building damaged
-
పక్కకు ఒరిగిన భవనం
గచ్చిబౌలి (హైదరాబాద్): రాజధాని నగరంలోని మాదాపూర్ ఐటీ కారిడార్‌కు చెంతనే ఉన్న సిద్దిఖీనగర్‌లో నాలుగు అంతస్తుల భవనం పక్కకు ఒరిగిన ఘటన కలకలం రేపింది. వసుకుల లక్ష్మణ్ అనే వ్యక్తి ప్లాట్ నం. 1639లో 70 గజాల స్థలంలో జీప్లస్ ఫోర్ భవనాన్ని నిర్మిచారు. ఫ్లోర్‌కు రెండు పోర్షన్ల చొప్పున నాలుగు ఫ్లోర్లు నిర్మాణం చేశారు. ఆ భవనంలో మొత్తం 48 మంది అద్దెకు ఉంటున్నారు. వారంతా చెంతనే ఉండే ఐటీ కంపెనీల్లో హౌజ్‌కీపింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో గోడ కూలినట్లు శబ్దం వచి్చనా ఎవరూ పట్టించుకోలేదు. కానీ రాత్రి 8.30 గంటల సమయంలో పెద్దగా శబ్దం వచ్చి భవనం ఒరిగిపోతోందని అరుపులు వినిపించడంతో అందరూ భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఆదరాబాదరాగా కిందకు వచ్చేశారు. ఇంతలోనే మూడో అంతస్తులో ఉండే సాదిక్ హుస్సేన్ కిందికి దూకగా అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈలోగా అందరూ కిందకు వచ్చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే భవనం నిర్మించినట్లు తెలుస్తోంది. పక్క స్థలంలో గుంతలు తీయడంతోనేనా.. ఈ భవనం పక్కనే ఉండే 1605, 1638 ప్లాట్లను కలిపి భవనం నిర్మించేందుకు పిల్లర్లు వేయడానికి గుంతలు తవ్వారు. వీటితో భవనానికి ఇబ్బంది వస్తుందని ఈ భవన యజమాని వారిని హెచ్చరించారు. అయినా వారు వినలేదు. దీనివల్లే ఈ భవనం పరిస్థితి ఇలా మారిందని కొందరు అంటున్నారు. ఘటనా స్థలాన్ని జీహెచ్ఎంసీ వెస్ట్‌జోన్ జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి, శేరిలింగంపల్లి టౌన్‌ప్లానింగ్ ఏసీపీ వెంకటరమణ, మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్, డీఆర్ఎఫ్ సిబ్బంది పరిశీలించారు.పక్కకు ఒరిగిన భవనం చుట్టూ ఉండే పది భవనాల్లో నివాసం ఉండేవారిని ముందు జాగ్రత్త చర్యగా ఖాళీ చేయించి వేరేచోటికి తరలించారు. ఈ భవనం ముందు కేవలం పదిఫీట్ల రోడ్డు మాత్రమే ఉంది. భవనాన్ని ఇంజనీర్లు పరిశీలించి నాణ్యతను నిర్ణయిస్తారని, వారి నివేదిక ఆధారంగా ఒరిగిన భవనాన్ని తొలగిస్తామని ఉపేందర్‌రెడ్డి వెల్లడించారు. అలాగే ఈ భవనం వెనుక లోతైన గుంతలు తీసిన బిల్డర్పైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. భవనం విరిగిందని అరుపులు వినిపించడంతో వచ్చేశా.. ‘మేము మొదటి అంతస్తులో ఉంటున్నాం. రాత్రి 8.30 గంటల సమయంలో శబ్దం వచ్చింది. కొద్దిసేపటికే ఇంట్లోని సామాన్లు కిందపడిపోవడం ప్రారంభమైంది. అదే సమయంలో భవనం విరిగిందని అరుపులు వినిపించడంతో వంట చేస్తున్న స్టవ్ ఆర్పకుండానే భయంతో కిందికి వచ్చేశా’ అని జహారుల్ చెప్పారు. -
నిర్లక్ష్యం నీడన గ్రంథాలయం
