biotech firms
-
మంచి కబురు!
కరోనా మహమ్మారిపై సాగుతున్న పోరాటంలో మరో ముందడుగు పడింది. 2–18 సంవత్సరాల మధ్యవారికి కోవాగ్జిన్ టీకాను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించవచ్చని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్‌నుంచి పూర్తిస్థాయిలో దీనికి గ్రీన్ సిగ్నల్ లభిస్తే ప్రపంచంలోనే తొలిసారి రెండేళ్లు, అంతకుపైబడిన పిల్లలకు టీకా వినియోగించే దేశంగా భారత్ నిలుస్తుంది. ఈ వ్యాక్సిన్‌ను రూపొందించిన భారత్ బయోటెక్ ఇప్పటికే మూడు దశల క్లినికల్ పరీక్షల డేటాను అందజేసింది. తుది దశ సమాచారం రావాల్సివుంది. జైకోవ్–డీ అనే టీకాకు సైతం అత్యవసర విని యోగానికి అనుమతులు లభించాయి. అయితే అది 12–18 సంవత్సరాల మధ్యవారి కోసం రూపొందించింది. అలాగే 5–18 మధ్య వయసున్న పిల్లలకు కార్బీవ్యాక్స్, 2–18 ఏళ్ల మధ్యవారికి తయారైన కోవోవ్యాక్స్‌లు ఇంకా ప్రయోగ దశలో ఉన్నాయి. ఒకపక్క కరోనా మహమ్మారి మూడో దశ మన దేశంలోనూ విరుచుకుపడే అవకాశమున్నదని, ఈసారి ప్రధానంగా పిల్లలపైనే అది ప్రతాపం చూపబోతున్నదని అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో వారి కోసం రూపొందించిన కోవాగ్జిన్ టీకా అందుబాటులోకి రాబోతుండటం దేశ ప్రజలకు ఊరటనిస్తుందనడంలో సందేహం లేదు. ఏడాదిన్నరకుపైగా పాఠశాలలు మూతబడి, ఆన్లైన్లో మాత్రమే చదువులు సాగుతున్న తీరు అత్యధిక శాతంమంది పిల్లలను చదువులకు పూర్తిగా దూరం చేసింది. ఒక అంచనా ప్రకారం 5 కోట్ల మంది పిల్లలు ఆన్లైన్ చదువులకు అవసరమైన సెల్ఫోన్లు, కంప్యూటర్లు కొనుక్కునే స్థోమత లేక పూర్తిగా వెనకబడ్డారు. ఇక క్రీడా శిక్షణ సంస్థలు, కోచింగ్ కేంద్రాలు వగైరాలు కూడా చాన్నాళ్లుగా మూతబడ్డాయి. ఇప్పుడిప్పుడే వాటిని మళ్లీ తెరుస్తున్నారు. బడులు తెరుచుకున్నా ఇప్పటికీ తమ పిల్లలను పంపడానికి తల్లిదండ్రులు సందేహిస్తూనే ఉన్నారు. ఇంటికే పరిమితమైతే పిల్లల చదువు లకు మాత్రమేకాక... వారి మానసిక, శారీరక ఎదుగుదలకూ అది అవరోధమవుతుందని వారికి తెలుసు. అలాగని ప్రాణాలకు ముప్పు పొంచివుందన్న భయాందోళనలు వారిని పీడిస్తూనే ఉన్నాయి. ఇక బడుల్లో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సివస్తోంది. మాస్క్‌లు ధరించటం, శాని టైజర్ వాడకం, దూరం పాటించడం తదితరాలతో తరగతి గదులు కూడా గతంలో మాదిరి స్వేచ్ఛా యుత వాతావరణానికి దూరమైనాయి. బడులకు వెళ్లొస్తున్నారన్న మాటేగానీ... అంతా సవ్యంగా ఉందో లేదోనన్న చింత అటు పిల్లలకూ, ఇటు తల్లిదండ్రులకూ కూడా ఉంటున్నది. పిల్లలకు సైతం వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకొస్తే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులుండవు. అయితే కరోనా వ్యాక్సిన్ అనుమతుల విషయంలో గతంలో వచ్చిన విమర్శలవంటివి తలెత్త కుండా డీసీజీఐ అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. వ్యాక్సిన్ల వాడకం సురక్షితమైనదని నిపుణుల కమిటీ మాత్రమే అభిప్రాయపడితే చాలదు. సీజీఐ సంస్థ వెలుపల