Assembly bill
-
మహిళలపై నేరాలకు మరణ శిక్షే
కోల్‌కతా: మహిళలపై అత్యాచారం, హత్య వంటి తీవ్ర నేరాలకు పాల్పడే దోషులకు మరణ శిక్ష విధించడానికి ఉద్దేశించిన ‘అపరాజిత’ బిల్లుకు పశి్చమ బెంగాల్ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ‘అపరాజిత మహిళ, బాలలు(పశి్చమ బెంగాల్ చట్టాలు, సవరణ) బిల్లు–2024’ను రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి మలోయ్ ఘటక్ మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అధికార, విపక్ష సభ్యులంతా బిల్లుకు అంగీకారం తెలిపారు. బిల్లుకు సంబంధించి ప్రతిపక్ష నేత సువేందు అధికారి ప్రతిపాదించిన కొన్ని సవరణలను సభ తిరస్కరించింది.మహిళలపై అత్యాచారానికి పాల్పడి వారి మరణానికి లేదా జీవచ్ఛవంగా మారడానికి కారణమైన దోషులకు మరణ శిక్ష లేదా పెరోల్‌కు వీల్లేకుండా యావజ్జీవ కారాగార శిక్ష విధించేలా అపరాజిత బిల్లును పశి్చమ బెంగాల్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మహిళలపై నేరాల కేసుల్లో వేగంగా దర్యాప్తు పూర్తి చేసి, సత్వరమే కోర్టు నుంచి తీర్పు వచ్చేలా బిల్లులో నిబంధనలు జోడించారు. మహిళలు, చిన్నారులకు భద్రతను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా అత్యాచారాలు, లైంగిక నేరాలకు సంబంధించి ఇప్పుడున్న చట్టంలో కొన్ని మార్పులు చేశారు, కొత్త అంశాలు చేర్చారు.కోల్‌కతాలోని ఆర్.జి.కర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దోషులకు మరణ శిక్ష విధించేలా కఠినమైన చట్టం తీసుకొస్తామని పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. అపరాజిత బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదించడం కోసమే రెండు రోజులపాటు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలి: సీఎం మమతా బెనర్జీ డిమాండ్ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోపాటు మహిళల భద్రత కోసం పటిష్టమైన చర్యలు చేపట్టని ముఖ్యమంత్రులంతా పదవులకు రాజీనామా చేయాలని పశి్చమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీలో అపరాజిత బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం ఆమె మాట్లాడారు. మహిళలపై నేరాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించి, బాధితులకు సత్వరమే న్యాయం చేకూర్చేలా చట్టాల్లో సవరణలు చేయాలని కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అందుకే తామే మొదట చొరవ తీసుకున్నామని తెలిపారు.అపరాజిత బిల్లు చట్టంగా మారి అమల్లోకి వస్తే.. ఇది మొత్తం దేశానికి ఒక రోల్‌మోడల్‌గా ఉపయోగపడుతుందని చెప్పారు. ఇటీవల ప్రధాని మోదీకి తాను రాసిన రెండు లేఖలను ఆమె సభ ముందుంచారు. మహిళలు, చిన్నారులకు భద్రత కలి్పంచేలా చట్టాలను అమలు చేయడంలో విఫలమైన పాలకులంతా పదవుల నుంచి తప్పుకోవాలని తేలి్చచెప్పారు. ఇదిలా ఉండగా, జూనియర్ డాక్టర్ హత్యకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని సభలో విపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు బిగ్గరగా నినదించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో మమతా బెనర్జీ స్పందించారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, గుజరాత్లో మహిళలపై అధికంగా నేరాలు జరుగుతున్నాయని తిప్పికొట్టారు.ఏమిటీ అపరాజిత బిల్లు?భారతీయ న్యాయ సంహిత, నాగరిక్ సురక్ష సంహితతో పాటు పోక్సో చట్టానికి కూడా పశి్చమ బెంగాల్ ప్రభుత్వ అపరాజిత బిల్లు సవరణలను ప్రతిపాదించింది. ‘‘అత్యాచారం, అత్యాచారం–హత్య, సామూహిక అత్యాచారం, బాధితుల గుర్తింపు బయటపెట్టడం, యాసిడ్ దాడి వంటి నేరాలకు విధించే శిక్షలకు సంబంధించి భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 64, 66, 70(1), 71, 72(1), 73, 124(1), 124(2)ను సవరించాలి. మహిళలు, చిన్నారులపై అత్యాచారం, లైంగిక నేరాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించాలి’’ అని పేర్కొంది.