beginning
-
మనకు రెండు వందే సాధారణ్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: వందేభారత్ రైళ్ల తర్వాత అదే తరహాలో సిద్ధమవుతున్న వందే సాధారణ్ రైళ్లు వచ్చే నెలలో పట్టాలెక్కబోతున్నాయి. వందేభారత్ రైళ్లు పూర్తి ఏసీ కోచ్‌లతో ఉండగా, ఇవి నాన్ ఏసీ కోచ్‌లతో నడిచే సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లు. వందేభారత్ రైళ్లలో టికెట్ ఛార్జీలు ఎక్కువగా ఉండటంతో పేద ప్రజలు వాటిలో ప్రయాణించడానికి ఇష్టపడటం లేదు. ఈ వెలితిని దూరం చేయాలన్న ఉద్దేశంతో దాదాపు అదే రూపంతో, ఇంచుమించు అంతే వేగంతో నడిచేలా కేంద్ర ప్రభుత్వం వందే సాధారణ్ పేరుతో ఈ రైళ్లను అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగా చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో సిద్ధమైన తొలి రైలును పశ్చిమ రైల్వేకు కేటాయించారు. అది రెండు రోజుల క్రితం ముంబైకి చేరుకుంది. దాన్ని ఢిల్లీ–ముంబై మధ్య నడిపే యోచనలో అధికారులున్నారు. ఇప్పటికే వందే సాధారణ్ రైళ్ల కోసం ఐదు మార్గాలకు రైల్వే బోర్డు అనుమతించింది. ఇందులో హైదరాబాద్–న్యూఢిల్లీ కూడా ఉండటం విశేషం. మరో 13 మార్గాలలో నడిపేందుకు అధికారులు ప్రతిపాదించారు. వాటికి అనుమతి రావాల్సి ఉంది. ఆ జాబితాలో హైదరాబాద్–నాగర్‌కోయల్ సర్విసు కూడా ఉండటం విశేషం. వెరసి తెలంగాణకు రెండు వందేసాధారణ్ రైళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. పుష్పుల్ పద్ధతిలో.. తొలి రెండు విడతలలో పట్టాలెక్కిన వందేభారత్ రైళ్లు తెలుపు రంగుపై నీలి చారలతో ఆకట్టుకున్నాయి. మూడో విడతకొచ్చేసరికి కాషాయం–నలుపులతో కూడిన మరింత ఆకర్షణీయ కలర్ కాంబినేషన్ ప్రత్యక్షమైంది. ఇప్పుడు వందే సాధారణ్ రైళ్లు కూడా కాషాయ–నలుపు కాంబినేషన్‌తో వస్తున్నాయి. వందేభారత్ తరహాలోనే ఇవి కూడా పుష్పుల్ ఇంజన్లతో నడుస్తాయి. అయితే, వందేభారత్‌లో ఇంజిన్లు విడిగా ఉండవు. రైలులోనే అంతర్భాగంగా ఉంటాయి. వందే సాధారణ్లో మాత్రం డబ్లూపీ–5 లోకోమోటివ్లను ముందు ఒకటి వెనక ఒకటి అమరుస్తారు. 130 కి.మీ. గరిష్ట వేగం.. డబ్ల్యూపీ–5 లోకోమోటివ్‌లు గంటకు 200 కి.మీ. వేగంతో ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటా యి. కానీ, వందే సాధారణ్ రేక్ వేగాన్ని తట్టుకునే 130 కి.మీ.వేగాన్ని మాత్రమే తట్టుకుంటాయి. ఇక ట్రాక్ సామర్థ్యం కూడా చాలా ప్రాంతాల్లో అంతే ఉంది. దీంతో ఈ రైలు గరిష్ట వేగం గంటకు 130 కి.మీ. 2004లో రైల్వే జన్సాధారణ్ పేరుతో రైళ్లను ప్రారంభించారు. సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే వేగంగా వెళ్లే ఈ రైళ్లు పూర్తిగా అన్ రిజర్వ్డ్ కోచ్‌లతో ఉంటాయి. కానీ, అవి సరిగా నడవలేదు. ఇప్పుడు వాటిని రీప్లేస్ చేస్తున్నట్టుగా వందే సాధారణ్ పేరుతో రైళ్లను ప్రారంభిస్తుండటం విశేషం. ఈ రైలులో రెండు ఇంజన్లతోపాటు 12 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 8 జనరల్ కంపార్ట్మెంట్ కోచ్‌లుంటాయి. ప్రతి కోచ్‌లో సీసీటీవీ కెమెరాలు, ప్రతి సీట్ వద్ద ఫోన్ ఛార్జింగ్ పాయింట్లు, మడత స్నాక్ టేబుల్స్, లగేజీ ర్యాక్, అగ్ని నియంత్రణ వ్యవస్థ ఉంటాయి. సెమీ పర్మనెంట్ కప్లర్స్ వ్యవస్థ వల్ల కుదుపులు తక్కువ. ఈ రైళ్లు 8.36 నిమిషాల్లో 110 కి.మీ. వేగాన్ని అందుకుంటాయి. 130 కి.మీ. వేగాన్ని 9.2 నిమిషాల్లో అందుకుంటాయి. అనుమతి పొందిన మార్గాలు ఇవీ.. ఢిల్లీ– ముంబై ఢిల్లీ – పట్నా ఢిల్లీ – హౌరా ఢిల్లీ – హైదరాబాద్ గువాహటి – ఎర్నాకులం పరిశీలన జాబితాలో ఉన్న రూట్లలో కొన్ని హైదరాబాద్ – నాగర్‌కోయల్ దర్బంగా– లూథియానా ముంబై–చాప్రా ముంబై–రాక్సౌల్ ముంబై–జమ్మూతావి దర్బంగా–అహ్మదాబాద్ కోల్‌కతా–పోర్బందర్ వారణాసి–దర్బంగా సార్సా–అమృత్సర్ మెంగళూరు–కోల్‌కతా గువాహటి–జమ్మూతావి -
తెలంగాణలో ఆగస్టు నెలంతా ప్రవేశ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: వివిధ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అవి నెలంతా కొనసాగనున్నాయి. ఈ పరీక్షలకు రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నారు. ముందుగా మంగళవారం (నేడు) ఈ–సెట్ జరగనుంది. దీన్ని రెండు విడతలుగా నిర్వహిస్తారు. మొదటి విడత ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో విడత మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షను 24 వేల మందికిపైగా రాయనున్నారు. దీనికోసం 41 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. ఇక ఈ నెల 4 నుంచి ఎంసెట్‌ను నిర్వహిస్తున్నారు. కోవిడ్ వచ్చిన వారికి పరీక్ష తేదీలను రీషెడ్యూల్ చేస్తారు. 4, 5, 6వ తేదీల్లో ఇంజనీరింగ్‌కు, 9, 10 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. దీనికోసం తెలంగాణలో 82 కేంద్రాలు, ఏపీలో 23 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ చెప్పారు. ఈ ప్రవేశ పరీక్షలను కూడా రెండు విడతలుగా నిర్వహిస్తారు. తొలి విడత ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో విడత మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు. ఎంసెట్‌కు మొత్తం విద్యార్థులు 2,51,132 మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో ఇంజనీరింగ్ 1,64,678 మంది, మెడికల్ 86,454 మంది రాస్తున్నారని తెలిపారు. అలాగే, ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు బిట్స్ ప్రవేశ పరీక్ష జరుగనుంది. మరోవైపు ఈ నెల 4వ తేదీన డిగ్రీ సీట్లను కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలోని డిగ్రీ సీట్లను దోస్త్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ సీట్ల కోసం దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. కరోనా జాగ్రత్తల మధ్య పరీక్షలు... కరోనా సెకండ్ వేవ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోనూ పలు జిల్లాల్లో కేసుల పెరుగుదల కనిపిస్తోంది. మరోవైపు థర్డ్‌వేవ్‌కు సంబంధించి హెచ్చరికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెలలో జరిగే ప్రవేశ పరీక్షలకు అన్ని రకాల కోవిడ్ జాగ్రత్తలు చేపట్టినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్ లింబాద్రి తెలిపారు. శానిటైజర్లు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భౌతిక దూరం ఉండేలా విద్యార్థులకు సీట్లను కేటాయిస్తున్నామని చెప్పారు. పరీక్షా హాలులోకి ప్రవేశించే ముందు జ్వరం చూస్తారని, విద్యార్థులు మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. సెల్ఫ్ డిక్లరేషన్ ఫాం ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరికైనా కోవిడ్ ఉంటే వారి విన్నపం మేరకు తదుపరి.. పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. -
యాదాద్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ..
