Automobile companies
-
పండుగ సీజన్‌పై భారీ ఆశలు
న్యూఢిల్లీ: పండుగ సీజన్‌పై ఆటోమొబైల్ కంపెనీలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. ఇటీవల అమ్మకాలు మందగించినప్పటికీ వినియోగదారుల సెంటిమెంటు మెరుగుపడి, మిగతా ఏడాదంతా అమ్మకాలు పుంజుకుంటాయని భావిస్తున్నాయి. ఏటా పండుగ సీజన్ సాధారణంగా ఓనంతో ప్రారంభమై దీపావళితో ముగుస్తుంది. గతేడాదితో పోలిస్తే ఈసారి 3–4 నెలలుగా విక్రయాలు నెమ్మదించాయని కియా ఇండియా నేషనల్ హెడ్ (సేల్స్, మార్కెటింగ్) హర్దీప్ సింగ్ బ్రార్ తెలిపారు. అయితే, గత కొద్ది నెలలుగా కొంత డిమాండ్ పేరుకున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి మార్కెట్ మెరుగుపడగలదని ఆశిస్తున్నట్లు వివరించారు. సెప్టెంబర్‌లో బుకింగ్స్ పుంజుకున్నాయని, అక్టోబర్‌లోనూ ఇదే ధోరణి కొనసాగే సంకేతాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ‘ఈసారి పండుగలన్నీ కూడా అక్టోబర్‌లోనే ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు 5–10 శాతం వృద్ధి చెందుతాయని అంచనా వేస్తున్నాం‘ అని బ్రార్ వివరించారు. జనవరి–ఏప్రిల్ మధ్య కాలంలో ప్యాసింజర్ వాహనాల పరిశ్రమ 7 శాతం వృద్ధి చెందగా, మే–సెప్టెంబర్ వ్యవధిలో 2–3 శాతం మేర తగ్గింది. దీంతో నిల్వలు పేరుకుపోయాయి. కఠిన పరిస్థితులు.. మూడు, నాలుగు నెలలుగా పరిశ్రమ కఠిన పరిస్థితులు ఎదుర్కొంటోందని, పండుగ సీజన్లో కొంత ఊరట లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు నిస్సాన్ మోటర్ ఇండియా ఎండీ సౌరభ్ వత్స తెలిపారు. ‘ఈ త్రైమాసికం ఎలా ఉండబోతోందనేది పండుగ సీజన్‌ను బట్టి తెలుస్తుంది. అలాగే మూడో త్రైమాసికాన్ని బట్టి మిగతా సంవత్సరం ఎలా ఉండబోతోందనేది తెలుస్తుంది‘ అని ఆయన పేర్కొన్నారు. అందుకే అంతా పండుగ సీజన్ విషయంలో ఆతృతగా ఉన్నట్లు వివరించారు. మరోవైపు, షోరూమ్‌లను సందర్శించే వారు, వాహనాల కోసం ఎంక్వైరీ చేసే వారు క్రమంగా పెరుగుతున్నారని టయోటా కిర్లోస్కర్ మోటర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్, సరీ్వస్, యూజ్డ్ కార్ వ్యాపార విభాగం) శబరి మనోహర్ తెలిపారు. పెరుగుతున్న డిమాండ్‌కి అనుగుణంగా కార్యకలాపాల నిర్వహణ కూడా మెరుగుపర్చుకున్నట్లు, మూడో షిఫ్ట్‌ను ప్రవేశపెట్టడం మొదలైనవి చేసినట్లు ఆయన చెప్పారు. బాగా డిమాండ్ ఉన్న అర్బన్ క్రూయిజర్ హైరైడర్ లాంటి మోడల్స్ సరఫరాను పెంచడంతో వెయిటింగ్ పీరియడ్ తగ్గుతోందని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా పర్యావరణ అనుకూల టెక్నాలజీ ఉన్న వాహనాలపై ఆసక్తి పెరుగుతోందని మనోహర్ పేర్కొన్నారు. లిమిటెడ్ ఎడిషన్లు.. కొత్తగా లిమిటెడ్ ఎడిషన్ మోడల్స్‌ను ప్రవేశపెట్టడం ద్వారా విక్రయాలు పెంచుకునేందుకు ప్రయతి్నస్తున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, సేల్స్) పార్థో బెనర్జీ తెలిపారు. వినాయక చవితి, జన్మాష్టమి సందర్భంగా అమ్మకాలు పుంజుకున్నాయని పేర్కొన్నారు. సెపె్టంబర్ ఆఖరు నాటికి తమ వాహన విక్రయాలు మరింతగా పెరిగాయని, మిగతా సీజన్లోను ఇదే సానుకూల ధోరణి కనిపించే అవకాశాలు ఉన్నాయని టాటా మోటర్స్ ఎండీ శైలేష్ చంద్ర చెప్పారు. -
ఎస్యూవీ.. కూపే అవతార్!
కుర్ర’కారు’ టాప్‌గేర్‌లో దూసుకెళ్తున్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ).. ఆటోమొబైల్ కంపెనీలకు కూడా గత కొన్నేళ్లుగా కాసులు కురిపిస్తున్నాయ్. అయితే, కస్టమర్ల మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఈ ఎస్‌యూవీల షేపు, స్టయిల్, డిజైన్‌లో శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ‘ఎస్యూవీ కూపే’ పేరుతో కొత్త సెగ్మెంట్నుక్రియేట్ చేయడం ద్వారా అమ్మకాల గేరు మార్చేందుకు పోటీ పడుతున్నాయి వాహన దిగ్గజాలు. దేశంలో అమ్ముడవుతున్న కార్లలో దాదాపు 55 శాతం వాటా ఎస్‌యూవీలదే కావడం వాటి క్రేజ్‌కు నిదర్శనం. అయితే, కొద్ది నెలలుగా డిమాండ్ కాస్త మందగించడంతో సరికొత్త లుక్‌తో ఆకట్టుకునేందుకు వాహన కంపెనీలు వాటికి కొత్తదనాన్ని జోడిస్తున్నాయి. మిడ్‌సైజ్ ఎస్యూవీ విభాగంలో ఎస్యూవీ కూపేలు ఇప్పుడు నయా ట్రెండ్. టాటా మోటార్స్ ‘కర్వ్’ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కూపేను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులోనే తాజాగా పెట్రోల్, డీజిల్ మోడల్‌ను కూడా తెచి్చంది. ఇక ఫ్రెంచ్ ఆటో దిగ్గజం సిట్రాన్ ఎస్యూవీ కూపే ‘బసాల్ట్’ను బరిలోకి దించింది. దీని రేటు, డిజైన్ కూడా ఊరించేలా ఉంది. త్వరలోనే మహీంద్రా తన పాపులర్ మోడల్ ఎక్స్‌యూవీ 700లో కూపే మోడల్‌ను విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నట్లు టాక్. మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్యూవీ కూపే కూడా క్యూలో ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా మార్కెట్లోకి వచి్చన టాటా, సిట్రాన్ కూపే ఎస్‌యూవీలకు కస్టమర్ల రెస్పాన్స్ అదిరిపోవడంతో ఇతర కంపెనీలూ ఈ సెగ్మెంట్‌పై ఫోకస్ పెంచాయి. ఫోక్స్‌వ్యాగన్, రెనో సైతం భారత్ మార్కెట్ కోసం కూపే ఎస్వీయూలను రెడీ చేస్తున్నాయట! ప్రీమియం లుక్, లగ్జరీ కార్లతో పోలిస్తే చాలా తక్కువ ధరల్లో కూపే మోడల్‌ను కోరుకునే వారిని ఈ ఎస్యూవీ కూపేలతో టార్గెట్ చేయాలనేది కార్ల కంపెనీల ప్లాన్. అమ్మకాల్లో వాటిదే హవా... ఇప్పుడు ఎక్కడ చూసినా ఎస్‌యూవీల హవాయే నడుస్తోంది. హైఎండ్ లగ్జరీ ఎస్వీయూల రేటు భారీగా ఉండటంతో కస్టమర్లకు అదే లుక్కు, ఫీచర్లతో రూ. 10–20 లక్షల ధరలో దొరుకుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ఫుల్ గిరాకీ ఉంటోంది. ఈ మిడ్‌సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లో హ్యుందాయ్ క్రెటా, మారుతీ గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, కియా సెల్టోస్, ఫోక్స్‌వ్యాగన్ టైగున్, హోండా ఎలివేట్, స్కోడా కుషక్, ఎంజీ ఆస్టర్, సిట్రాన్ సీ3 ఎయిర్‌క్రాస్ వంటివి హాట్ కేకుల్లా సేల్ అవుతున్నాయి. మరోపక్క, చిన్నకారు కొనే యోచనలో ఉన్నవారిని సైతం ఊరించే విధంగా రూ. 10 లక్షల స్థాయిలో సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీలను తీసుకొచ్చి మార్కెట్‌ను విస్తరించాయి కార్ల కంపెనీలు. మారుతీ బ్రెజా, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, నిస్సాన్ మాగ్నెట్, రెనో కైగర్, టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్, టయోటా ట్రైసర్ వంటివి సబ్‌కాంపాక్ట్ సెగ్మెంట్లో బాగా అమ్ముడవుతున్న మోడల్స్. గత రెండు మూడేళ్లుగా ఈ రెండు విభాగాల్లో పోటీ పెరిగిపోవడంతో.. ఇప్పుడు ఎస్యూవీ కూపేతో జెన్ జెడ్‌తో పాటు యువ కస్టమర్లను ఆకట్టుకోవాలనేది కార్ల కంపెనీల కొత్త వ్యూహం. ఇప్పటికే లగ్జరీ కూపే కార్లున్నాయ్..మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్, ల్యాండ్‌రోవర్, పోర్షే, బీఎండబ్ల్యూ తదితర లగ్జరీ కార్ల దిగ్గజాలు ఇప్పటికే కూపే ఎస్‌యూవీలను మన మార్కెట్లో విక్రయిస్తున్నాయి. అయితే, వీటి లుక్కు, డిజైన్లాగే ధర కూడా ‘టాప్’లేపేలా ఉంటుంది. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న ఎస్యూవీ కూపేల్లో బీఎండబ్ల్యూ ఎక్స్4 రేటే చాలా తక్కువ. ఎంతంటే జస్ట్ రూ. 96 లక్షలే! (ఎక్స్ షోరూమ్) అ‘ధర’పోయింది కదూ! అందుకే అచ్చం అలాంటి డిజైన్లోనే హాట్ సెల్లింగ్ మిడ్–ఎస్యూవీ రేంజ్‌లోనే ఈ స్టయిలిష్ కూపేలను ప్రవేశపెట్టడం ద్వారా కస్టమర్లకు మరింత వైవిధ్యాన్ని అందించేందుకు వాహన కంపెనీలన్నీ క్యూ కడుతున్నాయి. గతేడాది మొత్తం కార్ల అమ్మకాల్లో 16 శాతం వాటా మిడ్–ఎస్‌యూవీలదే కావడం విశేషం!