పదోన్నతులు త్వరగా కేటాయించాలి
డీఈఓకు వైఎస్సార్‌టీఎఫ్ వినతి
ఒంగోలు: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీచేయాలని వైఎస్సార్‌టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.జాలిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తిచేశారు. పదోన్నతులు కల్పించే సమయంలో అక్టోబరు 2016 మాసాంతానికి ఖాళీ అయ్యే స్థానాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పదోన్నతుల కారణంగా ఖాళీ అయ్యే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను డీఈవో పూల్‌లో ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఇవ్వాలని పేర్కొన్నారు.
గత ఏడాది విలీనం జరిగిన పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్‌టీచర్లు ఇన్ఫర్మేషన్ డేటాలలో జాయినింగ్ తేదీని రకరకాలుగా నమోదుచేశారన్నారు. జిల్లా మొత్తం ఒకే తేదీ ఉండేలా చర్యలు చేపట్టకపోతే రాబోవు బదిలీల్లో ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని విజ్ఞప్తిచేశారు. డీఈవోను కలిసిన వారిలో జిల్లా గౌరవ అధ్యక్షులు డీసీహెచ్.మాలకొండయ్య, ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, బొజ్జా సురేష్‌లు ఉన్నారు.