వీడియోకాన్ డీ 2హెచ్లో మరో గుజరాతీ చానల్
హైదరాబాద్ : వీడియోకాన్ డీ2హెచ్ తన ప్లాట్‌ఫామ్ మీద మరో కొత్త చానల్‌ను వినియోగదారులకు అందిస్తోంది. గుజరాత్‌కు చెందిన ప్రముఖ ప్రాంతీయ భాష చానల్ ‘సందేశ్ న్యూస్’ను తన ప్లాట్‌ఫామ్ మీద ప్రారంభించింది. సందేశ్ చానల్ ఒక 24/7 న్యూస్, కరెంట్ అఫైర్స్ చానల్. ఈ చానల్ ఎల్‌సీఎన్: 942 నంబర్లో వస్తుంది. వీడియోకాన్ డీ2హెచ్ ఈ చానల్‌తో కలుపుకొని మొత్తంగా 8 గుజరాత్ చానళ్లను తన ప్లాట్‌ఫామ్ మీద వినియోగదారులకు అందిస్తోంది.