కూడా ఆరోగ్య రంగంలో పని చేసే నిపుణులు ఉన్నారు. వారు కూడా అధ్యయనం చేసేందుకు వీలుగా డీసీజీఐ ఆ డేటాను అందు బాటులో ఉంచాలి. ప్రభుత్వం అనుమతించిందన్న ఒక్క కారణంతో సంతృప్తిపడి టీకాలు తీసుకోవ డానికి అనేకులు ముందుకొస్తారు. అందులో అనుమానం లేదు. కానీ అత్యధికులు సంతృప్తిపడే విధంగా చేయాలంటే ఇది తప్పనిసరి. క్లినికల్ పరీక్షల్లో వెల్లడైన అంశాలేమిటో, వాటి లోతుపాతులే మిటో ఆరోగ్యరంగ నిపుణులు నిశితంగా పరిశీలిస్తారు. ఒక దశ ప్రయోగానికీ, మరో దశ ప్రయో గానికీ మధ్య ఉన్న వ్యవధి, టీకాలు తీసుకున్నవారిలో వెల్లడైన లక్షణాలు అధ్యయనం చేస్తారు. వ్యాక్సిన్ల విషయంలో పెదవి విరిచేవారిని సైతం అటువంటివారి అభిప్రాయం సంతృప్తి పరు స్తుంది. పెద్దల కోసం రూపొందించిన టీకా యధాతథంగా పిల్లలకు ఇవ్వటం సాధ్యపడదు. ఈ విష యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ఎన్నో జాగ్రత్తలు సూచించింది. శారీరక ఎదుగుదల చక్కగా ఉండే శైశవ, బాల్య, కౌమార, యౌవన దశల్లోనివారు కావటం, వారికుండే భిన్నమైన వ్యాధి నిరోధకత ఇందుకు కారణం. క్లినికల్ పరీక్షకు ముందుకొచ్చిన పది పన్నెండేళ్లలోపు వయసున్న పిల్లలు తమను అడిగే ప్రశ్నలకు విస్పష్టంగా సమాధానాలివ్వటం కొంత కష్టం. అంతకన్నా చిన్న వయసు పిల్లలనుంచి సమాధానాలు రాబట్టడం అసాధ్యం. ఇప్పటికే 12–18 ఏళ్ల వారికి టీకాలం దించిన ఇజ్రాయెల్‌కు ఈ విషయంలో కొంత అనుభవముంది. బహుశా డేటా రూపకల్పనలో ఔషధ సంస్థలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఉంటాయి. పెద్దల టీకాల విషయంలోనే అనేకమందిలో ఇంకా సందేహాలున్నాయని, అందుకే అనేకులు వాటికి దూరంగా ఉన్నారని మరిచిపోకూడదు. ఆ పరిస్థితి పిల్లల టీకాల విషయంలో తలెత్తకూడదనుకుంటే, అంతా సజావుగా సాగిపోవాలనుకుంటే పారదర్శ కత ప్రాణప్రదమైనది. అది ప్రజానీకం హక్కు కూడా. ప్రభుత్వాలు ఎటూ పిల్లల టీకాలను కూడా ఉచితంగా పంపిణీ చేసే అవకాశం ఉంది. అయితే బయట కొనదల్చుకున్నవారికి సైతం అందుబాటులో ఉండేలా ఆ టీకాల ధర నిర్ణయించాలి. పౌరు లకు టీకాలందించే కార్యక్రమం మన దేశంలో జోరందుకుంది. అనేక రాష్ట్రాలు పట్టుదలగా దీన్ని కొనసాగిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో జనాభాలో మూడొంతులమంది ఒక టీకా లేదా రెండు తీసు కున్నట్టవుతుంది. పిల్లలకిచ్చే టీకాలు సైతం పూర్తి స్థాయిలో అందుబాటులోకొచ్చి, సాధ్యమైనంత ఎక్కువమందికి అందించగలిగితే జనాభాలో అత్యధికులు సురక్షిత స్థితికి చేరుకున్నట్టవుతుంది. చదువులు మళ్లీ చురుకందుకుంటాయి. సాధారణ పరిస్థితులు ఏర్పడతాయి. -
వ్యాక్సిన్ తయారీలో దేశీ కంపెనీల స్పీడ్
