Dallas airport
-
వైరల్ వీడియో : గాల్లోనే ఢీకొన్న 2 విమానాలు..
-
ట్రంప్ నిర్ణయంతో లక్ష వీసాల రద్దు
వాషింగ్టన్ : ఏడు ముస్లిం మెజారిటీ దేశాల ప్రజలకు అమెరికా ప్రయాణంపై నిషేధం విధిస్తూ అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్నాక దాదాపు లక్ష వీసాలను రద్దుచేసినట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. డల్లాస్ ఎయిర్పోర్టుకు యెమెన్ నుంచి వచ్చిన ఇద్దరు సోదరులు వేసిన కేసుపై విచారణ సందర్భంగా ప్రభుత్వం ఈ సంఖ్యను బహిర్గతం చేసింది. అయితే వీసాలున్నా ఎందరిని వెనక్కు పంపారనే అంశంపై మాత్రం ప్రభుత్వం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అమెరికా భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇరాక్, ఇరాన్ , యెమెన్ , సూడాన్ , సోమాలియా, లిబియా, సిరియా దేశాలనుంచి వచ్చే శరణార్థులపై నిషేధం విధిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. -
ఎయిర్పోర్టులో యువకుడి హల్చల్, కాల్పులు
డల్లాస్: డల్లాస్ లోని విమానాశ్రయంలో హంగామా సృష్టించిన ఓ యువకుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. లవ్ ఫీల్డ్ విమానాశ్రయంలో శుక్రవారం ఓ యువకుడు 'షూట్ మీ' అని పెద్దగా అరుస్తూ హల్చల్ చేశాడు. అతడు చేతిలో రాయి పట్టుకుని సంచరిస్తూ పెద్ద కేకలు వేయడంతో అతడిని లొంగిపోవాలని పోలీసులు సూచించారు. అయితే ఆ యువకుడు పోలీసుల హెచ్చరికలను ఏమాత్రం లెక్కచేయలేదు. దీంతో అతడిపై పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం. అనంతరం అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు స్థానికి టీవీ ఒక కథనాన్నిప్రసారం చేసింది. కాల్పుల అనంతరం విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మరోవైపు అతడి ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం లేదు. ఈ ఘటనపై స్పందించడానికి ఎయిర్ పోర్ట్ అధికారులు అందుబాటులో లేరు.