బీర్కూర్ : గ్రంథాలయాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ప్రభుత్వం పైసా విదల్చకపోవడం.. పం చాయతీలు సెస్సు చెల్లించకపోవడంతో అభివృద్ధి కి ఆమడదూరంలోనే ఉండిపోతున్నాయి. సౌకర్యా లు మెరుగుపడకపోవడంతో పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రంథాలయాల అభివృద్ధిని పాలకులు పట్టించుకోకపోవడంతో జిల్లాలోని దాదాపు అన్ని చోట్ల సమస్యలు తిష్టవేశాయి. జిల్లాలో పరిస్థితి.. కామారెడ్డి జిల్లాకేంద్రంలోని జిల్లా గ్రంథాలయం తో పాటు జిల్లావ్యాప్తంగా 18 శాఖ గ్రంథాలయా లు, 9 గ్రామీణ గ్రంథాలయాలు, 16 పుస్తక నిక్షేప కేంద్రాలు ఉన్నాయి. 14 గ్రంథాలయాలకు మాత్ర మే సొంత భవనాలున్నాయి. మరో మూడు చోట్ల ఉచిత భవనాల్లో కొనసాగుతుండగా.. మిగిలినవి అద్దెభవనాల్లో నడుస్తున్నాయి. బీర్కూర్, మద్నూ ర్ తదితర ప్రాంతాల్లోని గ్రంథాలయ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. జిల్లాలో రూ. 1.20 కోట్ల సెస్ బకాయిలు.. పంచాయతీ పన్నుల వసూలులో భాగంగా 8 శా తం గ్రంథాలయ సెస్సును ప్రజల నుంచి వసూ లు చేస్తారు. ఇలా వసూలు చేసిన సెస్సును పంచాయతీలు గ్రంథాలయాలకు చెల్లించాల్సి ఉంటుం ది. కానీ ఏడేళ్లుగా సర్పంచ్‌లు గ్రంథాలయ సెస్ చెల్లించడం లేదు. దీంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. జిల్లాలో రూ. 1.20 కోట్ల మేర గ్రంథాల య సెస్ పేరుకుపోయింది. ఈ సెస్‌ను పంచాయతీలు చెల్లిస్తే గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం సైతం గ్రంథాలయాల నిర్వహణకు ఒక్కపైసా కేటాయించడం లేదు. ఉద్యోగుల వేతనాలకు తప్ప నయా పైసా విడుదల చేయకపోవడంతో నిర్వహణ భారమవుతోందని గ్రంథపాలకులు పేర్కొంటున్నారు. జిల్లావ్యాప్తంగా ఏడుగురే ఉద్యోగులు.. జిల్లావ్యాప్తంగా గ్రంథాలయాల్లో ఒక గ్రేడ్–2 ఉద్యోగి, ముగ్గురు రికార్డు అసిస్టెంట్లు, మరో ముగ్గురు ఆఫీస్ సబార్డినేట్లు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఇద్దరు ఆఫీస్ సబార్డినేట్లు, ఒక లైబ్రేరియన్ ఉన్నారు. రూ. 12 వేల ఫిక్స్డ్ వేతనం పొందే 15 మంది పార్ట్‌టైం సిబ్బంది పనిచేస్తున్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వీరు పోరాటం చేస్తున్నారు. వీరిలో కొందరి వయస్సు రిటైర్మెంట్కు సమీపించినా క్రమబద్ధీకరణ జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది కొరతతో ఒక్కో ఉద్యోగిని రెండు, మూడు చోట్ల ఇన్చార్జి గ్రంథపాలకులుగా నియమించారు. సిబ్బంది కొరత సైతం గ్రంథాలయాల మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రస్థాయిలో బుక్ సెలెక్షన్ కమిటి ఏర్పాటు చేయకపోవడంతో కొత్త పుస్తకాల ఎంపిక జరగడం లేదు. దీంతో కొన్నేళ్లుగా కొత్తపుస్తకాలు గ్రంథాలయాలకు రావడం లేదు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం పంచాయితీ పాలకులు సెస్ చెల్లించడం లేదు. జిల్లా లో రూ. కోటీ 20 లక్షల సెస్ రావా ల్సి ఉంది. గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత కూడా ఉంది. దీంతో ఒక్కో ఉద్యోగికి రెండు నుంచి మూడు చోట్ల బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. సిబ్బందిని నియమించాలని, సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి నివేదించాం. – సురేశ్‌బాబు, గ్రంథాలయ సంస్థ జిల్లా కార్యదర్శి, కామారెడ్డి -
మూగజీవాలకు తప్పని వ్యథ!