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలనూ కబళిస్తున్న కరోనా వైరస్ కట్టడికి దేశీ ఫార్మా కంపెనీలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే పలు విదేశీ దిగ్గజాలు వ్యాక్సిన్లను రూపొందిస్తుండగా.. దేశీ కంపెనీలు సైతం ఈ రేసులో భాగం పంచుకుంటున్నాయి. గ్లోబల్ దిగ్గజాలతో ఒప్పందాల ద్వారా వ్యాక్సిన్ల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించేందుకు తమవంతు సహకారాన్ని అందిస్తున్నాయి. తద్వారా వేగంగా వ్యాక్సిన్లను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాయి. అంతేకాకుండా వ్యాక్సిన్లను భారీ స్థాయిలో అందించేందుకు సైతం సన్నాహాలు చేస్తున్నాయి. ఈ అంశాలపై ఫార్మా వర్గాల విశ్లేషణ చూద్దాం.. నిజానికి వ్యాక్సిన్ల తయారీ ఏళ్ల తరబడి సాగుతుందని ఫార్మా నిపుణులు చెబుతున్నారు. అయితే అతర్జాతీయ స్థాయిలో లక్షలకొద్దీ జనాభాకు సవాళ్లు విసురుతున్న కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్లను వేగంగా రూపొందించవలసి ఉన్నట్లు తెలియజేశారు. దీంతో అమెరికాసహా పలు దేశాల కంపెనీలు వ్యాక్సిన్లను రూపొందించేందుకు వేగవంత అనుమతులు పొందుతున్నట్లు తెలియజేశారు. ఈ బాటలో దేశీయంగా భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్, జైడస్ క్యాడిలా, పనాసియా బయోటెక్, ఇండియన్ ఇమ్యునలాజికల్స్, బయోలాజికల్ ఈ తదితర దిగ్గజాలు వ్యాక్సిన్ల అభివృద్ధి, తయారీపై దృష్టిపెట్టినట్లు పేర్కొన్నారు. క్లినికల్ పరీక్షలు కోవిడ్-19 వ్యాక్సిన్‌పై క్లినికల్ పరీక్షల నిర్వహణకు భారత్ బయోటెక్ ఔషధ నియంత్రణ సంస్థల అనుమతి పొందింది. తద్వారా కోవాగ్జిపై తొలి, రెండో దశల పరీక్షలను చేపడుతోంది. హైదరాబాద్ కేంద్రంలో రూపొందించిన ఈ వ్యాక్సిన్ పరీక్షలను గత వారమే చేపట్టింది. వ్యాక్సిన్ అభివృద్ధికి ఐసీఎంఆర్, ఎన్ఐవీలతో జత కట్టిన విషయం విదితమే. ఇదేవిధంగా 2020 చివరికల్లా కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్‌ను తీసుకురాగలమని భావిస్తున్నట్లు సీరమ్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది. దీనిలో భాగంగా ప్రస్తుతం యూకే కంపెనీ ఆస్ట్రాజెనెకాతో కలసి పనిచేస్తున్నట్లు తెలియజేసింది. ఈ ఔషధంపై మూడో దశ క్లినికల్ పరీక్షలు నడుస్తున్నాయని.. తాము సైతం ఆగస్ట్‌లో పరీక్షలను చేపట్టనున్నామని తెలియజేసింది. వెరసి ఏడాది చివరిలోగా ఆస్ట్రాజెనెకా ఆక్స్ఫర్డ్ నుంచి వ్యాక్సిన్ లభించగలదని భావిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు యూఎస్ కంపెనీ కోడాజెనిక్స్, ఆస్ట్రియా కంపెనీ థెమిస్కు సైతం వ్యాక్సిన్ అభివృద్ధిలో సహకారమందిస్తున్నట్లు వెల్లడించింది. 7 నెలల్లో కోవిడ్-19 కట్టడికి రూపొందిస్తున్న జైకోవిడ్ వ్యాక్సిన్‌పై ఏడు నెలల్లోగా క్లినికల్ పరీక్షలను పూర్తిచేయగలమని ఆశిస్తున్నట్లు జైడస్ క్యాడిలా తెలియజేసింది. గత వారమే హ్యూమన్ ట్రయల్స్‌ను ప్రారంభించినట్లు తెలియజేసింది. పరీక్షలు విజయవంతమైతే జనవరికల్లా వ్యాక్సిన్‌ను తీసుకువచ్చేందుకు వీలుంటుందని అభిప్రాయపడింది. ఇక కరోనా వైరస్‌కు చెక్‌పెట్టేందుకు యూఎస్ సంస్థ రెఫనా ఇంక్‌తో భాగస్వామ్యంలో ఐర్లాండ్‌లో సంయుక్త సంస్థలను నెలకొల్పుతున్నట్లు జూన్‌లోనే పనాసియా బయోటెక్ పేర్కొంది. తద్వారా 50 కోట్ల డోసేజీలను తయారు చేసే సన్నాహాల్లో ఉన్నట్లు వెల్లడించింది. వచ్చే