‘‘అత్యాచారం కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదైన 21 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలి. తగిన కారణాలుంటే మరో మూడు వారాలు పొడిగించవచ్చు. దోషులకు మరణ శిక్షతో పాటు జరిమానా లేదా ఆజన్మ ఖైదు (మరణించేదాకా) విధించాలి. మహిళలపై నేరాలకు సంబంధించిన కోర్టు కార్యకలాపాలను, కేసు విచారణ వివరాలను అనుమతి లేకుండా ప్రచురిస్తే 3 నుంచి ఐదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించాలి. దర్యాప్తు కోసం డీఎస్పీ నేతృత్వంలో జిల్లా స్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలి. దర్యాప్తు వేగంగా పూర్తి చేయడానికి ప్రత్యేక కోర్టును, దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలి’’ అని అపరాజిత బిల్లు ప్రతిపాదించింది. -
Supreme Court: బిల్లులు ఎందుకు ఆపేశారో చెప్పండి
న్యూఢిల్లీ: కేరళ, పశి్చమ బెంగాల్ శాసనసభల్లో ఆమోదించిన బిల్లులకు ఆయా రాష్ట్రాల గవర్నర్లు అంగీకారం తెలియజేయకుండా సుదీర్ఘకాలం పెండింగ్‌లో పెట్టడం పట్ల సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. గవర్నర్ల వైఖరిని సవాలు చేస్తూ కేరళ, పశి్చమ బెంగాల్ ప్రభుత్వాలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. కేంద్ర హోం శాఖకు, కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్, బెంగాల్ గవర్నర్ ఆనందబోసు కార్యదర్శులకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. బిల్లులను ఎందుకు పెండింగ్‌లో కొనసాగిస్తున్నారో మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అలాగే పిటిషన్లో కేంద్ర హోంశాఖను సైతం ఒక పార్టీగా చేర్చాలని బెంగాల్ ప్రభుత్వానికి సూచించింది. తమ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు గవర్నర్ అంగీకారం తెలియజేయడం లేదంటూ కేరళ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నెలలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూసీసీ బిల్లు
డెహ్రాడూన్: అత్యంత కీలకమైన ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) విషయంలో బీజేపీ పాలిత ఉత్తరాఖండ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. యూసీసీ బిల్లును సీఎం పుష్కర్‌సింగ్ ధామీ మంగళవారం అసెంబ్లీ ప్రవేశపెట్టారు. అధికార బీజేపీ సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేయగా విపక్ష సభ్యులు వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఉమ్మడి పౌరస్మృతి బిల్లుపై మంగళవారమే చర్చ, ఓటింగ్ జరగాల్సి ఉండగా, విపక్షాల నిరసనల వల్ల అది సాధ్యం కాలేదు. చర్చ జరగకుండానే బిల్లును ఆమోదించుకోవడానికి ప్రభుత్వం కుట్ర పన్నిందని ప్రతిపక్ష ఎమ్మెల్యే యశ్పాల్ ఆర్య మండిపడ్డారు. యూసీసీ బిల్లుపై ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఒకటి రెండు రోజుల్లో చర్చ, అనంతరం ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. సభలో ప్రభుత్వానికి తగిన సంఖ్యాబలం ఉండడంతో బిల్లు ఆమోదం పొందడం, గవర్నర్ సంతకంతో చట్టంగా మారడం లాంఛనమేనని చెప్పొచ్చు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి బిల్లును ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ చరిత్ర సృష్టించింది. ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఉమ్మడి పౌరస్మృతి బిల్లును తీసుకొచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు దేశంలో ప్రస్తుతం గోవాలో మాత్రమే ఉమ్మడి పౌరస్మృతి చట్టం అమలవుతోంది. అక్కడ పోర్చుగీసు పాలనా కాలంలోనే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఉమ్మడి పౌరస్మృతి బిల్లులో ఏముంది? ► ఉత్తరాఖండ్‌లో నివసిస్తున్న ప్రజలతోపాటు ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న ఉత్తరాఖండ్ పౌరులకు ఈ బిల్లు వర్తిస్తుంది. ► గిరిజన వర్గాల ప్రజలను బిల్లు నుంచి మినహాయించారు. ► భారత రాజ్యాంగంలోని పార్ట్–21 కింద తమ హక్కుల రక్షణ పొందుతున్న