bank association
-
ఉద్దేశపూర్వక ఎగవేతదారుల లిస్ట్ ఇదే..
ముంబై: ప్రభుత్వ బ్యాంకులకు టోకరా ఇస్తున్న ఉద్ధేశపూర్వక ఎగవేతదారులు (డిఫాల్టర్ల్స్ లిస్ట్)ను సెప్టెంబర్ 2019 వరకు బ్యాంక్ అసోసియేషన్ ప్రకటించింది. 2019 వరకు బ్యాంకులకు ఎగనామాలు పెట్టిన కంపెనీల లిస్ట్‌ను ఆల్ ఇండియా బ్యాంక్స్ ఎంప్లాయ్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఇందులో 2426 అకౌంట్స్ ద్వారా బ్యాంకులకు లక్షా 47 వేల 350 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్ధకు పెనుసవాల్‌గా భావిస్తున్న ఎగవాతదారుల జాబితాను విడుదల చేయడం హర్షనీయమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, 17 ప్రభుత్వ రంగ బ్యాంకులకు టోకరా ఇచ్చిన ఎగవేతదారుల వివరాలు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉద్దేశపూర్వక ఎగవేత దారులు 685 మంది కాగా చెల్లించని మొత్తం 43వేల 887 కోట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ డిఫ్లాల్టర్స్ (ఎగవేత దారులు)సంఖ్య 325, చెల్లించని మొత్తం 22వేల 370 కోట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా డిఫ్లాల్టర్స్ (ఎగవేత దారులు)సంఖ్య 355, చెల్లించని మొత్తం 14వేల 661 కోట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఫ్లాల్టర్స్ (ఎగవేత దారులు)సంఖ్య 184, చెల్లించని మొత్తం 11వేల 250 కోట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఫ్లాల్టర్స్(ఎగవేత దారులు) సంఖ్య 69, చెల్లించని మొత్తం 9 వేల 663 కోట్లు యునైట్‌డ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఫ్లాల్టర్స్ (ఎగవేత దారులు)సంఖ్య 128, చెల్లించని మొత్తం 7 వేల 028 కోట్లు యుకో బ్యాంక్ డిఫ్లాల్టర్స్ (ఎగవేత దారులు)సంఖ్య 87, చెల్లించని మొత్తం 6 వేల 813 కోట్లు ఒబిసి డిఫ్లాల్టర్స్ (ఎగవేత దారులు)సంఖ్య 138, చెల్లించని మొత్తం 6 వేల 549 కోట్లు కెనరా బ్యాంక్ డిఫ్లాల్టర్స్ (ఎగవేత దారులు)సంఖ్య 96, చెల్లించని మొత్తం 5 వేల 276 కోట్లు ఆంధ్రా బ్యాంక్ డిఫ్లాల్టర్స్(ఎగవేత దారులు) సంఖ్య 84 , చెల్లించని మొత్తం 5 వేల 165 కోట్లు అలాహాబాద్ బ్యాంక్ డిఫ్లాల్టర్స్ సంఖ్య 57, చెల్లించని మొత్తం 4 వేల 339 కోట్లు ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ డిఫ్లాల్టర్స్ (ఎగవేత దారులు)సంఖ్య 49 , చెల్లించని మొత్తం 3 వేల 188 కోట్లు కార్పొరేషన్ బ్యాంక్ డిఫ్లాల్టర్స్ (ఎగవేత దారులు)సంఖ్య 58 , చెల్లించని మొత్తం 2 వేల 450 కోట్లు ఇండియన్ బ్యాంక్ డిఫ్లాల్టర్స్ (ఎగవేత దారులు)సంఖ్య 27 , చెల్లించని మొత్తం 1 వేల 613 కోట్లు సిండికేట్ బ్యాంక్ డిఫ్లాల్టర్స్ (ఎగవేత దారులు) సంఖ్య 36 , చెల్లించని మొత్తం 1 వేల 438 కోట్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర డిఫ్లాల్టర్స్(ఎగవేత దారులు) సంఖ్య 42, చెల్లించని మొత్తం 1 వేల 405 కోట్లు పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్ డిఫ్లాల్టర్స్ (ఎగవేత దారులు)సంఖ్య 6 , చెల్లించని మొత్తం 255 కోట్లు -
పెద్ద నోట్ల రద్దుతో ఒరిగేదేమీ లేదు..
బ్లాక్ మనీపై ఉక్కుపాదం మోపుతూ, పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం రాత్రి ప్రకటించిన సంచలనాత్మక నిర్ణయం వల్ల అంతలా ఒరిగేదేమీ లేదని ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) అత్యున్నత స్థాయి అధికారి పేర్కొన్నారు. బ్లాక్ మనీ ఎక్కువగా విదేశీ బ్యాంకుల్లో, విదేశీ కరెన్సీ, గోల్డ్, ఇతర ఆస్తుల రూపంలో ఉంటుందని తెలిపారు. '' బ్లాక్‌మనీ ఎక్కువగా విదేశీ కరెన్సీ రూపంలో, బంగారం, ఆస్తుల రూపంలో ఉంటుందని అందరికీ తెలుసు. నగదు రూపంలో బ్లాక్‌మనీ లావాదేవీలు తక్కువగా ఉంటాయి. కేవలం ఈ చర్యలు మాత్రమే బ్లాక్‌మనీని నిర్మూలించడానికి సహకరించవు'' అని ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్. వెంకటాచలం మంగళవారం రాత్రి తెలిపారు. ఇక నకిలీ నోట్ల వ్యవహారానికి వస్తే, కేవలం ఈ చర్య మాత్రమే సరిపోదని పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా నకిలీ నోట్ల వ్యవహారంలో మూల కారణాలనే కనుగొనలేకపోతున్నామని చెప్పారు. ప్రభుత్వ ఈ నిర్ణయంతో కొత్త నకిలీ నోట్లు చలామణిలోకి వస్తాయి అని వ్యాఖ్యానించారు. దేశమంతా 102,000ఏటీఎంలు, 85,000 వాణిజ్య బ్యాంకు శాఖలు 10,000 కోపరేటివ్ బ్యాంకు శాఖలు ఉన్నాయని తెలిపారు. ఆర్బీఐ కొత్త నోట్లను బ్యాంకు శాఖలకు, ఏటీఎంలకు సప్లై చేయలేకపోతే, వచ్చే 24, 48 గంటల్లో సాధారణ ప్రజానీకానికి కొత్త నోట్ల పంపిణీ సాధ్యం కాదని హెచ్చరించారు. 500, 1000 నోట్ల రద్దుతో సాధారణ ప్రజలు చాలా అవస్థలు పడాల్సివస్తుందన్నారు. కాగ, నిన్న రాత్రి ప్రధాని నరేంద్రమోదీ బ్లాక్‌మనీపై సర్జికల్ స్టైక్ ప్రకటిస్తూ.. 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు షాకింగ్ నిర్ణయం ప్రకటించారు. ఈ ప్రకటనతో ఒక్కసారిగా సాధారణ ప్రజల్లో భయాందోళన నెలకొంది. 500, 1000నోట్లను ఏటీఎంలలో డిపాజిట్ చేసి, 100 రూపాయల నోట్లు తీసుకోవడం కోసం ప్రయత్నించారు. కానీ ఏటీఎంలన్నీ స్ట్రక్ కావడంతో, ప్రజలు రోడ్లపై బారులు తీశారు.