-
రబీకి సై..
అమలాపురం: చిన్నచిన్న ఇబ్బందులు మినహా.. ఖరీఫ్ సాగు దాదాపు ఆశాజనకంగానే ముగియడంతో.. రైతులు ఇక రబీ సాగు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే అన్నపూర్ణగా పేరొందిన గోదావరి డెల్టాలో రబీ సాగు ఆదివారం ఆరంభం కానుంది. ఈ ఏడాది సమృద్ధిగా సాగు నీరు ఉంటుందని అధికారులు ప్రకటించడంతో రైతులు సాగుపై ఆశలు పెంచుకున్నారు. ప్రస్తుతం గోదావరిలో సహజ జలాలు తగ్గడం అధికారులకు కాస్త ఆందోళన కలిగిస్తున్నా.. సీలేరు జలాలు కూడా తోడు కానుండడంతో రబీ సాగుకు ఢోకా ఉండదనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. రబీ సాగుకు వీలుగా అధికారులు గోదావరి డెల్టా కాలువలకు ఆదివారం నుంచి నీటి విడుదల పెంచనున్నారు. తూర్పు డెల్టాకు ఎక్కువగా, మధ్య డెల్టాలో కోతలు పూర్తి కానందున వారం రోజుల పాటు తక్కువగా నీరందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తూర్పు డెల్టాలో ఇప్పటికే బోర్ల మీద కొంతమంది రైతులు రబీ నారుమడులు పోసుకున్నారు. ఇక్కడ వెదజల్లు సాగుకు అనుగుణంగా ఎక్కువ మంది రైతులు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ రెండు డెల్టాలతో పాటు పిఠాపురం బ్రాంచ్ కెనాల్ (పీబీసీ) పరిధిలో మొత్తం 4,36,533 ఎకరాల్లో వరిసాగు జరుగుతోంది. మొత్తం సాగు కాలంలో కనీసం 90 టీఎంసీల నీరు అవసరమన్నది అధికారుల అంచనా. ఇందులో సీలేరు పవర్ జనరేషన్, బైపాస్ పద్ధతిలో 47 టీఎంసీలు, సహజ జలాలు 46 టీఎంసీలు వస్తాయని లెక్కలు కట్టారు. మొత్తం 93 టీఎంసీల నీరు వస్తున్నందున సాగుకు ఢోకా ఉండదని భావించారు. ఈ ఉద్దేశంతోనే రబీ మొత్తం ఆయకట్టుకు గత నెల 7న కాకినాడలో జరిగిన జిల్లా సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఖరీఫ్‌లో మంచి దిగుబడులు పొందిన రైతులు.. రబీలో కూడా అదే ఫలితాన్ని సాధిస్తే ఈ ఏడాది వ్యవసాయంలో లాభాలు చూసే అవకాశముంటుందన్న ఆశతో ఉన్నారు. డెల్టాలో రబీసాగుకు సిద్ధమవుతున్న సమయంలో గోదావరిలో సహజ జలాల తగ్గుదల రైతులను, అధికారులను ఆలోచనలో పడవేస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద శనివారం ఉదయం ఆరు గంటల సమయానికి ఇన్‌ఫ్లో 8,221 క్యూసెక్కులు మాత్రమే. ఇదే సమయంలో పట్టిసీమ 12 పంపుల ద్వారా కృష్ణా డెల్టాకు 4,250 క్యూసెక్కుల నీటిని తోడారు. అంటే మొత్తం ఇన్‌ఫ్లో 12,471 క్యూసెక్కులన్న మాట. ఇందులో సీలేరు పవర్ జనరేషన్ ద్వారా 3,384 క్యూసెక్కులు వస్తోంది. దీనిని మినహాయిస్తే 9,087 క్యూసెక్కులు మాత్రమే గోదావరి సహజ జలాలు రావడం గమనార్హం. వచ్చిన నీటిలో ప్రస్తుతం తూర్పు డెల్టాకు 400, మధ్య డెల్టాకు 800, పశ్చిమ డెల్టాకు 2,500 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 4,573 క్యూసెక్కుల మిగులు జలాలు వదులుతున్నారు. గోదావరి సహజ జలాలు 10 వేల క్యూసెక్కుల కన్నా తక్కువగా ఉండడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. గత ఏడాదితో పోల్చుకుంటే వీటి రాక రెట్టింపు ఉంది. గత ఏడాది డిసెంబర్ రెండు, మూడు తేదీల్లో సహజ జలాలు 4,167 క్యూసెక్కులు మాత్రమే కావడం గమనార్హం. ఇది డిసెంబర్ 8 నాటికి సున్నాకు పడిపోయింది. తరువాత కొంతమేర పెరిగినా ఆశించిన స్థాయిలో సహజ జలాలు రాలేదు. అప్పటితో పోల్చుకుంటే ఈ ఏడాది నీటి రాక ఆశాజనకంగా ఉండడం అధికారుల్లో ధీమాను పెంచుతోంది. అయితే రైతులు నిర్ణీత షెడ్యూలు ప్రకారం సాగు పూర్తి చేస్తే మంచిదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ మొదటి వారానికి పూర్తి చేయాలని కోరుతున్నారు. ముందస్తు సాగు చేయాలి.. సహజ జలాలు తగ్గుతున్నా సాగుకు పూర్తిగా నీరు ఇవ్వడంలో ఎటువంటి ఇబ్బందీ ఉండదు. కానీ రైతులు ముందుగా సాగు చేసుకోవడం అన్నివిధాలుగా మంచిది. మధ్య డెల్టాలో కోతలు ఆలస్యమయ్యే అవకాశమున్నందున మరో వారం రోజుల పాటు పూర్తి స్థాయిలో నీటి విడుదల చేయలేం. ఇక్కడ ఖరీఫ్ ఆలస్యమైనా రబీకి రైతులు సన్నాహాలు చేసుకోవాలి. డిసెంబర్ నెలాఖరుకు నాట్లు పూర్తి చేసుకోవాలి. – ఎన్.కృష్ణారావు, ఎస్ఈ, గోదావరి ఇరిగేషన్ సర్కిల్, ధవళేశ్వరం -
జెడ్పీ స్థాయీ సంఘాల ప్రాధాన్యం పెరిగేనా?