ఎస్యూవీ కూపే అంటే... ప్రస్తుతం బాగా ప్రాచుర్యంలో ఉన్న ఎస్‌యూవీలన్నీ దాదాపు బాక్స్ ఆకారంలో రగ్గ్డ్ లుక్‌తోనే ఉంటున్నాయి. బలిష్టమైన బాడీ, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, ఆఫ్‌రోడ్ సామర్థ్యం, ఎత్తుగా, స్పోర్ట్స్ లుక్ కూడా ఉండటంతో ఎస్‌యూవీలు మార్కెట్‌ను కొల్లగొడుతూనే ఉన్నాయి. కస్టమర్లకు హాట్ ఫేవరెట్‌గా మారాయి. అయితే, లగ్జరీ స్పోర్ట్స్ కూపే కార్లలోని స్లీక్ డిజైన్‌ను, ఎస్‌యూవీల్లోని రగ్గ్డ్ లుక్‌ను కలగలిపినవే ఈ కూపే ఎస్‌యూవీలు. దీనిలోని ప్రత్యేకత ఏంటంటే, ముందువైపు చూస్తే చాలా భారీగా ఎస్యూవీ స్టయిల్లోనే కనిపిస్తుంది. వెనక్కి వెళ్లే కొద్దీ రూఫ్‌లైన్ బాగా ఏటవాలుగా వంగి కూపే లుక్‌తో ఉంటుంది. ఇతర ఫీచర్లన్నీ ఎస్యూవీ మాదిరే ఉంటాయి. చాలావరకు లగ్జరీ కార్లలో ఇలాంటి డిజైన్‌ను మనం చూడొచ్చు. కస్టమర్లు సాధారణ బాక్స్ డిజైన్ కంటే స్పోర్ట్ లుక్‌తో ఉండే లైఫ్‌స్టయిల్ ఎస్‌యూవీలకే మొగ్గు చూపుతుండటంతో ఎస్యూవీ కూపే క్రాసోవర్లకు ఆదరణ పెరుగుతోంది. దీంతో లగ్జరీ, కాంపాక్ట్, సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీలకు తోడుగా బడ్జెట్ ధరల్లో కూపే ఎస్యూవీ సెగ్మెంట్‌తో దుమ్మురేపేందుకు కంపెనీలు సై అంటున్నాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
కొత్త ఈవీలపై ఆటో కంపెనీల కసరత్తు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) సంబంధించి కేంద్రం కొత్త విధానం ప్రకటించిన నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు రాబోయే రోజుల్లో మరిన్ని విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టడంపై దృష్టి పెడుతున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటర్స్ మొదలైన దిగ్గజాలు డిమాండ్‌కి అనుగుణంగా కొత్త మోడల్స్‌పై కసరత్తు చేస్తున్నాయి. 2025 జనవరితో మొదలుపెట్టి.. రాబోయే రోజుల్లో అయిదు బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా సీఈవో (ఆటోమోటివ్ విభాగం) నళినికాంత్ గొల్లగుంట తెలిపారు. తమ వినూత్నమైన ఇన్గ్లో ప్లాట్‌ఫాంపై ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. 2027 నాటికి తమ పోర్ట్‌ఫోలియోలో 20–30 శాతం వాటా విద్యుత్ వాహనాలదే ఉండగలదని నళినికాంత్ వివరించారు. మరోవైపు, తాము కూడా ఈవీలపై గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా ఈడీ (కార్పొరేట్ అఫైర్స్) రాహుల్ భారతి తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 550 కిలోమీటర్ల రేంజ్ ఉండే అధునాతన ఈవీ ఉత్పత్తిని ప్రారంభిస్తామని, 7–8 ఏళ్లలో ఆరు ఈవీ మోడల్స్‌ను ఆవిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలు, చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి భారత్‌లో హైబ్రీడ్–ఎలక్ట్రిక్, సీఎన్జీ, బయో–సీఎన్జీ, ఇథనాల్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వంటి మరెన్నో టెక్నాలజీలు అవసరమని రాహుల్ తెలిపారు. అటువంటి సాంకేతికతలపై కూడా తాము పని చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. పదేళ్లలో హ్యుందాయ్ రూ. 26 వేల కోట్లు .. 2030 నాటికి భారత ఆటోమోటివ్ మార్కెట్లో ఈవీల వాటా 20 శాతంగా ఉంటుందని పరిశ్రమ అంచనా వేస్తున్నట్లు హ్యుందాయ్ మోటర్ ఇండియా సీవోవో తరుణ్ గర్గ్ తెలిపారు. ఈవీలు క్రమంగా ప్రధాన స్థానాన్ని దక్కించుకోవచ్చన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే పదేళ్లలో తమిళనాడులో రూ. 26,000 కోట్ల మేర హ్యుందాయ్ ఇన్వెస్ట్ చేయనుంది. హ్యుందాయ్ ఇప్పటికే కోనా, అయోనిక్ 5 పేరిట ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోంది. 10 ఈవీలపై టాటా దృష్టి.. 2026 నాటికి పది ఎలక్ట్రిక వాహనాలను ప్రవేశపెట్టాలని నిర్దేశించుకున్నట్లు టాటా మోటర్స్ తెలిపింది. కర్వ్ ఈవీ, హ్యారియర్ ఈవీతో పాటు కంపెనీ ఈ ఏడాది మరో నాలుగు ఈవీలను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. మరోవైపు తాము ఈ ఏడాది 12 కొత్త వాహనాలను ప్రవేశపెట్టనుండగా, వాటిలో మూడు .. బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు ఉండనున్నట్లు మెర్సిడెస్ బెంజ్ తెలిపింది. 2030 నాటికి భారత్‌లో తమ ఆదాయంలో 50 శాతం భాగం ఎలక్ట్రిక్ వాహనాలదే ఉండగలదని అంచనా వేస్తున్నట్లు ఆడి ఇండియా తెలిపింది. ప్రస్తుతం కంపెనీ నాలుగు ఎలక్ట్రిక్ మోడల్స్‌ను దేశీయంగా విక్రయిస్తోంది. అమ్మకాల లక్ష్యాన్ని చేరుకునేందుకు మరిన్ని ఉత్పత్తులను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. -
కార్ల ధరలకు రెక్కలు!
ముంబై: ద్రవ్యోల్బణం, కమోడిటీ ధరలు పెరగడంతో వ్యయ ఒత్తిళ్లు అధికమవుతున్నందున ఆటో కంపెనీలు తమ వాహన ధరలు పెంచేందుకు సిద్ధమయ్యాయి. మారుతీ సుజుకీ, మహీంద్రా–మహీంద్రా, ఆడి ఇండియా, టాటా మోటార్స్ అండ్ మెర్సిడస్ బెంజ్ సంస్థలు తమ కార్ల ధరల్ని వచ్చే ఏడాది జనవరి నుంచి పెంచుతున్నట్లు ప్రకటించాయి. నిర్వహణ, ముడి సరుకుల వ్యయాలు పెరిగిన నేపథ్యంలో ధరలు పెంచాలకుంటున్నామని మారుతీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. అయితే ధరల పెంపు ఎంతమేర అనేది మాత్రం ఇంకా నిర్ణయించుకోలేదని, కొన్ని మోడళ్లపై ధరల పెంపు గణనీయంగా ఉండొచ్చన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ వాహన ధరలు 2.4% మేర పెరిగాయి. ► జనవరి 1 నుంచి వాహన ధరలు పెంచుతామని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. ధరల పెంపు ఎంతమేర ఉంటుందనేది త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. ►పెంపు జాబితాలో టాటా మోటార్స్ సైతం చేరింది. వచ్చే ఏడాది తొలి నెల నుంచి ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వాహన ధరల్ని పెంచే యోచనలో ఉన్నట్లు కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. ఎంతమేర అనేది మాత్రం వెల్లడించలేదు. ► జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా కూడా వచ్చే ఏడాది జనవరి నుంచి ధరలు పెంచేందుకు సమాయత్తమవుతోంది. సప్లై చైన్ సంబంధిత ఇన్పుట్, నిర్వహణ వ్యయాలు పెరిగిన నేపథ్యంలో వాహన ధరలను రెండు శాతం మేర పెంచుతున్నట్లు తెలిపింది. ‘‘సంస్థతో పాటు డీలర్ల మనుగడ కోసం పెంపు నిర్ణయం తప్పలేదు. కస్టమర్లపై ధరల భారం వీలైనంత తక్కువగా ఉండేలా చూస్తాము’’ అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ దిల్లాన్ తెలిపారు. -
WeareHiring రూటు మార్చిన ఆటోమేకర్స్: క్యాంపస్ ఇంటర్వ్యూల్లో భారీ నియామకాలు
న్యూఢిల్లీ: ప్రతిభావంతులైన యువ సిబ్బందిని రిక్రూట్ చేసుకునే క్రమంలో ఆటోమొబైల్ కంపెనీలు గతంలో ఎన్నడూ లేనంతగా ఇంజినీరింగ్ కాలేజీలు, బిజినెస్ స్కూల్స్ మీద దృష్టి పెడుతున్నాయి. దీంతో గౌహతి, మండీ లాంటి ప్రాంతాల్లోని ఐఐటీల్లో (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) క్యాంపస్ రిక్రూట్మెంట్లు ఈసారి గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్యాసింజర్ కార్ల మార్కెట్లలో ఒకటిగా భారత్ ఎదుగుతున్న నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు వివిధ విభాగాల్లో ప్రతిభావంతులను మరింతగా నియమించు కోవడంపై దృష్టి సారిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇంజినీరింగ్, ఎల్రక్టానిక్స్, ప్రోడక్ట్ డెవలప్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ విభాగాల్లో హైరింగ్‌ను పెంచుకుంటున్నట్లు వివరించాయి. అనలిటిక్స్, ఎలక్ట్రిఫికేషన్, ఇండస్ట్రీ 5.0 నైపుణ్యాలు ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నాయి. 