ఐరాస ట్రస్ట్‌కు భారత్ విరాళం
న్యూయార్క్: శాంతి పరిరక్షణకు ఐక్యరాజ్యసమితి తరఫున పనిచేసే దళాలు, పౌరుల చేతుల్లో లైంగిక దాడికి, వేధింపులకు గురైన మహిళలకు సహాయార్థం ఏర్పడ్డ ట్రస్ట్‌కు భారత్ రూ. 67 లక్షలు విరాళమిచ్చింది. ఈమేరకు ఐరాస క్షేత్ర సహాయ శాఖ (డీఎఫ్ఎస్) తెలిపింది. దీంతో ఈ ట్రస్ట్‌కు విరాళమిచ్చిన తొలి దేశంగా నిలిచింది.
కాగా, ఐరాస భద్రత మండలి అనుమతి కమిటీల(ఎఎన్ఎస్సీ) పనితీరుపై భారత్ మండిపడింది. కొన్ని దేశాలకు సంబంధించి సంకుచితంగా వ్యవహరిస్తోందని విమర్శించింది.