సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా క్రాస్ కంట్రీ చాంపియన్‌షిప్‌లో నాగరాజ్, లావణ్య చాంపియన్‌లుగా నిలిచారు. ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లో ఆదివారం నిర్వహించిన పురుషుల 10 కి.మీ పరుగును నిజాం కాలేజి గ్రౌండ్‌కు చెందిన నాగరాజ్ 32 నిమిషాల 34 సెకన్లలో పూర్తిచేసి విజేతగా నిలిచాడు. రమేశ్ (33:30:00; నిజాం కాలేజి గ్రౌండ్), షేక్ ఖాజా (35:10:00; ప్రజ్ఞయ) వరుసగా ద్వితీయ తృతీయ స్థానాలు దక్కించుకున్నారు. మహిళల 10 కి.మీ పరుగులో ఎస్. లావణ్య (41:34:00; సెయింట్ పాయిస్) అగ్రస్థానం సొంతం చేసుకోగా... ఎన్. విజయ (43:30:00; ఆర్‌బీవీఆర్), సాయి లత (45:10:00; ఫారెస్ట్ కాలేజి) వరుసగా రెండు, మూడు స్థానాలు కైవసం చేసుకున్నారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్ సంఘం అధ్యక్షుడు రాజేశ్ కుమార్, కార్యదర్శి భాస్కర్ రెడ్డి విజేతలకు సర్టిఫికెట్లు అందజేశారు.
ఇతర విభాగాల విజేతలు...
పురుషుల 8 కి.మీ పరుగు: 1. ప్రశాంత్ (25:30:00; నిజాం కాలేజి), 2. భరత్ (25:50:00; వివేకానంద), 3. సయ్యద్ షాబాజ్ అలీ (26:10:00; ఏవీ కాలేజి).
పురుషుల 6 కి.మీ పరుగు: 1. సయ్యద్ ఇనాయత్ అలీ (19:35:00; సెయింట్ ఇమాద్), 2. శేఖర్ (19:45:00; బీఎస్సీ), 3. రాహుల్ (19:55:00; జీజేసీ, రాయదుర్గం).
పురుషుల 2 కి.మీ పరుగు: 1. నిశాంత్ శర్మ (6:05:00; బీఎస్సీ), 2. మల్లేశ్ (6:50:00; ప్రభుత్వ ఐటీఐ).
మహిళల 4 కి.మీ పరుగు: 1. గంగోత్రి (16:10:00; ఓయూ), 2. మమత (16:40:00; రైల్వే డిగ్రీ కాలేజి).
మహిళల 2 కి.మీ పరుగు: 1. శ్రేయ (8:10:00; సెయింట్ మార్క్స్), 2. నిధి (8:20:00), 3. వేముల శ్రేయ (9:50:00; సెయింట్ ఆన్స్).
Comments
Please login to add a commentAdd a comment