2024 బ్యాచ్ నుంచి మేనేజ్మెంట్, గ్రాడ్యుయేట్ ట్రైనీలను తీసుకోవాలని జర్మనీ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ భావిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి 15-20శాతం ఎక్కువమందిని తీసుకోబోతున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. క్యాంపస్ నుంచి రిక్రూట్ చేసుకున్న వారికి కొత్త టెక్నాలజీలు, ప్లాట్‌ఫాంలపై తగు శిక్షణ ఇచ్చి భవిష్యత్ అవసరాల కోసం సిద్ధం చేసుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే డేటా అనలిటిక్స్ తదితర విభాగాల్లో నైపుణ్యాలున్న వారిని రిక్రూట్ చేసుకునే ప్రక్రియ కూడా ప్రారంభించింది. డేటా మైనింగ్ తదితర సాంకేతికతలతో ఈ–కామర్స్ చానల్స్‌ను అభివృద్ధి చేసేందుకు, బ్యాక్–ఎండ్ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేసేందుకు వీరిని వినియోగించుకోవాలనేది కంపెఈ యోచన. మారుతీ కూడా.. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు అమ్మకాల ఊతంతో భవిష్యత్ అవసరాల కోసం నియామకాలను మరింతగా పెంచుకునేందుకు మారుతీ సుజుకీ కూడా సన్నద్ధమవుతోంది. వ్యాపార విస్తరణకు అనుగుణంగా క్యాంపస్ నుంచి నియామకాలను కూడా పెంచుకుంటున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది క్యాంపస్‌ల నుంచి 1,000 మంది వరకూ సిబ్బందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు పేర్కొన్నాయి. సంస్థలో అంతర్గతంగా కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టడం, డిజిటల్ పరివర్తన మొదలైన వాటిని వేగంగా అమలు చేస్తున్నామని, ఇందుకోసం తత్సంబంధ నైపుణ్యాలున్న ప్రతిభావంతుల అవసరం చాలా ఉంటోందని వివరించాయి. (యూట్యూబ్ వీడియో లైక్ చేస్తే..రోజుకు రూ. 8వేలు: కట్ చేస్తే!) మరోవైపు, మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఇటీవలే తమ క్యాంపస్ హైరింగ్‌ల జాబితాలో మరిన్ని కొత్త ఐఐటీలు, ఎంబీయే సంస్థలను కూడా చేర్చింది. 2022లో దాదాపు 50 పైగా ఇంజినీరింగ్, ఎంబీఏ సంస్థల నుంచి మహీంద్రా ఎంట్రీ లెవెల్ సిబ్బందిని తీసుకుంది. సగటున 500-600 మందిని రిక్రూట్ చేసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అటు హీరో మోటోకార్ప్ సంస్థ డిప్లొమా ఇంజినీర్ల నియామకం కోసం ఢిల్లీ స్కిల్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ యూనివర్సిటీతో జట్టు కట్టింది. క్రితం సంవత్సరంతో పోలిస్తే తాము 40 శాతం ఎక్కువ మందిని క్యాంపస్ నుంచి రిక్రూట్ చేసుకున్నట్లు సంస్థ ప్రతినిధులు వివరించారు. వీరిలో ఎక్కువగా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకాట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్లు, ఎంబీఏలు ఉన్నట్లు పేర్కొన్నారు. కొరియా దిగ్గజం హ్యుందాయ్ మోటార్ భారత్‌లో తన కార్యకలాపాల కోసం వివిధ విభాగాల్లో, హోదాల్లో 1,000 పైగా ఉద్యోగాలను భర్తీ చేసే యత్నాల్లో ఉంది. క్యాంపస్‌ల విషయానికొస్తే.. ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ నేపథ్యం ఉన్నవారికి ప్రాధాన్యం లభించనుంది. (టీ స్టాల్ కోసం ఐఏఎస్ డ్రీమ్‌ను వదిలేశాడు: ఏకంగా ఏడాదికి రూ. 150 కోట్లు) క్యాంపస్‌లలోనూ ఆసక్తి.. ఆటోమొబైల్ కంపెనీల నియామకాల ప్రణాళికలపై క్యాంపస్‌లలో కూడా ఆసక్తి నెలకొంది. ఐఐటీ–గౌహతిలో గతేడాదితో పోలిస్తే ఈసారి కోర్ ఇంజినీరింగ్ నైపుణ్యాలున్న వారికి ఆఫర్లు గణనీయంగా పెరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కోర్ ఇంజినీర్, డిజైన్ ఇంజినీర్, బిజినెస్ అనలిస్ట్, డేటా ఇంజినీర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్ తదితరుల కోసం డిమాండ్ నెలకొన్నట్లు పేర్కొన్నాయి. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి తమ దగ్గర నుంచి రిక్రూట్ చేసుకునే ఆటోమొబైల్ కంపెనీల సంఖ్య పెరిగినట్లు ఐఐటీ-మండీ వర్గాలు తెలిపాయి. కోవిడ్‌పరమైన మందగమనం ప్రభావం తగ్గడం ఇందుకు కారణం కావచ్చని భావిస్తున్నట్లు వివరించాయి. -
ఎలక్ట్రిక్ బైక్ నడుపుతున్నారా?.. ఓలా సంస్థ కీలక నిర్ణయం.. ఉచితంగా!
ప్రముఖ ఎలక్ట్రిక్ సంస్థ ఓలా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఆ సంస్థకు చెందిన స్కూటర్లలలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో పాటు, అగ్నికి ఆహుతైన ఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఎస్1 ఈవీ వెహికల్స్‌లో ఫ్రంట్ ఫోర్క్ ఉన్నట్టుండీ విరిగిపోవడంతో వాహనదారులు స్వల్పంగా గాయపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ తరుణంలో ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫ్రంట్ ఫోర్క్‌లో ఏదైనా అసౌకర్యంగా ఉంటే ఫ్రీగా అప్‌గ్రేడ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. మార్చి 22 నుంచి అప్ గ్రేడ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. అపాయింట్మెంట్ బుక్ చేసుకునేందుకు తామే కస్టమర్లను సంప్రదిస్తామని ఓలా తన అధికారిక ప్రకటనలో పేర్కొంది. Important update about your Ola S1! pic.twitter.com/ca0jmw1BsA — Ola Electric (@OlaElectric) March 14, 2023 -
‘ఆటో’కు తీరని చిప్ చిక్కులు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో వాహనాల పరిశ్రమకు మొదలైన సెమీ కండక్టర్ల కష్టాలు ఇంకా పూర్తిగా తీరలేదు. గతంతో పోలిస్తే తీవ్రత కొంత తగ్గినా ఇప్పటికీ చిప్‌ల కొరత వెన్నాడుతూనే ఉంది. దీంతో ఆర్డర్లు పుష్కలంగా ఉన్నా ఆటోమొబైల్ కంపెనీలు ఉత్పత్తిని పెంచుకోలేకపోతున్నాయి. ఫలితంగా పెండింగ్ ఆర్డర్లు పేరుకుపోతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆటోమొబైల్ కంపెనీలు దాదాపుగా ఇవే విషయాలను ప్రస్తావించాయి. రెండో త్రైమాసికంతో పోలి స్తే మూడో క్వార్టర్లో పరికరాల సరఫరాపరమైన సమస్య స్వల్పంగా పెరిగిందని మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐఎల్) పేర్కొంది. క్యూ3లో దా దాపు 46,000 వాహనాలను ఉత్పత్తి చేయలేకపోయినట్లు తెలిపింది. ఎలక్ట్రానిక్ పరికరాల లభ్యతపై స్పష్టత లేకపోవడంతో ఉత్పత్తి ప్రణాళికలు వేసుకోవడం సవాలుగా మారిందని ఎంఎస్ఐఎల్ వివరించింది. దీనితో మూడో త్రైమాసికం ఆఖరు నాటికి 3,63,000 వాహనాల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయని.. వీటిలో 1,19,000 ఆర్డర్లు ఇటీవల ప్రవేశపెట్టిన మోడల్స్వే ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. అదే పరిస్థితిలో మరిన్ని సంస్థలు .. మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) కూడా దాదాపు ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది. కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం తెలంగాణ, మహారాష్ట్రలో దాదాపు రూ. 11,000 కోట్లతో పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించినప్పటికీ ప్రస్తుతమున్న ప్లాంట్ల సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థల్లో ఆటంకాలే ఇందుకు కారణమని కంపెనీ ఈడీ రాజేశ్ జెజూరికర్ వెల్లడించారు. స్కార్పియో, ఎక్స్‌యూవీ700 వంటి వాహనాల తయారీలో దాదాపు 200 రకాల సెమీకండక్టర్ చిప్స్ అవసరమవుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఎంఅండ్ఎం వద్ద 2,66,000 వాహనాలకు ఆర్డర్లు ఉన్నాయి. ఇక చిప్లపరమైన సవాళ్లు 2023లో కూడా కొనసాగవచ్చని జేఎల్ఆర్ పేర్కొంది. చిప్‌ల సరఫరాను మెరుగుపర్చుకునే దిశ గా మంచి పురోగతే సాధించామని .. అయినప్పటికీ కొన్ని సవాళ్లు నెలకొన్నాయని తెలిపింది. చైనాలో మళ్లీ కోవిడ్ ప్రబలడం, మార్కెట్లో అధిక రేట్లకు చిప్‌లు కొనాల్సి వస్తుండటం తదితర సవాళ్లు ఉన్న ట్లు వివరించింది. 2023లో డిమాండ్ సానుకూలంగానే ఉంటుందని భావిస్తున్నామని అయితే వాహనాలను ఎంత మేరకు అందించగలమనేది చిప్‌ల సరఫరా అంశమే నిర్దేశిస్తుందని స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ఎండీ పియుష్ ఆరోరా తెలిపారు. -
ఎలక్ట్రిక్ వెహికిల్స్ వాటా యూఎస్‌లో 63 శాతం, మరి భారత్‌లో ఎంతో తెలుసా?
ముంబై: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విక్రయాలు 2030 నాటికి భారత్‌లో 2.2 కోట్ల యూనిట్లకు చేరతాయని రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ నివేదిక వెల్లడించింది. అందుబాటు ధరలో రవాణా సౌకర్యాలకు డిమాండ్, కర్బన ఉద్గారాలను తగ్గించే లక్ష్యం ఇందుకు కారణమని వివరించింది. ‘2022లో దేశంలో జరిగిన మొత్తం వాహన విక్రయాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ వాటా కేవలం 3 శాతమే. అదే యూఎస్‌లో అయితే ఈవీల వాటా ఏకంగా 63 శాతం, చైనాలో 56 శాతం ఉంది. పెట్రోల్‌తో పోలిస్తే ఈవీలతో యాజమాన్య ఖర్చులు చాలా తక్కువ. అందుకే క్రమంగా కస్టమర్లు వీటికి మళ్లుతున్నారు. దిగుమతులను ఆసరాగా చేసుకుని చాలా బ్రాండ్లు ఈ రంగంలోకి ప్రవేశించాయి. మార్కెట్ పరిపక్వత చెంది, నిబంధనలు కఠినతరం అయితే ఈ రంగం ఏకీకృతం (కన్సాలిడేట్) అవుతుంది’ అని తెలిపింది. ప్రయాణ ఖర్చు తక్కువ.. ‘కొత్త కొత్త బ్రాండ్ల చేరికతో మోడళ్లను ఎంపిక చేసుకోవడానికి కస్టమర్లకు అవకాశం ఉంటుంది. ఫీచర్లు, రోజువారీ వ్యయం, వాహన ధర ఆధారంగా ఈవీ కొనుగోలు నిర్ణయం తీసుకుంటున్నారు. కొనుగోలు ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ టూ వీలర్లతో పోలిస్తే ప్రయాణానికి అయ్యే ఖర్చు తక్కువ. ‘ఒకసారి చార్జింగ్ చేస్తే వాహనం ఎంత దూరం ప్రయాణిస్తుంది’ అన్న వినియోగదార్ల ఆందోళన పరిశ్రమకు పెద్ద అడ్డంకిగా ఉంది. ఈవీ అమ్మకాలు పెరిగేకొద్దీ సుదూర ప్రయాణాలకు బలమైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు అవసరం అవుతుంది. ప్రధానంగా వేగంగా చార్జింగ్ పూర్తి అయ్యేలా ఫాస్ట్ చార్జింగ్ వసతులు ఉండాలి. ఈవీలు సింహ భాగం చేజిక్కించుకునే వరకు ఫేమ్, పీఎల్ఐ పథకాలు కొనసాగాలి’ అని నివేదిక వివరించింది. -
యుటిలిటీ వాహనాలకు డిమాండ్
ముంబై: యుటిలిటీ వాహనాలకు (యూవీ) డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా అమ్ముడయ్యే కార్లలో ఇవి అధిక వాటా దక్కించుకునే ధోరణి కొనసాగవచ్చని ఫిచ్ రేటింగ్స్ ఒక నివేదికలో తెలిపింది. అధిక మార్జిన్లు ఉండే యూవీల విక్రయాలపై మరింత దృష్టి పెట్టడం ద్వారా కమోడిటీల ధరల పెరుగుదల, అదనపు భద్రత ప్రమాణాలపరమైన వ్యయాల భారాన్ని ఆటోమొబైల్ సంస్థలు కొంత మేర ఎదుర్కొనేందుకు వీలుంటుందని పేర్కొంది. మరోవైపు, ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోతుండటంతో కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌ల తయారీని ఆటోమొబైల్ సంస్థలు తగ్గించుకుంటున్నట్లు వివరించింది. దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం కార్ల విక్రయాల్లో యూవీల పరిమాణం 49 శాతం పెరిగినట్లు (అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 28 శాతం) ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్ల సంయుక్త వాటా 66 శాతం నుండి 48 శాతానికి పడిపోయింది. యూవీలకు ఆదరణ పెరుగుతోందనడానికి ఇది నిదర్శనమని ఫిచ్ రేటింగ్స్ వివరించింది. ఇక యూవీ కేటగిరీలో అంతర్గతంగా ఎంట్రీ, మధ్య స్థాయి వాహనాల అమ్మకాల వాటా మొత్తం కార్ల విక్రయాల్లో 38 శాతానికి చేరింది. విశిష్టమైన సామర్థ్యాలతో పనిచేసే విశాలమైన యూవీల వైపు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారని ఫిచ్ పేర్కొంది. కొత్త మోడల్స్‌తో వృద్ధికి ఊతం.. గత కొన్నేళ్లుగా హ్యాచ్‌బ్యాక్‌లతో పోలిస్తే ఆటోమొబైల్ సంస్థలు పెద్ద సంఖ్యలో కొత్త యూవీ మోడల్స్‌ను ప్రవేశపెడుతున్నాయి. ఎంట్రీ కార్ల కొనుగోలుదారులతో పోల్చినప్పుడు ధరను పెద్దగా పట్టించుకోకుండా కొత్త కార్లకు అప్‌గ్రేడ్ అయ్యేవారు, అధికాదాయ వర్గాల వారు ఎక్కువగా వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. 2021 ఆర్థిక సంవత్సరంలో ఎంట్రీ, మధ్య స్థాయి యూవీల అమ్మకాలు 21 శాతం పెరగ్గా, గత ఆర్థిక సంవత్సరంలో 35 శాతం మేర పెరిగాయి. కోవిడ్–19పరమైన ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ యూవీలకు డిమాండ్ తగ్గలేదని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. తగ్గుతున్న హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్లు.. సెడాన్లు, హ్యాచ్‌బ్యాక్ కార్ల ఉత్పత్తి వ్యయాలు పెరుగుతూ ఉండటం వల్ల డిమాండ్, లాభదాయకతపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. కమోడిటీల రేట్లు పెరిగిపోవడం, వాహన భద్రత ప్రమాణాలు కఠినతరం చేయడంతో 2018 నుంచి చూస్తే ఎంట్రీ స్థాయి కార్ల ధరలు 20–30 శాతం పెరిగాయని పేర్కొంది. 2020 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ విభాగంలో అమ్మకాలు తగ్గుతూ వస్తున్నాయని తెలిపింది. కార్లలో అదనంగా ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేసే నిబంధన ఈ ఏడాది అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తే తయారీ వ్యయాలు మరో 3–5 శాతం మేర పెరగవచ్చని పేర్కొంది. దీంతో ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్లో కొత్త కార్ల ఆవిష్కరణలు తగ్గవచ్చని, కొన్ని మోడల్స్‌ను నిలిపివేసే అవకాశాలున్నాయని ఫిచ్ రేటింగ్స్ వివరించింది. దీని ఫలితంగా ఈ విభాగం వృద్ధి అవకాశాలు మరింతగా మందగిస్తాయని పేర్కొంది. ఖర్చులు పెరుగుతున్నా యూవీల అమ్మకాలు పెరుగుతుండటమనేది దేశీ కార్ల తయారీ సంస్థల లాభదాయకతకు తోడ్పాటుగా ఉండగలదని ఫిచ్ రేటింగ్స్ వివరించింది. సియామ్ గణాంకాల ప్రకారం 2022 ఆర్థిక సంవత్సరంలో ఎంట్రీ లెవెల్ కార్ల అమ్మకాలు 6 శాతం క్షీణించగా యూవీల అమ్మకాలు 40 శాతం పెరిగి ఆ మేరకు వ్యత్యాసాన్ని భర్తీ చేశాయని, పరిశ్రమ 13 శాతం వృద్ధి నమోదు చేయడంలో తోడ్పడ్డాయని పేర్కొంది. -
అలా చేస్తే సగం ధరకే పెట్రోల్, డీజిల్..!
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల్లో మార్పులు ప్రపంచదేశాలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.ఇక రష్యా-ఉక్రెయిన్ వార్తో క్రూడాయిల్ ధరలు కొత్త గరిష్టాలను తాకాయి. కాగా భారత ప్రభుత్వం క్రూడాయిల్ ధరల నుంచి ఉపశమనం పొందేందుకుగాను ఫ్లెక్స్ ఫ్యుయల్(మిశ్రమ ఇంధనం) వాహనాల తయారీపై ముమ్మర ప్రయత్నాలను చేస్తోంది. ఫ్లెక్స్ ఫ్యుయల్ వాహనాల తయారీపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలను చేశారు. తయారీకి సిద్దం..! వచ్చే ఆరు నెలల్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల తయారీని ప్రారంభిస్తామని ఆటోమొబైల్ కంపెనీల ఉన్నతాధికారులు తనకు హామీ ఇచ్చారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శనివారం తెలిపారు. ఈటీ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌ను ఉద్దేశించి గడ్కరీ మాట్లాడుతూ...100 శాతం స్వచ్ఛమైన ఇంధన వనరుల నుండి ప్రజా రవాణాను నడిపేందుకు ప్రభుత్వం ప్రణాళికపై పని చేస్తుందని చెప్పారు. వాహన దారులకు సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే సగం ధరకే ఇంధనం లభిస్తోందని గడ్కరీ అభిప్రాయపడ్డారు. త్వరలో 100 శాతం ఇథనాల్‌తో.. ఫ్లెక్స్ ఫ్యుయల్ వాహనాల తయారీ నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పలు ఆటోమొబైల్ కంపెనీలతో సమావేశాలను ముమ్మరం చేశారు. గత వారం అన్ని ప్రధాన ఆటోమొబైల్ కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్లు సియం(ఎస్ఐఏఎం) ప్రతినిధులతో సమావేశమయ్యానని తెలిపారు. ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్ల తయారీని త్వరలోనే ప్రారంభిస్తామని ఆయా కంపెనీలు హామీ ఇచ్చారన్నారు. ఇక భవిష్యత్తులో దేశవ్యాప్తంగా వాహనాలు 100 శాతం ఇథనాల్‌తో నడుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రీన్ హైడ్రోజన్, ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. కాగా టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో వంటి కంపెనీలు ఇప్పటికే ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాల కోసం ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ల తయారీని ప్రారంభించాయని ఆయన గుర్తుచేశారు. ఫ్లెక్స్ ఫ్యుయల్ అంటే..! ఫ్లెక్స్-ఫ్యుయల్ అనేది గ్యాసోలిన్ ,మిథనాల్ లేదా ఇథనాల్ మిశ్రమం నుంచి తయారైన ప్రత్యామ్నాయ ఇంధనం. పెట్రోల్‌లో ఇథనాల్‌ను 20 శాతం కలపడంతో ఫ్లెక్స్ ఫ్యుయల్ తయారవుతుంది. పెట్రోల్ కంటే దీని ధర తక్కువగా ఉంటుంది. ఇప్పటికే మహారాష్ట్రలో చాలా చోట్ల ఇథనాల్ కలిపిన పెట్రోల్ అందుబాటులో ఉంది.దీని ధర లీటరు రూ. 70 కంటే తక్కువగా ఉంది. చదవండి: ఫ్లీజ్ మోదీజీ!! మమ్మల్ని ఆదుకోండి..భారత్‌కు రష్యా బంపరాఫర్! -
పండుగ సీజన్‌పై ఆటో కంపెనీల ఆశలు
న్యూఢిల్లీ: చిప్‌ల కొరతతో సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పండుగ సీజన్లో అమ్మకాలు మరింత మెరుగ్గానే ఉండవచ్చని ఆటోమొబైల్ కంపెనీలు ఆశాభావంతో ఉన్నాయి. ఓనంతో మొదలైన పండుగ సీజన్ నవంబర్‌లో దీపావళితో ముగియనుంది. ఇప్పటిదాకానైతే డిమాండ్ బాగానే ఉండటంతో, అక్టోబర్‌లో సీజన్ తారస్థాయికి చేరితే సన్నద్ధంగా ఉండటం కోసం డీలర్లకు సరఫరా పెంచేందుకు వాహన కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. మారుతి సుజుకీ, టయోటా కిర్లోస్కర్ మోటర్, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతానికైతే డిమాండ్ గతేడాదితో పోలిస్తే మెరుగ్గానే ఉందని మారుతి సుజుకీ ఇండియా సీనియర్ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. బుకింగ్‌లు, ఎంక్వైరీలు, రిటైల్ విక్రయాలు గణనీయంగానే ఉంటున్నాయని.. సరఫరా తరఫునే కొన్ని సమస్యలు ఉండగా, వాటిని చక్కదిద్దుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వివరించారు. పండుగ సీజన్లో యుటిలిటీ వాహనాల ఆధిపత్యం కొనసాగవచ్చని, ప్యాసింజర్ వాహనాల విభాగంలో వీటి అమ్మకాల వాటా సగం దాకా ఉండవచ్చని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ సీఈవో వీజే నక్రా పేర్కొన్నారు. ఆరి్థక రికవరీ, వ్యక్తిగత రవాణా వాహనాల అవసరం పెరగడం, కొత్త వాహనాల ఆవిష్కరణ వంటి అంశాలతో రాబోయే రోజుల్లో డిమాండ్ మరింత మెరుగుపడొచ్చని టయోటా కిర్లోస్కర్ మోటర్ అసోసియేట్ జీఎం వి సిగమణి తెలిపారు. -
ఈవీ జర్నీ.. రయ్!
