Development - Welfare
-
ధైర్యముంటే రిపోర్టు కార్డు విడుదల చెయ్యండి.. అమిత్ షా
భోపాల్: త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ మధ్యప్రదేశ్‌లో దూకుడును పెంచింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన గరీబ్ కళ్యాణ్ మహా అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2003 నుండి 2023 వరకు పరిపాలనకు సంబంధించి రిపోర్టు కార్డును విడుదల చేశారు. ధైర్యముంటే కాంగ్రెస్ పార్టీ కూడా తమ 53 ఏళ్ల పరిపాలన తాలూకు ప్రగతి నివేదిక సమర్పించాలని సవాల్ విసిరారు. గరీబ్ కళ్యాణ్ మహా అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్ షా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చోహాన్, బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ సమక్షంలో 20 ఏళ్ల ప్రగతి నివేదికను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాటలాడుతూ మధ్యప్రదేశ్ ప్రజలు 2003లో కాంగ్రెస్ పార్టీని, వేర్పాటుదారుడు దిగ్విజయ్ సింగ్ ను సాగనంపి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. గడిచిన 20 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతికి శ్రీకారం చుట్టిందని అన్నారు. ధైర్యముంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఐదు దశాబ్దాల పరిపాలనలో మధ్య ప్రదేశ్ కు ఏమి చేసిందో నివేదిక విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. 1956లో మధ్యప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2003 వరకు ఐదారేళ్లు మినహాయిస్తే మిగతా సమయమంతా కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉందని ఆ సమయంలో ఇక్కడ అభివృద్ధి కరువై BIMARU(ఆరోగ్యం నశించి)గా మారిందని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి రాష్ట్రాభివవృద్ధికి కృషి చేసిందని.. మధ్యలో డిసెంబరు 2018 నుండి మార్చి 2002 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలన్నింటినీ నిలిపివేసి అభివృద్ధిని కుంటుపడేలా చేసిందని అన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం అన్ని విభాగాల్లోనూ దూసుకుపోతోందని.. 45 శాతంతో గోధుమల ఎగుమతిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని.. ప్రభుత్వ ఆరోగ్య పథకానికి సంబంధించి ఆయుష్మాన్ కార్డులు జారీ చేయడంలోనూ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద గ్రామీణ రోడ్డులను మెరుగుపరచడంలోనూ దేశానికే తలమానికంగా నిలిచిందని అన్నారు. వ్యవసాయ రంగానికి మౌలిక నిధుల పథకం కింద రూ. 4300 కోట్ల నిధులు సమకూర్చి దేశంలో నెంబర్ వన్ స్థానంలోనూ.. స్వచ్ఛతలో ఇండోర్ ఎప్పటినుంచో మొదటి స్థానంలోనూ కొనసాగుతున్నాయని ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా పేదలకు ఇల్లు కట్టించడంలో రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో నిలిచిందని.. సుమారు 44 లక్షల పేద కుటుంబాలు ఈ పథకం కింద గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ పక్కా ఇళ్లు సొంతం చేసుకున్నారని అన్నారు. రాష్ట్రంలో జరిగిన సంక్షేమాభివృద్ధి గురించి వివరిస్తూ రాష్ట్రంలోని సుమారు 1.36 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని 2003లో రూ.12000 గా ఉన్న తలసరి ఆదాయం ఇప్పుడు రూ.1.4 లక్షలకు చేరిందని అన్నారు. ఒకప్పుడు విభజనలు పాలైన రాష్ట్రంగా పిలవబడిన మధ్య ప్రదేశ్ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్తు, రోడ్లు, మంచినీరు, విద్య విభాగాల్లో ఎంతగానో అభివృద్ధి చెందిందని అన్నారు. చివరిగా ఆయన మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రస్తావన తీసుకొస్తూ 2014లో 29 ఎంపీ సీట్లకు గాను 27 సీట్లలో బీజేపీ పార్టీని గెలిపించగా 2019లో 28 సీట్లలోనూ గెలిపించారని.. ఈసారి జరగబోయే ఎన్నికల్లో మిగిలిన ఆ ఒక్క సీట్లో కూడా ప్రజలు గెలిపిస్తారని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించిన ఖర్గే.. తెలంగాణకు మొండిచేయి -
ఈ తొమ్మిది నెలలు ఎంతో కీలకం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తారనే ఉత్త ప్రచారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి కొట్టిపారేశారు. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో మంత్రులతో టైంకే ఎన్నికలకు వెళ్లనున్నట్లు స్పష్టం చేస్తూనే.. ఆయన కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల సమయం ఉందని.. ఈ కాలం ఎంతో కీలకమని.. మరింత సమర్థవంతంగా పని చేయాల్సిన అవసరం ఉందంటూ మంత్రులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ఇంకా తొమ్మిది నెలలు ఉంది. కష్టపడితే మళ్లీ మనదే విజయం. ఈ తొమ్మిది నెలల కాలం మంత్రులు మరింత చొరవతో పని చేయాలి. ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలి. ప్రభుత్వం చేస్తున్న మంచిని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. క్షేత్ర స్థాయిలో నిరంతరం ప్రజలతో మమేకం కావాలి అని ఆయన మంత్రులకు సూచించారు. చంద్రబాబు మేనిఫెస్టోను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఈ తొమ్మిది నెలల కాలం పని చేయండి.. మిగతాది నేను చూసుకుంటా అని ఆయన మంత్రులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన సమయం వచ్చిందని, చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇదీ చదవండి: ఏపీ ఎన్నికలు.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు -
సమగ్రాభివృద్ధికే తొలి ప్రాధాన్యత