వ్యక్తులకు, సమూహాలకు కూడా మినహాయింపు ఉంటుంది. ► సహజీవనాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ► సహజీవనం ద్వారా జన్మించిన పిల్లలకు చట్టబద్ధంగా గుర్తింపు లభిస్తుంది. ► వివాహం, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వం, దత్తత తదితర అంశాల్లో మతాలకు అతీతంగా ప్రజలందరికీ ఒకే చట్టం అమలు చేస్తారు. ► మతాలతో సంబంధం లేకుండా బహుభార్యత్వంపై నిషేధం అమలవుతుంది. ఒక్కరు ఒక్కరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ► ఎవరి మతాచారం ప్రకారం వారు వివాహం చేసుకోవచ్చు. ► సహజీవనం చేసే స్త్రీపురుషుల వయసులు వరుసగా 18, 21 ఏళ్లకు పైబడి ఉండాలి. ► సహజీవనం ప్రారంభించిన తర్వాత నెల రోజులలోపు ప్రభుత్వ రిజి్రస్టార్‌కు సమాచారం ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేకపోతే వారికి ఆరు నెలల దాకా జైలుశిక్ష లేదా రూ.25 వేల జరిమానా లేదా ఈ రెండు శిక్షలూ విధిస్తారు. ► సహజీవనంపై రిజిస్ట్రార్‌కు తప్పుడు సమాచారం ఇస్తే భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ► సహజీవనం సాగిస్తున్న మహిళను పురుషుడు వదిలేస్తే బాధితురాలు కోర్టును ఆశ్రయించవచ్చు. అతడి నుంచి జీవనభృతి పొందవచ్చు. ► పెళ్లి కాని జంటల మధ్య సహజీవనాన్ని అరికట్టేలా బిల్లులో పలు కీలకాంశాలు జోడించారు. -
తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు
-
పాసైన బిల్లుల ఆమోదం నా పరిధిలోనిది.. ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్ తమిళిసై!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మధ్య పరస్పర విమర్శలపర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గవర్నర్ తమిళిసై.. బహిరంగంగానే కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. గవర్నర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ పలు సందర్భాల్లో టీఆర్ఎస్ నేతలు సైతం తమిళిసైపై ఎదురు విమర్శలు కూడా చేశారు. కాగా, గవర్నర్ తమిళిసై మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా తమిళిసై మాట్లాడుతూ.. ‘అసెంబ్లీ సమావేశాల్లో పాసైన బిల్లులకు ఆమోదం తెలిపే అంశం పూర్తిగా నా పరిధిలోనిది. గవర్నర్‌గా నాకు విస్తృత అధికారాలు ఉంటాయి. నా పరిధికిలోబడే నేను నడుచుకుంటున్నాను. పెండింగ్‌లో ఉన్న బిల్లులను త్వరలోనే పరిశీలించి నిర్ణయం తీసుకుంటాను. నేను ఎవరికీ వ్యతిరేకం కాదు. గవర్నర్‌గా నా బాధ్యతను అనుసరించే నిర్ణయాలు వెలువరిస్తాను’ అని స్పష్టం చేశారు. అంతకుముందు కూడా గవర్నర్ తమిళిసై.. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున తనని జెండా ఆవిష్కరించనివ్వలేదని, ప్రసంగం కూడా చేయనివ్వలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ తన పని తాను చేసుకుంటూ పోతున్నానని అన్నారు. ఏనాడు నేను అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. రాజ్‌భవన్‌లో తనకయ్యే ఖర్చును మొత్తం తానే భరిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతినెలా తనకయ్యే ఖర్చును తానే సొంతంగా చెల్లిస్తున్నానని, ప్రభుత్వ సొమ్మును ఉపయోగించుకోవడం లేదని పేర్కొన్నారు. -
న్యూయార్క్ అసెంబ్లీలో కశ్మీర్‌పై తీర్మానం
న్యూయార్క్: ఫిబ్రవరి 5వ తేదీని ‘కశ్మీర్ అమెరికన్ డే’గా ప్రకటించాలని గవర్నర్ అండ్రూ క్యుఒమోను కోరుతూ న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ ఒక వివాదాస్పద తీర్మానాన్ని ఆమోదించింది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. జమ్మూకశ్మీర్ ఘన సంస్కృతిని, సామాజిక సంప్రదాయాలను తప్పుగా చూపి కశ్మీర్ ప్రజలను విడదీసే చర్యగా ఈ తీర్మానాన్ని అభివర్ణించింది. ఈ తీర్మానం వెనుక స్వార్ధ శక్తులున్నాయని ఆరోపించింది. అసెంబ్లీ సభ్యుడు నాదర్ సాయేఘ్, మరో 12 మంది సభ్యులు ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ‘కశ్మీరీలు ప్రతికూలతలను అధిగమించారు. పట్టుదలతో కృషి చేసి న్యూయార్క్ వలస ప్రజలకు పునాదిగా నిలిచారు. కశ్మీరీ ప్రజల మత స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛలకు న్యూయార్క్ రాష్ట్రం మద్దతునిస్తుంది’ అని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని వాషింగ్టన్‌లోని భారతీయ రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి తీవ్రంగా ఖండించారు. ‘జమ్మూకశ్మీర్ సహా దేశ భిన్న, ఘన సాంస్కృతిక వారసత్వం భారత్‌కు గర్వకారణం. జమ్మూకశ్మీర్ భారత్‌లో విడదీయలేని అంతర్భాగం’ అని స్పష్టం చేశారు. కాగా, కశ్మీర్‌పై న్యూయార్క్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని పాకిస్తాన్ స్వాగతించింది. -
విప్లవాత్మక బిల్లులు పెట్టాం:పెద్దిరెడ్డి
-
కీలక బిల్లులపై చర్చకు దూరంగా టీడీపీ
సాక్షి, అమరావతి: శాసనసభలో అత్యంత కీలకమైన బిల్లులపై చర్చకు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్న సాకుతో రెండు రోజులు సభ నుంచి చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన బిల్లులను సభలో ప్రవేశపెట్టి ఆమోదించింది. కానీ, చంద్రబాబు మాత్రం సభలో వాటి గురించి చర్చించేందుకు ఇష్టపడకుండా ఇతర అంశాలను లేవనెత్తి గొడవ చేయడం, వాకౌట్ చేసి వెళ్లిపోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మంగళవారం అత్యంత ప్రతిష్టాత్మకమైన బిల్లులుగా భావిస్తున్న శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు, నామినేటెడ్ పదవులు, పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులు, నామినేటెడ్ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ఆమోదించడానికి ముందు చర్చ మొదలవుతుండగానే టీడీపీ ఎమ్మెల్యేలు సభలో రచ్చ చేయడానికి ప్రయత్నించారు. దీంతో స్పీకర్ ముగ్గురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. అయినా టీడీపీ సభ్యులు దానిపైనే సభలో కొద్దిసేపు ఆందోళన చేసి ఆ తర్వాత వాకౌట్ చేశారు. తమది బీసీల పార్టీ అని పదేపదే చెప్పుకునే టీడీపీ అదే బీసీలకు సంబంధించిన అత్యంత కీలకమైన బిల్లులపై కనీసం మాట్లాడకుండా వెళ్లిపోవడం ఏమిటని ఆయా వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలిచ్చేందుకు ఉద్దేశించిన బిల్లుపై బుధవారం అసెంబ్లీలో చర్చ జరుగుతుందని తెలిసినా టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నోత్తరాల సమయంలోనే ఆందోళనకు దిగి, వాకౌట్ చేసి వెళ్లిపోయారు. అంతా వ్యూహాత్మకంగానే... కీలకమైన బిల్లులపై చర్చలో పాల్గొనకుండా చంద్రబాబు వ్యూహాత్మకంగా సభ నుంచి జారుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి, మీడియా సమావేశాల్లో తన వాదన వినిపిస్తున్న చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత విమర్శలతో సరిపెడుతూ కనీసం ఆ బిల్లులపై మాట్లాడకపోవడం గమనార్హం. ప్రతిష్టాత్మకమైన బిల్లుల విషయంలో ప్రజల దృష్టిని మరల్చేందుకే చంద్రబాబు, టీడీపీ సభ్యులు అనుచితంగా వ్యవహరించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సభలో అడ్డగోలుగా వ్యవహరించి సస్పెన్షన్ల వరకూ తీసుకెళ్లడం, దాన్ని అడ్డం పెట్టుకుని గొడవకు దిగడం, ధర్నాలు చేయడం, సభ నుంచి వాకౌట్ చేయడం వంటి చర్యల ద్వారా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలన్నదే టీడీపీ ఉద్దేశమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఏపీలో నవ చరిత్రకు శ్రీకారం