దేశీయ ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) డిమాండ్‌ను సొమ్ము చేసుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే పర్యావరణ అనుకూల ప్రయోజనాలకు తోడు, చమురు దిగుమతుల బిల్లును తగ్గించుకోవడం లక్ష్యాలుగా.. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహక విధానాలతో ముందుకు వస్తుండడాన్ని చూస్తూనే ఉన్నాము. దీంతో సంప్రదాయ ఆటోమొబైల్ కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ మోడళ్లతో కస్టమర్ల ముందుకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అనుకూల వ్యవస్థల (ఎకోసిస్టమ్) అభివృద్ధికి గతేడాది కరోనా మహమ్మారి తాత్కాలికంగా బ్రేకులు వేసింది. అయినప్పటికీ లాక్డౌన్, ఆంక్షలను క్రమంగా సడలిస్తూ రావడంతో తిరిగి ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) డిమాండ్ కొన్ని నెలల నుంచి మెరుగుపడుతోంది. కాకపోతే మన దేశంలో ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ ఇంకా ఆరంభ దశలోనే ఉంది. ప్రధానంగా పట్టణాలు, కొన్ని వాహన విభాగాల్లోనే విక్రయాలు నమోదవుతున్నాయి. అయినా సరే భవిష్యత్తుపై అంచనాలతో ద్విచక్ర ఈవీ మార్కెట్లోకి కొత్త సంస్థలు ఉత్సాహంగా ప్రవేశిస్తుంటే.. కార్ల విభాగంలో టాటా మోటార్స్ దూసుకుపోయే వ్యూహాలను అమలు చేస్తోంది. కేంద్ర, రాష్ట్రాల సబ్సిడీ, రాయితీ పథకాలు ఇందుకు కొంత మేర సాయపడుతున్నాయని చెప్పుకోవాలి. రంగంలోకి కొత్త సంస్థలు దేశీయ ఈవీ మార్కెట్లో దూకుడుగా వెళ్లే వ్యూహాలతో కొత్త సంస్థలు అడుగుపెడుతుంటే.. మరోవైపు ఆటోమొబైల్ రంగంలో స్థిరపడిన ప్రముఖ కంపెనీలు కూడా పోటీ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కార్లు, ద్విచక్ర, త్రిచక్ర ఈవీ విభాగంలో అవకాశాలను సొంతం చేసుకుని, వృద్ధి చెందేందుకు వేటికవే భిన్నమైన వ్యూహాలను రూపొందించుకుంటున్నాయి. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో మహీంద్రా లీడర్‌గా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఆచితూచి అన్నట్టుగా అడుగులు వేస్తోంది. రెవా ఎలక్ట్రిక్ కార్ కంపెనీని మహీంద్రా సొంతం చేసుకుని ఈ విభాగంలో ముందు నుంచి ఉన్న సంస్థగా పేరు సొంతం చేసుకున్నప్పటికీ.. త్రిచక్ర వాహనాలపైనే ప్రస్తుతం ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అయితే, ‘బోర్న్ ఈవీ’ విధానంతో రానున్న 4–5 ఏళ్ల కాలంలో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో మరింతగా చొచ్చుకుపోయే వ్యూహంతో మహీంద్రా ఉంది. ఆకర్షణీయంగా లేని ఫేమ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో పదుల సంఖ్యలో కంపెనీలు వందకు పైగా మోడళ్లను ఆఫర్ చేస్తుండగా.. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ఉన్న మోడళ్లను వేళ్లమీద లెక్క పెట్టొచ్చు. దీనికి కారణం ఫేమ్ (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఈవీ) పథకం ఎలక్ట్రిక్ కార్లకు ఆకర్షణీయంగా లేకపోవడమేనని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. గడిచిన మూడేళ్ల కాలంలో కేవలం 35,000 వాణిజ్య కార్లకే రాయితీలు రావడం పరిస్థితిని తెలియజేస్తోంది. డిమాండ్ తగినంత లేని పరిస్థితుల్లో పెట్టుబడులతో ప్రయోజనం ఉండదని కార్ల తయారీ సంస్థలు భావిస్తున్నాయి. అతి తక్కువ విక్రయాల కారణంగా భారతీయ కార్ల తయారీ సంస్థలు ఈవీలకు అవసరమైన కీలక విడిభాగాలను.. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ నుంచి పొందడం కష్టమవుతుందని ఐహెచ్ఎస్ మార్కిట్‌కు చెందిన దక్షిణాసియా ప్రధాన అనలిస్ట్ సూరజ్ ఘోష్ అన్నారు. మెట్రోలకే పరిమితమైన ఈవీ టూవీలర్లు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాలు ప్రధానంగా మెట్రోలు, పట్టణాలకే పరిమితమయ్యాయి. ఎన్నో సంస్థలు డీలర్ల ద్వారా తమ ఉత్పత్తులను పట్టణాల్లో విక్రయిస్తున్నాయి. మరోవైపు సంప్రదాయ కంపెనీలైన టీవీఎస్, బజాజ్‌లు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఇవి ఇప్పటి వరకు ఒక్కొక్క మోడల్‌నే మార్కెట్లోకి తీసుకొచ్చాయి. బెంగళూరులో ఏడాది క్రితం టీవీఎస్ ఐక్యూబ్ పేరుతో ఈవీ స్కూటర్‌ను ప్రవేశపెట్టగా.. ఇటీవలే ఢిల్లీ మార్కెట్లోకి ఈ ఉత్పత్తిని విడుదల చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని మార్కెట్లోకి దీన్ని విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. అంటే ప్రస్తుతానికి ఐ క్యూబ్ బెంగళూరు, ఢిల్లీ మార్కెట్లకే పరిమితం. బజాజ్ చేతక్ ఈవీ స్కూటర్ కూడా ఇంతే. గ్రీవ్స్కాటన్కు చెందిన యాంపియర్ ఎలక్ట్రిక్ మాత్రం ద్విచక్ర, త్రిచక్ర ఈవీ విభాగంలో చాలా మోడళ్లను తీసుకొస్తోంది. నెట్‌వర్క్‌నూ విస్తరిస్తోంది. తన ఈవీ వ్యాపార బాధ్యతలను చూసేందుకు యమహా ఇండియా మాజీ మార్కెటింగ్ హెడ్ రాయ్ కురియన్ను నియమించుకుంది. ఈ సంస్థకు 230 ప్రాంతాల్లో 300 డీలర్‌షిప్‌లు ఉన్నాయి. టాటా మోటార్స్ దూకుడు టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో వేగంగా అడుగులు వేస్తోంది. భిన్నమైన విధానంతో ఈవీ కార్ల మార్కెట్లో ప్రముఖ స్థానాన్ని ఇప్పటికే సొంతం చేసుకుంది. ప్రస్తుతానికి రెండు ఎలక్ట్రిక్ కార్లు టాటా మోటార్స్ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలో ఉండగా, మరిన్ని కార్లను ప్రవేశపెట్టే ప్రణాళికతో సంస్థ ఉంది. దేశవ్యాప్తంగా ప్రముఖ రహదారుల్లో ఇప్పటికే 300కు పైగా చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ప్రముఖ పట్టణాలు, జాతీయ రహదారులపై 2021 మార్చి నాటికి చార్జింగ్ స్టేషన్ల సంఖ్యను 700కు చేర్చాలన్న లక్ష్యంతో ఉంది. ‘‘భారత్ వైవిధ్యమైన మార్కెట్. ఈవీ విలువ ఆధారిత చైన్‌లో ఉత్పత్తులు, సేవల పరంగా అపారమైన వృద్ధి అవకాశాలున్నాయి. ఓఈఎమ్ (ఎక్విప్మెంట్ తయారీ సంస్థలు) కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తుల తయారీ, సదుపాయాలపై పెట్టుబడులను ప్రారంభించాయి. సరైన విధానం, ప్రామాణిక టెక్నాలజీ, నియంత్రణ చర్యలు అన్నవి దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని గణనీయంగా పెంచేందుకు తోడ్పడతాయి’’ అని ఈవై ఇండియా ఆటోమోటివ్ రంగ పార్ట్నర్ వినయ్ రఘునాథ్ తెలిపారు. -
స్పీడు పెంచనున్న ఆటోరంగం
న్యూఢిల్లీ: గతేడాది కష్టకాలంగా గడిచినప్పటికీ కొత్త ఏడాదిపై ఆటోమొబైల్ కంపెనీలు కాస్త ఆశావహంగా ఉన్నాయి. సరఫరా వ్యవస్థల సమస్యలు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ .. వృద్ధి ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాయి. కియా మోటర్స్ ఉత్పత్తి పెంచుకోనుండగా.. టయోటా కొంగొత్త ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఇక హ్యుందాయ్ మరిన్ని కొత్త ఆవిష్కరణలను పరిచయం చేయడంపై దృష్టి పెడుతోంది. ‘కొత్త ఏడాదిలో మా తయారీ ప్లాంటులో షిఫ్టులను మూడుకు పెంచుకోనున్నాం. అలాగే కొనుగోలుదారులకు సురక్షితమైన అనుభూతినిచ్చేందుకు ‘ఫిజిటల్’ (ఆఫ్‌లైన్ స్టోర్స్, డిజిటల్) నెట్వర్క్ విధానాన్ని మరింతగా పటిష్టం చేసుకోనున్నాం’ అని కియా మోటర్స్ ఎండీ ఖూఖ్యున్ షిమ్ తెలిపారు. కరోనా పరమైన సవాళ్లు ఎదురైనప్పటికీ.. 2020లో రెండు కొత్త సెగ్మెంట్లలోకి ప్రవేశించగలిగామని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలోని కియా మోటర్స్ ప్లాంటు వార్షిక సామర్థ్యం 3 లక్షల యూనిట్లుగా ఉంది. విద్యుత్ వాహనాలపైనా కసరత్తు .. 2021లో పెరిగే డిమాండ్‌కు, కస్టమర్ల అంచనాలకు అనుగుణంగా దశలవారీగా కొంగొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు టయోటా కిర్లోస్కర్ మోటర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్, సర్వీస్ విభాగాలు) నవీన్ సోని తెలిపారు. అలాగే మధ్యకాలికం నుంచి దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా విద్యుత్ వాహనాల్లాంటి ప్రత్యామ్నాయాలపైనా దృష్టి పెట్టనున్నట్లు ఆయన వివరించారు. ఇక వాహనాల లీజింగ్ సర్వీసులను మరిన్ని నగరాలకు విస్తరించే యోచనలో ఉన్నట్లు సోని పేర్కొన్నారు. మరోవైపు, కార్యకలాపాలను పూర్తి స్థాయిలో విస్తరించిన తర్వాత నుంచి అమ్మకాల పరిమాణం క్రమంగా పెరిగిందని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గోయల్ తెలిపారు. విదేశాలకు ఐ20 ప్రీమియం కార్ల ఎగుమతులు: హ్యుందాయ్ ఆత్మ నిర్భర్ భారత్ నినాదానికి కట్టుబడి తమ సరికొత్త ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్ల ఎగుమతులను ప్రారంభించినట్లు హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ తెలిపింది. మొదటి దఫా ఎగుమతుల్లో భాగంగా 180 ఐ20 మోడళ్లను దక్షిణాఫ్రికా, చిలీ, పెరూ దేశాలకు తరలించినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది నవంబర్‌లో అందుబాటులోకి వచ్చిన ఐ20 మోడల్ ధర ఎక్స్ షోరూం వద్ద రూ.6.79 – రూ.11.17 లక్షల మధ్య ఉంది. -
