ఇరాన్లో మరో అణు కేంద్రం
టెహ్రాన్: రష్యా సహకారంతో ఇరాన్ రెండో అణు విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులను శనివారం ప్రారంభించింది. ఆరు అగ్ర దేశాలతో గతేడాది కుదిరిన ఒప్పందం తరువాత ఇరాన్ చేపడుతున్న తొలి ప్రాజెక్టు ఇదేనని ప్రభుత్వ టీవీ చానల్ ఒకటి పేర్కొంది.
8.5 బిలియన్ డాలర్ల(రూ. 57 వేల కోట్లు) వ్యయమయ్యే ఈ కేంద్రం ద్వారా 1,057 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. వేయి మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న తొలి , ఏకైక అణు రియాక్టర్ ఉన్న బుషెహర్ పట్టణంలో ఈ కార్యక్రమం జరిగింది.