ఏడాది మొదట్లో 4 కోట్ల డోసేజీలను అందించగలమని తెలియజేసింది. ఇదే విధంగా వ్యాక్సిన్ అభివృద్ధికి ఆస్ట్రేలియా గ్రిఫిత్ యూనివర్శిటీతో చేతులు కలిపినట్లు ఇండియన్ ఇమ్యునలాజికల్స్ ఇప్పటికే పేర్కొంది. ఈ బాటలో మిన్‌వ్యాక్స్, బయోలాజికల్ ఈ తదితర కంపెనీలు సైతం వ్యాక్సిన్‌ను రూపొందించడంపై దృష్టిపెట్టాయి. పరీక్షలు ఇలా ఫార్మా వర్గాల వివరాల ప్రకారం.. వ్యాక్సిన్లను అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా తొలుత జంతువులపై పరీక్షలను నిర్వహిస్తారు. తదుపరి దశలో మనుషులపైనా ప్రయోగాత్మకంగా వ్యాక్సిన్ పనితీరును పరిశీలిస్తారు. తొలి దశ క్లినికల్ పరీక్షలలో కొద్దిమందిపై వ్యాక్సిన్ ప్రభావాన్ని పరిశీలిస్తారు. తదుపరి మరింత మందిపైనా.. ఇవి విజయవంతమైతే వేలమందిపైనా పరీక్షలు నిర్వహిస్తారు. వ్యాధి నిరోధక శక్తి పెంపు, భద్రత తదితర పలు అంశాలను క్లినికల్ ప్రయోగాలలో నమోదు చేస్తారు. తద్వారా నాలుగు దశలలో క్లినికల్ పరీక్షలను పూర్తి చేస్తారు. ఆపై వీటిని క్షుణ్ణంగా విశ్లేషిస్తారు. -
రోజారీ బయోటెక్ ఐపీవోకు యాంకర్ నిధులు
కోవిడ్-19 సవాళ్ల నేపథ్యంలోనూ ఐపీవోకు వస్తున్న రోజారీ బయోటెక్ తాజాగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించింది. వారాంతాన 15 యాంకర్ ఇన్వెస్టర్ సంస్థలకు 35 లక్షలకుపైగా షేర్లు కేటాయించడం ద్వారా రూ. 149 కోట్లు సమకూర్చుకుంది. అబుదభి ఇన్వెస్ట్మెంట్, హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్, యాక్సిస్ ఎంఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్, ఎస్బీఐ ఎంఎఫ్, సుందరం ఎంఎఫ్, గోల్డ్‌మన్ శాక్స్ తదితర సంస్థలు షేరుకి రూ. 425 ధరలో ఇన్వెస్ట్ చేశాయి. రూ. 2 ముఖ విలువతో వస్తున్న రోజారీ బయోటెక్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 13న(సోమవారం) ప్రారంభమై 15న(బుధవారం) ముగియనుంది. ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 423-425. గ్లాండ్ ఫార్మా సైతం మార్చి 16న ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యాక పబ్లిక్ ఇష్యూలు నిలిచిపోయాయని విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే రోజారీ బయోటెక్ ఇందుకు తిరిగి శ్రీకారం చుడుతోంది. కాగా.. హెల్త్‌కేర్ రంగ కంపెనీ గ్లాండ్ ఫార్మా సైతం తాజాగా ఐపీవో ప్రణాళికలు ప్రకటించింది. రూ. 6,000 కోట్ల సమీకరణకు అనుమతించమంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసింది. కోవిడ్-19 కారణంగా ఇటీవల పలు కంపెనీలు ఐపీవోలు చేపట్టేందుకు వెనుకాడుతున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఐపీవో ద్వారా ఎస్బీఐ కార్డ్స్ రూ. 10,000 కోట్లు సమీకరించిన విషయం విదితమే. 35 షేర్లకు. పబ్లిక్ ఇష్యూ ద్వారా రోజారీ బయోటెక్ రూ. 494-496 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 35 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంతకంటే అధికంగా కావాలనుకుంటే రూ. 