వ్యర్థాల పునర్వినియోగంతో లాభాలు
⇒ ఎమ్మెల్యే సంపత్‌కుమార్
⇒ వ్యర్థాల నియంత్రణపై మరిన్ని పరిశోధనలు జరగాలి
⇒ కాలుష్య రహిత సమాజంకోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలి
సాక్షి, హైదరాబాద్: వ్యర్థాల పునర్వినియోగం ద్వారా సంపదను పెంపొందించుకునేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని అలంపూర్ ఎమ్మెల్యే ఎస్ఏ సంపత్‌కుమార్ అన్నారు. వ్యర్థాలను నియంత్రించి కాలుష్య రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం జాతీయ ఉత్పాదకత వారోత్స వాలను పురస్కరించుకుని జాతీయ ఉత్పాద కత మండలి ఆధ్వర్యంలో ‘వ్యర్థాల పునర్వి నియోగం ద్వారా లాభాలు’ అంశంపై సదస్సు నిర్వహించారు.
సెస్ ఆడిటోరియం లో జరిగిన ఈ సదస్సులో సంపత్ మాట్లాడు తూ.. భావితరాలకు ఉపయోగపడే విధంగా వ్యర్థాల నియంత్రణ, పునర్విని యోగంపై మరిన్ని పరిశోధనలు జరగాలన్నారు. వ్యర్థాలను తగ్గించడం ద్వారా పరిశ్రమల ఉత్పాదకత పెరుగుతుందని, దీంతో ఉపాధి అవకాశాలు మెండవుతాయని అన్నారు. రాష్ట్రంలో మున్సిపాలిటీల ద్వారా రోజుకు 50వేల టన్నుల చెత్త వస్తోందని, ఆసుపత్రుల నుంచి రోజుకు 10వేల టన్నులు, పరిశ్రమల నుంచి ఏడాదికి లక్షల టన్నుల వ్యర్థాలు బయటకు వస్తున్నాయన్నారు. వ్యర్థాల నియంత్రణకు కఠిన చట్టాలు రూపొందించే లా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానన్నారు.
వ్యర్థాల రంగంలో అవకాశాలు..
వివిధ రకాల వ్యర్థాలను సేకరించి వాటిని పునర్ వినియోగించడంలో ఎన్నో లాభాలు న్నాయని రాంకీ సంస్థల చైర్మన్ అయోధ్య రామిరెడ్డి అన్నారు. వ్యర్థాల నిర్వహణకు సంబంధించి మూడు దశాబ్దాల కిందట రాంకీ రూపొందించిన మోడల్ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. గత పదేళ్లు గా సమాజంలో ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగవడంతో కుటుంబాలు, పరిశ్ర మల నుంచి కూడా వ్యర్థాలు పెరిగాయ న్నారు. స్వచ్ఛభారత్ ద్వారా కేంద్ర ప్రభుత్వం వ్యర్థాల నిర్వహణకు ముందుకు రావడం హర్షణీయమన్నారు. రోజురోజుకూ వ్యర్థాల పరిమాణం పెరుగు తున్నందున, ఈ రంగం లోకి వచ్చేవారెవరైనా సొమ్ము చేసుకునేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు.
సదస్సులో మిథాని డైరెక్టర్ ఎస్.కె.ఝా, జాతీయ ఉత్పాదకత మండలి ప్రాంతీయ సంచాలకుడు డాక్టర్ హేమంత్‌కుమార్‌రావు, రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ సాంకేతిక, ప్రణాళిక, పరిశోధన విభాగాధిపతి డాక్టర్ కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జాతీ య ఉత్పాదకత వారోత్సవాల నేపథ్యంలో ఎన్పీసీ నిర్వహించిన పోటీల్లో విజేతలకు అతిథులు బహుమతులు, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.