సాక్షి, ఆదిలాబాద్: కొత్త జెడ్పీ.. పాలకవర్గం ప్రమాణస్వీకారం చేసి నెలరోజులు దాటింది. పాలన వ్యవహారాలు ప్రారంభమైతేనే పనితీరు ఎలా ఉంటుందో తెలుస్తుంది. పాలకవర్గం ఇంకా క్రియాశీలకం కాలేదు. సమావేశాల నిర్వహణతోనే ఇటు జెడ్పీలో అధికారులు, సిబ్బంది పరంగా విధుల నిర్వహణ, ఇటు పాలకవర్గం వ్యవహారం స్పష్టం అవుతుంది. ప్రస్తుతం కొత్త జెడ్పీ పాలకవర్గం ‘స్థాయీ’ పెంచేలా వ్యవహరిస్తుందా.. లేదా అనేది భవిష్యత్ నిర్ధారించనుంది. మ్మడి జిల్లా ఉన్నప్పుడు 52 మండలాలతో జెడ్పీ పాలన సందడిగా ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలపాటు కొత్త జెడ్పీలు ఏర్పాటు చేయడంతో మార్పులు జరిగాయి. అప్పుడు 52 మంది జెడ్పీటీసీ సభ్యులు ఉండగా, ప్రస్తుతం కొత్త జిల్లాలో 18 మండలాల్లో ఆదిలాబాద్‌అర్బన్ మండలం మినహా 17 మంది ఉన్నారు. దీంతో స్థాయీ సంఘాలు, సర్వసభ్య సమావేశంలో మునపటి సభ్యుల సందడి కనిపించే అవకాశం లేదు. అయితే ప్రస్తుత పాలకవర్గంలో అధికార టీఆర్ఎస్ తొమ్మిది మంది సభ్యులను కలిగి ఉంది. ఇక బీజేపీ ఐదుగురు, కాంగ్రెస్ ముగ్గురు జెడ్పీటీసీలు ఉన్నారు. ఇందులో కాంగ్రెస్‌కు చెందిన ఉట్నూర్ జెడ్పీటీసీ చారులత జెడ్పీ చైర్మన్ ఎన్నికలో టీఆర్ఎస్కు మద్దతు తెలిపింది. దీంతో ఆమె కాంగ్రెస్ వైపు ఉండే అవకాశాలు లేవు. అయినా జెడ్పీచైర్మన్ ఎన్నిక సమయంలో ఐదుమంది సభ్యులు ఉన్న బీజేపీ తన అభ్యర్థిని బరిలోకి దించడం, దానికి కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు సభ్యులు మద్దతు ఇవ్వడం జరిగింది. అయితే మెజార్టీ సభ్యులు టీఆర్ఎస్ వైపు ఉండడంతో పాలకవర్గం అధికార పార్టీ వంతైంది. ఇదిలా ఉంటే స్థాయీ సంఘం, సర్వసభ్య సమావేశాల్లో బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు కలిసి అధికార టీఆర్ఎస్ పార్టీని సమస్యలపై ఎండగట్టే అవకాశాలు లేకపోలేదు. అలాంటి సమయంలో రాజకీయాలకే కొత్తైన జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ సమర్థవంతంగా వారిని తిప్పికొడతారా.. లేనిపక్షంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేది సమావేశాల్లోనే స్పష్టమయ్యే పరిస్థితి ఉంది. సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. అయితే స్థాయీ సంఘాల్లో మాత్రం వారిని కూడా సభ్యులుగా తీసుకోనున్నారు. కాగా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వారే ఉండటంతో పాలక పక్షానికి బలంగా ఉంది. అయితే ఎంపీ బీజేపీ సోయం బాపురావు ప్రాతినిధ్యం వహిస్తుండటం, ఆ పార్టీకి ఐదుగురు సభ్యులు ఉండటం, ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు మద్దతు పలికే అవకాశం ఉండడంతో సమావేశాల్లో వాడీవేడి ఉండే అవకాశాలు లేకపోలేదు. స్థాయీ సంఘాలు కీలకం.. జిల్లా పరిషత్ పాలకవర్గం ప్రమాణస్వీకారం చేసిన 60 రోజుల్లోపు స్థాయీ సంఘాలను నియమించాల్సి ఉంటుంది. ఇందులో ఏడు స్థాయీ సంఘాలు ఉన్నాయి. వాటిలో ప్రణాళిక ఆర్థిక పన్నులు, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్యసేవలు, మహిళ సంక్షేమం, సాంఘిక సంక్షే మం, నిర్మాణ పనుల స్థాయీ కమిటీలు ఉన్నా యి. ఇందులో ప్రణాళిక ఆర్థిక పన్నులు, నిర్మాణ పనుల స్థాయి కమిటీలకు సభ్యుల నుంచి అధిక డిమాండ్ ఉంటుంది. అయితే ప్రస్తుతం జెడ్పీలో 17మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు, కోఆప్షన్ సభ్యులను మన జెడ్పీ స్థాయీ సంఘంలో సభ్యులుగా తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలు సంపూర్ణంగా ఉండగా, ఆసిఫాబాద్, ఖానాపూర్ నియోజకవర్గాల్లోని మండలాలు పాక్షికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలతోపాటు ఆసిఫాబాద్, ఖానాపూర్ ఎమ్మెల్యేలను కూడా స్థాయీ సంఘంలో సభ్యులుగా తీసుకోవాల్సి వస్తుందా.. లేదా అనే విషయంలో జెడ్పీ ఉన్నతాధికారులు రాష్ట్ర అధికారుల నుంచి సమాచారం కోరారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి నిబంధన ఉందో ఇక్కడ కూడా అదే అమలవ్వాలని ఉంది. తద్వారా జిల్లాలో పాక్షికంగా ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఆదిలాబాద్ జెడ్పీ స్థాయీ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తారా.. లేదా అన్నది త్వరలో తేలిపోనుంది. అయితే ఈ స్టాండింగ్ కమిటీల నియామకానికి సంబంధించి ఇప్పటి వరకు పైనుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో కదలిక కనబడటంలేదు. సుమారు నెలరోజుల సమయం ఉండడంతో అధికారులు పై విషయాల్లో స్పష్టత కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీలుగా ఉపాధ్యాయ వర్గం నుంచి గెలిచిన రఘోత్తం రెడ్డి, పట్టభద్రుల స్థానం నుంచి గెలిచిన కాంగ్రెస్ పార్టీకి చెందిన జీవన్ రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన పురాణం సతీశ్‌లు ఉన్నారు. అయితే పురాణం సతీశ్‌ను స్థాయీ సంఘంలో సభ్యుడిగా తీసుకునే విషయంలో అధికారులు స్పష్టత కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా సతీశ్ మంచిర్యాల జిల్లా ఓటరుగా ఉండడంతో అక్కడి జెడ్పీలోనే స్థాయీ సంఘం సభ్యుడిగా వ్యవహరించే అవకాశం లేకపోలేదని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ నియామకాలు జరిగే అవకాశం ఉంది. ఏదేమైనా అధికార పార్టీ సభ్యులకే స్థాయీ సంఘంలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అదే సమయంలో విపక్ష సభ్యులకు కూడా సంఘాల్లో అవకాశం కల్పించినా అప్రాధాన్యత సంఘాల్లో వారికి చోటు కల్పించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో పాలకవర్గాన్ని విపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ల వ్యవహార శైలి ఎలా ఉండబోతుందో త్వరలో తేలిపోనుంది. సమావేశాలతోనే పాలనలో పరుగు జెడ్పీ కొలువుదీరి నెలరోజులు దాటినా ఇప్పటికీ పాలన పట్టాలెక్కలేదు. ప్రధానంగా సమావేశాల ప్రారంభంతోనే వేగం పుంజుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లా పరంగా ఆదిలాబాద్ జెడ్పీలో 69 మంది ఉద్యోగులు విధులు నిర్వహించేవారు. అయితే నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్‌లో కొత్త జెడ్పీల ఏర్పాటుతో ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులనే అక్కడికి విభజించారు. ప్రస్తుతం కొత్త ఆదిలాబాద్ జెడ్పీలో 22 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ప్లానింగ్, అకౌంట్స్, వర్క్స్, జీపీఎఫ్, విద్య సెక్షన్లను ఒక్కొక్క సూపరింటెండెంట్ పర్యవేక్షించేవారు. ప్రస్తుతం ఈ ఐదు సెక్షన్లకు కలిపి ఇద్దరు సూపరింటెండెంట్లను నియమించారు. అయితే ఇప్పటికి కార్యకలాపాల పరంగా వేగం పుంజుకోలేదు. ప్రధానంగా ఒకట్రెండు సమావేశాలు జరిగి విధివిధానాలు స్పష్టమైతేనే జెడ్పీలో అధికార కార్యకలాపాలు ఊపందుకునే అవకాశం ఉంది. సీఈఓలకే నిధుల కేటాయింపు అధికారం.. ఆదిలాబాద్ జెడ్పీలో ఎన్నికల సమయంలో, ప్రమాణస్వీకారం రోజు సీఈఓగా ఉన్న నరేందర్‌ను ఇక్కడి నుంచి మంచిర్యాలకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో ప్రస్తుతం కిషన్ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే మధ్యలో సీఈఓగా వేణు అనే అధికారి ఇక్కడికి బదిలీపై వచ్చి ఒకేరోజు పనిచేసి వెళ్లిపోయారు. ప్రధానంగా రెవెన్యూ అధికారి అయిన వేణు జెడ్పీ కార్యకలాపాల్లో పీఆర్ సిబ్బంది మధ్య ఇక్కడ ఇమడలేకపోయారన్న విమర్శ లేకపోలేదు. అదే సమయంలో గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జెడ్పీలోనే ఏఓగా పనిచేసిన కిషన్ ఆదిలాబాద్ జెడ్పీ సీఈఓగా రావడం యాదృచ్చికంగా జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఉమ్మడి పాలకవర్గంలో జెడ్పీకి వివిధ పథకాల కింద నిధుల కేటాయింపు జరగకపోవడంపై అప్పట్లో సభ్యులు ప్రతీ సమావేశంలోనూ ఆక్షేపన వ్యక్తం చేసేవారు. ప్రస్తుతం కొత్త జెడ్పీలకు నిధులు కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నిధుల విడుదల, వినియోగం, అధికారాలను జెడ్పీ సీఈఓకు కల్పిస్తూ పంచాయతీరాజ్ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలో జెడ్పీ సీఈఓల ఆమోదం తర్వాత నిధుల కేటాయింపు, విడుదల, పంపిణీ అధికారాలు డిప్యూటీ సీఈఓలకు ఉండగా, ప్రస్తుతం మార్పు చోటుచేసుకుంది. ప్రస్తుతం డిప్యూటీ సీఈఓల పోస్టులను ప్రభుత్వం రద్దు చేసింది. వారి స్థానంలో ప్రతీ జెడ్పీకి అకౌంట్ ఆఫీసర్ పోస్టును కేటాయించారు. ఈ నేపథ్యంలో గతంలో ఉమ్మడి జెడ్పీకి ఏఓగా వ్యవహరించిన కిషన్ ప్రస్తుతం సీఈఓగా నిధుల విడుదల, వినియోగంలో క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు. ఆదేశాలు రావడమే తరువాయి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే స్థాయీ సంఘాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. ఈ సంఘాల ఏర్పాటుతోపాటు మన జెడ్పీ పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేల విషయంలోనూ ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. – కిషన్, జెడ్పీ సీఈఓ -