2 లక్షల విలువ మించకుండా ఏకమొత్తంగా దరఖాస్తు చేయవచ్చు. ఐపీవో నిధులను ప్రధానంగా రుణ చెల్లింపులతోపాటు.. వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. ఇష్యూలో భాగంగా 1.05 కోట్ల షేర్లతోపాటు తాజాగా రూ. 50 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇష్యూ విజయవంతంగా పూర్తయితే.. ఈ నెల(జులై) 23కల్లా రోజారీ బయోటెక్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. 3 విభాగాలలో రోజారీ బయోటెక్ ప్రధానంగా మూడు విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. గృహ పరిశుభ్రత, వ్యక్తిగత సంరక్షణ(హోమ్, పెర్సనల్ కేర్) ప్రొడక్టులతోపాటు.. పెర్ఫార్మెన్స్ కెమికల్స్‌నూ తయారు చేస్తోంది. టెక్స్టైల్ స్పెషాలిటీ కెమికల్స్‌ను రూపొందిస్తోంది. అంతేకాకుండా జంతు సంరక్షణ, బలవర్ధక ఉత్పత్తులు(యానిమల్ హెల్త్, న్యూట్రిషన్ ప్రొడక్ట్స్)ను తయారు చేస్తోంది. కంపెనీ ఉత్పత్తులను సబ్బులు, డిటర్జెంట్లు, పెయింట్లు, టైల్స్, పేపర్, టెక్స్టైల్స్ తదితర రంగాలలో వినియోగిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు వివరించాయి. కంపెనీకి హెచ్‌యూఎల్, ఐఎఫ్బీ ఇండస్ట్రీస్, అరవింద్ తదితర దిగ్గజ కంపెనీలు కీలక కస్టమర్లుగా నిలుస్తున్నాయి. అయితే కంపెనీ కార్యకలాపాలు కలిగిన రంగాలలో ఆర్తి ఇండస్ట్రీస్, గలాక్సీ సర్ఫెక్టాంట్స్, వినతీ ఆర్గానిక్స్ తదితర లిస్టెడ్ కంపెనీలు ప్రధాన ప్రత్యర్దులుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2020లో ఇలా గతేడాది(2019-20)లో రోజారీ బయోటెక్ రూ. 604 కోట్ల ఆదాయం సాధించింది. ఇబిటా రూ. 104 కోట్లను అధిగమించగా.. నికర లాభం రూ. 65 కోట్లను తాకింది. కంపెనీ ఉత్పత్తులను గృహ, వ్యక్తిగత సంరక్షణ ప్రొడక్టుల తయారీలో వినియోగిస్తున్నందున నిత్యావసర కేటగిరీలోకి చేరుతుందని యాక్సిస్ క్యాపిటల్ పేర్కొంది. దీంతో సిల్వస్సాలోని ప్లాంటు కోవిడ్-19 లాక్‌డవున్‌లోనూ తయారీని కొనసాగించినట్లు తెలియజేసింది. -
రోజారీ బయోటెక్ పబ్లిక్ ఇష్యూ. 13న
కరోనా వైరస్ కట్టడికి లాక్‌డవున్ ప్రకటించాక మళ్లీ పబ్లిక్ ఇష్యూ సందడి మొదలుకానుంది. ఇందుకు స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ రోజారీ బయోటెక్ శ్రీకారం చుడుతోంది. ఐపీవో ఈ నెల 13న ప్రారంభంకానుంది. ఇష్యూకి ధరల శ్రేణిని షేరుకి రూ. 423-425గా కంపెనీ నిర్ణయించింది. మార్చి 16న ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ లిస్టయ్యాక తిరిగి ఓ కంపెనీ పబ్లిక్ ఇష్యూకి రావడం గమనార్హం. కోవిడ్-19 కారణంగా ఇటీవల పలు కంపెనీలు ఐపీవోలు చేపట్టేందుకు వెనుకాడుతున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఐపీవో ద్వారా ఎస్బీఐ కార్డ్స్ రూ. 10,000 కోట్లు సమీకరించిన విషయం విదితమే. రూ. 2 ముఖ విలువ రూ. 2 ముఖ విలువతో వస్తున్న రోజారీ బయోటెక్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 15న ముగియనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 35 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంతకంటే అధికంగా కావాలనుకుంటే రూ. 