కార్ల మార్కెట్లో ఆ 5 కంపెనీలదే హవా
ముంబై, సాక్షి: దేశీయంగా కార్ల విక్రయాలలో మెజారిటీ వాటాను 5 కంపెనీలు ఆక్రమిస్తున్నట్లు ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ సమాఖ్య(ఎఫ్ఏడీఏ) తాజాగా పేర్కొంది. దీంతో ప్యాసింజర్ వాహన మార్కెట్లో 85 శాతం వాటా వీటి సొంతంకాగా.. మరో 22 బ్రాండ్లు మిగిలిన 15 శాతం మార్కెట్లను పంచుకుంటున్నట్లు తెలియజేసింది. మారుతీ సుజుకీ, హ్యుండాయ్, టాటా మోటార్స్, కియా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ప్రధాన వాటాను గెలుచుకున్నట్లు పేర్కొంది. (ఫేస్బుక్ నుంచి విడిగా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్?) పెద్ద మార్కెట్ గత నవంబర్ నుంచి చూస్తే ఈ నవంబర్ వరకూ టాప్-5 కంపెనీలు తమ మార్కెట్ వాటాను 4.5 శాతంమేర పెంచుకున్నట్లు ఎఫ్ఏడీఏ తెలియజేసింది. దీంతో వీటి వాటా 81.2 శాతం నుంచి 85 శాతానికి ఎగసినట్లు వెల్లడించింది. సుప్రసిద్ధ గ్లోబల్ బ్రాండ్లు రేనాల్ట్, ఫోర్డ్, హోండా, టయోటా, ఫోక్స్‌వ్యాగన్ తదితరాలు పోటీ పడుతున్నప్పటికీ దేశీయంగా పరిస్థితులు వేరని ఆటో రంగ నిపుణులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. భారత్.. ప్రపంచంలోనే నాలుగో పెద్ద ఆటోమోటివ్ మార్కెట్ కాగా.. చైనా తొలి స్థానాన్ని ఆక్రమిస్తోంది. చైనాలో టాప్-5 కార్ల కంపెనీల వాటా 40 శాతమే. జర్మనీలో సైతం 50 శాతమేకాగా.. యూఎస్‌లో టాప్-5 కంపెనీలు 68 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. అయితే జపాన్‌లో కూడా టాప్-5 కంపెనీల వాటా అత్యధికంగా 81 శాతంగా నమోదవుతుండటం గమనార్హం! జపాన్‌లో మార్కెట్ లీటర్లు జపనీస్ కంపెనీలేకావడం విశేషం! పలు దేశాలలో ప్రాధాన్యత కలిగిన టయోటా వాటా దేశీయంగా 3 శాతానికి పరిమితమవుతున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి.(డిస్నీప్లస్‌లో హాట్‌స్టార్.. హాట్‌హాట్) మారుతీ జోరు చౌక ధరల మోడళ్లు, ప్రాచుర్యం పొందిన బ్రాండ్లు, భారీ నెట్వర్క్ వంటి అంశాల కారణంగా మారుతీ సుజుకీ కార్లకు డిమాండ్ కొనసాగుతున్నట్లు ఆటో నిపుణులు చెబుతున్నారు. దీంతో మారుతీ 50 శాతం వాటాను ఆక్రమిస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది కాలంలో హ్యుండాయ్ మార్కెట్ వాటా స్వల్ప క్షీణతతో 17.74 శాతం నుంచి 16.21 శాతానికి చేరింది. ఇదే కాలంలో టాటా మోటార్స్ వాటా 4.84 శాతం నుంచి 7.5 శాతానికి ఎగసింది. ఇక కియా మోటార్స్ వాటా 3.78 శాతం నుంచి 6.28 శాతానికి జంప్‌చేసింది. ఆల్ట్రోజ్.. థార్.. పండుగల సీజన్, కొత్త మోడళ్ల విడుదల, లాయల్టీ బెనిఫిట్స్, చౌక వడ్డీ రేట్లు తదితర పలు అంశాలు కార్ల విక్రయాలపై ప్రభావాన్ని చూపుతుంటాయని విశ్లేషకులు వివరిస్తున్నారు. టాటా మోటార్స్‌కు ఆల్ట్రోజ్, ఎస్యూవీ నెక్సాన్ మోడళ్లు మద్దతుగా నిలిచినట్లు పేర్కొన్నారు. కాగా.. ఎంఅండ్ఎం వాటా 6.78 శాతం నుంచి 5.48 శాతానికి నీరసించింది. కంపెనీ విడుదల చేసిన థార్ ఎస్‌యూవీకి భారీ డిమాండ్ నెలకొన్నప్పటికీ తగిన స్థాయిలో వాహనాల తయారీ, సరఫరా చేయలేకపోవడం ప్రభావం చూపినట్లు ఆటో నిపుణులు తెలియజేశారు. -
ఆటో.. రీస్టార్ట్..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి ఉద్దేశించిన లాక్డౌన్ దెబ్బతో మూతబడిన వ్యాపార కార్యకలాపాలను ఆటోమొబైల్ సంస్థలు క్రమంగా పునఃప్రారంభిస్తున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, ఫోక్స్‌వ్యాగన్, మహీంద్రా, హోండా కార్స్ మొదలైన వాటి బాటలోనే మరికొన్ని సంస్థలు కూడా షోరూమ్‌లు తెరవడంతో పాటు ఆన్లైన్లో అమ్మకాలు చేపడుతున్నాయి. తాజాగా ఆడి ఇండియా, రెనో తదితర కంపెనీలు ఈ జాబితాలో చేరాయి. ఆడి ఇండియా: కస్టమర్లు ఇంటి నుంచి కదలకుండానే వాహన కొనుగోలు, సర్వీసింగ్ వంటి సేవలు పొందేందుకు వీలుగా ఆన్లైన్ సేల్స్, సర్వీస్ కార్యకలాపాలు ప్రారంభించింది. రెనో: ఫ్రాన్స్ ఆటోమొబైల్ దిగ్గజం రెనో భారత్‌లో తమ కార్పొరేట్ ఆఫీస్‌ను, కొన్ని డీలర్‌షిప్‌లు.. సర్వీస్ సెంటర్లను పునఃప్రారంభించింది. కొత్త భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా 194 షోరూమ్స్, వర్క్‌షాప్‌లను తిరిగి తెరిచినట్లు రెనో ఇండియా కార్యకలాపాల విభాగం సీఈవో వెంకట్రామ్ మామిళ్లపల్లె తెలిపారు. బజాజ్ ఆటో: మూడో ఫేజ్ లాక్డౌన్ నిబంధనల సడలింపు నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో డీలర్‌షిప్‌లు, సర్వీస్ సెంటర్లను మే 4 నుంచి క్రమంగా తెరుస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. హీరో: పంజాబ్, బీహార్‌లోని ప్లాంట్లను పునఃప్రారంభించినట్లు హీరో సైకిల్స్ వెల్లడించింది. మొత్తం సామర్థ్యంలో 30 శాతం మేర ఉత్పత్తి మొదలుపెట్టినట్లు వివరించింది. అలాగే స్వల్ప సిబ్బందితో కార్పొరేట్ ఆఫీస్‌ను కూడా తెరిచినట్లు సీఎండీ పంకజ్ ఎం ముంజల్ చెప్పారు. -
చేతక్ ఎలక్ట్రిక్ @ రూ. లక్ష
ముంబై: ప్రముఖ వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో ఒకప్పటి తన ఐకానిక్ స్కూటర్ ‘చేతక్’ను మళ్లీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. నూతన తరానికి తగిన విధంగా ఈసారి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదలచేసింది. ఈ–స్కూటర్ ప్రారంభ ధర రూ. లక్ష కాగా, ఎలక్ట్రిక్ స్కూటర్లకు ప్రభుత్వం ఇస్తోన్న సబ్సిడీలు పోనూ ఇది ఎక్స్–షోరూం ధరని కంపెనీ వివరించింది. అంటే, రోడ్ ట్యాక్స్, బీమా కలపని ధర ఇది. డిస్క్ బ్రేక్‌లు, లగ్జరీ ఫినిషింగ్ కలిగిన ప్రీమియం ఎడిషన్ ధర రూ. 1.15 లక్షలుగా ఉంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 95 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలిగే చేతక్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ సంక్రాంతి పండుగ రోజే (నేటి నుంచి) ప్రారంభంకానున్నాయి. సంస్థ వెబ్సైట్ ద్వారా ఈ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయవచ్చని, ఇందుకు ఇనీషియల్ అమౌంట్ కింద రూ. 2,000 చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఫిబ్రవరి నెలాఖరు నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ వెల్లడించారు. మూడేళ్ల వారంటీ..: ఈ–స్కూటర్‌కు ఏడాదికి ఒకసారి లేదంటే.. 12,000 కిలోమీటర్లు తిరిగిన ప్రతిసారీ కనీస నిర్వహణ అవసరమని కంపెనీ పేర్కొంది. కస్టమర్లకు 50,000 కిలోమీటర్ల వరకు లేదంటే, మూడేళ్లు ఏది ముందైతే అది వారంటీగా లభిస్తుంది. లిథియం–అయాన్ బ్యాటరీకి కూడా వారంటీ వర్తిస్తుంది. అతి నియంత్రణ వల్లే రేట్ల పెంపు.. ఏడాదిన్నరలో 30% పెరగనున్న ద్విచక్ర వాహనాల ధరలు బడ్జెట్‌పై పెద్దగా ఆశల్లేవు: బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ఏడాదిన్నర వ్యవధిలో ద్విచక్ర వాహనాల ధరలు 30 శాతం మేర పెరగనున్నాయని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ వెల్లడించారు. మార్కెట్లను ’అతిగా నియంత్రించడమే’ ఇందుకు కారణమని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త ఉద్గార నిబంధనల అమలు ప్రభావం తదితర నియంత్రణపరమైన అంశాలను బజాజ్ ఉదహరించారు. చేతక్ స్కూటర్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను లాంఛనంగా ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. కొత్తగా భారత్ స్టేజ్–6 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను తయారు చేయాల్సి రానుండటంతో స్టేజ్–4 తో పోలిస్తే రేట్లు మరింత పెంచాల్సి వస్తుందంటూ ఆటోమొబైల్ సంస్థలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బజాజ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, విద్యుత్ వాహనాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని 5 శాతంగా కేంద్రం నిర్ణయించినప్పటికీ.. కంబషన్ ఇంజిన్ వాహనాలపై 28 శాతం కొనసాగుతోందని బజాజ్ చెప్పారు. దీన్ని 18 శాతానికైనా తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఆటోమొబైల్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే అంశాలేవీ బడ్జెట్లో ఉంటాయని తానేమీ ఆశించడం లేదని బజాజ్ తెలిపారు. -