దేశవ్యాప్తంగా 91 నియోజకవర్గాల్లో పోలింగ్ షురూ
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 91 నియోజకవర్గాల్లో లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్ గురువారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్, అసోం, బిహార్, ఒడిశా,చండీగఢ్, జమ్ము కశ్మీర్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయా, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర, అండమాన్ నికోబార్, లక్షద్వీప్‌ల్లోని పలు నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరుగుతోంది. ఇక జనరల్ నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందని, ఈశాన్య రాష్ట్రాల్లో ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ ఐదు గంటల వరకూ కొనసాగుతుందని ఈసీ ప్రకటించింది. అయితే మణిపూర్, నాగాలండ్‌లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగుస్తుందని పేర్కొంది. మరోవైపు తొలివిడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. -
హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభం
-
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభం
-
నేడు అంధుల టీ-20 వరల్డ్‌కప్ మ్యాచ్
తలపడనున్న దక్షిణాఫిక్రా - వెస్టిండీస్ ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు వేదిక : ఆర్డీటీ ప్రధాన మైదానం సమయం : ఉదయం 10 గంటలకు ప్రవేశం : ఉచితం అనంతపురం సప్తగిరి సర్కిల్ : నేడు అంధుల టీ-20 వరల్డ్‌కప్ మ్యాచ్ జరుగనుంది. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు ఈ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఆర్డీటీ క్రీడా మైదానంలో జరుగనున్న ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. కలెక్టర్ కోన శశిధర్ మ్యాచ్‌ను ప్రారంభించనున్నారు. క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా(క్యాబి), సమర్థనం ట్రస్ట్‌లు సంయుక్తంగా ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా జరుగుతున్న పోటీల్లో భాగంగా అనంతపురంలోనూ మ్యాచ్ జరుగుతోంది. పిచ్ సిద్ధం వరల్డ్ కప్ మ్యాచ్‌లో భాగంగా ఽఆర్డీటీ సిబ్బంది ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా మ్యాచ్ జరిగే పిచ్‌తో పాటు అవుట్‌ఫీల్డ్‌ను సిద్ధం చేశారు. క్రీడాకారులకు ఏమాత్రం ఇబ్బందిలేకుండా చర్యలు తీసుకున్నారు. ప్రవేశం ఉచితం జిల్లాలో మొదటిసారిగా జరుగుతున్న అంధుల టీ-20 వరల్డ్‌కప్ మ్యాచ్‌ను ప్రతి ఒక్కరూ ఉచితంగానే చూడొచ్చని సమర్థనం ట్రస్ట్ ఆంధ్ర, తెలంగాణ హెడ్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మ్యాచ్‌ను దాదాపు 8 వేల మంది వీక్షించే అవకాశం ఉందని చెప్పారు. వివిధ పాఠశాలలకు చెందిన 3 వేల మంది విద్యార్థులు మ్యాచ్‌ను వీక్షిస్తారన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈఓ, ఎంఈఓలకు ఇన్విటేషన్లను అందించామని తెలిపారు. మ్యాచ్ విజయవంతానికి అందరూ సహకరించాలన్నారు. 100 మంది వలంటీర్లు వరల్డ్ కప్ మ్యాచ్‌ను వీక్షించేందుకు వీఐపీ, వీవీఐపీల కోసం ప్రత్యేకమైన గ్యాలరీలను ఏర్పాటు చేశారు. వారి కోసం ప్రత్యేకంగా సీట్లను కేటాయించారు. ఇక.. మైదానంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లను చేపట్టారు. అలాగే 100 మంది వలంటీర్లను ఈ మ్యాచ్ సజావుగా జరిగేందుకు నియమించారు. జిల్లా క్రీడాకారులే అంపైర్లు అంధుల ప్రపంచకప్ పోటీలకు జిల్లాకు చెందిన క్రీడాకారులు అన్సర్‌ఖాన్, బాలసుబ్రహ్మణ్యం, అక్కులన్నలు అంపైర్లుగా ఎంపికయ్యారు. వీరిలో బీసీసీఐ లెవల్1 క్వాలిఫైయింగ్ అంపైర్లుగా అన్సర్‌ఖాన్, బాలసుబ్రహ్మణ్యం , స్కోరర్‌గా అక్కులన్న వ్యవహరిస్తారు. వీరితో పాటు ఆన్లైన్ స్కోరర్‌గా రాష్ట్ర క్రీడాకారుడు వినీల్కుమార్ను నియమించారు. -
31నుంచి ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం
సాక్షి, తిరుమల: 2017 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్ల వయసు నిండిన వారు కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియ అక్టోబరు 31వ తేదీ నుంచి ప్రారంభిస్తామని తిరుమలలో వెల్లడించారు. బుధవారం ఆయన తలనీలాలు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ అన్ని మండల కేంద్రాలు, ఆర్టీవో, సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటేనే ప్రజాస్వామ్యంలో భాగస్వాములవుతారని, అందువల్ల ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు కావాలని భన్వర్‌లాల్ పిలుపునిచ్చారు. -
స్పెక్ట్రమ్ మెగా వేలం నేటి నుంచే
-
స్పెక్ట్రమ్ మెగా వేలం నేటి నుంచే
♦ రేసులో ఏడు కంపెనీలు ♦ రిజర్వ్ ధర రూ.5.66 లక్షల కోట్లు న్యూఢిల్లీ: దేశ చరిత్రలోనే తొలిసారిగా భారీ స్థాయిలో నిర్వహిస్తున్న స్పెక్ట్రమ్ వేలం శనివారం నుంచి ప్రారంభమవుతోంది. ఏడు బ్యాండ్లలో మొత్తం 2,354.55 మెగాహెడ్జ్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ వేలానికి రానుంది. రూ.5.66 లక్షల కోట్లను రిజర్వ్ ధరగా కేంద్ర సర్కారు ఖరారు చేసింది. పాల్గొనే కంపెనీలు: భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులర్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్‌సెల్, టాటా టెలి ధరావతు సొమ్ము: ఏడు టెలికం సంస్థలు రూ.14,653 కోట్లను ధరావతు సొమ్ము కింద జమ చేశాయి. ఓ ఆపరేటర్... తాను బిడ్ వేసే స్పెక్ట్రమ్ విలువలో సుమారు పది శాతాన్ని ధరావతు కింద జమ చేయాల్సి ఉంటుంది. రిలయన్స్ జియో మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) రూ.6,500 కోట్లు, వొడాఫోన్ రూ.2,740 కోట్లు, ఐడియా రూ.2,000 కోట్లు, ఎయిర్టెల్ రూ.1,980 కోట్లు జమ చేశాయి. వేలం అంతా ఆన్లైన్లోనే: వేలం ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే కొనసాగుతుంది. ఈ బాధ్యతలను ఎం-జంక్షన్ సర్వీసెస్ అనే సంస్థకు సర్కారు అప్పగించింది. ఈ వారం ప్రారంభంలో డమ్మీ వేలం నిర్వహించి అంతా సాఫీగానే ఉన్నట్టు ప్రభుత్వం నిర్ధారించుకుంది. వేలం సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరుకు కొనసాగుతుంది. -
వికలాంగుల సాంస్కృతిక పోటీలు ప్రారంభం
న్యూశాయంపేట : జ్యోతిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో మొదటిసారిగా మానసిక వికలాంగులకు, అనాథలకు నిర్వహిస్తున్న సాంస్కృతిక పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు హన్మకొండ బాలసముద్రంలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో కలెక్టర్ వాకాటి కరుణ ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 40 స్వచ్ఛంద సంస్థలకు చెందిన వికలాంగ, అనాథలు 200 మంది ప్రదర్శనలు ఇచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అనాథ పిల్లలకు సాంస్కృతిక పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జ్యోతిరెడ్డి ఫౌండేషన్ అధ్యక్షురాలు దూదిబాల జ్యోతిరెడ్డి, సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ అనితారెడ్డి, రాజారపు ప్రతాప్, విజయ్‌పాల్‌రెడ్డి, జ్యోతిష్, రామలీల, శ్రీనివాస్, లక్ష్మణాచారి తదితరులు పాల్గొన్నారు. -
30 నుంచి నాల్కో బైబ్యాక్ ఆఫర్...