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా సమగ్రాభివృద్ధికే తొలి ప్రాధాన్యత ఇస్తామని మంత్రులు స్పష్టం చేశారు. పునర్విభజన తర్వాత మొదటి సారి జిల్లా సమీక్షా కమిటీ సమావేశం(డీఆర్సీ) శనివారం స్థానిక వైఎస్సార్ సభావేదిక ప్రాంగణంలో నిర్వహించారు. సమావేశానికి జిల్లా ఇన్చార్జి మంత్రి ఉషశ్రీచరణ్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కే.నారాయణస్వామి, ఆర్కే రోజా హాజరయ్యారు. కలెక్టర్ హరినారాయణన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లాలో చేపడుతున్న పలు సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై కూలంకషంగా చర్చించారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో నాడు–నేడు పథకం ద్వారా పాఠశాల లు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని మండలాల్లో సప్లయ్చానల్స్ సర్వే చేసి, వాటి మరమ్మతు పనులను ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాలన్నారు. అన్ని రంగాల్లో ప్రగతి పరుగు చిత్తూరు జిల్లా అన్ని రంగాల్లో ప్రగతి సాధించేందుకు తన వంతు కృషి చేస్తానని ఇన్చార్జి మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేసేందుకు అధికారులు కీలక పాత్ర పోషించాలన్నారు. రైతులకు అధునాతన సాగు పద్ధతులపై వ్యవసాయ శాఖాధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలని చెప్పారు. మందుల కొరత లేకుండా అందుబాటులో పెట్టాలన్నారు. స్పందన కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతగా భావించి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు. శాఖల వారీగా చర్చ ∙పేదలందరికీ ఇళ్లు పథకంలో జిల్లాలో రూ.318.19 కోట్లతో 72,272 గృహాల నిర్మాణంలో 72 శాతం గ్రౌండింగ్ చేసి చిత్తూరు జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపారని జిల్లా గృహనిర్మాణశాఖ పీడీ పద్మనాభం వివరించారు. జిల్లాలో రూ.316.70 కోట్లతో టిడ్కో ద్వారా నిర్మిస్తున్న గృహాలను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో నాడు నేడు పథకం రెండో విడతలో 783 పాఠశాలల్లో రూ.217 కోట్లతో పనులు చేపడుతున్నట్లు సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణారెడ్డి వివరించారు. రెండో విడతలో 784 అదనపు తరగతులను నిర్మించనున్నట్లు చెప్పారు. నాడు నేడు పథకంలో జిల్లాలోని 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రూ.11.95 కోట్లతో పనులు చేపడుతున్నామని డీఎంహెచ్ఓ శ్రీహరి వివరించారు. ∙జిల్లాలోని 370 గ్రామాల్లో రీసర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నామని సర్వే శాఖ ఏడీ గిరి« తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జిల్లాలో 1,50,682 జాబ్‌కార్డులు కలిగిన వారికి 79,68,671 పని దినాలు కల్పించినట్లు డ్వామా పీడీ చంద్రశేఖర్ తెలిపారు. ఇందుకు రూ.181.311 కోట్లను ఖర్చు చేసినట్లు చెప్పారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతుల పంటలకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామని వ్యవసాయ శాఖ అధికారి మురళీ కృష్ణ వివరించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్‌లు, మిల్క్ బల్క్ యూనిట్ల శాశ్వత భవనాల పనులను నిర్మిస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, ఎంఎస్ బాబు, వెంకటే గౌడ, ఎమ్మెల్సీ భరత్, చిత్తూరు మేయర్ అముద, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, రాష్ట్ర జానపద కళల అభివృద్ధి సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, డీసీసీబీ చైర్ పర్సన్ రెడ్డెమ్మ, కుప్పం రెస్కో చైర్మన్ సెంథిల్‌కుమార్, జెడ్పీ సీఈఓ ప్రభాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ... రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాలను అభివృద్ధిలోకి తీసుకువస్తామని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. పేదలందరికీ ఇళ్లు పథకంలో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచినందుకు కలెక్టర్, జేసీలతోపాటు ఇతర అధికారులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో పథకాల అమలులో చిత్తూరు జిల్లా ముందుండేలా పనిచేయాలని చెప్పారు. పార్టీలకతీతంగా కుల, మత, వర్గ, పార్టీలకతీతంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే.రోజా అన్నారు. నాడు–నేడు పథకంతో సర్కారు బడుల రూపురేఖలు మారాయని చెప్పారు. చెరువులు, శ్మశానవాటికలు ఆక్రమణకు లోనుకానుండా రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
భోగం మీది, త్యాగం మాదా?
పేద దేశాల పట్ల ప్రకృతికే కాదు, అభివృద్ధి సమాజాలకూ జాలి ఉండదా? మానవ చేష్టల వల్ల పుట్టిన ‘వాతావరణ మార్పు’ దుష్ప్రభావాలు పేద దేశాలపై ఉన్నంతగా సంపన్న దేశాలపైన లేవు. ప్రకృతి వనరుల్ని అసాధారణ రీతిలో పిండుకొని ఎదిగిన ‘అభివృధ్ధి చరిత్ర’ కొన్ని సమాజాలది! పైగా వాతావరణ మార్పులకు కారణమౌతున్న నేటి కర్భన ఉద్గారాలు, ఇతరేతర కాలుష్యాలు, భూతాపోన్నతి వంటివి ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల సృష్టే! అప్పుడు, ఇప్పుడు, తాజా ఆంక్షల వల్ల శీఘ్రప్రగతి కుంటుబడి రేపు.. బలవుతున్నది మాత్రం పేద దేశాలే! సదరు నష్టాన్ని పూడుస్తామని... ఎన్ని అంతర్జాతీయ సదస్సుల్లో వాగ్దానాలిచ్చి చివరకు ఒప్పంద రూపు సంతరింపజేసినా, ఆశించినట్టు అవి ఆచరణకు నోచుకోవు. పేద, మధ్య తరహా దేశాలు వాతావరణ మార్పు విపరిణామాల నుంచి, ప్రకృతి వైపరిత్యాల నుంచి బయటపడలేక... మరింత ప్రాణ, ఆస్తి నష్టాల్ని చవిచూస్తున్నాయి. అభివృద్ధి చెందిన సంపన్నదేశాలకు, అభివృద్ధి చెందని పేద దేశాలకు మధ్య అంతరాలను పూడ్చే సంగతెలా ఉన్నా... మానవ ప్రమేయం వల్ల కాలక్రమంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దే చర్యల్లోనూ పురోగతి మిథ్య! పేద దేశాలను ఆదుకునేందుకు అభివృద్ధి చెందిన దేశాలు వెచ్చిస్తామని చెప్పిన ‘వాతావరణ ఆర్థిక సహాయం’ పుష్కర కాలం దాటినా ఇంకా ఓ రూపు సంతరించుకోకపోవడం శాపమే! ప్రపంచంలోని ఏడు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలైన జి–7 (అమెరికా, కెనెడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్) దేశాల సదస్సు, ఈ ‘సహాయం’పై మరోమారు చేసిన తాజా వాగ్దానమే ఇందుకు నిదర్శనం! యునైటెడ్ కింగ్డమ్ (యూకే) కార్బిస్‌బే లో ఆదివారం ముగిసిన ఈ సదస్సు వేదిక నుంచి మరోమారు హామీ అయితే లభించిది కానీ, లిఖిత పత్రంలో స్పష్టత కొరవడింది. ఎవరెంత వెచ్చిస్తారో నిర్దిష్ట ఆర్థిక సహాయం, నగదు గురించిన వివరాలేమీ లేవు. అందుకే పర్యావరణ పోరాట సంఘాలు పెదవి విరుస్తున్నాయి. ఏటా వంద బిలియన్ డాలర్ల (రూ.7.32 లక్షల కోట్లు) వాతావరణ ఆర్థిక వనరుల్ని సమకూర్చే పాత హామీ నెరవేరుస్తామని, ఈ వారమే కార్యాచరణ ప్రారంభిస్తామని సదస్సు పేర్కొంది. ‘ఇది మా బాధ్యత’ అని ఆతిథ్య