2 లక్షల విలువ మించకుండా ఏకమొత్తంగా దరఖాస్తు చేయవచ్చు. పబ్లిక్ ఇష్యూ ద్వారా రోజారీ బయో రూ. 494-496 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఐపీవో నిధులను ప్రధానంగా రుణ చెల్లింపులతోపాటు.. వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. ఇష్యూలో భాగంగా 1.05 కోట్ల షేర్లతోపాటు తాజాగా రూ. 50 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇష్యూ విజయవంతంగా పూర్తయితే.. ఈ నెల(జులై) 23కల్లా రోజారీ బయోటెక్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. 3 విభాగాలలో రోజారీ బయోటెక్ ప్రధానంగా మూడు విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. గృహ పరిశుభ్రత, వ్యక్తిగత సంరక్షణ(హోమ్, పెర్సనల్ కేర్) ప్రొడక్టులతోపాటు.. పెర్ఫార్మెన్స్ కెమికల్స్‌నూ తయారు చేస్తోంది. టెక్స్టైల్ స్పెషాలిటీ కెమికల్స్‌ను రూపొందిస్తోంది. అంతేకాకుండా జంతు సంరక్షణ, బలవర్ధక ఉత్పత్తులు(యానిమల్ హెల్త్, న్యూట్రిషన్ ప్రొడక్ట్స్)ను తయారు చేస్తోంది. కంపెనీ ఉత్పత్తులను సబ్బులు, డిటర్జెంట్లు, పెయింట్లు, టైల్స్, పేపర్, టెక్స్టైల్స్ తదితర రంగాలలో వినియోగిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు వివరించాయి. కంపెనీకి హెచ్‌యూఎల్, ఐఎఫ్బీ ఇండస్ట్రీస్, అరవింద్ తదితర దిగ్గజ కంపెనీలు కీలక కస్టమర్లుగా నిలుస్తున్నాయి. అయితే కంపెనీ కార్యకలాపాలు కలిగిన రంగాలలో ఆర్తి ఇండస్ట్రీస్, గలాక్సీ సర్ఫెక్టాంట్స్, వినతీ ఆర్గానిక్స్ తదితర లిస్టెడ్ కంపెనీలు ప్రధాన ప్రత్యర్దులుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2020లో ఇలా గతేడాది(2019-20)లో రోజారీ బయోటెక్ రూ. 604 కోట్ల ఆదాయం సాధించింది. ఇబిటా రూ. 104 కోట్లను అధిగమించగా.. నికర లాభం రూ. 65 కోట్లను తాకింది. కంపెనీ ఉత్పత్తులను గృహ, వ్యక్తిగత సంరక్షణ ప్రొడక్టుల తయారీలో వినియోగిస్తున్నందున నిత్యావసర కేటగిరీలోకి చేరుతుందని యాక్సిస్ క్యాపిటల్ పేర్కొంది. దీంతో సిల్వస్సాలోని ప్లాంటు కోవిడ్-19 లాక్‌డవున్‌లోనూ తయారీని కొనసాగించినట్లు తెలియజేసింది. -
పనాసియా బయో- జూబిలెంట్ లైఫ్.. భళా
ప్రపంచవ్యాప్తంగా అనారోగ్య ప్రకంపనలు సృష్టిస్తున్న కోవిడ్-19 కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌కు సంబంధించి ఒప్పందాన్ని కుదుర్చుకున్న వార్తలతో పనాసియా బయోటెక్ కౌంటర్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక మరోపక్క కరోనా వైరస్‌కు చెక్‌పెట్టగల రెమ్‌డెసివిర్ ఔషధ లైసెన్సింగ్‌కు ఇప్పటికే ఒప్పందాన్ని కుదుర్చుకున్న జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ కౌంటర్‌కు సైతం డిమాండ్ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. పనాసియా బయోటెక్ కోవిడ్-19 నివారణకు వినియోగించగల వ్యాక్సిన్ అభివృద్ధిలో భాగంగా యూఎస్ కంపెనీ రెఫానాతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తాజాగా పనాసియో బయోటెక్ వెల్లడించింది. తద్వారా ఈ వ్యాక్సిన్ అంతర్జాతీయ అభివృద్ధి, తయారీ, పంపిణీలకు వీలు కలగనున్నట్లు తెలియజేసింది. ప్రొడక్ట్ డెవలప్మెంట్, వాణిజ్య ప్రాతిపదికన తయారీలతోపాటు.. క్లినికల్ డెవలప్మెంట్ తదితర కార్యక్రమాలను చేపట్టవలసి ఉంటుందని వివరించింది. ఈ వ్యాక్సిన్‌ను 50 కోట్ల డోసేజీల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ యాజమాన్యం ఈ సందర్భంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో పనాసియా బయోటెక్ షేరు ఎన్ఎస్ఈలో 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనేవాళ్లు అధికంకావడంతో ఈ షేరు రూ. 34 ఎగసి రూ. 204 సమీపంలో ఫ్రీజయ్యింది. తద్వారా ఏప్రిల్ 28న సాధించిన ఏడాది గరిష్టం రూ. 211కు చేరువలో నిలిచింది. జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించాక జోరందుకున్న హెల్త్‌కేర్ రంగ కంపెనీ జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ కౌంటర్ మరోసారి జోరు చూపుతోంది. ఎన్ఎస్ఈలో ఈ షేరు ప్రస్తుతం 8.5 శాతం జంప్‌చేసి రూ. 604 వద్ద ట్రేడవుతోంది. తొలుత 12 శాతం దూసుకెళ్లి రూ. 625ను తాకింది. తద్వారా జనవరి 23న నమోదైన 52 వారాల గరిష్టం రూ. 639కు చేరువైంది. ఈ నెలలో ఇప్పటివరకూ ఈ షేరు 41 శాతం ర్యాలీ చేయడం విశేషం! కాగా.. గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో జూబిలెంట్ లైఫ్ నికర లాభం 92 శాతం జంప్‌చేసి రూ. 260 కోట్లను తాకగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం యథాతథంగా రూ. 2391 కోట్లకు చేరింది. ఇటీవల యూఎస్ దిగ్గజం గిలియడ్ సైన్సెస్ నుంచి రెమ్‌డెసివిర్ ఔషధ తయారీ, మార్కెటింగ్‌కు జూబిలెంట్ లైఫ్.. లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం విదితమే. -
క్లినికల్ ట్రయల్స్‌కు స్కాట్లాండ్ బెస్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్లినికల్ ట్రయల్స్‌కి స్కాట్లాండ్ చాలా అనుకూలమైన దేశమని, దీన్ని రాష్ట్ర ఫార్మా, బయో కంపెనీలు వినియోగించుకోవాలని స్కాటిష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడ్ ప్రమోషన్ బోర్డ్ ఎస్డీఐ తెలిపింది. స్కాంట్లాండ్లో ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను తెలియచేయడానికి గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్డీఐ కంట్రీ మేనేజర్ (ఇండియా) రోమా కుమార్ బుసీ మాట్లాడుతూ ఇండియాతో పోలిస్తే అనుమతులు చాలా వేగంగా లభిస్తాయని ఆమె తెలియజేశారు. ప్రపంచంలో క్లినికల్ ట్రయల్స్‌లో అగ్రస్థానంలో ఉన్న తొలి 5 కంపెనీలూ తమ దేశంలోనే ఉన్నాయని బుసీ చెప్పారు. ఒక్కసారి యూరోపియన్ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరితే స్కాచ్ విస్కీ ధరలు కూడా బాగా తగ్గే అవకాశం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న స్కాచ్ విస్కీపై 150% దిగుమతి సుంకాన్ని విధిస్తున్నారు.