bhuvanagiri police
-
నగదు డ్రా చేసి ఇస్తానని..
భువనగిరిఅర్బన్ : ఏటీఎంలకు నగదు డ్రా చేయడానికి వచ్చే వ్యక్తులను మోసగిస్తున్న వ్యక్తిని భువనగిరి పట్టణ పోలీసులు మంగళవారం జిల్లా కేంద్రంలో అరెస్టు చేశారు. భువనగిరిలోని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను సీఐ వెంకన్నగౌడ్ వెల్లడించారు. గుంటూరు జిల్లా నర్సంపేట్లోని ప్రకాష్‌నగర్‌కు చెందిన తుమ్మల ఉదయ్‌కుమార్(మాజీ హోంగార్డు) కూలీ పని చేస్తున్నాడు. ఉదయ్‌కుమార్ ఏటీఎంల వద్ద కాపుకాస్తూ నగదు కోసం వచ్చేవారిని గమనిస్తుంటాడు. ఏటీఎంలపై అవగాహన లేనివారుంటే వారికి సహాయం చేస్తానని చెప్పి నగదు తీసి ఇస్తాడు. అనంతరం వారి ఒరిజినల్ ఏటీఎంను కాకుండా తన వద్ద అప్పటికే ఉన్న మరో డూప్లికేట్ కార్డు ఇస్తాడు. తాను తీసుకున్న ఒరిజినల్ ఏటీఎం కార్డులతో పెట్రోల్ బంకులు, నగదు ఇచ్చే చోటుకు వెళ్లి డబ్బులు తీసుకుంటాడు. జనవరి 7న భువనగిరిలో కొమ్మిడి ఇంద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ నెల 4న భువనగిరి పట్టణంలో అనుమానస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని విచారించగా ఏటీఎం వద్ద చోరీలకు పాల్పడుతున్నట్లు ఒపుకున్నాడు. అతని వద్ద నుంచి రూ.3 లక్షల నగదు, 4 సెల్ఫోన్లు, 2 ఏటీఎం కార్డులు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితుడు 2012 నుంచి ఏటీఎం వద్ద మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. పలు జిల్లాల్లో 11 కేసులు నమోదు నిందితుడిపై పలు జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయి. యాదాద్రి జిల్లాలోని భువనగిరి పట్టణంలో రూ. 2.65లక్షలు, వరంగల్ జిల్లాలోని దేవరుప్పలలో రూ.76,650లు, కాజీపేటలో రూ. 1.27 లక్షలు, వర్దన్నపేటలో రూ.50,000, మెదక్ జిల్లాలోని నర్సపూర్‌లో రెండు ఏటీఎంలలో రూ. 1,09,300, సిద్దిపేట జిల్లాలోని చేర్యాల్లో రూ.40,000, దుబ్బాకలో రూ. 74,500, మహబూబాద్ జిల్లాలోని దంతాలపల్లిలో రూ.1,07,000, సిరిసిల్లలో రూ. 53000, కరీంనగర్ జిల్లా టౌన్–1లో రూ. 30,000, మొత్తం రూ. 9,32,450 నగదును అపహరించినట్లు సీఐ తెలిపాడు. ఏటీఎంల వద్ద అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. గుర్తు తెలియని వ్యక్తులకు ఏటీఎం కార్డులు ఇవ్వొద్దని సూచించారు. దొంగను పట్టుకున్న ఎస్ఐ రాజు, ఐడీ పార్టీ కానిస్టేబుల్స్ శ్రీనివాస్, సైదులు, రవి, శ్రీనివాస్‌ను సీఐ వెంకన్నగౌడ్ అభినందించారు. వీరికి రివార్డు కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజు, ఐడీ పార్టీ శ్రీనివాస్, సైదులు, రవి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
స్వాతి పొలంలోనే నరేశ్‌ను చంపేశారు
- భువనగిరి ప్రేమగాథ విషాదాంతం - నరేశ్‌ను స్వాతి తండ్రే హత్యచేశాడని పోలీసుల వెల్లడి - కొద్ది రోజుల కిందటే ఆత్మహత్య చేసుకున్న స్వాతి భువనగిరి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన నరేశ్ అదృశ్యం కేసు ఊహించిన మలుపే తిరిగింది. స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డే నరేశ్‌ను కిరాతకంగా హత్యచేసినట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో పోలీసులు శనివారం ఉదయం శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేశారు. శ్రీనివాస రెడ్డి సోదరుడు, సోదరుడి కుమారుల పేర్లను కూడా నిందితుల జాబితాలో చేర్చారు. మే 1 నుంచి నరేశ్ అదృశ్యంకాగా, అతని ప్రియురాలు స్వాతి మే 16న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆద్యంతం మలుపులతో కూడిన ప్రేమగాథ చివరికి తీవ్రవిషాదాంతంగా ముగిసినట్లయింది. స్వాతి పొలంలోనే చంపేశారు.. స్వాతి- నరేశ్‌ల ప్రేమ వ్యవహారంపై మొదటి నుంచీ విముఖత ప్రదర్శించిన శ్రీనివాసరెడ్డి.. తమను కాదని స్వాతి.. నరేశ్ వెళ్లడంతో కోపం పెంచుకున్నారు. పథకం ప్రకారమే ముంబై నుంచి స్వాతి-నరేశ్‌లను ఊరికి రప్పించారు. వివాహం జరిపిస్తామని కూతురిని నమ్మించిన శ్రీనివాసరెడ్డి.. ఆమె చేతే ఫోన్ చేయించి నరేశ్‌ను పిలిపించాడు. స్వాతి పేరుమీద ఉన్న పొలంలోనే నరేశ్‌ను అతికిరాతకంగా హత్యచేశారు. అనంతరం శవాన్ని టైర్లతో కాల్చేసి, బూడిదను మూసి నదిలో కలిపారు. పోలీసుల విచారణలో స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి, ఇతర నిందితులు ఈ మేరకు నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. కోర్టు జోక్యంతో కదిలిన డొంక.. అంబోజి నరేశ్ అదృశ్యం విషయంలో అతని తల్లిదండ్రులు, దళిత సంఘాలు వ్యక్తపరిచిన అనుమానమే నిజమైంది. మే 1 నుంచి కనిపించకుండాపోయిన నరేశ్‌ను స్వాతి కుటుంబీకులే ఏదైనా చేసి ఉంటారని సర్వత్రా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే పోలీసులు మాత్రం ఆ దిశగా దర్యాప్తు జరపకపోవడంతో బాధిత కుటుంబం కోర్టును ఆశ్రయించింది. స్పందించిన కోర్టు.. జూన్ 1 లోగా నరేశ్ ఆచూకీ కనిపెట్టాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు గడువు సమీపిస్తుండటంతో చేసేదేమీలేక అసలు నిందితులను అరెస్ట్‌చేశారు. ఈ కేసులో పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఎలా మొదలైంది? పల్లెర్ల గ్రామానికి చెందిన అంబోజు నరేష్‌తో ఫేస్బుక్ ద్వారా రెండు సంవత్సరాల క్రితం స్వాతి పరిచయం ఏర్పడింది. నరేష్ తల్లిదండ్రులు ముంబై లో ఉంటున్నారు. నరేష్ పల్లెర్లలో తాత వద్ద ఉంటూ భువనగిరిలో డిగ్రీ పూర్తి చేశాడు. స్వాతి వలిగొండలో ప్రగతి కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. ఫేస్బుక్లో ఏర్పడిన ఈ ఇద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో గత మార్చి 25న ముంబై వెళ్లి వివాహం చేసుకున్నారు. నెల రోజుల క్రితం అమ్మాయి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి ఇరువురిని ముంబై నుంచి పిలిపించారు. మన కుటుంబాల మధ్య గొడవలు ఉండవద్దు మంచిగా ఉండాలని వారికి సూచిం చారు. అయినా నరేష్–స్వాతి తిరిగి ముంబైకి వెళ్లారు. 15 రోజుల క్రితం ఇద్దరికి వివాహం జరిపిస్తానంటూ.. స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి చెప్పడంతో ఈనెల 11న తిరిగి భువనగిరికి వచ్చారు. అక్కడే ఉన్న శ్రీనివాస్‌రెడ్డి తన కూతురును తీసుకెళ్లాడు. అప్పటి నుంచి అంబోజు నరేష్ కనిపించడం లేదు. ఈ విషయంపై నరేష్ తండ్రి అంబోజు వెంకటయ్య హోంమంత్రి, డీసీపీలకు ఇటీవలనే హైకోర్టులోనూ ఫిటిషన్ దాఖలు చేశాడు. దీంతో మే 18న స్వాతితో పాటు ఆమె తండ్రి శ్రీని వాస్‌రెడ్డి, కిడ్నాప్‌కు గురైన నరేష్‌లను కోర్టులో హాజరు పర్చాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ క్రమంలోనే స్వాతి ఆత్మహత్య చేసుకోవడం, అది ఆత్మహత్యా లేక హత్యా అనే అనుమానాలు వ్యక్తం కావడం, అంతలోనే ఇవాళ నరేశ్ హత్యకు గురైన విషయం వెల్లడికావడంతో వీరి ప్రేమగాథ విషాదాంతంగా ముగిసినట్లయింది. -
స్వాతి పొలంలోనే నరేశ్‌ను చంపేశారు