రాష్ట్రంలో అతి పెద్ద సామాజిక మార్పునకు ఊతమిచ్చే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇదివరకెన్నడూ లేని రీతిలో స్థానికులకు ఉపాధి కల్పించే కీలక నిర్ణయాలకు నాంది పలికింది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పించడానికి అడుగు ముందుకు వేసింది. అసాధ్యం అనుకున్న పనులను సుసాధ్యం చేస్తూ కొత్త చరిత్ర సృష్టించింది. నిరుద్యోగ యువతకు భవిష్యత్‌పై భరోసా కల్పిస్తూ, మహిళల చిరకాల కోరిక నెరవేరుస్తూ నవ సమాజ నిర్మాణానికి అంకురార్పణ గావించింది. రాష్ట్రంలో పరిశ్రమలు, కర్మాగారాలలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా, దశల వారీగా మద్య నిషేధం దిశగా మద్య నియంత్రణ చట్టాన్ని సవరించేలా ప్రవేశ పెట్టిన కీలక బిల్లులను బుధవారం సభ్యుల హర్షధ్వానాల నడుమ శాసనసభ ఆమోదించింది. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రూపొందిన ఈ బిల్లులు నిరుద్యోగులు, మహిళల పాలిట వరం అని ఈ సందర్భంగా పలువురు శాసనసభ్యులు కొనియాడారు. పేదలు, మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన సంఘ సంస్కర్తగా చరిత్రలో నిలిచిపోతారని ప్రశంసించారు. సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పరిశ్రమలు, కర్మాగారాలలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేందుకు ఉద్దేశించిన చరిత్రాత్మక బిల్లును బుధవారం రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశం మేరకు రూపొందించిన ఈ బిల్లు నిరుద్యోగుల పాలిట వరం అని పలువురు శాసనసభ్యులు అభివర్ణించారు. ఏపీ పరిశ్రమలు, కర్మాగారాలలో స్థానిక అభ్యర్థులకు ఉపాధి బిల్లు–2019ను శాసనసభ సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపింది. దీంతో స్థానికులు పొట్ట చేత పట్టుకుని వలసలు పోవాల్సిన అవసరం ఉండదని శాసనసభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ బిల్లుపై చర్చకు ప్రతిపాదిస్తూ రాష్ట్ర కార్మిక, ఉపాధి, కర్మాగారాల శాఖ మంత్రి జి.జయరాం మాట్లాడారు. ‘అందరి తల రాతను బ్రహ్మదేవుడు రాస్తాడని విశ్వసిస్తుంటారు. అందరి సంగతేమో గానీ మా తలరాత రాసింది మాత్రం వైఎస్ జగన్మోహనుడు’ అని అన్నారు. ఎస్సీలకు అంబేడ్కర్‌లా, వాల్మీకులకు వాల్మీకి మహర్షిలా, క్రైస్తవులకు ఏసుక్రీస్తులా, ముస్లింలకు అల్లా లాగా, అందరి దేవుడు షిర్డీ సాయిలాగా సమాజంలోని అన్ని వర్గాలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవుడని అభివర్ణించారు. ఈ సందర్భంగా జగన్ వినమ్రంగా నమస్కరిస్తూ బిల్లుపై మాట్లాడాల్సిందిగా సంజ్ఞలు చేశారు. బాబు వంచిస్తే.. జగన్ ఆదుకున్నారు గత ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగం అని చెప్పి అందర్నీ వంచించారని మంత్రి జయరాం అన్నారు. చంద్రబాబుకు, జగన్‌కు.. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ప్రస్తుత బిల్లు ప్రకారం స్థానిక పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని, ఇదో చారిత్రక నిర్ణయమని వివరించారు. నైపుణ్యం, అర్హత లేదన్న సాకుతో పరిశ్రమల యజమానులు స్థానికులను తిరస్కరించే వీలు లేదని, నైపుణ్యం లేకపోతే శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లోకి తీసుకోవాలన్నారు. మిగతా 25 శాతం ఉద్యోగాలలో యాజమాన్యాలు ఇష్టం వచ్చిన వారిని నియమించుకునే స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. పి.రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి బిల్లును తీసుకువచ్చిన చరిత్ర లేదన్నారు. ఈ బిల్లు చట్టమైతే అనేక ప్రాంతాలలో పరిశ్రమలు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నైపుణ్యం లేని వారికి మూడేళ్ల కాలంలో శిక్షణ ఇవ్వొచ్చన్నారు. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వడం వల్ల పరిశ్రమల యాజమాన్యాలకు చాలా ఖర్చులు తగ్గుతాయన్నారు. మధ్యప్రదేశ్‌లోని పరిశ్రమల్లో స్థానికులకు 70 శాతం ఉద్యోగాలు ఇచ్చే వెసులుబాటు ఉందని, దాన్ని మించి ఆంధ్రప్రదేశ్‌లో అవకాశం కల్పిస్తున్నారని వివరించారు. గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు చేయలేని పనులు నవ యువకుడైన వైఎస్ జగన్ తన 45 రోజుల పాలనలో చేసి చూపారన్నారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా మొదలు రాష్ట్ర విభజన నాటి హామీలను అమలు చేయనప్పుడు నోరెత్తని ఆంగ్ల ఛానళ్లు ఇప్పుడు ఈ బిల్లును వివాదాస్పదం చేయాలని చూడడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చిన మేనిఫెస్టో మూడు తరాల భవిష్యత్ అన్నారు. మహాత్మా గాంధీ కలలు సాకారం మంగళవారం ఆమోదించిన ఐదు బిల్లులు సామాజికమైనవైతే బుధవారం ప్రతిపాదించిన బిల్లులు చరిత్రాత్మకమైనవని కిలారు రోశయ్య అన్నారు. మహాత్మాగాంధీ కన్న కలలను సాకారం చేసే దిశగా వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. చంద్రబాబు ఎంతో గొప్పగా చెప్పుకునే అమరావతి ప్రాంత అభివృద్ధి పనుల్లోనూ సుమారు 80 శాతం మంది కార్మికులు ఇతర రాష్ట్రాల వారని, స్థానికులకు ఎటువంటి అవకాశం కల్పించలేదన్నారు. 