బీచ్‌లో మహిళ ఆత్యహత్యాయత్నం
మొగల్తూరు : మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ వద్ద గురువారం సాయంత్రం ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చేతి నరాలు కోసుకుని ఆత్మహత్య చేసుకుంటుండగా స్థానికులు గమనించి అడ్డుకున్నారు. 108 అంబులెన్స్‌లో ఆమెను నరసాపురం ఆస్పత్రికి తరలించారు. మొగల్తూరు స్టేషన్ పరిధి తూర్పుతాళ్లు గ్రామానికి చెందిన కట్టా శారదగా ఆమెను గుర్తించారు. విషయం తన దృష్టికి వచ్చిందని, పూర్తి సమాచారం లేదని మొగల్తూరు ఎస్సై డీజే రత్నం తెలిపారు.