cool drinks shops
-
హబీబ్‌నగర్‌లో దారుణం.. కూల్ డ్రింక్ చోరీ చేశాడని..
సాక్షి, హైదరాబాద్: కూల్ డ్రింక్ దొంగతనం చేశాడంటూ ఓ దుకాణ యజమాని తొమ్మిదేళ్ల బాలుడిని దుస్తులు ఊడదీసి చేతులు, కాళ్లు కట్టేసి చితకబాదడమేగాక ప్రైవేట్ పార్ట్స్ పై కారం చల్లి పైశాచికానందం పొందారు. అంతటితో ఆగకుండా ఈ తతంగాన్ని వీడియో తీసి బాలుడి తల్లికి పంపించిన సంఘటన హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్సై గాయత్రి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానిక అఫ్జల్‌సాగర్ కట్ట ప్రధాన రహదారిపై అబ్రహీమ్ జనరల్ అండ్ స్టేషనరీ దుకాణాన్ని అదే ప్రాంతానికి చెందిన కృష్ణ అద్దెకు తీసుకుని నడుపుతున్నాడు. ఖదిరియా మసీదు సమీపంలో ఉండే బాలుడు (9) తరచూ సదరు దుకాణానికి సరుకుల కొనుగోలు నిమిత్తం వచ్చేవాడు. ఈ క్రమంలో ఇటీవల అతను దుకాణంలో కూల్ డ్రింక్ బాటిల్ దొంగలించాడు. దీనిని గుర్తించిన కృష్ణ సోమవారం బాలుడిని పట్టుకుని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటి టెర్రస్ పైకి తీసుకువెళ్లి అతడి బట్టలు ఊడదీసి, చేతులు కాళ్లు కట్టేశాడు. ఆపై బాలుడి ప్రైవేట్ పార్ట్స్‌పై కారం పొడి చల్లాడు. బాధను భరించలేక బాలుడు కేకలు వేశాడు. అంతేకాకుండా ఈ దృశ్యాలను తన సెల్‌ఫోన్‌తో వీడియో తీసి బాలుడి తల్లికి షేర్ చేశాడు. దీంతో ఆమె ఈ విషయాన్ని తమ బంధువుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో సమాచారం అందుకున్న హబీబ్‌నగర్ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన బాలుడిని చేరదీసుకుని చికిత్స నిమిత్తం నాంపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతడి దాడికి పాల్పడిన కృష్ణను అదుపులోకి తీసుకుని విచారించారు. దాడి చేసిన విషయం వాస్తవమేనని ఒప్పుకోవడంతో నిందితుడిపై కేసులు నమోదు చేశారు. దుకాణంలో చోరీకి పాల్పడిన బాలుడిని విచారించేందుకు సీడబ్ల్యూసీ అధికారులకు అప్పగించారు. బాలుడిపై దాడి అమానుషం కూల్‌డ్రింక్ చోరీ చేశాడనే నెపంతో ఓ బాలుడి పట్ల దుకాణం యజమాని ప్రవర్తించిన తీరు దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చిన్న పిల్లలపై ఇలాంటి అకృత్యాలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే శిక్షాస్మృతిని మార్చాలని కోరారు. చదవండి: ఆన్లైన్ గేమ్ ఆడి.. రూ.95 లక్షలు ఓడి.. -
కూల్ కూల్‌గా మోసం
సాక్షి,వేపగుంట(గోపాలపట్నం (విశాఖపశ్చిమ) : నాణ్యత పాటించని ఫ్రూట్ జ్యూస్ షాపుపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేశారు. వేపగుంట సాయిమాధవనగర్‌లో పిల్లా శ్రీనివాసరావు శీతల పానీయాల తయారీ కేంద్రం కృప ఏజెన్సీస్ పేరిట నిర్వహిస్తున్నాడు. బుధవారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ సీఎంనాయుడు ఆ శాఖ ఎస్ఐ రమేష్, ఆహార భద్రతాధికారులు వెంకటరత్నం, శ్రీరాములుతో అక్కడికి వచ్చి తనిఖీలు చేపట్టారు. శీతల పానీయాల తయారీకి శుద్ధి చేసిన నీరు వాడాల్సి ఉండగా, ఇక్కడ మా త్రం బాటిళ్లలో బావిలో నీరుపోసేస్తున్నారు. అందులో మామిడి, ద్రాక్ష రసాలతో పాటు కొద్ది రోజులు నిల్వ ఉండేలా రసాయనాలు కలి పేస్తున్నారు. దీంతో శ్రీనివాసరావును అరె స్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. శాంపిళ్లను హై దరాబాద్ సేఫ్టీ ఫుడ్ ల్యాబ్‌కు పంపుతున్నట్లు చెప్పారు. -
వామ్మో ఎండ!
