Arms Store
-
జమ్మూ కశ్మీర్లో భారీగా మారణాయుధాలు పట్టివేత
భారత సైన్యం, జమ్ముకాశ్మీర్ పోలీసులు భారీ మొత్తంలో యుద్ధం తరహా ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారు ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో యూరీలోని హత్లాంగా సెక్టార్లో ఈ ఆయుధాలను గుర్తించారు. ఆ ఆయుధాల్లో ఎనిమిది ఏకేఎస్ 74 రైఫిళ్లు, 560 లైవ్ రైఫిల్ రౌండ్లు, 12 చైనీస్ పిస్టల్స్, 14 పాకిస్తాన్, చైనా గ్రెనేడ్లతో పాటు పాకిస్తాన్ జెండాతో కూడిన బెలూన్లు ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు కల్నల్ మనీష్ పంజ్ చెప్పారు. ఆ ఆయుధాలు పాకిస్తాన్‌వేనని, ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలన్నారు కల్నల్ మనీష్ పంజ్ పాకిస్తాన్‌కి చెందిన మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ కేసును చేధించే క్రమంలోనే ఒక రాజకీయ కార్యకర్త, కాంట్రాక్టర్, దుకాణాదారుడు, ఐదుగురు పోలీసులతో సహా సుమారు 17 మందిని పోలీసులు అరెస్టు చేసిన తర్వాతే ఈ అనుహ్య ఘటన చోటు చేసుకుంది. మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులో పౌల్ట్రీ షాపు యజమాని మహ్మద్ వసీమ్ నజర్ అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో అతడిచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు చేసినట్లు తెలిపారు. (చదవండి:15 రోజుల పాటు శిక్ష..ఆప్ మంత్రికి మరో ఎదురు దెబ్బ) -
వేటకా..? విద్రోహానికా..?
సిటీబ్యూరో: మహారాష్ట్రలోని యవత్మాల్ ప్రాంతంలో ఆయుధం, మందుగుండుతో పట్టుబడిన ముగ్గురు హైదరాబాదీల కేసు దర్యాప్తును ఆ రాష్ట్ర యాంటీ టైస్ట్ స్వ్కాడ్ (ఏటీఎస్) ముమ్మరం చేసింది. ఆ ‘సామగ్రి’ వారికి ఎలా వచ్చింది? ఎవరికి ఇవ్వాలని వెళ్తున్నారు? అనే అంశాలతో పాటు వీటిని వినియోగించేది జంతువుల్ని వేటాడటానికా? లేక విద్రోహక చర్య కోసమా? అనే కోణాల్లో లోతుగా ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా ఏటీఎస్‌కు చెందిన ప్రత్యేక బృందం ఆదివారం నగరానికి వచ్చి రెండు రోజుల పాటు దర్యాప్తు చేసి వెళ్లింది. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ మసివుద్దీన్ ఒవైసీ, మహ్మద్ ఉమర్ ఘాజీ, మహ్మద్ మిరాజుద్దీన్ ఓ వాహనంలో ప్రయాణిస్తుండగా శుక్రవారం అర్దరాత్రి యవత్మాల్ సమీపంలోని ఖారబీ చెక్‌పోస్టు వద్ద పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. హైదరాబాద్ వచ్చిన ఏటీఎస్ బృందం ఆ ముగ్గురిలో ఒకరికి చెందినదిగా అనుమానిస్తున్న అబిడ్స్‌లో ఉన్న ఆయుధ విక్రయ దుకాణం (ఆర్మరీ) నుంచి కొన్ని రికార్డులు సేకరించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ ముగ్గురినీ మహారాష్ట్రలోని ధరత్రి పోలీసులు అదుపులో ఉంచుకున్నారు. మరోపక్క యవత్మాల్ లోకల్ క్రైమ్ బ్రాంచ్ (ఎల్సీబీ) చీఫ్ సంజయ్ పుజల్కర్ సైతం స్వయంగా రంగంలోకి దిగారు. ముగ్గురు యువకులకు సంబంధించిన సెల్‌ఫోన్ కాల్ డేటాలనూ విశ్లేషిస్తున్నారు.