Capital Investment
-
స్టార్టప్ కంపెనీలో క్రికెటర్ రూ.7.4 కోట్లు పెట్టుబడి
భారత క్రికెటర్ రిషబ్ పంత్ సాఫ్ట్వేర్ సేవలందించే కంపెనీలో రూ.7.4 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ప్రకటించారు. టెక్‌జాకీ అనే సాఫ్ట్వేర్ విక్రేతలకు సాయం చేసే కంపెనీ రూ.370 కోట్ల మూలధనాన్ని సమీకరించాలని నిర్ణయించింది. కంపెనీ ప్రణాళికలపై ఆసక్తి ఉన్నవారు ఇందులో ఇన్వెస్ట్ చేశారు. అందులో భాగంగా ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ కంపెనీ సమీకరించాలనుకునే మొత్తంలో రెండు శాతం వాటాను సమకూర్చారు.ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఫోర్స్పాయింట్ గ్లోబల్ సీఈఓ మానీ రివెలో కూడా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టినట్లు కంపెనీ వ్యవస్థాపకులు ఆకాష్ నంగియా తెలిపారు. అయితే మానీ ఎంత ఇన్వెస్ట్ చేశారోమాత్రం వెల్లడించలేదు. ఈ సందర్భంగా నంగియా మాట్లాడుతూ..‘కంపెనీ భవిష్యత్తు కార్యకలాపాలకు మూలధనాన్ని సేకరించాలని నిర్ణయించాం. ముందుగా రూ.410 కోట్లు సేకరించాలనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల 10 శాతం తగ్గించి రూ.370 కోట్ల పెట్టుబడికి ప్రణాళికలు సిద్ధం చేశాం. తాజాగా సమకూరిన నిధులతో మార్కెటింగ్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తాం. యూఎస్‌లో కంపెనీని విస్తరించడానికి ఈ నిధులు తోడ్పడుతాయి’ అని చెప్పారు.ఆకాష్ నంగియా గతంలో జొమాటో ఎగ్జిక్యూటివ్‌గా పని చేశారు. మెకిన్సేలో పని చేసిన అర్జున్ మిట్టల్ సాయంతో 2017లో టెక్‌జాకీ సాఫ్ట్వేర్ అగ్రిగేటర్ స్టార్టప్ కంపెనీను స్థాపించారు. ఇది దేశంలోని చిన్న వ్యాపారాల కోసం సాఫ్ట్‌వేర్‌ను విక్రయించేందుకు సాయపడుతుంది. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాలో తన కార్యకలాపాలు ప్రారంభించింది. టెక్‌జాకీ మైక్రోసాఫ్ట్, అడాబ్, ఏడబ్ల్యూఎస్, కెక, ఫ్రెష్‌వర్క్స్, మైబిల్ బుక్ వంటి కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సుమారు రూ.125 కోట్లు ఆదాయాన్ని సంపాదించినట్లు అధికారులు తెలిపారు. 2024-25లో ఇది రూ.170-180 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందా..?ఇటీవల కేఎల్ రాహుల్ మెటామ్యాన్ స్టార్టప్ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ జులైలో భారత్‌కు చెందిన న్యూట్రిషన్ సప్లిమెంట్ బ్రాండ్ ‘సప్లై6’లో ఇన్వెస్ట్ చేశారు. ఏప్రిల్‌లో శ్రేయాస్ అయ్యర్ హెల్త్‌టెక్ ప్లాట్‌ఫామ్ ‘క్యూర్లో’లో పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. -
ప్రత్యేక సాయం వర్తింప చేయండి
సాక్షి, న్యూఢిల్లీ : నాడు–నేడు పథకం ద్వారా విద్య, ఆరోగ్య రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (మూలధన పెట్టుబడి)గా భావించి ప్రత్యేక సాయం వర్తింప చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఈ కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం.. శుక్రవారం నిర్మలా సీతారామన్‌తో సుమారు 40 నిమిషాలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే కేపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌పై కేంద్ర ప్రభుత్వం స్పెషల్ అసిస్టెన్స్ ఇచ్చేలా బడ్జెట్లో పొందుపరిచిన అంశాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాల్లో అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టిందని, స్కూళ్లలో నాడు–నేడు కింద రూ.6 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. తొలి దశ కింద 15,717 స్కూళ్లలో పనులు పూర్తయ్యాయని, ఆరో తరగతి నుంచి ఐఎఫ్‌పీ ప్యానెల్స్ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. ఆరోగ్య రంగంలోనూ నాడు–నేడు కింద అనేక పనులు చేపట్టామని, విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు మొదలు టీచింగ్ ఆస్పత్రుల వరకు పనులు చేపట్టామని, ఇందుకు రూ.4 వేల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. ఈ ఖర్చును క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్గా భావించి స్పెషల్ అసిస్టెన్స్ వర్తింప చేయాలని కోరారు. జాప్యం లేకుండా నిధులు విడుదల చేయాలి 2014–15కు సంబంధించిన వనరుల గ్యాప్ ఫండింగ్, 2016–2019 మధ్య పరిమితికి మించి తీసుకున్న రుణాల కారణంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న పర్యవసానాలు, 2021–22లో రుణాల పరిమితిపై సడలింపుల అంశాన్ని ఆర్థిక మంత్రితో చర్చించారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ డిస్కంలకు ఏపీ జెన్కో సరఫరా చేసిన విద్యుత్తుకు సంబంధించి రూ.6,756.92 కోట్ల బకాయిల అంశాన్నీ ప్రస్తావించారు. ఈ అంశం పలుసార్లు కేంద్రం దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఏపీ జెన్కో ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈ సొమ్ములు చాలా అవసరమని, జాప్యం లేకుండా వీలైనంత త్వరగా వచ్చేలా చూడాలని కోరారు. శనివారం నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొననున్నారు. విమానాశ్రయంలో ఘన స్వాగతం ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్సీపీ ఎంపీలు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎంపీలు మార్గాని భరత్‌రామ్, వంగా గీతా విశ్వనాథ్, చింతా అనూరాధ, ఎన్.రెడ్డెప్ప, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి గన్నవరం నుంచి ముఖ్యమంత్రి వెంట వచ్చారు. -
ఆర్థిక వ్యవస్థ పురోగతికి భారీ పన్ను వసూళ్లు బూస్ట్!
న్యూఢిల్లీ: బడ్జెట్లో (2022–23 ఆర్థిక సంవత్సరం) మూలధన పెట్టుబడుల పెంపు ప్రణాళికలు దేశ తయారీ రంగాన్ని ఉత్తేజం చేస్తాయని, పెట్టుబడులు పెరుగుతాయని, పన్ను రాబడులు పుంజుకుంటాయని ఆర్థికశాఖ ప్రకటించింది. ఆయా అంశాలు ఎకానమీని ఐదు ట్రిలియన్ డాలర్ల దిశగా నడుపుతాయన్న భరోసాను వ్యక్తం చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో 2022–23 ఆర్థిక సంవత్సరానికి క్యాపెక్స్ (మూలధన వ్యయ ం)ను 35.4% పెంచారు. దీనితో ఈ విలువ రూ. 7.5 లక్షల కోట్లకు పెరిగింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో క్యాపెక్స్ రూ. 5.5 లక్షల కోట్లు. తాజా ఆర్థిక పరిస్థితి, భవిష్యత్ అంచనాలపై ఆర్థిక శాఖ ఆవిష్కరించిన అవుట్‌లుక్‌లో ముఖ్యాంశాలు... ► గత ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయాలు రికార్డు స్థాయిలో 34% పెరిగి రూ. 