సాక్షి, నెల్లూరు : ఏప్రిల్ ప్రారంభంలోనే ఎండలు భగభగమంటున్నాయి. వారం రోజులుగా పరిశీలిస్తే రోజు రోజుకూ ఉష్ణోగ్రత తీవ్రమవుతోంది. మార్చి ప్రారంభం నుంచే ఎండల తీవ్రత పెరుగుతూ రాగా, గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. మే నెలలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకుంటూ జనం జడుసుకుంటున్నారు. ఇప్పుడే ఉదయం 11 గంటల దాటితే రోడ్లు ఎడారులను తలపిస్తున్నాయి. మహిళలు చంటి పిల్లలతో బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. భానుడి ప్రచండ ప్రతాపంతో ఎక్కువగా ప్రజలు ఇళ్లకే పరితమవుతున్నారు. జిల్లాలో వాతావరణ పరిస్థితిలో ఒక్కసారిగా మార్పులొచ్చాయి. పగలు వేడిగా, రాత్రి చలి అధికంగా ఉంది. నాలుగు రోజులు వరకు రాత్రి పూట మంచు తీవ్రంగా ఉండగా, రెండు రోజులుగా మంచు కూడా తగ్గుముఖం పట్టింది. ఒకేసారి రెండు రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక చంటి పిల్లలు, వృద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ వారం రోజుల్లోనే వడ దెబ్బకు జిల్లా వ్యాప్తంగా నలుగురు మృత్యువాత పడ్డారు. దీనికి తోడు విద్యుత్ కోతలు అధికమవడంతో ఒక వైపు ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతుండగా రాత్రి వేళల్లో దోమల బెడద మరింత ఇబ్బందులకు గురి చేస్తోంది. ఏప్రిల్ నుంచి ఎండలు అధికమయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతుండడంతో ఈ రెండు నెలలు ఎండలను తట్టకునేదెలా అనే ఆందోళనలో ప్రజలు ఉన్నారు. జిల్లాలో పరీక్షలు, ఎన్నికలు ఉండటంతో ఎండ వేడిమి సెగలు తట్టుకునేందుకు ప్రజలు అల్లాడుతున్నారు. అప్పుడే వేసవి తాపాన్ని తట్టుకునేందుకు కూల్‌డ్రింక్ షాపులు, ఐస్‌క్రీమ్ షాపులు కిటకిటలాడుతున్నాయి. నగరంలో పలు చోట్ల చెరకు రసం, పుచ్చకాయలు, కిరిణీ కాయలు విక్రయాలు కూడా అనూహ్యంగా పెరిగాయి. ఎండలను తట్టుకోలేక పలువురు తమ ఇళ్లల్లో ఉండలేక ఏసీ సినిమా థియేటర్లకు పరుగులు తీస్తున్రాను. సినిమా ఎలా ఉన్నా సరే.. ఆ మూడు గంటల పాటు సేద తీరుదాం అనే భావన జనాల్లో కనిపిస్తోంది.