కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమబెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ మరోసారి విమర్శలు గుప్పించింది. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రవేశపెట్టిన బడ్జెట్ బ్రేకులు ఫేలయిన బడ్జెట్ అని వ్యంగ్యంగా పేర్కొంది. దీని వల్ల ఒరిగిందేమీ లేదని, పైగా తమ రాష్ట్రంపై అదనపు భారం పడిందని విమర్శించింది. ఈ బడ్జెట్ను కచ్చితంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది. కనీసం ప్రయాణీకుల ఛార్జీల ధరలైనా తగ్గుతాయని తాము భావించామని, డీజీల్ ధరలు తగ్గినప్పటికీ ప్రయాణీకులకు చార్జీల భారం తప్పలేదని పార్టీ అధికారిక వెబ్ సైట్లో పేర్కొంది. ఈ బడ్జెట్ ద్వారా అత్యవసర వస్తువుల ధరలు పెరుగుతాయని, ఇవి రైతులపై, గృహిణులపై ప్రభావం చూపుతాయని వెల్లడించింది.