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నాల్కో షేర్ల బైబ్యాక్ ఈ నెల 30న ప్రారంభం కానుంది. సెస్టెంబర్ 14తో ముగుస్తుంది. ఇందులో భాగంగా రూ.2,835 కోట్ల విలువైన సుమారు 64.43 కోట్ల షేర్లను (22.15 శాతం వాటాకు సమానం) కొనుగోలు చేయనుంది. ఒక్కో షేరుకు రూ.44 చొప్పున చెల్లించనుండగా... ఇందుకుగాను రిజర్వ్ నిధులను వినియోగించనుంది. ఎస్బీఐ కేపిటల్ మార్కెట్స్‌కు బైబ్యాక్ కార్యక్రమ బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు ఆఫర్ లెటర్‌ను నాల్కో స్టాక్ ఎక్స్ఛేంజ్లకు అందజేసింది. మూలధనం తగ్గించడం ద్వారా దీర్ఘకాలంలో వాటాదారుల విలువ పెరుగనున్నట్టు కంపెనీ తెలిపింది. -
ప్రారంభానికి నోచుకోని బాలికల వసతిగృహం
–రూ.1.30కోట్ల నిధులతో పూర్తయిన వసతిగృహాం భవనం –రెండు వందల మంది బాలికలకు వసతి సౌకర్యం –ఇబ్బందులు పడుతున్న విద్యార్ధులు మునగాల: మండల కేంద్రంలో దాదాపు రూ.1.30కోట్ల నిధులతో నిర్మించిన ఆదర్శ పాఠశాల వసతి గృహాం నిర్మాణం పూర్తయినప్పటీకీ ప్రారంబానికి నోచుకోవడం లేదు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అన్ని సౌకర్యాలతో కూడిన ఈ వసతి గృహాంలో దాదాపు వంద మంది విద్యార్థినులకు వసతి సౌకర్యం కల్పించే వీలుంది. ఈ హాస్టల్లో 20 గదులున్నాయి. ఒక్కో గదికి నలుగురుకు ఉండే వీలు ఉంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినులు రెండు వందల మంది పైచిలుకే ఉన్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలకు ఇతర ప్రాంతాల నుంచి ఆటోలు, బస్సులు, సైకిళ్ల మీద విద్యార్థినులు నిత్యం పాఠశాలకు వచ్చి విద్యనభ్యసిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం ఆరంభంలో వసతి గృహాం ప్రారంభిస్తారనుకుంటే అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. నీటి సరఫరా, మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణంతో పాటు వసతి గృహాం చుట్టు ప్రహారీ గోడ నిర్మాణం కూడా పూర్తయింది. వీలైనంత త్వరలో వసతి గృహాన్ని ప్రారంభించి విద్యార్థినులను ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. నిత్యం ఇబ్బందులు పడుతున్నాం: శృతి తొమ్మిదో తరగతి,ఆకుపాముల ప్రతిరోజు పాఠశాలకు పది కి.మీ.దూరంలో ఉన్న ఆకపాముల నుంచి మునగాల వరకు ఆర్టీసీ బస్సులో వచ్చి బస్టాప్ నుంచి కి.మీ.దూరం నడిచి పాఠశాలకు వస్తున్నాను. దీంతో ప్రతిరోజు పాఠశాల వచ్చిపోయేందుకు రెండు గంటల సమయం పడుతోంది. దీంతో నిత్యం ఇబ్బందులు పడుతున్నాం. వసతి గృహాం ప్రారంభించి ఇబ్బందులు తొలగించాలి. వసతిగృహాన్ని తక్షణమే ప్రారంభించాలి: ప్రియాంక, ఇంటర్ ప్రథమ సంవత్సరం, కలకోవ వసతిగృహాం నిర్మాణం పూర్తయినప్పటీకీ నేటికి ప్రారంభించకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నాం. తక్షణమే వసతిగృహాన్ని ప్రారంభించి విద్యార్థులను ఇబ్బందులను తొలగించాలి. 20రోజుల్లో ప్రారంభిస్తాం: సాయిఈశ్వరి, పాఠశాల ప్రిన్సిపాల్ పాఠశాలకు అనుబంధంగా నిర్మించిన వసతి గృహాం నిర్మాణం పూర్తయింది. 20రోజుల్లో జిల్లా మంత్రిగారి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్ధినుల ఇబ్బందులు తొలగనున్నాయి. వసతి గృహానికి అవసరమైన సిబ్బంది నియామకానికి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తాం. -
'సజావుగా సాగనిస్తామన్నారు'
న్యూఢిల్లీ: కేంద్ర అఖిలపక్ష భేటీ సజావుగా జరిగిందని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ అన్నారు. అన్ని పార్టీల నేతలు సమావేశాలకు సహకరిస్తామని చెప్పారని తెలిపారు. ఆదివారం మంత్రి అనంత్ కుమార్ నేతృత్వంలో ఆదివారం అఖిలపక్ష భేటీ జరిగింది. ఇందులో రేపటి నుంచి జరగబోయే పార్లమెంటు సమావేశాలపై ఈ భేటీలో చర్చించారు. ముఖ్యంగా సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలకు ఎన్డీఏ విజ్ఞప్తి చేసింది. జీఎస్టీ బిల్లుపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్ సీపీ ఎంపీలు మేకపాటి, విజయసాయిరెడ్డి హాజరయ్యారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్ట సవరణ, విభజన హామీలపై వీరు ప్రస్తావించారని సమాచారం. -
నేటి నుంచి థైరోకేర్ ఐపీఓ
ధర శ్రేణి రూ.420-446 న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా డయాగ్నస్టిక్స్ ల్యాబొరేటరీ చెయిన్‌ను నిర్వహిస్తున్న థైరోకేర్ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) నేటి(బుధవారం) నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 29న (శుక్రవారం) నాడు ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఒక్కోటి రూ.10 ముఖ విలువగల 1.07 కోట్ల షేర్లను జారీ చేయనున్నారు. ఈ ఐపీఓకు ధరల శ్రేణిని రూ.420-రూ.446గా కంపెనీ నిర్ణయించింది. ఈ ధరల శ్రేణిలో గరిష్ట స్థాయి ధర ప్రకారం చూస్తే ఈ కంపెనీ ఈ ఐపీఓ ద్వారా రూ.480 కోట్లు సమీకరించనున్నదని అంచనా. ఈ ఐపీఓకు ఎడిల్‌వేజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సంస్థలు లీడ్ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. థైరో కేర్ కంపెనీకి డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్, ఎస్ఆర్ఎల్ డయాగ్నస్టిక్స్, మెట్రోపొలిస్ హెల్త్‌కేర్, అపోలో క్లినిక్‌ల నుంచి గట్టి పోటీనే ఉంది. -
సిటీ బస్ స్టార్ట్
