సల్మాన్ సినిమాలనూ నిషేధిస్తాం: రాజ్ ఠాక్రే
పాకిస్థాన్‌కు చెందిన నటీనటులంతా వెంటనే దేశాన్ని విడిచి వెళ్లిపోవాలంటూ 48 గంటల అల్టిమేటం ఇచ్చిన ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే మరోసారి అదే అంశంపై స్పందించారు. ఈసారి ఆయన బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్‌కు ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు. వాళ్లకు మరీ అంత ఇబ్బందిగా అనిపిస్తే వాళ్ల సినిమాలను కూడా నిషేధిస్తామని చెప్పారు.
మన దేశంలో నటీనటులకు కొరతగా ఉందా అని ప్రశ్నించారు. అసలు పాకిస్థానీ నటులు మన సినిమాల్లో పనిచేయాల్సిన అవసరం ఏముందో తనకు అర్థం కావడం లేదన్నారు. మన కోసం జవాన్లు సరిహద్దుల్లో పోరాటం చేస్తున్నారని.. వాళ్లంతా ఆయుధాలు కింద పడేస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. మన సరిహద్దులను కాపాడేది ఎవరు.. సల్మాన్ ఖానా అని ప్రశ్నించారు. దేశం ముఖ్యమన్న విషయాన్ని వీళ్లంతా గుర్తించాలని చెప్పారు.