2016 నుంచి నాలుగేళ్లలో రూ.19,58,000 కోట్ల పెట్టుబడులు, 43 లక్షల ఉద్యోగాలు అని చెప్పి చంద్రబాబు మోసం చేశారన్నారు. వి.వరప్రసాద్ మాట్లాడుతూ ఈ బిల్లుతో ప్రతి నియోజకవర్గంలో ఒక నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసే వెసులుబాటు ఉంటుందన్నారు. వలసల్ని నిరోధించవచ్చన్నారు. ఈ బిల్లులోని అంశాలను అమలు చేయని పరిశ్రమల యాజమాన్యాలకు, అధికారులకు కూడా జరిమానాలు విధించేలా ప్రతిపాదనలు ఉండాలని సూచించారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి ఉండకపోతే పరిశ్రమలు వచ్చి ఉండేవని పలాస ఎమ్మెల్యే అప్పలరాజు దుయ్యబట్టారు. నైపుణ్యం లేదనే సాకుతో ఉద్యోగాలు తిరస్కరించే అవకాశం ఇకపై ఉండదన్నారు. గ్రామీణ యువతకు ఇదో వరమన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బి.మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో విప్లవాత్మక మార్పునకు ఈ బిల్లు శ్రీకారం చుడుతోందన్నారు. పరిశ్రమలకు స్థానికులు భూములు ఇస్తున్నప్పుడు ఉద్యోగాలు వేరే వాళ్లకు ఇస్తామనడంలో అర్థం లేదని, ఇకపై ఈ సమస్య ఉండదన్నారు. జగన్ పట్టుదలతోనే... సామాజిక న్యాయం, బడుగు వర్గాలకు సాధికారతకు ఉద్దేశించిన 5 బిల్లులు సభ ఆమోదం పొందేంత వరకు మా అన్న, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నం ముట్టలేదని సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ చెప్పారు. జగన్ పట్టుదలకు, బీసీల పట్ల ఆయనకున్న ప్రేమాభిమానాలకు ఇదే నిదర్శనమన్నారు. మహాత్మాగాంధీ, జ్యోతిరావ్ పూలే, అంబేడ్కర్ ఎలాగో ఇక వైఎస్ జగన్ కూడా తమకు అంతేనని అభివర్ణించారు. ప్రస్తుతం జగనిజం నడుస్తోందన్నారు. ఏపీ రాజకీయ చరిత్ర చెప్పాల్సి వస్తే జగన్‌కు ముందు జగన్‌కు తర్వాత అని చెప్పాల్సి వస్తుందన్నారు. ఏ నాయకునికీ తట్టని ఆలోచనలెన్నో వైఎస్ జగన్‌కు తట్టాయని, అందుకే ఆయన మహనీయుడని అన్నారు. పారిశ్రామిక విప్లవం సామాజిక బాధ్యతతో పారిశ్రామిక విప్లవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పిస్తూ చేస్తున్న చట్టం రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి దోహదపడుతుంది. ఎందుకంటే పరిశ్రమలకు అవసరమైన రీతిలో యువతకు శిక్షణ ఇచ్చి నిపుణులైన ఉద్యోగులను ప్రభుత్వమే అందిస్తుంది. ఇక పారిశ్రామికీకరణతో కాలుష్యం, ఇతర సమస్యలు ఎదుర్కొంటున్న స్థానికులకు పరిశ్రమల ఏర్పాటు పట్ల సానుకూల ధోరణి పెరుగుతుంది. స్థానికులకే ఉద్యోగాల్లో సింహభాగం దక్కాలన్న నినాదం ప్రపంచ వ్యాప్తంగా బలోపేతమవుతోంది. అదే నినాదంతో అమెరికన్ల మనసు గెలుచుకుని ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యారు. అదే రీతిలో బ్రిటన్ కూడా బ్రెగ్జిట్ పేరిట ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చింది. – మేకపాటి గౌతంరెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి యువత భవిష్యత్‌కు ఇక భరోసా పరిశ్రమల్లోని ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పించే చట్టాన్ని తీసుకురావాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఇంటికో ఉద్యోగం ఇస్తామంటే నమ్మి టీడీపీకి అధికారం అప్పగిస్తే చంద్రబాబు యువతను మోసం చేశారు. దాంతో యువతలో నిరాశ నిస్పృహలు పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించే చట్టాన్ని తీసుకురావాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం యువతలో కొత్త ఆశలు రేకెత్తించింది. తమ భవిష్యత్ బాగుంటుందన్న భరోసా వారికి కలుగుతోంది. ప్రజలు ఆయన నాయకత్వం కలకాలం ఉండాలని కోరుకుంటున్నారు. – రాపాక వరప్రసాద్, ఎమ్మెల్యే, రాజోలు -