పశువైద్యశాలల్లో వసతులు కరువు డాక్టర్లు, సిబ్బంది కోరతతో పీడిస్తున్న సమస్య వ్యాక్సినేషన్, చికిత్సలు చేసేందుకు ఇక్కట్లు కల్హేర్: మండలంలోని కల్హేర్, సిర్గాపూర్ రెండు పశువైద్యశాలలు ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. వైద్యశాలల్లో సరైన వసతులు లేక మూగజీవాలు తీవ్ర నరకయాతన పడుతున్నాయి.దీనికితోడు సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో మూగజీవులకు వైద్య సేవలు అందడం లేదు. సొంత భవనాలు నిర్మాణానికి నోచుకోవడం లేదు. మండలంలో 30 వేలకు పైగా గొర్రెలు, మేకలు, గేదెలు, ఆవులు ఉన్నాయి. రెండు చోట్ల సర్కార్ వైద్యశాలలున్నా అటెండర్లే వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్, కంపౌండర్ పోస్టులు రెండు చొప్పున ఖాళీగా ఉన్నాయి. సంజీవన్‌రావుపేట పశువైద్యాధికారి డాక్టర్ నేతాజీ ఇన్‌చార్జీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పశువులకు గర్భకోశ వ్యాధి, ఇతర చికిత్సలు చేసేందుకు అటెండర్లు, గోపాలమిత్రలు దిక్కుగా మారారు. మండలంలో 4గురు మాత్రమే గోపాలమిత్రలు ఉన్నారు. గోపాలమిత్రలు అత్యవసర సమయంలో దొరకని దుస్థితి. డాక్టర్లు, సిబ్బంది కొరత కారణంగా పశువులకు చికిత్స జరిపేందుకు, వ్యాక్సినేషన్ చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డాక్టర్లు, సిబ్బందిని నియమించడంలో ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పశుపోశకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ భవనంలో నిర్వహణ కల్హేర్‌లో పశు వైద్యశాల నిర్వహణ కోసం సొంత భవనాలు నిర్మాణానికి నోచుకోవడం లేదు. గ్రామ పంచాయతీ కార్యాలయంలోని శిథిలావంతమైన ఓ గదిలో వైద్యశాల కొనసాగిస్తున్నారు. కల్హేర్‌లో పశువైద్యశాల ప్రారంభించి దాదాపు 40 సంవత్సరాలు గడుస్తున్న సొంత భవనం నిర్మాణం కోసం మోక్షం లభించడం లేదు. శిథిలమైన భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సరిపోయెంత గదులు, వసతులు లేక పోవడంతో మందులు, వ్యాక్సిన్లు ఉంచేందుకు ఇక్కట్లు తప్పడం లేదు. సిర్గాపూర్‌లో సొంత భవనం ఉన్న శిథిలవస్థలో చేరింది. భవనాల నిర్మాణం, డాక్టర్లు, సిబ్బందిని నియమించి పశువులకు మెరుగైన వైద్యసేవాలు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పశుపోశకులు కోరుతున్నారు.