క్లినికల్ ట్రయల్స్‌కు స్కాట్లాండ్ బెస్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్లినికల్ ట్రయల్స్‌కి స్కాట్లాండ్ చాలా అనుకూలమైన దేశమని, దీన్ని రాష్ట్ర ఫార్మా, బయో కంపెనీలు వినియోగించుకోవాలని స్కాటిష్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ట్రేడ్ ప్రమోషన్ బోర్డ్ ఎస్‌డీఐ తెలిపింది. స్కాంట్లాండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలను తెలియచేయడానికి గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌డీఐ కంట్రీ మేనేజర్ (ఇండియా) రోమా కుమార్ బుసీ మాట్లాడుతూ ఇండియాతో పోలిస్తే అనుమతులు చాలా వేగంగా లభిస్తాయని ఆమె తెలియజేశారు.
ప్రపంచంలో క్లినికల్ ట్రయల్స్‌లో అగ్రస్థానంలో ఉన్న తొలి 5 కంపెనీలూ తమ దేశంలోనే ఉన్నాయని బుసీ చెప్పారు. ఒక్కసారి యూరోపియన్ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరితే స్కాచ్ విస్కీ ధరలు కూడా బాగా తగ్గే అవకాశం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న స్కాచ్ విస్కీపై 150% దిగుమతి సుంకాన్ని విధిస్తున్నారు.