cross country championship
-
చాంప్స్ నాగరాజ్, లావణ్య
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా క్రాస్ కంట్రీ చాంపియన్‌షిప్‌లో నాగరాజ్, లావణ్య చాంపియన్లుగా నిలిచారు. ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లో ఆదివారం నిర్వహించిన పురుషుల 10 కి.మీ పరుగును నిజాం కాలేజి గ్రౌండ్‌కు చెందిన నాగరాజ్ 32 నిమిషాల 34 సెకన్లలో పూర్తిచేసి విజేతగా నిలిచాడు. రమేశ్ (33:30:00; నిజాం కాలేజి గ్రౌండ్), షేక్ ఖాజా (35:10:00; ప్రజ్ఞయ) వరుసగా ద్వితీయ తృతీయ స్థానాలు దక్కించుకున్నారు. మహిళల 10 కి.మీ పరుగులో ఎస్. లావణ్య (41:34:00; సెయింట్ పాయిస్) అగ్రస్థానం సొంతం చేసుకోగా... ఎన్. విజయ (43:30:00; ఆర్బీవీఆర్), సాయి లత (45:10:00; ఫారెస్ట్ కాలేజి) వరుసగా రెండు, మూడు స్థానాలు కైవసం చేసుకున్నారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్ సంఘం అధ్యక్షుడు రాజేశ్ కుమార్, కార్యదర్శి భాస్కర్ రెడ్డి విజేతలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఇతర విభాగాల విజేతలు... పురుషుల 8 కి.మీ పరుగు: 1. ప్రశాంత్ (25:30:00; నిజాం కాలేజి), 2. భరత్ (25:50:00; వివేకానంద), 3. సయ్యద్ షాబాజ్ అలీ (26:10:00; ఏవీ కాలేజి). పురుషుల 6 కి.మీ పరుగు: 1. సయ్యద్ ఇనాయత్ అలీ (19:35:00; సెయింట్ ఇమాద్), 2. శేఖర్ (19:45:00; బీఎస్సీ), 3. రాహుల్ (19:55:00; జీజేసీ, రాయదుర్గం). పురుషుల 2 కి.మీ పరుగు: 1. నిశాంత్ శర్మ (6:05:00; బీఎస్సీ), 2. మల్లేశ్ (6:50:00; ప్రభుత్వ ఐటీఐ). మహిళల 4 కి.మీ పరుగు: 1. గంగోత్రి (16:10:00; ఓయూ), 2. మమత (16:40:00; రైల్వే డిగ్రీ కాలేజి). మహిళల 2 కి.మీ పరుగు: 1. శ్రేయ (8:10:00; సెయింట్ మార్క్స్), 2. నిధి (8:20:00), 3. వేముల శ్రేయ (9:50:00; సెయింట్ ఆన్స్). -
క్రాస్‌కంట్రీ విజేతలు ప్రశాంత్, కావ్య
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్ కాలేజీ క్రాస్ కంట్రీ రేస్ పోటీల్లో బి. ప్రశాంత్, పి. కావ్య విజేతలుగా నిలిచారు. ఓయూ వేదికగా ఆదివారం జరిగిన ఈ పోటీలను ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) ఎం. నర్సింహులు ప్రారంభించారు. పురుషుల 10 కి.మీ. రేస్‌లో నిజాం కాలేజీకి చెందిన ప్రశాంత్ చాంపియన్‌గా నిలిచాడు. అతను అందరికన్నా ముందుగా 33 నిమిషాల 32.4 సెకన్లలో పరుగును పూర్తి చేసి అగ్రస్థానాన్ని అందుకున్నాడు. రెండోస్థానంలో నిలిచిన హెచ్జీపీఎం అథ్లెట్ ఎస్. వినోద్ 33 నిమిషాల 50 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నాడు. అవంతి కాలేజీకి చెందిన ఎ. పవన్‌తేజ (33ని. 55.7సె.) మూడోస్థానంలో నిలిచాడు. మహిళల కేటగిరీలో వనితా కాలేజీకి చెందిన కావ్య 38 నిమిషాల 8.02 సెకన్లలో రేస్‌ను ముగించి విజేతగా నిలిచింది. ఎన్. సుచిత్ర (సెయింట్ ఆన్స్; 39ని.13.2సె.), ఎస్. అనురాగ (సెయింట్ ఆన్స్; 42ని.51సె.) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. పురుషుల టీమ్ చాంపియన్‌షిప్‌ను నిజాం కాలేజీ గెలుచుకుంది. 58 పాయింట్లతో నిజాం జట్టు టైటిల్‌ను అందుకుంది. అవంతి కాలేజీ (67 పాయింట్లు), భవన్స్ వివేకానంద (75 పాయింట్లు) తర్వాతి స్థానాలను సాధించాయి. మహిళల టీమ్ చాంపియన్‌షిప్‌ను సెయింట్ ఆన్స్ (30 పాయింట్లు) జట్టు దక్కించుకుంది. జీసీపీఈ 35 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచింది. భవన్స్ (78 పాయింట్లు) జట్టుకు మూడోస్థానం దక్కింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ ఎల్బీ లక్ష్మీకాంత్ రాథోడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
టీమ్ చాంపియన్ నిజామ్ కాలేజ్
సాక్షి, హైదారాబాద్: అవంతి డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో జరిగిన ఉస్మానియా అంతర్ కళాశాలల క్రాస్ కంట్రీ చాంపియన్‌షిప్‌లో నిజామ్ కాలేజ్, కస్తూర్బా గాంధీ కాలేజ్ జట్లు చాంపియన్లుగా నిలిచాయి. ఆదివారం ఉస్మానియా ప్రాంగణంలో జరిగిన పురుషుల టీమ్ ఈవెంట్ పోటీల్లో 87 పాయింట్లు సాధించి నిజామ్ కాలేజ్ విజేతగా నిలవగా... 153 పాయింట్లతో భవన్స్ వివేకానంద కాలేజ్, 217 పాయింట్లతో బద్రుక కాలేజ్ వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్ని దక్కించుకున్నాయి. మహిళల టీమ్ ఈవెంట్లో కస్తూర్బా గాంధీ కాలేజ్ (38 పాయింట్లు), సెయింట్ ఆన్స్ డిగ్రీ కాలేజ్ (42 పాయింట్లు), కోఠి మహిళల యూనివర్సిటీ కాలేజ్ (54 పాయింట్లు)లు తొలి 3 స్థానాల్లో నిలిచాయి. మరోవైపు 5 కి.మీ పరుగు మహిళల వ్యక్తిగత విభాగంలో ప్రియాంక (వనిత మహావిద్యాలయ) 19: 58.7 నిమిషాల్లో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. ఆర్. కలైవాణి (20:53 ని., సెయింట్ ఆన్స్), కె. మానస (22:14.3ని.) రన్నరప్‌లుగా నిలిచారు. 12 కి.మీ రేసులో పురుషుల వ్యక్తిగత విభాగంలో కె. ఆనంద్ (41: 39.8ని., న్యూ గవర్నమెంట్ కాలేజ్, శేరిలింగంపల్లి), ఎస్. వినోద్ (42:02.08ని., నిజామ్ కాలేజ్), బి. రంగయ్య (42:07.8ని., న్యూ బద్రుక కాలేజ్) తొలి మూడు స్థానాల్ని దక్కించుకున్నారు.