కారు.. పల్లె‘టూరు’
అమ్మకాలు పడిపోయి... ఆపసోపాలు పడుతున్న వాహన కంపెనీలకు వరుణుడు కరుణచూపాడు. ఈ ఏడాది వానలు కాస్త లేటయినా... దండిగానే కురవడంతో ఇప్పుడు ఆటోమొబైల్ దిగ్గజాలు ‘వర్షా’తిరేకాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పల్లెకు పోదాం.. మందగమనాన్ని తట్టుకుందాం.. అమ్మకాలు పెంచుకుందాం అని పాట పాడుతున్నాయి. గ్రామీణులను ఆకర్షించడానికి గ్రామ మహోత్సవాలను నిర్వహిస్తున్నాయి. తక్కువ వడ్డీరేట్లకు వాహన రుణాలిస్తున్నాయి. ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్లను అందిస్తున్నాయి. సర్వీసింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. వాహన కంపెనీల పల్లెబాటపై సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ... వాహన కంపెనీలు గ్రామీణ మార్కెట్‌పై మరింతగా దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. ఆర్థిక మందగమనం కారణంగా డిమాండ్ తగ్గి అమ్మకాలు కుదేలవడంతో వాహన కంపెనీలు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వాహన విక్రయాలు గత ఇరవై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా దిగజారిపోయాయి. దీంతో మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్, మహీంద్రా, టయోటా తదితర వాహన కంపెనీలు గ్రామీణ మార్కెట్లలో అమ్మకాలు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇక మొత్తం అమ్మకాల్లో గ్రామీణ అమ్మకాలు దాదాపు సగంగా ఉండే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ 3,000కు పైగా తాలుకాల్లో సేల్స్, సర్వీసింగ్ అవుట్లెట్లను అందుబాటులోకి తెచ్చింది. అమ్మకాలు పెంచుకోవడానికి టీచర్లు, గ్రామాల్లో కుల వృత్తులు చేసే వ్యక్తులపై దృష్టి పెట్టింది. సమృద్ధిగా వర్షాలు.... గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులను ఆకర్షించడానికి వాహన కంపెనీలు గ్రామ మహోత్సవాలను నిర్వహిస్తున్నాయి. ఈ ఉత్సవాల్లో ఆకర్షణీయమైన ఎక్సే్ఛంజ్ డీల్స్‌ను, తక్కువ వడ్డీరేట్ల ఫైనాన్స్ స్కీమ్‌లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ వర్షాకాలంలో వర్షాలు పుష్కలంగా కురియడంతో పంటలు సమృద్ధిగా పండి ఆర్థిక వ్యవస్థ త్వరితంగా రికవరీ కాగలదన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో వాహన కంపెనీలు గ్రామీణ మార్కెట్ బాట పడుతున్నాయి. ఖరీఫ్‌లో పంటలు బాగా పండుతాయనే అంచనాలు, గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికి బడ్జెట్ ప్రోత్సాహాన్నివ్వడం తదితర అంశాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వాహనాలకు డిమాండ్ పెరగగలదని కంపెనీలు భావిస్తున్నాయి. భవిష్యత్తు గ్రామీణ మార్కెట్లదే... కాగా మందగమనం కారణంగా వాహన కంపెనీలు గ్రామీణ మార్కెట్ బాట పట్టాయనడం పూర్తిగా సరైనది కాదని కొందరు నిపుణలంటున్నారు. పెద్ద నగరాల్లో కాకుండా ఇతర మార్కెట్లలో భవిష్యత్తులో అమ్మకాలు పెరుగుతాయనే అంచనాలు కూడా దీనికి కారణమని వారంటున్నారు. భవిష్యత్తు గ్రామీణ మార్కెట్లదేనని రెనో ఇండియా ఎండీ మామిళ్లపల్లి వెంకట్రామ్ అంటున్నారు. గ్రామీణ ప్రాంతాలే ముందుగా మందగమన పరిస్థితులను అధిగమిస్తాయని, ఆ తర్వాత పట్టణాలు పుంజుకుంటాయన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు రియల్టీ కుదేలైందని, ముందుగా గ్రామీణ ప్రాంతాల్లోనే రియల్టీకి డిమాండ్ పెరిగిందని, ఆ తర్వాత పట్టణాల్లో రియల్టీ రంగం పుంజుకుందని ఆయన ఉదహరించారు. ఎంక్వైరీలు పెరుగుతున్నాయి. ఇప్పటికే గ్రామీణ ప్రాంత వినియోగదారుల నుంచి ఎంౖMð్వరీలు పెరుగుతున్నాయని మారుతీ సుజుకీ ఈడీ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాత్సవ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ కార్లకు సంబంధించి అధికంగా వివరాలు అడుగుతున్నారని, ఎంక్వైరీలు పెరగడం మార్కెట్ పునరుజ్జీవనం పొందుతుందనడానికి ఆరంభ సంకేతమని పేర్కొన్నారు. మొత్తం మారుతీ అమ్మకాల్లో గ్రామీణ ప్రాంత అమ్మకాలు 38 శాతంగా ఉంటాయి. మందగమనం కారణంగా మారుతీ సుజుకీ కంపెనీ పట్టణ అమ్మకాలు ఈ ఏడాది ఏప్రిల్–జూలై కాలంలో భారీగా తగ్గగా, గ్రామీణ ప్రాంత అమ్మకాలు 16 శాతం తగ్గాయి. గ్రామీణ మార్కెటే మెరుగు మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, పట్టణ ప్రాంతాల వ్యాపారంతో పోల్చితే గ్రామీణ వ్యాపారం ఒకింత మెరుగ్గా ఉందని హ్యుందాయ్ సేల్స్ హెడ్ వికాస్ జైన్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో ఈ కంపెనీ గ్రామీణ ప్రాంత అమ్మకాలు 5 శాతం మేర మాత్రమే తగ్గాయి. త్వరలోనే ఈ మార్కెట్లు పుంజుకుంటాయని, పూర్తి ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు సానుకూల వృద్ధిని సాధించగలవని ఈ కంపెనీ భావిస్తోంది. -
వాహన ఉత్పత్తికి కోతలు..
న్యూఢిల్లీ: మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తిని సవరించుకుంటున్నాయి. ప్రస్తుత త్రైమాసికంలో 8 నుంచి 14 రోజుల వరకు ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు మహీంద్రా అండ్ మహీంద్రా శుక్రవారం ప్రకటించింది. టాటా మోటార్స్ సైతం తగ్గుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని సవరించనున్నట్టు ధ్రువీకరించింది. 2019–20 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) పలు ప్లాంట్లలో 8–14 రోజుల వరకు ఎటువంటి ఉత్పత్తి ఉండదంటూ స్టాక్ ఎక్సేంజ్‌లకు ఎంఅండ్ఎం సమాచారం ఇచ్చింది. ‘‘గతంలో పేర్కొన్నట్టుగానే.... వెలుపలి వాతావరణం ఇప్పటికీ సవాళ్లతో కూడుకుని ఉంది. డిమాండ్ తగ్గిపోతోంది. డిమాండ్‌కు అనుగుణంగా మా ఉత్పత్తిని మార్చుకోవడంతోపాటు, పనివేళల షిఫ్ట్‌లు, కాంట్రాక్టు సిబ్బందిని సర్దుబాటు చేసుకున్నాం’’అని టాటా మోటార్స్ స్పష్టం చేసింది. గత కొన్ని నెలలుగా వాహనాల అమ్మకాలు పడిపోతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో ఎంఅండ్ఎం దేశీయ వాహన అమ్మకాలు 8 శాతం క్షీణించి, 1,61,604 యూనిట్లుగా ఉన్నాయి. ఎగుమతులతో కలిపి చూసినా కానీ అమ్మకాలు 8 శాతం తగ్గాయి. కస్టమర్ల నుంచి డిమాండ్ బలహీనంగా ఉండడంతో ఈ నెల అంతటా ఉత్పత్తిని నిలిపివేస్టున్నట్టు ఆటో విడిభాగాల తయారీ సంస్థ జామ్నా ఆటో గురువారమే ప్రకటించింది. వరుసగా ఆరో నెల జూలైలోనూ తాము ఉత్పత్తికి కోత విధించినట్టు మారుతీ సుజుకీ ఈ వారమే ప్రకటించింది. ఆటో విడిభాగాల దిగ్గజం బాష్ సైతం తాత్కాలికంగా తన రెండు ప్లాంట్లలో 13 రోజుల పాటు ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు తెలిపింది. జీఎస్టీని తగ్గించాలి: సియామ్ న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను భారాన్ని తగ్గించి పరిశ్రమను ఆదుకోవాలని ఆటో ఇండస్ట్రీ ప్రభుత్వాన్ని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 28 శాతం పన్ను రేటును 18 శాతానికి తగ్గించాలని ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య (సియామ్) కోరింది. అమల్లో ఉన్న రేటుకు 1–22 శాతం వరకు అదనపు సెస్ వర్తిస్తుండగా.. ఇప్పటికే పలు ఇబ్బందులను ఎదుర్కుంటున్న ఆటో పరిశ్రమను ఈ పన్నుల భారం మరింత కుంగదీస్తుందని వివరించింది. పన్ను తగ్గింపు డిమాండ్‌కు సమాఖ్యలోని అన్ని తయారీ సంస్థలతో పాటు ద్విచక్ర వాహనాల ప్రధాన తయారీ సంస్థ(ఓఈఎం)ల మద్దతు కూడకట్టుకుని ఏకగ్రీవ డిమాండ్ ఉన్నట్లు సియామ్ ప్రెసిడెంట్ రాజన్ వధేరా తెలియజేశారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిగిన భేటీలో ప్యాసింజర్, వాణిజ్య, ద్విచక్ర విభాగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఉన్నట్లు స్పష్టంచేశారు. -
ఆధార్ ప్రింట్ చేసినట్టు కాదు..!
