విభిన్నంగా కిరుమి
తమిళసినిమా: విభిన్న కథా చిత్రంగా కిరుమి చిత్రం ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు అనుచరణ్ అంటున్నారు. నవ దర్శకుడైన ఈయన ఆస్ట్రేలియూ అనే షార్ట్ ఫిలిం ద్వారా విమర్శకుల ప్రశంసలందుకున్నారు. జేపీఆర్ ఫిలింస్ పతాకంపై కె.జయరాం ఎల్ పృథ్విరాజ్, ఎం.జయరామన్, ఎస్ రాజేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో చార్లీ, రేష్మీ మీనన్, వనిత, డేవిడ్ సాల్మన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ, ఇదో వైవిధ్యభరిత కథా చిత్రం అన్నారు. ప్రస్తుత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పారు. చిత్ర హీరో కదిర్ మాట్లాడుతూ ఇది సాధారణ సోషల్ ఎలిమెంట్స్‌తో కూడిన చిత్రం కాదన్నారు. సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటుందన్నారు. సహజత్వానికి దగ్గరగా ఉంటుందని చెప్పారు. చిత్ర షూటింగ్ 90 శాతం పూర్తి అయ్యిందని నిర్మాతలు తెలిపారు. చిత్రానికి కె.సంగీతాన్ని అందిస్తుండగా పిసి శ్రీరామ్ శిష్యుడు అరుల్ విన్సెంట్ చాయాగ్రహణం అందిస్తున్నారని తెలిపారు.