రకటన అనుమానంగా మారింది.గత నెల రజనీ కాంత్ ఆధ్యాత్మిక పయనాన్ని సాగించారు. రిషికేష్, ఉత్తరాఖండ్, బాబా ఆశ్రమాల సందర్శనకు ఆయన వెళ్లడం, అక్కడి నుంచి రాగానే రాజకీయ ప్రకటన తథ్యమని ప్రచారం సాగింది. అయితే, తలైవా పార్టీ విషయంగా నోరు మెదపలేదు. ఈ పరిస్థితుల్లో మరి కొద్ది రోజుల్లో రజనీ అమెరికా పయనం కాబోతున్నారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లలో సన్నిహితులు ఉన్నారు. వారం రోజులకు పైగా ఆయన అక్కడే ఉంటారని సమాచారం. రజనీ అమెరికా పర్యటనతో ఇప్పట్లో పార్టీ ప్రకటన అనేది అనుమానమే అని తెలుస్తోంది. అయితే, ఆయన సన్నిహితులు మాత్రం ఈ పర్యటన ముందుగా నిర్ణయించినదేనని వ్యాఖ్యానిస్తున్నారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు రజనీ వెళ్తున్నట్టు, ఆయన పర్యటనకు వెళ్లినా, పార్టీ ఏర్పాటు కసరత్తులు, ఇతర వ్యవహారాల మీద దృష్టి పెట్టేందుకు తగ్గ ఏర్పాట్లు చేసే వెళ్తారని స్పందిస్తున్నారు. తలైవా అమెరికా పర్యటన ఎప్పుడు అన్నది అధికారికంగా ప్రకటన వెలువడుతుందని పేర్కొంటున్నారు. కాగా, సినిమా వివాద సమస్య సమసిపోవడంతో మరో నెల రోజుల్లో ‘కాల’ విడుదల, ఆ తదుపరి రోబో విడుదల మీద రజనీ దృష్టి పెట్టబోతున్నారు. ఆ తదుపరి మరో కొత్త సినిమా మీద పూర్తిగా లీనం కానున్న నేపథ్యంలో, ఇక రాజకీయ పార్టీ అన్నది ఈ ఏడాది కూడా లేన్నట్టే అన్న చర్చ ఊపందుకుంది. రజనీతో ఆనంద రాజ్ భేటీ అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చిన అనంతరం సినీ నటుడు ఆనంద రాజ్ పార్టీలకు దూరంగా ఉన్నారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వైపు ఆయన చూపు మరళినా, చివరకు వెనక్కు తగ్గారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన పోయెస్ గార్డెన్‌లోని రజనీ కాంత్ ఇంటి మెట్లెక్కడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రజనీని పొగడ్తలతో ముంచెత్తడం గమనార్హం. తమిళ ప్రజల మీద రజనీకి చిత్తశుద్ధి ఉందని, వారికి మంచి జరగాలన్న ఉద్దేశంతో ఆయన అడుగులు సాగుతున్నాయని కితాబు ఇచ్చారు. ప్రజా జీవితంలోకి పూర్తిస్థాయిలో తనను ఆయన త్వరగా అంకితం చేసుకుంటారన్నారు. అయితే, రజనీకి వ్యతిరేకంగా భారతీరాజా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆనంద రాజ్ పేర్కొన్నారు. -
పాంచ్ పటాకాగా చెన్నై చిన్నది
చెన్నై చిన్నది త్రిష పాంచ్ పటాకాగా పేలనున్నారన్నది తాజా సమాచారం. కమలహాసన్, అజిత్, విజయ్, విక్రమ్ వంటి అగ్రనాయకులందరితోనూ నటించిన నటి త్రిష ఒక దశలో పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. నిర్మాత, వ్యాపాత వేత్త వరుణ్మణియన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన త్రిషకు అది వివాహనిశ్చితార్థంతోనే ఆగిపోయిన విషయం విదితమే.వ్యక్తిగత జీవితంలో అలాంటి బ్రేక్ పడినా వృత్తిపరంగా మాత్రం బ్రేకులు లేని బండిలా యమా స్పీడ్ అందుకుంది.అప్పటి వరకూ అందచందాలతోనే సరిపెట్టుకున్న త్రిషకు ఆ తరువాత నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు వరించడం విశేషం. ఆ మధ్య నాయకి అనే హార ర్ కథా చిత్రంలో ద్విపాత్రాభినం చేసిన ఈ భామ తాజాగా ఆ తరహా కథతోనూ మోహిని అనే చిత్రం చేస్తున్నారు. ఇదే తరహాలో మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన త్రిష తాజాగా మరో విభిన్న కథా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. విశేషం ఏమిటంటే ఇప్పటి వరకూ ఒకటీ, రెండు పాత్రల్లోనే నటించిన ఈ బ్యూటీ ఈ చిత్రంలో ఏకంగా ఐదు పాత్రల్లో నటించనున్నారట. ఇందులో రెండు పాత్రల కోసం తన బరువును మరింత తగ్గించుకుని నటించనున్నారట. ఇకపోతే ఈ చిత్రం కోసం త్రిష కోటి రూపాయలను పారితోషికంగా పుచ్చుకోనున్నారట. అంతేకాదు కాస్ట్యూ మ్స్ కోసం మరో 25 లక్షలు తీసుకుంటున్నారట. ఇందులో నాజర్, ఆనందరాజ్ ముఖ్యపాత్రలు పోషించనున్నారని తెలిసింది. ఇంతకు ముందు శరత్‌కుమార్ హీరోగా రహస్య పోలీస్ చిత్రాన్ని తెరకెక్కించిన ఇళవరసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.ప్రస్తుతం మోహినీ చిత్రం కోసం లండ న్లో ఉన్న త్రిష ఆ చిత్రాన్ని పూర్తి చేసి పంచ పాత్రల చిత్రంలో నటించనున్నట్లు సమాచారం.