ఐఎన్ఎస్ కమోర్తా జాతికి అంకితం
విశాఖ : జలాంతర్గామి విధ్వంసక యుద్ధనౌక ఐఎన్ఎస్ కమోర్తా తూర్పు నౌకాదళం అమ్ములపొదిలోకి చేరింది. శత్రు దేశాల జలాంతర్గాములను విధ్వంసం చేసే యాంటీ సబ్ మెరైన్ కమోర్తాను శనివారం రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించారు. తూర్పు బంగాళాఖాత తీరంలోని విశాఖ డాక్ యార్డ్ లో జరిగిన కార్యక్రమంలో జైట్లీ కమోర్తాను జాతికి అంకితం చేశారు. 99 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ జలాంతర్గామి రూపొందింది.
13 మీటర్ల భీమ్‌ను కలిగి ఉండే కమోర్త నౌక 110 మీటర్ల పొడవుంటుంది. 25 నాటికన్ మైళ్ళ వేగంతో దూసుకుపోగలదు. 3500 నాటికన్ మైళ్ళ పాటు నిరంతర పయనం సాగించగలదు. పూర్తి ఆయుధ సామగ్రిని కలిగి సెన్సార్ల పరిజ్ఞానంతో అత్యంత ఆధునికత సంతరించుకుంది.
భారీ టోర్పడేలు,ఎఎస్‌డబ్ల్యు రాకెట్స్,మధ్యంతర స్థాయి గన్,మరోరెండు మల్టీ బారన్ గన్లు ఈయుద్ధ నౌక సాధనసంపత్తి. 200 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను సయితం గుర్తించగలదు. ఎఎస్‌డబ్ల్యు హెలికాఫ్టర్‌ను సయితం తీసుకుపోగలదు. 13 మంది అధికారులు173మంది నావికులతో కమోడార్ మనోజ్ ఝా నేతత్వంలో సేవలందించనుంది. ఈస్ట్రన్ ఫ్లీట్‌కే ఈ యుద్ధ నౌక చేరి ప్రత్యేకతను చాటుకోనుంది.