ఆర్మీ, వైమానిక దళాలకు డిప్యూటీ చీఫ్‌ల నియామకం
న్యూఢిల్లీ: దేశ సైనిక, వైమానిక దళాలకు నూతన ఉప ప్రధానాధికారులు(డిప్యూటీ చీఫ్) నియమితులయ్యారు. లెఫ్టినెంట్ జనరల్ సి.ఎ. క్రిష్ణన్(58) సైనిక దళాల ఉప ప్రధానాధికారిగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న లెఫ్టినెంట్ జనరల్ నరేంద్ర సింగ్ రిటైర్ కావడంతో ఈ పదవి ఖాళీ అయింది.
దాదాపు 40 ఏళ్లపాటు నరేంద్ర సింగ్ సైనిక దళాల్లో సేవలందించారు. మరోపక్క, ఎయిర్ మార్షల్ ఎస్బీపీ సిన్హా(58) వైమానికి దళ ఉప ప్రధానాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. వైమానిక దళ ఆధునికీకరణలో ఈయన ప్రముఖ పాత్ర పోషించనున్నారు.