రక్తమోడిన రోడ్లు
=జిల్లాలో ఐదుగురి మృతి
=నుజ్జునుజ్జైన వాహనాలు
=అతివేగం, నిర్లక్ష్యమే కారణం
=విషాదంలో బాధిత కుటుంబాలు
కుప్పం, శ్రీకాళహస్తిరూరల్, కల్లూరు, కలికిరి, న్యూస్‌లైన్ : కుప్పం నుంచి తమిళనాడులోని క్రిష్ణగిరి బీఎస్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు శుక్రవారం మధ్యాహ్నం బయలుదేరింది. వూర్గవుధ్యంలోని నడువుూరు సమీపంలో ఘాట్ వద్ద అదుపు తప్పి బస్సు బోల్తా పడింది. ఈ ప్రవూదంలో తమిళనాడులోని కాళియువ్ము కోయిల్ గ్రావూనికి చెందిన అయ్యుప్ప వూల ధరించిన వుునిరాజ్(40) అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్రయాణికులు 30 మంది గాయపడ్డారు. వీరిలో 17 వుంది కుప్పం వంద పడకల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వురో 13 వుందిని క్రిష్ణగిరి ఆస్పత్రికి తరలించారు. గాయుపడిన వారిలో శాంత(50), రావుూ్మర్తి(73), వలర్మది(53), నీలవ్ము(55), శావుల (17), లక్ష్మి (40), సేతు(35), వలర్మది(50), శ్రీనివాసులు(30), సురేష్(33), జయులక్ష్మి(67), సుబ్రవుణ్యం ఆచారి(44), వుుద్దుక్రిష్ణ(23), రాజవుణి(44), అన్నపూర్ణి(45), రాజవ్ము(45), చంద్ర(40) వంద పడకల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆధారంగా ఉన్న మునిరాజ్ చనిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
కలికిరిలో..
కలికిరి శివారు ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. వైఎస్ఆర్ జిల్లా చిన్నమండ్యం మండలం కొత్తపల్లె పంచాయతీ రోడ్డుకాడ కురవపల్లెకు చెందిన ఎ.శ్రీనివాసులు(32) కొంతకాలంగా తిరుపతిలో కాపురం ఉంటున్నారు. అలాగే మదనపల్లె రూరల్ మండలం సీటీఎం మిట్టపల్లెకు చెందిన కరుణాకర్(40), మధుబాబు తిరుపతిలోనే ఆటో తోలుకుంటూ జీవిస్తున్నారు.
వీరు తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న అవ్వ సీతమ్మను స్వగ్రామానికి తరలించేందుకు శ్రీనివాసులుకు చెందిన కారును గురువారం రాత్రి మాట్లాడుకున్నారు. రాత్రికిరాత్రే సీతమ్మను స్వగ్రామానికి తీసుకెళ్లారు. అనంతరం తిరుపతికి తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు కలికిరి మండలం బోయపల్లె సబ్స్టాప్ సమీపంలో కారు ముందుటైర్ పంక్చర్ అయింది. దీంతో కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సును ఢీకొంది.
కారు నడుపుతున్న శ్రీనివాసులు, ముందువైపు కూర్చున్న కరుణాకర్ సంఘటన స్థలంలోనే మృత్యువాత పడ్డారు. వెనుకవైపు కూర్చున్న మధుబాబు తీవ్రంగా గాయపడ్డారు. ఇతన్ని మదనపల్లెకు తరలించారు. సంఘటన స్థలాన్ని ఇన్చార్జ్ సీఐ బి.పార్థసారథి, ఎస్ఐ సోమశేఖర్‌రెడ్డి పరిశీలించారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదిలావుండగా ప్రమాదం జరిగి మూడుగంటలైనా మృతదేహాలను వాహనం నుంచి బయటకు తీయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎట్టకేలకు సీఐ ప్రత్యేక చొరవతో మృతదేహాలను బయటికి తీశారు.
శ్రీకాళహస్తిలో..
తమిళనాడులోని తిరువణ్ణామలైకు చెందిన అబ్దుల్లా, రషీద్, అమీర్ టవేరా కారులో తిరువులకు వెళ్లారు. అక్కడ దర్శనానంతరం శ్రీకాళహస్తికి శుక్రవారం బయులుదేరారు. చెన్నై నుంచి మాక్సీక్యాబ్ వ్యానులో అరుణ్కువూర్, మైథిలి, పావని, గాంధీవుధు, ఊహ, కవిత, వెంకటేశ్, సునీత, అనీల్, ఇంద్రాణి తిరుమలకు బయలుదేరారు.
ఈ రెండు వాహనాలు శ్రీకాళహస్తి వుండలంలోని చెర్లోపల్లె సమీపంలో ఢీకొన్నాయి. ఈ ప్రవూదంలో టవేరా కారు నుజ్జునుజ్జు అయింది. కారు డ్రైవర్ కార్తీక్(32), అబ్దుల్లా, రషీద్, అమీర్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కార్తీక్ మృతి చెందాడు. మైథిలి, గాంధీవుధు, ఇంద్రాణిలకు తీవ్రంగా గాయపడ్డారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ సంజీవ్కువూర్ తెలిపారు.
పులిచెర్లలో..
పులిచెర్ల మండలం వడ్లపల్లె సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్ఆర్సీపీ నేత కొల్లే ప్రభాకర్(51) దుర్మరణం చెందాడు. కల్లూరు ఎస్ఐ వెంకటేష్ కథనం మేరకు.. పులిచెర్ల మండలం కమ్మపల్లె పంచాయతీ కురవపల్లెకు చెందిన వైఎస్ఆర్సీపీ నేత కొల్లే ప్రభాకర్ తన గ్రామానికి చెందిన వీరభద్రయ్యతో కలిసి గురువారం సాయంత్రం మదనపల్లెలో ఓ వివాహానికి హాజరయ్యారు. వీరిద్దరూ శుక్రవారం ఉదయం మదనపల్లె నుంచి పీలేరుకు బస్సులో చేరుకున్నారు. అనంతరం ద్విచక్ర వాహనంలో స్వగ్రామానికి బయలుదేరారు.
పీలేరు-పులిచెర్ల మార్గమధ్యంలోని వడ్లపల్లె సమీపంలో ఓ మలుపు వద్ద ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో ప్రభాకర్, వీరభద్రయ్య ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఈ ప్రమాదంలో కొల్లే ప్రభాకర్ తలకు తీవ్ర గాయమై అక్కడిక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ వీరభద్రయ్యను ప్రయాణికులు పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని కల్లూరు ఎస్ఐ వెంకటేష్ పరిశీలించారు. బస్సు డ్రైవర్ సెల్వరాజ్ కల్లూరు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. కొల్లే ప్రభాకర్ మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో కురవపల్లెకు చేరకున్నారు.