దేశం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు. ప్రపంచ కర్బన ఉద్గారాల్లో అయిదో వంతు (20%) జి–7 దేశాల పుణ్యమే! అని కూడా ఆయన అంగీకరించారు. ‘మా వంతు కేటాయింపులు పెంచుతాం, ఇతర అభివృద్ది చెందిన దేశాలనూ పెంచమని అడుగుతూ... ఉమ్మడిగా ఈ హామీ నెరవేర్చడానికి కృషి చేస్తాం’ అని సదస్సు పేర్కొంది. అతిథిగా పాల్గొన్న భారత్ కూడా, హామీ నిలబెట్టుకోవాలని జి–7 ను అంతకు ముందు కోరింది. కర్బన ఉద్గారాలు, ఇతర కాలుష్యాల వల్ల భూతాపోన్నతి పెరిగి, ధృవాల మంచు కరిగి సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. పలు దీవులు, సముద్ర తీరనగరాలు మునిగే ప్రమాదంతో పాటు ఇంకెన్నో ప్రకృతి అనర్థాలు ఈ వాతావరణ మార్పు వల్ల ముంచుకొస్తున్నాయి. ఉష్ణాగ్రత తదుపరి పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కే నియంత్రించడం ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న లక్ష్యం. వాతావరణ మార్పు వల్ల పుట్టే విపత్తుల్ని తట్టుకునే సన్నద్దత, ఎదుర్కొనే సమర్ధత, మార్పులకు అనుగుణంగా జీవనాన్ని దిద్దుకునే సంసిద్ధత అవసరం! పెట్రోల్, బొగ్గు వంటి శిలాజ ఇంధన వినియోగాల్ని తగ్గించి, ప్రత్యామ్నాయ పునర్వినియోగ, సుస్థిర ఇంధనాల్ని సమకూర్చుకోవాలి. ఈ క్రమంలో ప్రగతి మందగించినా పేద దేశాలు భరించాలి. అవసరమైన ఆధునిక టెక్నాలజీని సమకూర్చుకోవాలి. అందుకు గాను అభివృద్ధి చెందిన, సంపన్న దేశాలు సహకారం అందించాలి. ఇదివరకే ప్రకృతిని పిండుకొని ఎదిగిన సమాజాలు కనుక, ‘అందరి కోసం అందరు, కొందరికి ప్రత్యేక బాధ్యత’ నినాదంతో కర్తవ్యాన్ని నెత్తినెత్తుకోవాలి. ఈ స్ఫూర్తితో అభివృద్ధి చెందిన దేశాలు ఏటా 100 బిలియన్ డాలర్లను ‘క్లైమెట్ ఫైనాన్స్’కి వెచ్చిస్తామని, ఐక్యరాజ్యసమితి 2009 (కొపన్హెగెన్)లో నిర్వహించిన సదస్సులో నిర్దిష్టంగా హామీ ఇచ్చాయి. 2020 నాటికి కేటాయింపులు మొదలు కావాలి. ఆర్థిక సహాయంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని పేద దేశాలకు బదలాయించాలి. తర్వాత జరిగిన పలు సదస్సుల్లో ఈ హామీని నొక్కి చెప్పాయి. పారిస్ భాగస్వామ్య పక్షాల సదస్సు (2015)లోనూ ఈ అంశం సుదీర్ఘంగా చర్చించి, ఒప్పందాలపై సంతకాలు చేశారు. కార్యాచరణ మాత్రం లేదు. తాజా హామీ ప్రకారమూ 2025 నాటికి తొలి కేటాయింపులు జరుగొచ్చనేది ఆశ! సంపన్న దేశాల సహాయం లభించినా... మౌలికసదుపాయాలు కల్పించే ఏ పెట్టుబడిదారో, కాంట్రాక్టరో, రాబడి పలు రెట్లు పెంచుకుంటారు. పేదలకు దక్కేది పరోక్ష ప్రయోజనాలే! అసాధారణ ఎండకు వడదెబ్బ తగిలి ఓ నడివయస్కుడు శ్రీకాకుళంలో మరణిస్తాడు. అప్పుతెచ్చిన పెట్టుబడితో పండిన పంట వడగళ్ల వానకు నాశనమైతే మహబూబ్‌నగర్ రైతొకరు ఆత్మహత్య చేసుకుంటాడు. మూడేళ్ల వరుస కరువుకు బతుకు గడువక వలస కూలీగా ఉత్తర్‌ప్రదేశ్ వెళ్లిన అనంతపురం జిల్లా కదిరి పరిధి పల్లె గృహిణి, విధివక్రించి అక్కడ పడుపు వృత్తిలోకి జారి ఎయిడ్స్ సోకి మరణిస్తుంది.... ఇవన్నీ ‘వాతావరణ మార్పు’ మరణాలే! ఏ అభివృద్ధి చెందిన దేశపు ఆర్థిక సహాయం ఈ చావుల్ని ఆపుతుంది? సమాధానం లేని ప్రశ్నలే! -
పట్టణాలకు కొత్తరూపు
జిల్లాలో ప్రస్తుతం గుంటూరు నగరంతోపాటు తెనాలి, చిలకలూరిపేట, సత్తెనపల్లి, రేపల్లె, వినుకొండ మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. పిడుగురాళ్ల, మాచర్ల మున్సిపాలిటీలను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. విలీన గ్రామాల సమస్యల కారణంగా తాడేపల్లి, మంగళగిరి, పొన్నూరు, బాపట్ల, నరసరావుపేట మున్సిపాలిటీల్లోను, దాచేపల్లి, గురజాల నగర పంచాయతీల్లోను ఎన్నికలు జరగడంలేదు. సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లాలో గుంటూరు నగరం, పట్టణాలు అభివృద్ధి పథం వైపు సాగుతున్నాయి. ప్రజలందరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక పట్టణాలు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి. స్వచ్ఛ గుంటూరు, స్వచ్ఛ పట్టణాలుగా మార్చేందుకు జిల్లాలో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. నగరంలోను, పట్టణాల్లోను గతంలో ఎన్నడూ లేని విధంగా లక్షల మంది పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేశారు. ఒక్క గుంటూరు నగరంలోనే 64 వేల మందికి ఇళ్లస్థలాల పట్టాలు ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో 32 వేల టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు. జిల్లాలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలంతా అభివృద్ధి, సంక్షేమం వైపు మొగ్గు చూపించి అత్యధికశాతం వైఎస్సార్సీపీ అభిమానుల్ని గెలిపించారు. మున్సిపల్ ఎన్నికల్లోను అవే ఫలితాలు పునరావృతం అవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలాచోట్ల పోటీచేసేందుకు ఎవరూ ఉత్సాహం చూపక విపక్షాలు నిరాశలో మునిగిపోయాయి. పేరేచర్లలో ఇంటికి శంకుస్థాపన చేసి ప్రార్థన చేస్తున్న ముస్లిం కుటుంబం గుంటూరులో ప్రగతి పరుగులు గుంటూరు నగరంలో రూ.34.31 కోట్లతో రోడ్ల విస్తరణ, మరమ్మతులు జరుగుతున్నాయి. టీడీపీ హయాంలో నగరంలో రూ.903 కోట్లతో పనులు చేపట్టినా కాంట్రాక్టు సంస్థతో కొంతమంది టీడీపీ పెద్దలు కుమ్మక్కై ముందే కమీషన్లు వసూలు చేశారు. ఫలితంగా పనులు పూర్తికాలేదు. యూజీడీ పనుల కోసం రోడ్లను తవ్వి వదిలేయడం వంటివి ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆ పనులను పూర్తిచేసి ప్రజల ఇబ్బందులు తొలగించింది. కాంట్రాక్టు సంస్థతో మాట్లాడి పనులు పూర్తిచేసే దిశగా ప్రణాళికలు రచించింది. రాష్ట్రంలోనే తొలిసారి గుంటూరులో ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంటు ఏర్పాటు చేశారు. జిందాల్ ఆధ్వర్యంలో నాయుడుపేటలో 32 ఎకారల్లో వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటును ఏర్పాటు చేశారు. గాంధీ పార్కును రూ.6.5 కోట్లతో సుందరీకరిస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.13.55 కోట్లతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నగరంలోని ప్రభుత్వాస్పత్రి, వైద్యకళాశాలల అభివృద్ధికి రూ.700 కోట్లతో పనులు మొదలయ్యాయి. పురపాలక సంఘాల్లో.. తెనాలి మున్సిపాలిటీలో 21,152 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. 