brake fail
-
హార్సిలీహిల్స్ ఘాట్‌పై తప్పిన ప్రమాదం
బి.కొత్తకోట: అన్నమయ్యజిల్లా బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ ఘాట్‌రోడ్డుపై ఆదివారం సాయంత్రం ఓ మినీబస్సు బ్రేక్ ఫెయిల్ కాగా డ్రైవర్ సమయస్ఫూర్తి వల్ల 25 మంది పర్యాటకులకు ప్రాణాపాయం తప్పింది. రాయచోటి నియోజకవర్గం చిన్నమండేనికి చెందిన పర్యాటకులు స్థానికంగా ఉన్న ట్రావెల్స్‌కు చెందిన మినీ బస్సును అద్దెకు తీసుకుని హార్సిలీహిల్స్ పర్యటనకు వచ్చారు. సాయంత్రం తిరిగి వెళ్తుండగా ప్రొద్దుటూరు మలుపు వద్దకు రాగానే మినీబస్సు వేగం నియంత్రించేందుకు డ్రైవర్ ఖాదర్‌వలీ ప్రయత్నించగా బ్రేక్ ఫెయిలైంది. వాహనాన్ని అలాగే ముందుకు పోనిస్తే మలుపు వద్ద ప్రమాదం జరిగేది. కానీ అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నేరుగా గ్రిల్ పక్కనే ఉన్న బండరాళ్లను ఢీకొట్టించి బస్సు ఆగేలా చేశారు. ఈ సంఘటనలో బస్సు ముందరి భాగం దెబ్బతినగా పర్యాటకులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం అందరూ ఆర్టీసీ బస్సుల్లో స్వస్థలానికి వెళ్లారు. చాలా తక్కువ వేగంతో వస్తున్నందునే ప్రమాదాన్ని నివారించగలిగానని డ్రైవర్ ఖాదర్‌వలీ చెప్పారు. -
ఆర్టీసీ బస్ బ్రేకులు ఫెయిలయ్యి..
కర్నూలు : కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం హంద్రి కైరవాడి గ్రామంలో గురువారం ప్రమాదవశాత్తూ ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలవ్వటంతో ముందు వెళ్తున్న మరో బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్లతో పాటు బస్సులో ప్రయాణిస్తున్న 12 మందికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటనలో రోడ్డు పక్కనున్న ఓ చిన్న షాపు కూడా ధ్వంసమయ్యింది. కాగా ఆ ఆర్టీసీ బస్సు ఎమ్మిగనూరు డిపోకు చెందినది. -
బ్రేకులు ఫేలయిన బడ్జెట్
కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమబెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ మరోసారి విమర్శలు గుప్పించింది. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రవేశపెట్టిన బడ్జెట్ బ్రేకులు ఫేలయిన బడ్జెట్ అని వ్యంగ్యంగా పేర్కొంది. దీని వల్ల ఒరిగిందేమీ లేదని, పైగా తమ రాష్ట్రంపై అదనపు భారం పడిందని విమర్శించింది. ఈ బడ్జెట్‌ను కచ్చితంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది. కనీసం ప్రయాణీకుల ఛార్జీల ధరలైనా తగ్గుతాయని తాము భావించామని, డీజీల్ ధరలు తగ్గినప్పటికీ ప్రయాణీకులకు చార్జీల భారం తప్పలేదని పార్టీ అధికారిక వెబ్ సైట్లో పేర్కొంది. ఈ బడ్జెట్ ద్వారా అత్యవసర వస్తువుల ధరలు పెరుగుతాయని, ఇవి రైతులపై, గృహిణులపై ప్రభావం చూపుతాయని వెల్లడించింది.