భక్తుల, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాం: టీటీడీ
తిరుమల: భక్తులకు, ఉద్యోగులకు సమస్యలు లేకుండా చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. టీటీడీ పాలకమండలికి నేటితో రెండేళ్ల పదవీ కాలం ముగిసింది. ఈ సందర్భంగా బోర్డు చివరి సమావేశం మంగళవారం జరిగింది. తమ జీవితాల్లో ఇది మరచిపోలేని అనుభూతి అని ఆయన అన్నారు.
జూన్ మొదటి వారం నుంచి శ్రీవారి అనుగ్రహం పేరుతో సేవా టికెట్లను ఎలక్ట్రానిక్ లక్కీ డ్రిప్ ద్వారా భక్తులకు అందిస్తామని చెప్పారు. లడ్డూల తయారీ కార్మికులకు రూ. 3 వేల మేర జీతం పెంచామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సైన్సు మ్యూజియం ఏర్పాటుకు భూమి లీజుకు ఇవ్వడానికి, తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల రాజగోపురాల నిర్మాణ అభివృద్ధికి రూ.8 కోట్లకు పైగా మంజూరుకు బోర్డు ఆమోదం తెలిపింది.