1,856 టిడ్కో ఇళ్లు పేదలకు కేటాయించారు. అన్ని వార్డుల్లో సిమెంటు రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. రూ.240 కోట్లతో తెనాలి –మంగళగిరి బైపాస్ వరకు నాలుగు లేన్ల రహదారి విస్తరణ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. హైదరాబాద్ ట్యాంకు బండ్ తరహాలో తెనాలిలో కెనాల్ బండ్‌కు ప్రణాళికలు రచిస్తున్నారు. ►చిలకలూరిపేట పట్టణంలో 8,714 మంది పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. 3,248 మందికి టిడ్కో ఇళ్లు కేటాయించారు. అమృత్ పథకం కింద పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ.139.80 కోట్లతో పనులు చేపట్టారు. పట్టణంలో రూ.46 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. ►వినుకొండ పట్టణంలో 5,471 మందికి ఇళ్లస్థలాలు, 1,440 మందికి టిడ్కో ఇళ్లు కేటాయించారు. పట్టణంలో తాగునీటి సమస్యకు వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే సింగర చెరువు (మంచినీటి చెరువు)ను 60 నుంచి 270 ఎకరాలకు విస్తరించి వేసవిలోనూ నీటి ఎద్దడి లేకుండా చేశారు. ►సత్తెనపల్లిలో 5,323 మంది పేదలకు ఇళ్లస్థలాలు, 160 మందికి టిడ్కో ఇళ్లు కేటాయించారు. ►రేపల్లె పట్టణంలో 3,088 మంది పేదలకు ఇళ్ల స్థలాలు, 1,344 మందికి టిడ్కో ఇళ్లు మంజూరు చేశారు. -
వైఎస్ జగన్ ఎప్పుడూ గుర్తు చేస్తుంటారు
సాక్షి, కాశీబుగ్గ : దీర్ఘకాలంగా జిల్లాలో పెండింగ్‌లో ఉండిపోయిన పనులపై రానున్న రోజుల్లో దృష్టి సారిస్తామని రాష్ట్ర మత్స్యశాఖ, పాడి, పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. పలాస మంత్రి క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన ‘సాక్షి’తో ముఖా–ముఖి మాట్లాడారు. సాక్షి : మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అసలు జిల్లా విషయానికి వస్తే ఏం చేయాలనుకుంటున్నారు..? మంత్రి : నేను రాష్ట్రానికి మంత్రి అయినప్పటికీ ముందుగా పలాసకు ఎమ్మెల్యేను, శ్రీకాకుళం జిల్లా వాసిని. అందు చేత అనేక ప్రభుత్వాలు దాట వేస్తూ చేతులెత్తేసిన దీర్ఘకాల సమస్యలపై దృష్టి సారిస్తాను. జిల్లాలో ఉన్న మహేంద్రతనయ ఆఫ్‌షోర్ ప్రాజెక్టు వంటి వాటిపై దృష్టి పెడతాను. సీఎం వైఎస్ జగన్ ఈ ప్రాజెక్టును ఎప్పుడూ గుర్తు చేస్తుంటారు. నాన్నగారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు పూర్తి చేద్దామని అంటుంటారు. ఇప్పటికే పాత టెండర్‌ను రద్దు చేశారు. నెల రోజుల వ్యవధిలో కొత్త టెండర్లకు పిలుపునిచ్చి నిర్మాణ పనులు చేపడతారు. ఇలా జిల్లా విషయానికి వస్తే దీర్ఘకాలంగా సమస్యలుగా ఉన్న వాటిని గుర్తించి మన జిల్లా సీనియర్ నేతల ఆలోచనలు, సలహాలతో పూర్తి చేస్తాం. సాక్షి : తిత్లీ తుఫాన్‌తో నష్టపోయిన ఉద్దాన జీడి, కొబ్బరి రైతులను ఏవిధంగా ఆదుకోవాలనుకుంటున్నారు? మంత్రి : తిత్లీ సమయంలో టీడీపీ నాయకులే పరిహారాన్ని చాలావరకు మింగేశారు. దీనిపై పాదయాత్ర సమయంలోనే వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లాం. అందుకే ఆయన అర్హుల ఎంపికతో పాటు పరిహారం రెట్టింపు చేశారు. టెక్నికల్ సమస్యలు పరిష్కరించి మూడు వారాల్లో పరిహారం అందజేస్తాం. జీడి విషయంలో కూడా సీఎం వద్ద ప్రస్తావిస్తే రూ.10వేల మద్దతు ధర ప్రకటించారు. పలా స పరిసర ప్రాంతాలలో హారీ్టకల్చర్ రీసెర్చ్ సెంటర్ ని ర్మించడానికి మంజూరు చేశారు. రానున్న రోజుల్లో ఉద్దానం రైతన్నలకు మేలు జరుగుతుంది. (రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే) సాక్షి : రాజకీయాల్లో మీకు అనుభవం తక్కువ. మంత్రిగా రాణించడానికి ఏం చేస్తారు? మంత్రి :మన జిల్లా అదృష్టమో, నా అదృష్టమో గానీ నేను ఏ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లినా వారు కాదనడం లేదు. అందుకే మరింత ఉత్సాహంగా పనిచేయాలనిపిస్తుంది. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సుభిక్షంగా జీవిస్తున్నప్పుడు అందకంటే కావాల్సింది ఏముంటుంది. సాక్షి : కిడ్నీ వ్యాధి బాధితుల కోసం చేస్తున్న పనులు? మంత్రి :గత ప్రభుత్వ హయాంలో కొంతమంది డయాలసిస్‌కు ముందుకు వచ్చే వారు కాదు. అలా ఇంట్లోనే ఉండిపోయి చనిపోయేవారు. ఆ బాధలను జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో నూతనంగా డయాలసిస్ కేంద్రాలతో పాటు, డయాలసిస్ చేసుకుంటున్న వ్యక్తి ఇంటికి రూ.10వేలు వలంటీర్ ద్వారా అందిస్తున్నారు. క్రియాటిన్ తక్కువగా ఉన్నవారికి రూ.5వేలు పింఛన్ సైతం అందిస్తున్నారు. శుక్రవారం నాడు మందసలో పది బెడ్లతో నూతన డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించనున్నాం. కిడ్నీ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలకు వాటర్ గ్రిడ్‌ను నిర్మించనున్నాం. ఒక్క పలాస నియోజకవర్గంలో నాలుగు ప్రాంతాల్లో లక్షా యాభైవేల లీటర్ల కెపాసిటీ గల ట్యాంకర్ల నిర్మాణం జరగనుంది. వంశధార రిజర్వాయర్ నుంచి సుమారు 50 కిలోమీటర్లు పైపులైన్ పలాసకు రానుంది. ఇది పూర్తయితే ప్రజల గుండెల్లో నాయకులు నిలిచిపోవడం ఖాయం. సాక్షి : కరోనాపై ఓ డాక్టర్‌గా మీ సలహా? మంత్రి : కరోనాకు ఏ ఒక్కరూ అతీతం కాదు. అందరం కరోనాను చూడాల్సిందే. మన వద్ద కేసులతో పాటు రికవరీ కూడా పెరుగుతోంది. అందులోనూ ప్లాస్మా థెరపీ కూడా పనిచేస్తోంది. అందుకే ప్లాస్మా దానానికి ముందుకు రావాలి. దీనిపై అపోహలు అక్కర్లేదు. సాక్షి : పలాస ప్రాంతంలో వరుసగా అధికారుల సస్పెన్షన్‌పై మీ అభిప్రాయం? మంత్రి : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి. ప్రజలకు సేవ చేయడానికి ఉన్న వారు తప్పుగా ప్రవర్తించకూడదు. అలా చేస్తే మూల్యం చెల్లించక తప్పదు. సాక్షి : మూడు రాజధానులపై మీ వాదన? మంత్రి : అమరావతి కోసం రాష్ట్ర ఆదాయాన్ని ఖర్చు పెట్టేయాలని గత ప్రభుత్వం చూసింది. అది సరికాదు. అలా గే అక్కడ చంద్రబాబు తన వర్గం వారిని మాత్రమే ఆలోచనలో పెట్టుకున్నారు. మూడు రాజధానుల వల్ల మూ డు ప్రాంతాల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ పరిపాలన రాజధాని రావడంతో వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. శ్రీకాకుళం, విజయనగరం వంటి ప్రాంతాల్లో సైతం వలసలు తగ్గుముఖం పడతాయి. -
నేను, నాది కాదు.. మనం, మనది!