న్యూఢిల్లీ: త్రిచక్ర వాహనాలను 2023 నుంచి, ద్విచక్ర వాహనాలను 2025 నుంచి పూర్తిగా ఎలక్ట్రిక్ రూపంలోనే అనుమతించాలన్న నీతి ఆయోగ్ ప్రతిపాదనపై అగ్రశ్రేణి ఆటో కంపెనీలు అభ్యంతరాలు వ్యక్తంచేశాయి. ఇదేమీ ఆధార్ కార్డును ప్రింట్ చేసింత ఈజీ కాదని టీవీఎస్, బజాజ్ ఆటో వ్యాఖ్యానించాయి. ఈ ప్రతిపాదనల వెనక తగినంత అధ్యయనం, సంప్రదింపులు లేవని పేర్కొన్నాయి. ‘‘ఇది ఆధార్ కార్డు కాదు. సాఫ్ట్వేర్, ప్రింట్ కార్డులు కాదు. మొత్తం సరఫరా చెయిన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ప్రస్తుత వ్యవస్థ నుంచి దానికి మళ్లాల్సి ఉంటుంది’’ అని టీవీఎస్ మోటార్ కంపెనీ చైర్మన్, ఎండీ వేణు శ్రీనివాసన్ పేర్కొన్నారు. తమ ప్రతిపాదనలపై రెండు వారాల్లో ఆటో మొబైల్ పరిశ్రమ స్పందించాలని నీతి ఆయోగ్ కోరిన నేపథ్యంలో వేణు శ్రీనివాసన్ ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. నాలుగు నెలల సమయం కోరాం... ‘‘ఓ ప్రణాళికతో ముందుకు రావడానికి మాకు నాలుగు నెలల సమయం పడుతుందని తెలియజేశాం. ప్రణాళిక ఓ నగరంతో (అత్యధిక ద్విచక్ర వాహనాలు కలిగిన నగరం) మొదలవుతుంది. ఆ తర్వాత బదిలీ అన్నది కొంత కాలానికి జరుగుతుంది’’ అని వేణు శ్రీనివాసన్ తెలిపారు. 2 కోట్ల వాహనాలు, 15 బిలియన్ డాలర్ల అమ్మకాలు, 10 లక్షల మంది ఉపాధితో కూడిన ఈ రంగంలో ఒకేసారి పూర్తిగా మార్పు అన్నది సాధ్యం కాదని చెప్పారాయన. థర్మల్ (బొగ్గు ఆధారిత) విద్యుత్‌తో నడిచే బ్యాటరీలకు మళ్లడం కాలుష్యాన్ని తగ్గించదని స్పష్టంచేశారు. కాలుష్యంలో వాహనాల పాత్ర 20 శాతం అయితే, ఇందులో ద్విచక్ర వాహనాల నుంచి వెలువడే కాలుష్యం 20 శాతమేనని, అంటే కేవలం 4 శాతం కాలుష్యం గురించి ఇదంతా చేస్తున్నట్టుగా ఉందని అభిప్రాయపడ్డారు. దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులను ఆకర్షించిందని, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. కాగా పూర్తిగా 100 శాతం ఎలక్ట్రిక్ వాహనాలకు మళ్లడం అన్నది అవసరం లేదని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ చెప్పారు. కార్లు తదితర వాహనాలను వదిలేసి, కేవలం ద్వి, త్రిచక్ర వాహనాలనే లక్ష్యం చేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం: హీరో మోటోకార్ప్ 150సీసీ సామర్థ్యం వరకు, ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్లతో కూడిన ద్విచక్ర వాహనాలను పూర్తిగా నిషేధించాలన్న నీతి ఆయోగ్ విధానంతో తలెత్తబోయే పరిణామాలపై తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్టు అగ్రగామి టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ ప్రకటించింది. ఈ విధానంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. 150సీసీ సామర్థ్యంలోపు ముఖ్యంగా 100సీసీ, 110సీసీ, 125సీసీ విభాగంలో విక్రయమయ్యే అత్యధిక వాహనాలు ఈ కంపెనీవే. భాగస్వాములు అందరి ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని కంపెనీ సూచించింది. ఎలక్ట్రిక్ వాహనాల అమలును బలవంతంగా రుద్దడానికి బదులు, మార్కెట్ పరిస్థితులు, కస్టమర్ల వైపు నుంచి ఆమోదం వంటి అంశాలతో ఎలక్ట్రిక్ వాహనాలకు మళ్లడం అనేది ఆధారపడి ఉండాలని సూచించింది. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ, దేశ జీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ రంగంపై ప్రతిపాదిత నిషేధం తీవ్ర ప్రభావం చూపుతుందని హీరో మోటోకార్ప్ ఆందోళన వ్యక్తం చేసింది. -
విదేశీ ఆటోమొబైల్ కంపెనీలకు గడ్డుకాలం
న్యూఢిల్లీ: ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాల పరంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగం ఆటోమొబైల్ సంస్థలకు సంతోషాన్నివ్వలేదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా భారత ఆటోమొబైల్ మార్కెట్లో బలమైన స్థానం కోసం పోటీ పడుతున్న విదేశీ కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. మొత్తం 17 ఆటోమొబైల్ సంస్థల్లో సగానికి పైగా కంపెనీల ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు ఏప్రిల్–అక్టోబర్ కాలంలో తగ్గిపోవడం గమనార్హం. సియామ్ గణాంకాల ప్రకారం... అంతర్జాతీయ బ్రాండ్లు అయిన వోక్స్వ్యాగన్, రెనో, నిస్సాన్, స్కోడాల విక్రయాలు తగ్గిన వాటిల్లో ఉన్నాయి. వోక్స్వ్యాగన్ విక్రయాలు ఏప్రిల్–అక్టోబర్ కాలంలో 24 శాతం తగ్గి 21,367 యూనిట్లుగా ఉన్నాయి. రెనో విక్రయాలు 27 శాతం క్షీణించి 47,064 యూనిట్లుగా ఉన్నాయి. నిస్సాన్ మోటార్స్ ఇండియా 22,905 వాహనాలను విక్రయించగా, ఇది గతేడాది ఇదే కాలంతో చూస్తే 27 శాతం తక్కువ. స్కోడా ఆటో ఇండియా అమ్మకాలు 9,919 యూనిట్లుగా ఉండగా, ఇది 18 శాతం తక్కువ. ఫియట్ ఇండియా అమ్మకాలు సైతం 70 శాతం తగ్గి 481 యూనిట్లకు పరిమితం అయ్యాయి. భారత కార్యకలాపాలు లాభసాటిగా లేకపోవడంతో జనరల్ మోటార్స్ గతేడాది ఇక్కడ అమ్మకాలకు స్వస్తి చెప్పడం తెలిసిందే. ఇక దేశీయ సంస్థల్లో ఫోర్స్ మోటార్స్ అమ్మకాలు 17 శాతం, మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ అమ్మకాలు 32 శాతం తగ్గాయి. మారుతి సుజుకీ ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు మాత్రం 9 శాతం, హ్యుందాయ్ మోటార్స్ 4 శాతం, టాటా మోటార్స్ 26 శాతం, హోండా కార్స్ 3 శాతం చొప్పున అమ్మకాలు పెంచుకున్నాయి. -
కారు.. బైక్ టాప్ గేర్!
న్యూఢిల్లీ: వాహన పరిశ్రమ స్పీడ్ మీదుంది. ఆటోమొబైల్ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరుసగా రెండో నెలలోనూ బలమైన అమ్మకాలు సాధించాయి. మారుతీ సుజుకీ ఇండియా, టాటా మోటార్స్, హోండా కార్స్, ఫోర్డ్ ఇండియా కంపెనీలు మే నెల విక్రయాల్లో రెండంకెల వృద్ధిని నమోదుచేశాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు కూడా పెరిగాయి. మరోవైపు మోటార్‌సైకిళ్లూ పరుగులు పెట్టాయి. వాహన విక్రయాలను పరిశీలిస్తే.. ♦ మారుతీ సుజుకీ ఇండియా దేశీ వాహన విక్రయాలు 24.9 శాతం వృద్ధితో 1,30,676 యూనిట్ల నుంచి 1,63,200 యూనిట్లకు పెరిగాయి. కాంపాక్ట్ కార్ల బలమైన అమ్మకాలు దీనికి కారణం. ♦ టాటా మోటార్స్ దేశీ ప్యాసింజర్ వాహన (పీవీ) విక్రయాలు ఏకంగా 61 శాతం ఎగశాయి. ఇవి 10,855 యూనిట్ల నుంచి 17,489 యూనిట్లకు చేరాయి. ‘టియాగో, టిగోర్ మోడళ్ల డిమాండ్ నేపథ్యంలో కార్ల విక్రయాలు 18%పెరిగాయి. ఇక యుటిలిటీ వెహికల్స్‌లో 463 శాతం వృద్ధి నమోదయ్యింది. నెక్సాన్, హెక్జా బలమైన అమ్మకాలు ఈ వృద్ధికి దోహదపడ్డాయి’ అని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ తెలిపారు. ఇక సంస్థ దేశీ అమ్మకాలు 58 శాతం వృద్ధితో 34,461 యూనిట్ల నుంచి 54,295 యూనిట్లకు చేరాయి. ♦ హోండా కార్స్ దేశీ అమ్మకాలు 41% వృద్ధితో 11,278 యూనిట్ల నుంచి 15,864 యూనిట్లకు చేరాయి. కొత్త అమేజ్ బలమైన విక్రయాలు దీనికి కారణం. కస్టమర్ డిమాండ్ నేపథ్యంలో అమేజ్‌కు అధిక ప్రాధాన్యమిస్తున్నామని సంస్థ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్, డైరెక్టర్ రాజేశ్ గోయెల్ చెప్పారు. ♦ హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీ అమ్మకాలు 7 శాతం పెరిగాయి. ఇవి 42,007 యూనిట్ల నుంచి 45,008 యూనిట్లకు చేరాయి. ♦ మహీంద్రా అండ్ మహీంద్రా దేశీ ప్యాసింజర్ వాహన అమ్మకాలు (స్కార్పియో, ఎక్స్‌యూవీ500 సహా) 20,715 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది మే నెల అమ్మకాలు 20,392 యూనిట్లతో పోలిస్తే 2 శాతం వృద్ధి కనిపించింది. ఇక సంస్థ దేశీ అమ్మకాలు 8% వృద్ధితో 40,710 యూనిట్ల నుంచి 43,818 యూనిట్లకు పెరిగాయి. ♦ ఫోర్డ్ ఇండియా దేశీ వాహన విక్రయాలు 6,742 యూనిట్ల నుంచి 9,069 యూనిట్లకు ఎగశాయి. 35 శాతం వృద్ధి కనిపించింది. బలమైన బ్రాండ్, సరైన ప్రొడక్ట్, అందుబాటు ధర వంటి అంశాలు తమ వృద్ధికి కారణమని ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ అనురాగ్ మెహ్రోత్రా తెలిపారు. కమోడిటీ, ఫ్యూయెల్ ధరల పెంపు వల్ల పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడొచ్చన్నారు. టూ వీలర్ రయ్.. టూ వీలర్ విభాగానికి వస్తే.. మార్కెట్ లీడర్ హీరో మోటొకార్ప్ అమ్మకాలు 11 శాతం వృద్ధితో 7,06,365 యూనిట్లకు చేరాయి. బజాజ్ ఆటో విక్రయాల్లో 30 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇవి 3,13,756 యూనిట్ల నుంచి 4,07,044 యూనిట్లకు పెరిగాయి. టీవీఎస్ మోటార్ మొత్తం అమ్మకాలు 10 శాతం వృద్ధితో 3,09,865 యూనిట్లకు ఎగశాయి. రాయల్ ఎన్ఫీల్డ్ మొత్తం విక్రయాలు 23 శాతం వృద్ధితో 74,697 యూనిట్లకు పెరిగాయి. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ మొత్తం అమ్మకాలు 3 శాతం వృద్ధితో 5,51,601 యూనిట్లకు ఎగశాయి. సుజుకీ మోటార్‌సైకిల్ దేశీ విక్రయాలు 37 శాతం వృద్ధితో 53,167 యూనిట్లకు పెరిగాయి. ఇక అశోక్ లేలాండ్ మొత్తం అమ్మకాలు 51 శాతం వృద్ధితో 13,659 యూనిట్లకు చేరాయి. -
ఇది పండుగ కానుక: వాహన రంగం హర్షం
న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేట్ల తగ్గింపును పండుగ కానుకగా ఆటోమొబైల్ సంస్థలు అభివర్ణించాయి. సాధారణంగా పండుగల సీజన్లో ఆటోమొబైల్ అమ్మకాలు కనీసం 15-20 శాతం పెరుగుతాయని, కానీ గత కొద్ది సంవత్సరాలుగా అలా జరగడం లేదని పేర్కొన్నాయి. వడ్డీ రేట్ల తగ్గింపుతో ఈసారి మళ్లీ ఆ మేర అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని హ్యుందాయ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేశ్ శ్రీవాస్తవ చెప్పారు. కస్టమర్లకు ఇది సానుకూల సంకేతమని మారుతీ సుజుకీ ఈడీ ఆర్సీ కాల్సీ అభిప్రాయపడ్డారు.