ఖమ్మం నగర రోడ్లపై లోకల్ బస్సులు రయ్య్‌మ్రంటూ చక్కర్లు కొట్టనున్నాయి. మంగళవారం మంత్రి తుమ్మల సిటీబస్‌లను ప్రారంభించి, అందులో ప్రయాణించారు. నగరంలో తొలివిడతగా ఇల్లెందు రూట్లో ఎనిమిది, బోనకల్ రూట్లో నాలుగు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేసింది. -ఖమ్మం మామిళ్లగూడెం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నగరంలో సిటీ బస్సులు ప్రారంభం ఖమ్మం మామిళ్లగూడెం : ఆర్టీసీ అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం రీజియన్‌కు కొత్తగా వచ్చిన సిటీ బస్సులను నగరంలోని ఎన్నెస్పీలో గల కొత్త బస్టాండ్ స్థలంలో మంత్రి తుమ్మల మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థను రక్షించుకునేందుకు ప్రతీ ఒక్కరు సహకరించాలన్నారు. సంస్థను లాభాల బాట పట్టించేందుకు సహకారం అందించాలన్నారు. అలాగే నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దటానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, కలెక్టర్ లోకేష్‌కుమార్, ఆర్టీసీ ఆర్ఎం శివకుమార్, డిప్యూటీ సీటీఎం రామ్మూర్తినాయక్, సీఎంఈ జాన్‌రెడ్డి, డిప్యూటీ ఈఈ కె.లక్ష్మణ్, డీఎం సుగుణాకర్, సీఐ మహేష్‌కుమార్, పీజీడీఐ వినాయకరావు, ఎస్డీఐ ప్రభాకర్, ఎస్‌డబ్ల్యూఎఫ్ రీజియన్ కార్యదర్శి గడ్డం లింగయ్య, డిపో అధ్యక్షుడు తోకల బాబు, వివిధ యూనియన్ల నాయకులు పాల్గొన్నారు. టీఎంయూ వినతి డిపో పరిధిలో దాదాపు 160 బస్సులు నడుస్తున్నాయని, ప్రస్తుతం మంత్రి చొరవతో కొత్త 30 బస్సులు వస్తున్నాయని టీఎంయూ కార్యదర్శి ఎన్వీ.భద్రంతెలిపారు. పాలనాపరమైన ఇబ్బం దులను ఎదుర్కోవడానికి మరో డిపో ఏర్పాటు చేయాలని కోరారు. బస్సులను బైపాస్ ద్వారా మళ్లించడంవల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందు లు పడాల్సి వస్తోందన్నారు. అలాగే ఖమ్మం రీజియన్‌లో 3వేల మంది కార్మికులు పని చేస్తున్నారని, వారికి సొంతిళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన మంత్రి దృష్టికి తెచ్చారు. కాగా, వినతిపత్రం అందించిన వారిలో రీజి యన్ అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్, ఎన్వీ.భద్రం, డిపో అధ్యక్ష, కార్యదర్శులు బీఎన్.రెడ్డి, శంకర్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. -
కొత్త 108 వాహనాలకు మోక్షం
రేపు రోడ్డెక్కనున్న 145 కొత్త అంబులెన్సులు సాక్షి, హైదరాబాద్: కొత్త ‘108’ అంబులెన్సులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. వీటిని గురువారం హైదరాబాద్‌లో ప్రారంభించాలని వైద్య ఆరోగ్యశాఖ తాజాగా నిర్ణయించింది. దాదాపు ఆరు నెలలుగా వీటిపై తాత్సారం చేసిన ప్రభుత్వం ఎట్టకేలకు వీటిని రోడ్డెక్కించనుంది. జీవీకే-ఈఎంఆర్ఐ సంస్థకే వీటి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. కొత్త అంబులెన్సులను అందుబాటులోకి తేవడంలో సుదీర్ఘ జాప్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవడం, రోగుల ఇక్కట్లపై ‘సాక్షి’ కథనాలు ప్రచురించడంతో అధికారులు స్పందించారు. ప్రస్తుతం కండిషన్లో ఉన్న 195 అంబులెన్సులతోపాటు 145 కొత్త వాహనాలతో కలిపి మొత్తం 340 అంబులెన్సులను అత్యవసర సేవలకు వినియోగించుకుంటామని ‘108’ ప్రత్యేకాధికారి డాక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చుతున్నందున 108 అంబులెన్సులన్నింటినీ ఒకే రకంగా తీర్చిదిద్దుతామన్నారు. కొత్త అంబులెన్సులకు అత్యాధునిక సదుపాయాలు కల్పించారు. వాహనాలన్నింటికీ ట్యూబ్ లెస్ టైర్లు ఏర్పాటు చేశారు. అలాగే సడన్ బ్రేక్ వేసినప్పుడు వాహనాలు అదుపు తప్పకుండా యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్)ను అమర్చడంతోపాటు ఆటోమెటిక్ వెహికిల్ ట్రాకింగ్ సిస్టమ్ (ఏవీటీఎస్)ను ఏర్పాటు చేశారు. దీనివల్ల వాహనం ఎక్కడుందో నేరుగా కంట్రోల్ రూం నుంచి ఆన్లైన్లో వీక్షించవచ్చు. -
ముహూర్తం ఖరారు
25న బీబీనగర్ నిమ్స్‌లో ఓపీ సేవలు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: బీబీనగర్ నిమ్స్ ప్రారంభానికి ఎట్టకేలకు ముహుర్తం ఖరారైంది. స్థానికులకు తక్షణ వైద్యం అందించే చర్యల్లో భాగంగా ఈ నెల 25న ఓపీ సేవలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో గైనిక్, ఆర్థో, పిడియాట్రిక్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ వంటి సేవలు అందుబాటులో ఉం టాయి. ఆ తర్వాత ఇన్‌పేషంట్ సర్వీసులు కూడా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. ప్రస్తుతానికి పంజగుట్ట నిమ్స్‌లో పని చేస్తున్న వైద్యులనే ఇందుకు వినియోగించుకోవాలని నిర్ణయించింది. బీబీనగర్‌లో ఓపీ ప్రారంభంతో నల్లగొండ, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, మెదక్ జిల్లా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. నాలుగు అంతస్తుల్లో నాలుగు వందల పడకల సామర్థ్యంతో నిర్మించిన ఈ భవనంలో 4 ఆపరేషన్ థియేటర్లు, క్యాజువాలిటీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, స్పైన్, హెడ్ ఇంజూరీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, విభాగాలతో పాటు అధునాతన బ్లడ్ బ్యాంక్, ఎక్సరే, సీటీ, ఎంఆర్ఐ విభాగాల్ని ఏర్పాటు చేశారు. ప్రతి విభాగానికి ఆరుగురు నిష్ణాతులైన వైద్యులతో పాటు ప్రాథమిక అవసరాలకు 700 మంది నర్సింగ్, పారామెడికిల్, నాన్ పారామెడికల్ స్టాఫ్ అవసరం. కానీ ఇప్పటివరకు నియా మకాలు చేపట్టలేదు. దీంతో దశల వారీగా సేవలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఆ మేరకు తొలి దశలో బేసిక్ (ఆర్థోపెడిక్స్, గైనిక్, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ) ఓపీ వైద్య సేవల్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ చెప్పారు. -
హెచ్ సీయూలో తరగతులు ప్రారంభం
♦ శాంతించిన విద్యార్థులు.. 8 ప్రధాన డిమాండ్లతో వినతిపత్రం ♦ పది రోజుల్లో పరిష్కరించకుంటే మళ్లీ ఉద్యమిస్తామని హెచ్చరిక ♦ డిమాండ్లపై సానుకూలంగా వ్యవహరిస్తాం: ఇన్చార్జి వీసీ పెరియస్వామి సాక్షి, హైదరాబాద్: రోహిత్ ఆత్మహత్యతో ఉద్రిక్తంగా మారిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పరిస్థితులు చక్కబడుతున్నాయి. దాదాపు రెండు వారాల అనంతరం సోమవారం తరగతులు ప్రారంభం అయ్యాయి. వర్సిటీ ఇన్చార్జి వైస్ చాన్సలర్ పెరియస్వామి విజ్ఞప్తి మేరకు విద్యార్థులతో పాటు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది యధావిధిగా విధులకు హాజరయ్యారు. ఇక విద్యార్థులు ఎనిమిది డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఇన్చార్జి వీసీ పెరియస్వామికి అందజేశారు. పది రోజుల్లోగా తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమాన్ని తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని కేంద్ర మానవ వనరుల శాఖ తమకు సూచించిందని ఇన్చార్జి వీసీ పెరియస్వామి తెలిపారు. ఇక విద్యార్థుల డిమాండ్లపై సానుకూలంగా వ్యవహరిస్తున్న ఇన్చార్జి వీసీ పెరియస్వామికి కొంత సమయం ఇవ్వాలని భావిస్తున్నట్లు హెచ్‌సీయూ ఎస్సీ, ఎస్టీ అధ్యాపకులు, రోహిత్ ఉద్యమానికి అనుకూలంగా ఉన్న ఇతర అధ్యాపకులు పేర్కొన్నారు. అధ్యాపకులకు, అధ్యాపకేతర సిబ్బందికి వేతనాలు, విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్లు సోమవారం విడుదలైనట్లు తెలిపారు. మరోవైపు సోమవారం కూడా ముంబై, ఢిల్లీల్లో విద్యార్థుల నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. డిమాండ్లను పరిష్కరిస్తాం: ఇన్చార్జి వీసీ విద్యార్థుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఈ విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాల్సిందిగా మానవ వనరుల అభివృద్ధి శాఖ తనకు సూచించిందని ఇన్చార్జి వీసీ పెరియస్వామి తెలిపారు. ఆ డిమాండ్లలో తన పరిధిలో ఉన్న వాటిని వెంటనే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. వర్సిటీ వీసీ అప్పారావును తొలగించే అంశం తన పరిధిలోది కాదని, విచారణ కమిటీ నివేదిక అనంతరం కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. రోహిత్ తమ్ముడు రాజుకు ఆయన విద్యార్హతలను బట్టి ఎక్కడ అవకాశం కల్పించగలమనే దానిని వర్సిటీ పాలకమండలి పరిశీలిస్తోందన్నారు. అలాగే 50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించే అంశాన్ని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పరిశీలిస్తున్నట్లు తెలిసిందని... వర్సిటీ అధ్యాపకులు సైతం కొంత సాయం చేయాలని యోచిస్తున్నారని తెలిపారు. ఇక గతంలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల కుటుంబ సభ్యులకు ఉద్యోగావకాశాలు, నష్టపరిహారం చెల్లింపు అంశాలపై పాలక మండలి ఒక నివేదికను తయారు చేస్తుందన్నారు. సుశీల్ అరెస్ట్ వద్దు: హైకోర్టు రోహిత్ ఆత్మహత్య వ్యవహారంలో హెచ్‌సీయూ ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్‌కుమార్, కార్యదర్శి కృష్ణ చైతన్య, సుశీల్ బాబాయి దివాకర్‌లను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు సోమవారం పోలీసులను ఆదేశించింది. అయితే ఈ కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులయ్యారంటూ పీహెచ్డీ విద్యార్థి ప్రశాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు... వర్సిటీ వీసీ అప్పారావు, కేంద్ర మంత్రి దత్తాత్రేయలతో పాటు సుశీల్‌కుమార్, కృష్ణచైతన్య, దివాకర్లపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ సుశీల్‌కుమార్ తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. రోహిత్, ప్రశాంత్ తదితరులపై సుశీల్‌కుమార్ తొలుత పోలీసులకు ఫిర్యాదు చేశారని, దానికి కౌంటర్‌గానే సుశీల్ తదితరులపై ప్రశాంత్ ఫిర్యాదు చేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి... పిటిషనర్లను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థుల డిమాండ్లు.. ♦ హెచ్‌సీయూ వీసీ అప్పారావును పదవి నుంచి తొలగించాలి. ♦ {పొఫెసర్ శ్రీవాస్తవను కూడా బాధ్యతల నుంచి తప్పించాలి. ♦ రోహిత్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి హెచ్‌సీయూలో ఉద్యాగావకాశం ఇవ్వాలి. ♦ పెండింగ్‌లో ఉన్న రోహిత్ స్కాలర్షిప్ను తక్షణమే విడుదల చేయాలి. ♦ రోహిత్ స్మారకోపన్యాసాన్ని విశ్వవిద్యాలయమే అధికారికంగా నిర్వహించాలి. ♦ రోహిత్‌తో పాటు సస్పెండ్ చేసిన నలుగురికి విశ్వవిద్యాలయం యాజమాన్యం బహిరంగ క్షమాపణ చెప్పాలి.ఉన్నత విశ్వవిద్యాలయాల్లో వివక్షను నిర్మూలించడం కోసం థోరట్ కమిటీ చేసిన సిఫార్సులను అన్ని విశ్వవిద్యాలయాల్లో అమలు చేయాలి. ♦ ఉన్నత విద్యాలయాల్లో వివక్షను నివారించేందుకు రోహిత్ చట్టం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్‌సీయూ పాలక మండలి విజ్ఞప్తి చేయాలి. ♦ అలోక్పాండేను తొలగించాలి. ప్రాక్టోరియల్బోర్డును పునర్వ్యవస్థీకరించాలి. వివక్షకు వ్యతిరేకంగా, విద్యార్థులకు సంఘీభావంగా అధికారిక పదవులకు ఎస్సీ, ఎస్టీ అధ్యాపకులు చేసిన రాజీనామాలను పాలక మండలి అంగీకరించవద్దు. వారిని యధావిధిగా కొనసాగించాలి. -
రూ.600 కోట్లతో కళ్యాణ్ జ్యుయలర్స్ విస్తరణ
హైదరాబాద్: కళ్యాణ్ జ్యుయలర్స్ త్వరలో 14 కొత్త షోరూమ్‌లను ప్రారంభిస్తోంది. ఈ 14 షోరూమ్‌ల ఏర్పాటుకు రూ.600 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది. భారత్‌లో 7, ఖతర్‌లో 7 చొప్పున వీటిని ఏర్పాటు చేస్తామని కంపెనీ సీఎండీ టి.ఎస్.కళ్యాణరామన్ పేర్కొన్నారు. చెన్నైలో 2, కోల్‌కతాలో 2, రాజస్థాన్‌లో మూడు చొప్పున షోరూమ్‌లను ఏర్పాటు చేయనున్నామని, దీంతో ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తమ షోరూమ్‌ల సంఖ్య వందకు చేరుకుంటుందని ఆయన తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి రూ.13,000 కోట్ల టర్నోవర్ సాధించడం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 8 కొత్త షోరూమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. -
వైజాగ్ లో ప్రొ కబడ్డీ
♦ 30న లీగ్ ప్రారంభం ♦ తొలి మ్యాచ్‌లో టైటాన్స్, ♦ యు ముంబా ఢీ న్యూఢిల్లీ: వరుసగా రెండేళ్ల పాటు అభిమానులను అలరించిన ప్రొ కబడ్డీ లీగ్‌కు మరోసారి రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 30 నుంచి ఈ లీగ్ మూడో సీజన్ ప్రారంభం కానుంది. ఇకనుంచి కబడ్డీ లీగ్ ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఈ లీగ్ 30న హైదరాబాద్‌లో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో స్టేడియం అందుబాటులో లేకపోవడంతో వేదికను విశాఖపట్నంకు మార్చారు. ఈ ఏడాది తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ యు ముంబాతో తెలుగు టైటాన్స్ జట్టు తలపడుతుంది. 2014 తొలి సీజన్లోనూ వైజాగ్‌లోనే మ్యాచ్‌లు జరిగాయి. మార్చి 5న ఢిల్లీలో జరిగే ఫైనల్‌తో సీజన్ ముగుస్తుంది. మొత్తం ఎనిమిది జట్లు తలపడుతున్న ఈ టోర్నీలో 26 మంది విదేశీ ఆటగాళ్లు కూడా బరిలోకి దిగుతున్నారు. ఢిల్లీలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వివరాలను ప్రకటించారు. జైపూర్ జట్టు యజమాని అభిషేక్ బచ్చన్‌తో పాటు ఆటగాళ్లు నవనీత్, అనూప్, కాశీలింగ ఇందులో పాల్గొన్నారు. ఈసారి టైటిల్ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నట్టు అభిషేక్ బచ్చన్ తెలిపారు. -
విజయీభవ!