27.07 లక్ష ల కోట్లకు చేరుకున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ మహమ్మారి సవాళ్లను ఎదుర్కొని వేగవంతమైన పురోగతి సాధిస్తోందనడానికి ఇది గొప్ప సాక్ష్యం. ► భారత్‌ను ప్రపంచ ఆర్థిక శక్తిగా మార్చడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నిబద్ధత కోసం పలు చర్యలు తీసుకుంటోంది. ఆయా అంశాలు దేశాన్ని పటిష్ట ఆర్థిక పురోగతి బాటన నిలుపుతున్నాయి. ► ఎకానమీ పటిష్ట బాటన నడుస్తోందని ఇటీవల భారీగా పెరిగిన పన్ను ఆదాయాలు వెల్లడిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్య సాధన సాధ్యమేనని ఈ గణాంకాలు భరోసా ఇస్తున్నాయి. 2020–21లో స్థూల కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.6.5 లక్షల కోట్లయితే, ఇది 2021–22లో రూ.8.6 లక్షల కోట్లకు పెరిగింది. గడచిన ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో 49 శాతం పెరిగి రూ.14.10 లక్షల కోట్లకు చేరాయి. పరోక్ష పన్నుల వసూళ్లు 20 శాతం పెరిగి 12.90 లక్షల కోట్లకు ఎగశాయి. ► పన్ను వసూళ్ల బేస్ పెంపు, తక్కువ వడ్డీరేట్లు, మినహాయింపులు లేని కొత్త సరళీకృత పన్ను విధానం, కార్పొరేట్ రంగానికి వ్యాపారాన్ని సులభతరం చేయడం, భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచడం, పన్ను ఎగవేతలకు చర్యలు వంటి పలు సంస్కరణాత్మక చర్యలు పన్నుల రాబడిని పెంచడానికి, తద్వారా ఎకానమీ పురోగతికి దోహదపడుతున్నాయి. -
టాటా క్లిక్‌లో టాటా గ్రూప్ భారీ పెట్టుబడులు
కోల్‌కతా, సాక్షి: ఈకామర్స్ వెంచర్ టాటా క్లిక్‌లో తాజాగా రూ. 3,500 కోట్లను ఇన్వెస్ట్ చేయాలని టాటా గ్రూప్ ప్రణాళిలు వేసింది. ఇందుకు వీలుగా టాటా క్లిక్ అధీకృత మూలధనాన్ని ప్రస్తుత రూ. 1,500 కోట్ల నుంచి రూ. 5,000 కోట్లకు పెంచేందుకు నిర్ణయించింది. ఇందుకు బోర్డు అంగీకరించినట్లు టాటా క్లిక్ మాతృ సంస్థ టాటా యూనిస్టోర్ నియంత్రణ సంస్థలకు తెలియజేసింది. ఈక్విటీ షేర్ల జారీ ద్వారా పెట్టుబడులను సమకూర్చనున్నట్లు తెలియజేసింది. తద్వారా కంపెనీ వృద్ధికి అవసరమైన నిధులు అందించనున్నట్లు వివరించింది. (ఆన్లైన్ బ్రాండ్ బోట్‌కు భారీ నిధులు) ఈకామర్స్‌కు ప్రాధాన్యం ప్రస్తుతం టాటా యూనిస్టోర్ పెయిడప్ షేర్ క్యాపిటల్ రూ. 1,203 కోట్లుగా నమోదైంది. ఇటీవల రుణ సమీకరణ పరిమితిని రూ. 490 కోట్లకు పెంచుకుంది. గత ఏప్రిల్‌లో మాతృ సంస్థ నుంచి రూ. 30 కోట్లు సమకూర్చుకుంది. ఇదేవిధంగా 2020లో రూ. 311 కోట్లు, 2019లోరూ. 292 కోట్లు, 2018లో రూ. 224 కోట్లు చొప్పున అందుకుంది. కొంతకాలంగా టాటా గ్రూప్ ఈకామర్స్ బిజినెస్‌కు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు ఈ సందర్భంగా కార్పొరేట్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆల్టిన్‌ఫో పేర్కొంది. కాగా.. 2019-20లో కంపెనీ ఆదాయం 144 శాతం జంప్‌చేసి రూ. 266 కోట్లను అధిగమించింది. నికర నష్టం సైతం 9.7 శాతం పెరిగి రూ. 270.6 కోట్లను తాకింది. అయితే ప్రస్తుత వేగాన్ని కొనసాగిస్తే టాటా యూనిస్టోర్ త్వరలోనే నిర్వహణ లాభాలు ఆర్జించే స్థాయికి చేరుతుందని ఆల్టిన్‌ఫో వ్యవస్థాపకుడు మోహిత్ యాదవ్ అంచనా వేశారు. -
ఈ-కామర్స్... ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్
గెస్ట్ కాలమ్ ఈ-కామర్స్.. ఆన్లైన్ విధానంలో ఆయా వస్తువుల క్రయవిక్రయాలు సాగించే విభాగం. కొద్దిగా సాంకేతిక నైపుణ్యాలు, మార్కెటింగ్ చాతుర్యం ఉంటే.. ఈ-కామర్స్‌లో కొత్త స్టార్ట్-అప్స్‌తో ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా రాణించేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోణంలోనూ తక్కువ ఖర్చుతో స్టార్ట్-అప్ను సుగమం చేసేది ఈ-కామర్స్ అంటున్నారు ప్రముఖ ఆన్లైన్ బిజినెస్ పోర్టల్ ఇ-బే ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ లతీఫ్ నతానీ. దేశంలో ఆన్లైన్ క్రయవిక్రయాలు పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ రంగంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవకాశాలపై లతీఫ్ నతానీతో ప్రత్యేక ఇంటర్వ్యూ.. దేశంలో ప్రస్తుతం ఈ-కామర్స్ రంగం ఎలా పయనిస్తోంది? ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ వంటి సదుపాయాలతో దేశంలో ఈ-కామర్స్ శరవేగంగా వృద్ధి చెందుతోంది. ప్రతి నెలా సగటున మూడు కోట్ల మంది ప్రజలు ఆన్లైన్ షాపింగ్ ద్వారా కొనుగోళ్లు చేస్తున్నారనే గణాంకాలే ఇందు కు నిదర్శనం. ఇటీవల ‘ఫొరెస్టర్’ విడుదల చేసిన నివేదిక ప్రకారం- 2014 నాటికి 60శాతం వృద్ధితో 3.2 బిలియన్ డాలర్ల వృద్ధి రేటును సాధించనుందని అంచనా. స్టార్ట్-అప్స్ పరంగా ఈ-కామర్స్ రంగంలో అవకాశాలు? ఆన్లైన్ షాపింగ్ కార్యకలాపాలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో.. అంతే స్థాయిలో కొత్త సంస్థల ఏర్పాటుకు కూడా అనేక అవకాశాలున్నాయి. ఈ-కామర్స్ వెబ్సైట్ ద్వారా కేవలం సంస్థ నిర్వాహకులకే కాకుండా పరోక్షంగా వందలాది మందికి ఉపాధి లభిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని చేతి వృత్తుల వారికి, అదేవిధంగా తాము తయారు చేసిన వస్తువుల విక్రయ మార్గాలపై అవగాహన లేని వారికి ఆన్లైన్ బిజినెస్ పోర్టల్స్ ఎంతో సహకరిస్తున్నాయి. అమ్మకందార్లు-కొనుగోలుదార్లకు మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తూ ఇద్దరికీ లాభదాయకంగా ఉండేలా సేవలు అందిస్తున్నాయి. ఈ-కామర్స్ విభాగంలో ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా రాణించాలంటే.. ప్రత్యేక స్కిల్స్ అవసరమా? ఈ-బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులు ఎంత మేరకు ఉపయోగం? వాస్తవానికి ఈ-కామర్స్ వ్యాపార రంగంలో ప్రవేశించాలనుకునేవారికి ఎలాంటి అకడెమిక్ నైపుణ్యాలు అవసరం లేదు. సాంకేతిక నైపుణ్యం, కొనుగోలుదారులు, అమ్మకందార్లను గుర్తించి వారికి తమ ఆన్లైన్ ట్రేడింగ్ పోర్టల్ అనుకూలం అనే విధంగా వ్యవహరిస్తే విజయం సాధించినట్లే. ఈ-బిజినెస్‌కు సంబంధించిన అవగాహన ఈ-బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల ద్వారా పొందొచ్చు. ఈ-కామర్స్ నైపుణ్యాలు అందించడంలో ఈ-బే ఇండియా తీసుకుంటున్న చర్యలు? స్పీక్వెల్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ పరిధిలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ల సహకారంతో ‘ఈ-ప్రో’ పేరుతో సర్టిఫికేషన్ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా.. ఈ-కామర్స్ నేపథ్యం, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, కస్టమర్ సర్వీస్, మార్కెటింగ్, ఆన్లైన్ సెల్లింగ్, ప్రాసెస్ ఆఫ్ సెల్లింగ్ తదితర అంశాలపై నైపుణ్యాలు కల్పించేలా శిక్షణనిస్తున్నాం. దీంతోపాటు మా సంస్థలో సెల్లర్స్‌గా ఉన్న వారికి భాషా నైపుణ్యాలు అందించేందుకు ఇంగ్లిష్, తెలుగు, హిందీ, గుజరాతీ, తమిళం, కన్నడ భాషల్లో ప్రావీణ్యం పొందేలా ఆన్లైన్ లెర్నింగ్ మాడ్యూల్స్‌ను కూడా అందిస్తున్నాం. మన దేశంలో కొత్త స్టార్ట్-అప్స్ విషయంలో సవాళ్లు, సమస్యలపై మీ అభిప్రాయం? ప్రస్తుతం మన దేశంలో ఆహ్వానించదగిన పరిణామం.. యువత స్టార్ట్-అప్స్ దిశగా ఆలోచించడం. ఈ క్రమంలో ఎన్నో వెంచర్స్ ఆవిష్కృతమవుతున్నాయి. ఇదే సమయంలో ఎదురవుతున్న ప్రధాన సవాళ్లు.. నిర్దిష్ట బడ్జెట్లో మౌలిక సదుపాయలు ఏర్పాటు చేసుకోవడం. అంతేకాకుండా.. సదరు ఉత్పత్తికి సంబంధించి భారీ స్థాయిలో ఉండే లక్షిత వినియోగదారులను చేరేందుకు అవసరమైన మార్కెటింగ్ వ్యూహాలు. ఈ రెండు అంశాలు ప్రధాన సమస్యలుగా మారుతున్నాయి. వీటికి పరిష్కారం ఆర్థిక వనరుల సమీకరణ. ఈ-కామర్స్‌తో పోల్చితే ఉత్పత్తి రంగంలో స్టార్ట్-అప్స్ సంఖ్య తక్కువకు కారణం? ఈ-కామర్స్‌కు సంబంధించి కొత్త స్టార్ట్-అప్స్ ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం.. తక్కువ ఖర్చుతో ప్రారంభించే సౌలభ్యం. అదే ఉత్పత్తి రంగంలో కొత్త స్టార్ట్-అప్ అంటే భారీగా మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, మార్కెటింగ్ నైపుణ్యాలు అవసరం. ఇందుకోసం పెట్టుబడి కూడా భారీగానే ఉండాలి. అంతేకాకుండా ఈ-కామర్స్ సంస్థలు.. చిన్న తరహా ఉత్పత్తిదారులకు చక్కటి మార్కెటింగ్ ప్రాంతంగా నిలుస్తూ ఆ ఇబ్బందులను తగ్గిస్తున్నాయి. ఔత్సాహిక ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు వనరుల సమీకరణకు ఉన్న మార్గాలు? ప్రస్తుతం సీడ్ ఫండింగ్ సంస్థలు లాభదాయకమైన వెంచర్స్‌కు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. ఫండింగ్ ఇవ్వడంతో సరిపెట్టకుండా.. నిరంతరం సమీక్షిస్తూ వ్యాపారాభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపైనా సలహాలు, సూచనలు అందిస్తున్నాయి. ఈ అవకాశాలను ఔత్సాహికులు అందిపుచ్చుకోవాలి. ఇంటర్నెట్ ద్వారా ఈ సౌకర్యాలు అందించే సంస్థల వివరాలు తెలుసుకోవచ్చు. స్టార్ట్-అప్‌కు సరైన సమయం? తాము సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్న రంగానికి సంబంధించి ప్రాథమిక అవగాహన కోసం ముందుగా ఆ రంగంలో పని అనుభవం గడించడం మంచిది. ఫలితంగా ఆ రంగంలోని లోటుపాట్లు, తాజా పరిస్థితులపై అవగాహన లభిస్తుంది. తాము భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై స్పష్టత వస్తుంది. లాభదాయక విధానాలు అవలంబించే వీలు కలుగుతుంది. స్వయంఉపాధి, ఉద్యోగం.. రెండు వర్గాల ఔత్సాహికులకు మీరిచ్చే సలహా? తమ అకడమిక్ విభాగాల్లో నైపుణ్యాలతోపాటు పీపుల్ స్కిల్స్ (కమ్యూనికేషన్, ఇంటర్ పర్సనల్, క్రాస్ కల్చరల్) పెంచుకోవాలి. అవి ఉన్నప్పుడే ఉద్యోగమైనా, వ్యాపారంలోనైనా భవిష్యత్తులో రాణించొచ్చు. ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవచ్చు.