ఎడారి జిల్లాలో రెండే సీట్లు
రాజస్థాన్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన థార్ ఎడారి... దూరంగా విసిరేసినట్లు ఉండే గ్రామాలు... ఆయా గ్రామాల్లో కేవలం వందల సంఖ్యలోనే ఓటర్లు. ఇదీ రాజస్థాన్లో గోల్డెన్ సిటీగా పేరుగాంచిన జైసల్మేర్ జిల్లా పరిస్థితి. జిల్లా విస్తీర్ణం 38,401 చదరపు కిలోమీటర్లు ఉన్నప్పటికీ అందులో ఎక్కువ భాగం ఎడారి ప్రాంతమే. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 6.72 లక్షలు. అందుకే ఈ జిల్లాలో జైసల్మేర్, పోఖ్రాన్ శాసనసభా నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. జైసల్మేర్ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చోటూసింగ్తోపాటు కాంగ్రెస్ నుంచి రూపారాం పోటీ పడుతుండగా; పోఖ్రాన్లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సాలేహ్ మహమ్మద్, బీజేపీ నుంచి షేతా సింగ్ పోటీలో ఉన్నారు.
రాజస్థాన్లో బీజేపీ గెలుపు: సర్వే
న్యూఢిల్లీ: రాజస్థాన్లో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టనున్నట్లు ఏబీపీ న్యూస్-దైనిక్ భాస్కర్-నీల్సేన్ సర్వే వెల్లడించింది. మొత్తం 200 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 105 స్థానాల్లో గెలుపొందే అవకాశాలున్నట్లు తె లిపింది. కాంగ్రెస్కు 77 సీట్లు లభించవచ్చని పేర్కొంది.