మెళవాయి ఘటనపై విచారణకు ఆదేశం
కాంట్రాక్టర్ ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదు
మడకశిర: అనంతపురం జిల్లా మడకశిర మండలం మెళవాయి వద్ద రైతుల పట్ల కాంట్రాక్టర్ అమానుష చర్యపై విచారణ చేసి.. నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కోనశశిధర్, జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు కూడా ఈ సంఘటనపై పూర్తి స్థాయి నివేదిక కోరారు.
నష్టపరిహారం ఇవ్వకుండానే తమ పొలంలో చేపట్టిన 220 కేవీ విద్యుత్ స్తంభాల ఏర్పాటును అడ్డుకోబోయిన తండ్రీకొడుకులు నబీరసూల్, వన్నూర్సాబ్పై కాంట్రాక్టర్ ప్రవీణ్‌కుమార్, కర్ణాటక, ఆంధ్ర విద్యుత్ శాఖ అధికారుల సమక్షంలోనే అమానుషంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. బాధిత రైతుల ఫిర్యాదు మేరకు కాంట్రాక్టర్ ప్రవీణ్‌కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.