వేటకా..? విద్రోహానికా..? | Black-action..... | Sakshi
Sakshi News home page

వేటకా..? విద్రోహానికా..?

Published Wed, Jan 6 2016 11:37 PM | Last Updated on Sun, Sep 3 2017 3:12 PM

Black-action.....

సిటీబ్యూరో:  మహారాష్ట్రలోని యవత్‌మాల్ ప్రాంతంలో ఆయుధం, మందుగుండుతో పట్టుబడిన ముగ్గురు హైదరాబాదీల కేసు దర్యాప్తును ఆ రాష్ట్ర యాంటీ టైస్ట్ స్వ్కాడ్ (ఏటీఎస్) ముమ్మరం చేసింది. ఆ ‘సామగ్రి’ వారికి ఎలా వచ్చింది? ఎవరికి ఇవ్వాలని వెళ్తున్నారు? అనే అంశాలతో పాటు వీటిని వినియోగించేది జంతువుల్ని వేటాడటానికా? లేక విద్రోహక చర్య కోసమా? అనే కోణాల్లో లోతుగా ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా ఏటీఎస్‌కు చెందిన ప్రత్యేక బృందం ఆదివారం నగరానికి వచ్చి రెండు రోజుల పాటు దర్యాప్తు చేసి వెళ్లింది.

హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ మసివుద్దీన్ ఒవైసీ, మహ్మద్ ఉమర్ ఘాజీ, మహ్మద్ మిరాజుద్దీన్ ఓ వాహనంలో ప్రయాణిస్తుండగా శుక్రవారం అర్దరాత్రి యవత్‌మాల్ సమీపంలోని ఖారబీ చెక్‌పోస్టు వద్ద పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే.  హైదరాబాద్ వచ్చిన ఏటీఎస్ బృందం ఆ ముగ్గురిలో ఒకరికి చెందినదిగా అనుమానిస్తున్న అబిడ్స్‌లో ఉన్న ఆయుధ విక్రయ దుకాణం (ఆర్మరీ) నుంచి కొన్ని రికార్డులు సేకరించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ ముగ్గురినీ మహారాష్ట్రలోని ధరత్రి పోలీసులు అదుపులో ఉంచుకున్నారు. మరోపక్క యవత్‌మాల్ లోకల్ క్రైమ్ బ్రాంచ్ (ఎల్‌సీబీ) చీఫ్ సంజయ్ పుజల్‌కర్ సైతం స్వయంగా రంగంలోకి దిగారు. ముగ్గురు యువకులకు సంబంధించిన సెల్‌ఫోన్ కాల్ డేటాలనూ విశ్లేషిస్తున్నారు.
 

Advertisement

పోల్

Advertisement