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని డిగ్రీ కళాశాలల్లో బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ ప్రథమ, ద్వితీయ, ఫైనల్ ఇయర్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు జిల్లాల్లో 153 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 153 మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. ఒక్కో సెంటర్‌కు ఒక్కో అబ్జర్వర్ ఉంటారు. అందులో వరంగల్ జిల్లాలో 60, ఖమ్మం జిల్లాలో 46, ఆదిలాబాద్ జిల్లాలో 47 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. జంబ్లింగ్ విధానంలోనే ఒక కాలేజీ విద్యార్థులు మరో కాలేజీలో పరీక్షా కేంద్రంగా ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ పరిధిలో వరంగల్ జిల్లా ఏటూరునాగారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మాత్రమే సెల్ఫ్ సెంటర్‌గా ఏర్పాటు చేశారు. అక్కడ సమీపంలో మరో కాలేజీ లేకపోవటమే కారణం. 18 నుంచి ఏప్రిల్ 18 వరకు పరీక్షలు మూడు జిల్లాల్లో కలిపి 2,33,782 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. బీఏ మొదటి సంవత్సరంలో 19,671, ద్వితీయ 13,874, తృతీయ 10,292, బీకాం మొదటి 31,182, ద్వితీయ 26,717, ఫైనల్ ఈయర్ 21,575, బీఎస్సీ మొదటి 43,182, ద్వితీయ 36,527, ఫైనల్ ఈయర్‌లో 29,707, బీబీఎం మొదటి 377, ద్వితీయ 353, ఫైనల్ ఈయర్‌లో 325 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. డిగ్రీ ఫస్టియర్ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. సెకండియర్, ఫైనల్ ఈయర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు ఉంటారుు. ఈనెల 18 నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు డిగ్రీ పరీక్షలు జరుగుతాయన్నారు. మొదటి, మూడో సంవత్సరం పరీక్షలు ఒకరోజు మరుసటి రోజు ద్వితీయ సంవత్సరం పరీక్షలు టైం టేబుల్ ప్రకారం జరుగుతాయన్నారు. ఏర్పాట్లు పూర్తి పరీక్షలు పకడ్బందీగా నిర్వహంచేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని కేయూ అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ బి.వెంకట్రామ్రెడ్డి తెలిపారు. హాల్‌టికె ట్లు సంబంధిత కాలేజీల వెబ్సైట్లలో అందుబాటులో ఉంచామన్నారు. ప్రిన్సిపాల్స్ లాగిన్ అయి హాల్‌టికెట్లను డౌన్లోడు చేసుకొవాలి. ఒక్కో జిల్లాకు రెండు ఫ్లయింగ్స్క్వాడ్లను అందులో ఒక్కో స్క్వాడ్ బృందంలో నలుగరు చొప్పున డిగ్రీ కాలేజీల సీనియర్ లెక్చరర్లు ఉంటారు. జిల్లాకు ఒక స్పెషల్ స్కాడ్ కూడా ఉం టుంది. ఇందులో యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఉంటారు. తనీఖీలు చేస్తారు. అబ్జర్వర్లలను నియమించామన్నారు. ప్రశ్నాపత్రాలు పోలీస్స్టేషన్లలోను, నోడల్ కాలేజీల్లోను అందుబాటులో ఉంచారు. వరంగల్ జిల్లాలో రూరల్ ఏరియాలో 7 పరీక్ష కేంద్రాల పరిధిలో, ఖమ్మంలో 12 పరీక్షా కేంద్రాల పరిధిలో, ఆదిలాబాద్‌లో 13 పరీక్షాకేంద్రాల పరిధిలో పోలీస్టేషన్లో ఉంచారు. మిగతా కేంద్రాలకు సంబంధిత పరీక్షా కేంద్రాల పరిధిలోని ప్రభుత్వ కాలేజీల్లోను అందుబాటులో ఉంచారు. -
వడివడిగా.. బడికి
నేటి నుంచి పాఠశాలల పునః ప్రారంభం స్కూళ్లను అలంకరించిన ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలు సర్కార్ బడుల్లో మాత్రం సమస్యలే స్వాగతతోరణాలు కొనుగోళ్లతో కళకళలాడిన మార్కెట్లు సిటీబ్యూరో: వేసవి సెలవుల అనంతరం నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. సుమారు 40 రోజులపాటు ఆటపాటలతో కాలక్షేపం చేసిన చిన్నారులంతా బడిబాట పట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికే కొత్త పుస్తకాలు, కొత్త యూనిఫారాలను సిద్ధం చేసుకున్న విద్యార్థులు కొత్త బ్యాగులతో స్కూళ్లల్లో అడుగు పెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. చిన్నారులకు పాఠ్య పుస్తకాలు, బూట్లు, బ్యాగులు, యూనిఫారాల కొనుగోళ్లతో గత వారం రోజులుగా తల్లిదండ్రులు బిజీగా గడిపారు. నగరవ్యాప్తంగా 7.5 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది సుమారు 50 వేల మంది చిన్నారులు తొలిసారిగా బడుల్లోకి అడుగుపెడుతున్నారు. నూతన విద్యా సంవత్సరంలో కోటి ఆశలు, శతకోటి ఠమొదటిపేజీ తరువాయి ఆకాంక్షలతో బడిలో అడుగు పెడుతున్న చిన్నారులకు ఆల్ ది బెస్ట్. ముస్తాబైన స్కూళ్లు.. పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న వేళ నగరంలో ప్రత్యేక వాతావరణం చోటుచేసుకుంది. షాపులన్నీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కళకళలాడుతున్నాయి. విద్యార్థులను, తల్లిదండ్రులను ఆకర్షించేం దుకు ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లన్నీ ఇప్పటికే (తరగతి గదులు, పాఠశాల ప్రాంగణం) అలంకరించాయి. సర్కారు స్కూళ్లు మాత్రం పాత సమస్యలతోనే స్వాగతం పలుకనున్నాయి. పెరిగిన పుస్తకాల ధరలు పేపర్ ధర పెరిగిన దృష్ట్యా ఈ ఏడాది అన్ని రకాల పుస్తకాల ధరలు 5 నుంచి 10 శాతం పెరిగాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ప్రభుత్వమే ఉచితంగానే పంపిణీ చేస్తుండగా, ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో పుస్తకాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అంతేకాదు పలు ప్రైవేటు స్కూళ ్లలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులందరూ పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు తమ వద్దే కొనాలని యాజమాన్యాలు షరతులు పెట్టాయి. ఇప్పటికే 95 శాతం మంది విద్యార్థులు తమకు అవసరమైన పుస్తకాలు, ఇతర వస్తువులను కొనుగోలు చేశారు. ఈ ఏడాది కేవలం స్కూల్ విద్యార్థుల వల్ల సాధారణ మార్కెట్ (బ్యాగులు, బూట్లు, యూనిఫారమ్ తదితరాలన్నీ కలిపి)లో దాదాపు రూ.100 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్టు అంచనా. మధ్యతరగతి వర్గాల పిల్లలు చదువు‘కొంటున్నది’ఇలా.. తరగతి ట్యూషన్ ఫీజు ట్రాన్స్పోర్ట్ పుస్తకాలు అడ్మిషన్ ఫీజు నర్సరీ-యూకేజీ 18,000 7,500 2,500 10,000 1,2,3వ తరగతులకు 23,000 10,000 3,000 10,000 4,5వ తరగతులకు 28,000 12,000 3,400 15,000 6,7వ తరగతులకు 33,000 15,000 3,500 20,000 8,9వ తరగతులకు 38,000 15,000 4,000 20,000 10వ తరగతికి 42,000 15,000 4,000 20,000 నోట్: ఇవీకాక యూనిఫారాలు, షూ అండ్ సాక్స్, టై, లోగో, బెల్ట్‌ల ఖర్చు అదనం.