పూలింగ్ నేటి నుంచే
-
పూలింగ్ నేటి నుంచే
* 9 నెలల్లో యాజమాన్య ధ్రువపత్రాలు.. త్వరలో అసెంబ్లీలో బిల్లు * రాజధానిపై సీఎం ప్రకటన * ఇన్నర్, మిడిల్, ఔటర్ రింగ్రోడ్లుగా నిర్మాణ పరిధి * తొలిదశలో ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలో పనులు సాక్షి, హైదరాబాద్: రాజధానికి అవసరమైన భూ సమీకరణ ప్రక్రియను మంగళవారం నుంచి ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రపంచస్థాయి మౌలిక వసతులతో, అత్యాధునిక టెక్నాలజీతో నవ్యాంధ్ర రాజధానిని నిర్మిస్తున్నట్టు చెప్పారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజధాని భూ సమీకరణపై సీఎం విధాన ప్రకటన చేశారు. రాజధాని నిర్మాణ పరిధిని ఇన్నర్ రింగ్‌రోడ్డు, మిడిల్ రింగ్‌రోడ్డు, ఔటర్ రింగ్‌రోడ్డు పేరుతో మూడు భాగాలుగా విభజించామన్నారు. ఇందులో భాగంగా.. పక్కా వాస్తు ప్రకారం గుంటూరుకు సమీపంలో 75 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్‌రోడ్డు పరిధిలో తొలి దశ రాజధాని నిర్మాణం పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఆ తర్వాత గుంటూరు, విజయవాడ, తెనాలి, మంగళగిరి ప్రాంతాల్లో మిడిల్ రింగ్‌రోడ్డు 125 కిలోమీటర్ల పరిధిలో, ఔటర్ రింగ్‌రోడ్డు 200 కిలోమీటర్ల పరిధిలోనూ మరో రెండు దశల్లో నిర్మాణం ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు రాజధానికి భూ సమీకరణ ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధానికి భూములిచ్చే రైతుల రుణమాఫీని (కుటుంబానికి గరిష్టంగా రూ.1.50లక్షలు) ఏకకాలంలో మాఫీ చేస్తామన్నారు. ఇందుకోసం 22,405 మంది లబ్ధిదారులకు రూ.200 కోట్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పారు. భూ సమీకరణకు సంబంధించిన బిల్లును త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. లాటరీ పద్ధతిలో స్థలాల కేటాయింపు రైతులు ప్రభుత్వానికి భూములు అప్పగించిన వెంటనే చట్టబద్ధమైన రసీదు ఇస్తామని, ఆ తర్వాత 9 నెలల్లో భూ సమీకరణయాజమాన్య ధ్రువపత్రాలను (ల్యాండ్ పూలింగ్ ఓనర్షిప్ సర్టిఫికెట్ - ఎల్పీఓసీ) ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ‘రైతులు భూములు ఇచ్చిన నాటినుంచి మూడేళ్లలో అభివృద్ధి చేసిన భూములు వారికిస్తాం. రైతులు ఇచ్చే భూములు ఏ ప్రాంతమైతే (మెట్ట, జరీబు (ఏటా మూడు పంటలు పండే సారవంతమైన భూములు) అదే ప్రాంతంలో ప్లాట్లు ఇస్తాం. భూములిచ్చిన రైతులకు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, నాలా ఫీజులు, మౌలిక వసతుల అభివృద్ధి ఫీజు తదితరాలు ఉండవు. అయితే ఇవి వన్‌టైమ్ సెటిల్మెంట్ (ఒకసారి అమ్మడం లేదా కొనడం) వరకే వర్తిస్తాయి. రైతులకు నివాస, వాణిజ్య స్థలాలను వారి భూములను బట్టి ఆయా కేటగిరీల వారీగా లాటరీ పద్ధతి ద్వారా కేటాయిస్తాం. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న భూములకు భూ సమీకరణ యాజమాన్య ధ్రువపత్రాలను ఆ దేవాలయాలకే అందజేస్తాం. రైతులకు ఇచ్చే ప్యాకేజీ తరహాలోనే దేవాలయాలకూ పరిహారం ఉంటుంది. అసైన్ట్ భూములకు కూడా మెట్ట, జరీబు భూములుగా విభజించి, పదేళ్ల పాటు పట్టా రైతులకు ఇచ్చినట్టే పరిహారం ఇస్తాం..’ వివరించారు. ఇక్కడ కోల్పోయే పంట దిగుబడిని ఏవిధంగా భర్తీ చేస్తారన్న ప్రశ్నకు.. ఈ ప్రాంతాన్ని డ్రాట్ ప్రూఫ్ (కరువు రహిత) ప్రదేశంగా మారుస్తానంటూ చంద్రబాబు ముక్తాయింపునిచ్చారు. భూసమీకరణ ప్రాంతంలో భూములకు నష్టపరిహారం పొందని లేదా భూమిలేని సుమారు 12 వేల కుటుంబాలకు (ఇందులో కౌలుదారులున్నారు) నెలకు రూ. 