బాలుడిని చేరదీసిన కండక్టర్
పోచమ్మమైదాను : జనగామ నుంచి మంగళవారం రాత్రి వచ్చిన బస్సులో ఒంటరిగా ఓ బాలుడు కనిపించడంతో గమనించిన కండక్టర్ 1098కి సమాచారం ఇచ్చారు. చైల్డ్‌లైను సిబ్బంది అక్కడికి చేరుకొని బాలుడిని తీసుకెళ్లి సీడబ్ల్యూసీ చైర్మను అనితారెడ్డి ఎదుట బుధవారం హాజరుపరిచారు. అనంతరం ఆ బాలుడికి బాలసదనంలో ఆశ్రయం కలి్పం చారు. బాలుడి వయస్సు 9 సంవత్సరాలు ఉంటుంది. బాలుడి పేరు మహేష్ అని, తండ్రి పేరు రవి, తల్లి పేరు బాగమ్మ అని చెబుతున్నాడు. అడ్రస్ మాత్రం చెప్పడం లేదు. కాగా అతడికి రాత్రి ఫిట్స్ రావడంతో ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. బాలుడి బంధువులు ఎవరైనా ఉంటే ఆధారాలతో 1098, 9177362072 నంబర్‌కు ఫో¯ŒS చేయాలని అనితారెడ్డి కోరారు.