2500 చొప్పున పదేళ్ల పాటు రాజధాని సామాజిక భద్రతా నిధి (క్యాపిటల్ రీజియన్ సోషల్ సెక్యూరిటీ ఫండ్) కింద చెల్లింపులు చేస్తామన్నారు. ‘రైతు కూలీలకు వృత్తినైపుణ్య శిక్షణనిస్తాం. శిక్షణా కాలంలో స్టైఫండ్ ఇస్తాం. అనంతరం ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలకు అవకాశం ఇస్తాం. ఇక కూలీలకు 365 రోజులూ పని ఉండేలా చూస్తాం. ఇళ్లు లేని వారికి ఉచితంగా ఇళ్లు ఇస్తాం. రహదారుల విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారికీ కొత్తగా ఇళ్లు కేటాయిస్తాం. ఈ ప్రాంతంలో 2014 డిసెంబర్ 8 నాటికి స్థానికంగా నివాసం ఉన్న వారికి ఉచితంగా విద్య, వైద్యం అందిస్తాం. వృద్ధుల కోసం ఆశ్రమాలు, ఎన్టీఆర్ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం..’ అని చెప్పారు. సమీకరణ చేస్తున్న ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్లు యథావిధిగా కొనసాగుతాయని సీఎం అన్నారు. సీఆర్డీఏ చట్టం వచ్చాక నిబంధనల మేరకే రిజిస్ట్రేషన్లు ఉంటాయని పేర్కొన్నారు. చిన్న సన్నకారు రైతులు.. అంటే ఎకరా రెండెకరాల పొలం ఉన్న రైతులు ఒక్కరు లేదా గ్రూపుగా కలిసి ఒకే చోట భూమి కావాలన్నా ఇస్తామని అన్నారు. గ్రామ కంఠంలోని ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించేందుకు త్వరలోనే ధ్రువపత్రాలను జారీ చేస్తామని చెప్పారు. దొంగలు కోర్టుకెళతారు బాబు వివాదాస్పద వ్యాఖ్యలు రాజధాని కోసం భూ సమీకరణను వ్యతిరేకిస్తూ కొందరు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారన్న ప్రశ్నకు తీవ్రంగా స్పందిస్తూ.. చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతులను దొంగలతో పోల్చారు. భూ సమీకరణపై కొందరు రైతులు కోర్టును ఆశ్రయిస్తున్నారనీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇప్పటికే నోటీసులు జారీ చేసిందన్న విషయాన్ని విలేకరులు గుర్తుచేయగా.. ‘చాలామంది ఎర్రచందనం దొంగలు కూడా కోర్టుకు వెళ్లారు కదా! ఏం చేశారు. ఇది కూడా అలాగే ఉంటుంది..’ అని ముఖ్యమంత్రి జవాబిచ్చారు. రాజధాని కోసం భూములు ఇవ్వలేమని రైతులు ఎవరైనా అంటే వారిపై చట్టపరంగా చర్యలుంటాయని హెచ్చరించారు. భూ సేకరణ ద్వారా తీసుకోవలసిన వస్తుందని స్పష్టం చేశారు. రాజధాని రావడం ఇష్టం లేని కొన్ని రాజకీయ పార్టీలు అక్కడికెళ్లి మొసలి కన్నీళ్లు కారుస్తున్నాయని, మరికొంతమంది దీనిపై రాజకీయాలు చేయాలని చూశారని, వాటిని పట్టించుకోమని అన్నారు. ప్రభుత్వోద్యోగాలు ఇవ్వలేం రాజధాని ప్రాంతానికి భూములిచ్చిన రైతులకు గానీ, కౌలుదారులకు గానీ, రైతు కూలీలకు గానీ ఎలాంటి ప్రభుత్వోద్యోగాలు ఇవ్వలేమని చంద్రబాబు స్పష్టం చేశారు. అవసరమైతే నైపుణ్య శిక్షణ (స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ)నిచ్చి వారికి ప్రైవేటు ఉద్యోగాల్లో ప్రాధాన్యతనిస్తామని అన్నారు. ఈ ఆరు నెలల్లో మీ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని విలేకరులు అడగ్గా.. నిద్రపోయే సమయం మినహా మిగతా సమయాన్నంతా ప్రజల కోసమే వెచ్చించానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తిచేస్తానని అన్నారు. చంద్రబాబు చెప్పిన మరికొన్ని ముఖ్యాంశాలు.. - నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఒక ము ఖ్య భవనానికి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు (దివంగత మాజీ మంత్రి) పేరు పెడతాం - ప్రస్తుతం ఈ భూముల్లో టేకు చెట్లు ఉన్నాయి. వాటిని రైతులే అమ్ముకోవచ్చు - నిమ్మ, సపోట, జామ తోటల రైతులకు ఎకరానికి ఏకమొత్తంగా రూ.50 వేలు అదనంగా ఇస్తాం - పేద కుటుంబాల వారు స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకునేందుకు రూ.25 లక్షల వరకు వడ్డీలేని రుణాలు - ప్రస్తుతం ఉన్న పంటలకు సంబంధించి తుది ఫలసాయం పొందేందుకు అనుమతి. తదుపరి పంటకు వీలుండదు - భూ యజమానుల జాబితాను బహిరంగంగా ప్రకటిస్తాం. సవరణలు స్వీకరించి తుది జాబితా ప్రకటిస్తాం - భూములిచ్చిన రైతులకు క్యాపిటల్ గెయిన్స్, ఆదాయ పన్నుల మినహాయింపు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తాం - భూములిచ్చిన రైతులు వారి ప్లాట్లను మూడేళ్ల వరకు ఆగాల్సిన పనిలేకుండా ముందే అయినా అమ్ముకోవచ్చు - డబ్బు ఉన్న రైతులకు పారిశ్రామికవేత్తలుగా శిక్షణనిస్తాం.