‘‘అభివృద్ధి అంటే ఆర్థికంగా మాత్రమే కాదు. సామాజిక అజెండా కూడా ఉండాలి. అప్పుడే అది పరిపూర్ణమవుతుంది. ఈ భావనతోనే పని చేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం స్పష్టంగా ఈ ఆలోచనతోనే ఉంది. అదేవిధంగా ప్రభుత్వ పాలనలో ప్రజలను భాగస్వామ్యం చేసుకోవడం.. ఇది మనదనే భావన పెంపొందించడం, సొంతంగా మన పనులు మనం చేసుకోవాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారనే ఆలోచనలను తొలగించడం వంటి ప్రాధమ్యాలతో పనిచేస్తున్నాం. కేవలం అధికారంతో పనిచేయించడం కాదు.. ఆలోచనల్లో మార్పులు తీసుకురావాలనే అభిప్రాయంతో ముందుకెళుతున్నాం’’ అని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అన్నారు. ‘కాఫీ విత్ సాక్షి’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన ‘సాక్షి’ ఎడిషన్ కార్యాలయాన్ని సందర్శించారు. పత్రిక ఎలా డిజైన్ అవుతుంది? ఎలా ప్రింట్ అవుతుందనే అంశాలను పరిశీలించడంతో పాటు జిల్లా అభివృద్ధిలో తన ప్రాధాన్యతలను ఆయన వివరించారు. – సాక్షి ప్రతినిధి, అనంతపురం ‘కాఫీ విత్ సాక్షి’ కార్యక్రమంలో భాగంగా రీడర్స్, సాక్షి ఉద్యోగులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు విద్యకు ప్రాధాన్యం గతంలో నాతో పాటు చదువుకునే ఒక మిత్రుడిని వాళ్ల తండ్రి.. కూలికి వెళితే రూ.10 వస్తాయి. చదువుకుంటే ఏం వస్తుందని పనులకు తీసుకెళ్లారు. కూలికి పోవడం వల్ల ఆ రోజు ఆదాయం కనిపించింది. కానీ నేను చదువుకోవడం వల్ల దీర్ఘకాలంలో ఉద్యోగంతో పాటు ఐఏఎస్ కాగలిగాను. ప్రతి ఒక్కరూ పిల్లల చదువుకు ప్రాధాన్యత నివ్వాలి. భరోసా కల్పిద్దాం ‘‘ఈ కార్యాలయం మనందరిది. ఇక్కడి అధికారులను కలిసే సమయంలో దయచేసి చెప్పులు విడవవద్దు. చేతులు కట్టుకుని ఒంగి నిలబడవద్దు. కన్నీళ్లు పెట్టుకోకండి. కాళ్లు మొక్కకండి.’’ అనే పోస్టర్‌ను రూపొందించాం. ప్రజల భుజం మీద చేయి వేసి.. మేమున్నామనే ధైర్యాన్ని ఇవ్వాలి. సమస్యలను చెప్పుకునేందుకు వచ్చే ప్రజలకు భరోసా కల్పించినప్పుడే ఉద్యోగ జీవితానికి సార్థకత. విలువలు ముఖ్యం ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి అత్యంత కీలకం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కుల వెంట పరుగులు తీస్తుండటం విద్యార్థుల మానసిక స్థితిపై పెను ప్రభావం చూపుతుంది. అలా కాకుండా విద్యార్థి వాస్తవ పరిస్థితికి అనుగుణంగా ఫలితాలు ఉండాలి. ఏదో ఒకటి చేసి ఉత్తీర్ణత శాతం చూపించడం వల్ల.. ఆ విద్యార్థి భవిష్యత్తులో దేనికీ పనికిరాకుండా పోతాడు. అలాంటి చదువు వద్దు.. విలువలతో కూడిన విద్య ముఖ్యం. ‘‘ప్రభుత్వం అంటే ప్రజలది అనే భావన రావాలి. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాతో (అధికారులతో) మాట్లాడేటప్పుడు కూడా మనం, మనది అనే చెబుతుంటారు. నేను, నాది అనే భావన కనిపించదు. అందరూ కలిసి పని చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.’’ చదవండి: అదిరిందయ్యా చంద్రం అధికారి తలుచుకుంటే.. అధికారులు ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడి పనులు చేయాలి. అధికార దర్పంతో కాదు. ఇదెందుకు చెబుతున్నానంటే.. ‘‘నేను కర్నూలులోని జవహర్ నవోదయలో పదో తరగతి చదువుతున్న సమయంలో ఆర్ఆర్బీకి ఎంపికయ్యాను. ఆ ఉద్యోగంలో చేరేందుకు నాకు టీసీ అవసరం. నవోదయలో టీసీ తీసుకోవాలంటే రెండు నెలల ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రిన్సిపాల్‌ను కలిస్తే, నిబంధనలు అలా ఉన్నాయని.. హైదరాబాద్‌కు వెళ్లి ఉన్నతాధికారిని కలవమని సూచించారు. చిన్న వయస్సులోనే ఉద్యోగం వచ్చిందనే సంతోషం ఒకవైపున్నా.. టీసీ వస్తుందో రాదోననే టెన్షన్. హైదరాబాద్‌కు వెళ్లి నా పరిస్థితిని అంతా వివరించగా ఆ అధికారి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ టీసీ మంజూరుకు అనుమతించారు. ఒక అధికారి తలుచుకుంటే.. ఎంతో కొంత సహాయం చేయగలరనేందుకు ఇదొక నిదర్శనం. ఆ భావన ప్రతి ఒక్కరిలో రావాలి.’’ సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘‘నేనూ రాయలసీమవాడినే. ఇక్కడి ప్రజల బాధలు, ఆశలు, ఆకాంక్షలు నాకు బాగా తెలుసు. ప్రధానంగా అనంతపురం జిల్లాలో వర్షపాతం చాలా తక్కువ. విపరీతమైన కరువు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ సాగునీటి ప్రాజెక్టులతో పాటు చదువు, ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే సాధ్యమైనంత ఎక్కువగా పొలాలకు నీరు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. గ్రామ, వార్డు సచివాలయాలతో ప్రజల గడప వద్దకే ప్రభుత్వ పాలన వచ్చింది. మనదనే భావన అందరిలో పెంపొందినప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది. ఇక అధికారంతో పనులు చేయించడం నా విధానం కాదు.. ఆలోచనల్లో మార్పు తెచ్చి పనిచేయించాలన్నదే నా అభిమతం.’’ అని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అన్నారు. మరిన్ని విశేషాలు ఆయన మాటల్లోనే.. సాధారణంగా అభివృద్ధి, సంక్షేమం ఏదైనా ప్రభుత్వానికి రెండు కళ్లుగా ఉంటాయి. అయితే, కేవలం ఎకనమిక్ అజెండా(ఆర్థిక అభివృద్ధి) మాత్రమే కాకుండా సోషల్ ఎజెండాతో కూడా మిళితం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలాంటి వారు మంచి స్టేట్స్‌మెన్‌గా గుర్తింపు పొందుతారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి–సంక్షేమంతో పాటు వాటి అమలులో సోషల్ ఎజెండా కూడా ఉంది. అది వివిధ ప్రభుత్వ పథకాల్లో కూడా ప్రతిఫలిస్తోంది. ఇందుకు ఉదాహరణలు.. నామినేషన్ పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం భాగస్వామ్యం కల్పించడం, నామినేషన్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్ల అమలు వంటివి ఉన్నాయి. ఇది నేరుగా మనకు కనపడుతోంది. పరోక్షంగా కూడా ఉంది. గ్రామ, వార్డు సచివాలయాల రూపంలో. ప్రభుత్వ సేవలు కేవలం కొద్ది మందికి మాత్రమే కాకుండా.. వాయిస్ లేని వారికి కూడా అందుబాటులోకి తేవడం. గతంలో ఎవ్వరూ చేయని విధంగా ప్రస్తుత ప్రభుత్వం చేస్తోంది. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. ఇది మనదనే భావనతో.. ప్రభుత్వం అంటే ప్రజలది అనే భావన రావాలి. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాతో(అధికారులతో) మాట్లాడేటప్పుడు కూడా మనం, మనది అనే చెబుతుంటారు. నేను, నాది అనే భావన కనిపించదు. అందరూ కలిసి చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే మన బడి నాడు–నేడు అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో బడి మనది అనే భావన కేవలం విద్యార్థులే కాదు.. వారి తల్లిదండ్రులు, గ్రామస్తుల్లో కూడా రావాలన్నదే అభిప్రాయం. తద్వారా మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి. వాస్తవానికి విద్యారంగం మీద ప్రభుత్వం చేసే ప్రతీ పైసా ఖర్చు భావితరాలకు ఉపయోగపడుతుంది. అప్పటికప్పుడు అది ఆర్థిక ఫలితాలు ఇవ్వకపోవచ్చుకానీ.. దీర్ఘకాలంలో రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరం. మన బడి నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం, పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయడం చేస్తున్నారు. కచ్చింగా మూడేళ్ల కాలంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌కు దీటుగా అభివృద్ధి చెందుతాయి. చదవండి: అనంతపురం కలెక్టర్‌గా గంధం చంద్రుడు గడప వద్దకే...! గతంలో ఏదైనా ప్రభుత్వ అధికారిని కలవాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేది. ఏ సమయంలో అందుబాటులో ఉంటారనే విషయం కూడా ప్రజలకు తెలిసేది కాదు. మండల కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. అయితే, ప్రస్తుతం గ్రామ సచివాలయాలతో ప్రభుత్వ పాలన ప్రజల గడప వద్దకే వచ్చింది. ఒక గ్రామంలో ఏకంగా 11 మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయడం.. అందుకు అనుబంధంగా వలంటీర్ల వ్యవస్థ ఇంటి వద్దకు వెళ్లి సేవలందించడం ఇది ఒక చరిత్ర. ఇప్పుడు ఏదైనా పనికావాలంటే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఏయే అధికారి ఎక్కడ ఉంటారు? ఏయే పనులు చేస్తారు? కూడా స్పష్టంగా పేర్కొంటున్నాం. ఇప్పటికే జిల్లాలో గ్రామ సచివాలయాల వ్యవస్థ పనిచేస్తోంది. ఇంకా ఇబ్బందులు ఉన్న చోట సమస్యలను పరిష్కరించి ముందుకు వెళ్తాం. ఎక్కడా లేనివిధంగా జిల్లాలో మొదటిరోజే ప్రజలకు అవసరమైన సేవలను ప్రారంభించాం. 1బీ అడంగల్, డెత్, బర్త్ సర్టిఫికెట్లను జారీచేస్తున్నాం. అన్ని సేవలను కూడా అందుబాటులోకి తెచ్చి ప్రజల గడపవద్దకే పాలన అందిస్తాం. ఎవరో వచ్చి ఏదో చేస్తారని.. మనకు ఏదైనా సమస్య వస్తే ఎవరో వచ్చి ఏదో చేస్తారనే భావన ఎక్కువగా నాటుకుపోయింది. మన పనులను సొంతంగా మనమే చేసుకోవాలనే భావనను పెంపొందించాలనే ప్రయత్నం చేస్తున్నా. అందులో భాగంగా మన అనంత–సుందర అనంత కార్యక్రమాన్ని ప్రారంభించాం. మన ఇంటి పక్కన చెత్తను మనమే తీసేద్దాం. మన పరిసరాలను శుభ్రంగా ఉంచుదామనే అభిప్రాయాన్ని ప్రజల్లో నాటేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇది ఒక్క రోజులో అయ్యే పనికాదు. మన భావనలో మార్పులు రావాలంటే సమయం పడుతుంది. అయినప్పటికీ భవిష్యతులో వీటి ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. కేవలం ఉన్న అధికారాలతో ఆదేశాలు జారీచేసి పనులు చేయించే అవకాశం ఉంది. అయితే, అది కేవలం అప్పటివరకే ఉంటుంది. అలా కాకుండా అందరి ఆలోచనల్లో మార్పు వస్తే ఆ మార్పు మనం ఉన్నా లేకపోయినా ఎల్లకాలం ఉంటుంది. ఫలితాలకు లింకు లేదు చదువు అంటే కేవలం మార్కులు అనే భావన పోవాలి. బట్టీపట్టో, కాపీయింగ్ చేసో మార్కులు సాధించడం ద్వారా ఎలాంటి ఉపయోగం ఉండదు. మా పాఠశాలలో 100 శాతం రిజల్ట్స్ వచ్చింది. మా జిల్లాలో మంచి ఉత్తీర్ణత శాతం సాధించాం అని చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. అందుకే కేవలం మార్కుల మీద కాకుండా విజ్ఞానం పెంచుకోవడం మీద ధ్యాస ఉంచాలి. గతంలో పాఠశాల ఉత్తీర్ణత శాతానికి.. ప్రమోషన్లకీ లింకు ఉంది. అందుకే ఉత్తీర్ణత శాతం ఎక్కువ తెచ్చేందుకు ఉపాధ్యాయులు ఆరాటపడేవారు. ఇప్పుడు నేను పదో తరగతి ఉత్తీర్ణత విషయంలో కచ్చితంగా అందరికీ చెప్పాను. మీ ఫలితాలకు, ప్రమోషన్లకీ సంబంధం ఉండదని వివరించాం. సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించి.. స్ట్రిక్టుగా ఉంటామని చెప్పడం వల్ల ఫలితం ఉండదు. మన ఆలోచనల్లోనే మార్పులు రావాలి. ఆ దిశగానే 10వ తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులకు కూడా ఒక లేఖ రాశాను. త్వరలో 10వ తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులతో టెలీ కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడాలని కూడా అనుకుంటున్నాను. -
రెండేళ్లలో పులివెందులలో మరింత ప్రగతి
సాక్షి, వేముల : పులివెందుల నియోజకవర్గంలో రెండేళ్లలో మార్పు తీసుకువచ్చే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ సభా భవనంలో గురువారం మండల అభివృద్ధి పనులపై సమీక్ష అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పులివెందుల మున్సిపాలిటీ, చక్రాయపేట మండలాలు మినహా అన్ని మండలాల్లో అభివృద్ధి పనులపై సమీక్షలు పూర్తయ్యాయన్నారు. ఆయా గ్రామాలలో సమస్యలను, పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆయా శాఖల ప్రధాన కార్యాలయానికి పంపాలన్నారు. అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు రూపొందిస్తే అవసరమైన నిధులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి విడుదల చేయిస్తానన్నారు. ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తామన్నారు. సత్వరమే పూర్తి చేసేందుకు అధికారులు చొరవ చూపాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పులివెందుల నియోజకవర్గాన్ని రెండేళ్లలో అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు అధికారులు పనిచేయాలన్నారు. ఇందుకోసం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించినప్పుడే మార్పు సాధ్యమవుతుందన్నారు. మహిళలకు ఆసరా శ్రీజ పాల డెయిరీలు.. : నియోజకవర్గంలో శ్రీజ పాల డెయిరీ మహిళలకు ఆసరాగా నిలుస్తుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలో అన్ని కేంద్రాలలో శ్రీజ పాల డెయిరీల ఏర్పాటుకు సంస్థ ముందుకొచ్చిందన్నారు. సంస్థలో 75వేలమంది మహిళలు సభ్యులుగా ఉన్నారన్నారు. ఈ డెయిరీలకు పాలు పోసేవారికి 15రోజులకు బిల్లులు తమ ఖాతాలలో జమ అవుతాయన్నారు. ప్రతి గ్రామంలోనూ శ్రీజ పాల డెయిరీలను ఏర్పాటు చేసి పాల ఉత్పత్తిని పెంచుకునేలా సంస్థ కృషి చేస్తోందన్నారు. గ్రామాలలో ప్రతి ఇంటిలో పాడి పశువుల పెంపకం ద్వారా కుటుంబాలు ఆర్థికాభివృద్ధి సాధించవచ్చునన్నారు. పులివెందుల నియోజకవర్గంలో శ్రీజ పాల డెయిరీ ఏర్పాటుకు సంస్థ ఇప్పటికే గ్రామాల్లో సర్వే చేసిందన్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, డ్వామా పీడీ యధుభూషణ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ మండల నాయకులు నాగేళ్ల సాంబశివారెడ్డి, మండల పరిశీలకులు లింగాల రామలింగారెడ్డి, మాజీ ఎంపీపీ జనార్థన్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు రాజారెడ్డి, మరకా శివకృష్ణారెడ్డి, బయపురెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీలు శ్రీరామిరెడ్డి, మల్రెడ్డి, చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమగ్రాభివృద్ధే విజన్
జిల్లా సమగ్రాభివృద్ధిపై ప్రత్యేక విజన్‌తో కలెక్టర్ హరి కిరణ్ ముందుకు సాగుతున్నారు. స్పందనలో వచ్చే సమస్యలకు యుద్ధ ప్రాతిపదికన పరిష్కారం చూపేందుకు జిల్లా అధికార యంత్రాంగాన్ని ఉరకలెత్తిస్తున్నారు. నవరత్నాల అమలుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. గ్రామ వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల సరికొత్త పాలనను సమర్థవంతంగా నడిపేందుకు సిద్ధమవుతున్నారు. గాలేరు–నగరి ప్రాజెక్టును పూర్తి చేసి గండికోటలో 26 టీఎంసీల నీటిని నింపడమే టార్గెట్‌గా నిర్దేశించుకున్నారు. కడప విమానాశ్రయం అభివృద్ధి్ద, స్టీల్‌ప్లాంటు నిర్మాణం, కుందూ ద్వారా బ్రహ్మంసాగర్‌కు నీరు తదితర పథకాలను పూర్తి చేసి జిల్లాను అన్ని రంగాలలోముందుకు నడిపించేందుకు కలెక్టర్ కృషి చేస్తున్నారు. సీఎం జిల్లా కావడంతో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.అభివృద్ధి,సంక్షేమాలను అవకతవకలకు తావు లేకుండా పట్టాలెక్కించడం కత్తిమీద సామే. సమర్థుడు, పాలనాదక్షత కలిగిన యువ అధికారిగా హరికిరణ్ ఆ బాధ్యతలను సవాలుగా తీసుకున్నారు. జిల్లాకు సంబంధించి వివిధ అంశాలపై ‘సాక్షి ప్రతినిధి’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. –సాక్షి ప్రతినిధి కడప సాక్షి : స్పందన కార్యక్రమం ఎలా ఉంది? కలెక్టర్ : ఈ కార్యక్రమానికి ఊహించనంతంగా స్పందన వస్తోంది. వారం వారం జనం తండోపతండాలుగా వస్తున్నారు. ఎన్నడూ లేనంతగా జనం నమ్మకంతో అధికారుల వద్దకు తరలి వస్తున్నారు. సాక్షి : సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కలెక్టర్ : జనం సమస్యలను అర్జీ రూపంలో తీసుకుంటూ నమోదు చేస్తున్నాం. సమస్యను ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తామో కూడా అర్జీదారులకు చెబుతున్నాం. చిన్నచిన్న సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తున్నాం. సాక్షాత్తూ ముఖ్యమంత్రే స్పందనను వారం వారం సమీక్షిస్తున్నారు. దీంతో జిల్లాలో ఈ కార్యక్రమాన్ని మరింత ›ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నాం. సాక్షి : జిల్లా సమగ్రాభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కలెక్టర్ : ఇది ముఖ్యమంత్రి జిల్లా. ఇక్కడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. అందుకు అనుగుణంగా జిల్లాలోని ప్రధాన సమస్యలను గుర్తించడం, వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడం ముఖ్యం. ఇందుకోసం ప్రణాళికలు ఇప్పటికే సిద్దం చేశాం. సాక్షి : జన్మభూమి కమిటీలకు, సచివాలయ ఉద్యోగుల వ్యవస్థకు తేడా ఏమిటి? కలెక్టర్ : జన్మభూమి కమిటీలు నిర్ణాయక శక్తిగా పనిచేశాయి. వారు చెప్పిందే జరిగింది.. వలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల వ్యవస్థ ఇందుకు భిన్నం. వీరు ప్రభుత్వ పథకాల ఫలాలను ప్రజలకు చేరవేస్తాం. సాక్షి : జిల్లాలో అభివృద్ధి పనుల సంగతేమిటి? కలెక్టర్ : ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు ప్రాంతాలలో మాత్రమే గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం ఉంది. మిగిలిన నియోజకవర్గాల్లో గ్రామాలకు సక్రమంగా రోడ్లు లేవు. ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సాక్షి : తాగునీటి ఇబ్బందులు ఎలా అధిగమిస్తారు? కలెక్టర్ : మూడు నాలుగేళ్లుగా వర్షాలు లేవు. భూగర్బ జలాలు అడుగంటాయి. బోరుబావులు, తాగునీటి పథకాలు ఒట్టిపోయాయి. ప్రస్తుతం వెయ్యి గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. వర్షాలు వస్తే తప్ప ఇబ్బందులు తీరవు. భవిష్యత్తులో నీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నదే లక్ష్యం. గాలేరు–నగరి, తెలుగుగంగ తదితర ప్రాజెక్టుల మిగులు పనులు పూర్తి చేసి గండికోటలో 26 టీఎంసీల నీటిని నిలిపి ప్రతి గ్రామానికి సురక్షిత తాగునీటిని అందిస్తాం. సాక్షి : కుందూ వరద కాలువ ఎంతవరకు వచ్చింది? కలెక్టర్ : కుందూ నుంచి నీటిని తరలింపే లక్ష్యంగా బ్రహ్మంసాగర్‌కు కాలువను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబరులో స్వయంగా ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.300 కోట్లకు పైగా వెచ్చించి ఐదు టీఎంసీలకు పైగా నీటిని బ్రహ్మంసాగర్‌కు తరలించాలన్నది ఉద్దేశం. సాగర్‌లో నిత్యం నీటిని నిల్వ ఉంచి పరివాహక ప్రాంతంలో సాగు, తాగునీటిని అందించాలన్నదే లక్ష్యం. సాక్షి : రిమ్స్ అభివృద్ధి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కలెక్టర్ : రిమ్స్ ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చేందుకు ముఖ్యమంత్రి ఒకే చెప్పారు. అవసరమైన నిధులు ఇస్తామన్నారు. ప్రస్తుతం ఫైలు సిద్ధంగా ఉంది. త్వరలోనే రిమ్స్‌ను సూపర్ స్పెషాలిటీ మార్చడం జరుగుతుంది. ఇదే జరిగితే ఆస్పత్రిలో మరిన్ని ఉద్యోగాల కల్పన జరుగుతుంది. పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయి. సాక్షి : స్పోర్ట్స్ అభివృద్ధి తీసుకుంటున్న చర్యలు ఏమిటి? కలెక్టర్ : జిల్లాలో రూ.30 కోట్లతో స్పోర్ట్స్ స్కూలు అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు సైతం చర్యలు తీసుకుంటున్నాం. అందుకోసం అవసరమైన భూమిని యోగి వేమన యూనివర్సిటీæ ప్రాంతంలో సేకరిస్తున్నాం. సాక్షి : జిల్లాలో ప్రధాన రోడ్లను ఎక్కడ నిర్మించబోతున్నారు? కలెక్టర్ : కడప నుంచి ప్రకాశం జిల్లాలోని అమరావతి–అనంత ప్రధాన రహదారిలో కలిసేలా మైదుకూరు నుండి ప్రధాన రహదారిని నిర్మించాలని యోచిస్తున్నాం. ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఈ రహదారి నిర్మాణానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మరింతగా కృషి చేస్తున్నారు. సాక్షి : సీఎం జిల్లాలో మీ ఆధ్వర్యంలో పాలన ఎలా ఉండబోతోంది? కలెక్టర్ : కచ్చితంగా పారదర్శకంగా ఉంటుంది. ముఖ్యమంత్రి ఉద్దేశం కూడా ఇదే. అవినీతికి తావు లేని పాలన ఉండాలని చెబుతున్నారు. అధికారులను సమన్వయం చేసుకుని పాలన సాగిస్తాం. సాక్షి : ప్రజాప్రతినిధుల మద్దతు ఎలా ఉంది? కలెక్టర్ : ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మొదలుకొని అందరూ ప్రజాప్రతినిధులు సహకరిస్తున్నారు. సొంత జిల్లా కావడంతో అభివృద్ధికి సీఎం అన్ని విధాలుగా సాయం అందిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నియోజకవర్గాలను అభివృద్ది చేసుకోవాలన్నది అందరి ›ప్రజాప్రతినిధుల ఆలోచన. దీనికి అనుగుణంగానే అధికారుల సహకారం ఉంటుంది. సాక్షి : అధికారుల సహకారం ఎలా ఉంది? కలెక్టర్ : పనిచేసేవారూ ఉన్నారు. కొందరు పనిచేయని వారూ ఉన్నారు. ముఖ్యమంత్రి జిల్లాలో అన్ని విభాగాల అధికారులు అప్రమత్తతతోనే ఉంటేనే పనులు జరుగుతాయి. పనిచేసే అధికారులను ప్రోత్సహిస్తాం. పనిచేయని వారిని సాగనంపుతాం. సాక్షి : జిల్లాలో కరువు పరిస్థితులను ఎలా అధిగమిస్తారు? కలెక్టర్ : ఇప్పటికే వర్షాభావంతో ఖరీఫ్ దాదాపుగా పోయింది. రబీపైనే ఆశలు. ప్రత్యామ్నాయ పంటలకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రభుత్వ పరంగా రైతాంగంతోపాటు అన్ని వర్గాల వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటాం. సాక్షి : స్టీల్‌ప్లాంటు నిర్మాణం ఎంత వరకు వచ్చింది? కలెక్టర్ : స్టీల్‌ప్లాంటు నిర్మిస్తున్నట్లు ఇప్పటికే సీఎం ప్రకటించారు. కొప్పర్తి ప్రాంతంలో 6500 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. స్టీల్ ప్లాంటు ఇక్కడే ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తున్నాం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని విషయాలను ముఖ్యమంత్రి స్వయంగా చూస్తున్నారు. స్టీల్‌ప్లాంటు త్వరలోనే ఏర్పాటవుతుంది. దీంతోపాటు కొప్పర్తిలో మరిన్ని పరిశ్రమలు నెలకొల్పబోతున్నాం. సాక్షి : సంక్షేమ పథకాల అమలుకు తీసుకుంటున్న చర్యలేమిటి? కలెక్టర్ : నవరత్నాల అమలుకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. అర్హులైన అందరికీ పెన్షన్లు, రేషన్‌కార్డులు ఇవ్వడంతోపాటు నవరత్నాల్లోని అన్ని పథకాలను అర్హులందరికీ అందేలా చూస్తాం. గ్రామ స్థాయిలో పథకాలు సక్రమంగా అందేందుకు వలంటీర్ల వ్యవస్థతోపాటు గ్రామ, పట్టణ సచివాలయాల వ్యవస్థను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. దీనిని సక్రమంగా అమలు చేసేందుకే చర్యలు తీసుకుంటున్నాం. సచివాలయ ఉద్యోగుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించబోతున్నాం. సాక్షి : కడప విమానాశ్రయ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కలెక్టర్ :కడప విమానాశ్రయాన్ని తిరుపతి, వైజాగ్ తదితర విమానాశ్రయాల స్థాయిలో అభివృద్ధి చేయబోతున్నాం. రాబోయే మూడు నెలల్లో నైట్ ల్యాండింగ్ ఉండేలా చర్యలు చేపడుతున్నాం. విమానాశ్రయంలో అవసరమైన ఆరు ఫిల్లర్స్ ఏర్పాటు చేయబోతున్నాం. ఫారెస్టు క్లియరెన్స్ రావాల్సి ఉంది. త్వరలోనే పనులు పూర్తి చేస్తాం. విమానాశ్రయంలో గ్రీనరీ కోసం ఇప్పటికే కోటి రూపాయలు ఖర్చు చేశాం. మరో కోటి రూపాయలు నిధులు వెచ్చించనున్నాం. -
గుండె గూటిలో వైఎస్సార్
రాయలకాలాన్ని స్వర్ణయుగం అంటాం. దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి ఆ నాటి పాలనను మరోసారి పరిచయం చేశారు. ఇందిరమ్మ పేరుతో గూడులేని పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చారు. ఆరోగ్యశ్రీ పేరుతో బడుగుజీవులకు ప్రాణాలు పోశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేదల ఉన్నత చదువులకు బాటలు వేశారు. పావలా వడ్డీతో మహిళలను లక్షాధికారులను చేశారు. ఉచిత విద్యుత్, రుణమాఫీ, బీడు భూములకు నీళ్లిచ్చి రైతు బాంధవుడిలా నిలిచిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలతో పేదల గుండె గుడిలో దేవుడిగా నిలిచిపోయారు రాజశేఖరరెడ్డి. అటువంటి నేత జయంతి సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. మనసంతా నువ్వే! చినుకు సవ్వడివి నువ్వు గలగల పారే సెలయేరు నువ్వు జలయజ్ఞ ప్రదాత నువ్వు ప్రగతి రథసారథి నువ్వు భవిత బాటసారి నువ్వు చదువుల రేడు నువ్వు ఊపిరిలూదే ప్రాణదాత నువ్వు రైతు వెన్నుదన్ను నువ్వు కలకాలం నిలవాలి నీ నవ్వు.. ప్రజల కోసమే బతికావు ప్రగతి కోసమే జీవించావు రచ్చబండకని ఏగావు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావు రాజన్నా.. నినుమరువలేమన్నా.. మా ఆశవు నువ్వు..మా శ్వాసవు నువ్వు మా ధైర్యం నువ్వు.. మా మనసంతా నువ్వు చెరగదు నీ జ్ఞాపకం మరువదు నిను ఈ లోకం కళ్లు మూసినా నువ్వే.. కళ్లు తెరిచినా నువ్వే.. నీ రూపం పదిలం నీ ప్రగతి అపూర్వం నాయకా ఇవే మా జోహార్లు కన్నీటి హారతులు ఘనమైన నివాళులు.. సాక్షి, తిరుపతి : వైఎస్ అంటేనే ఓ బ్రాండ్. పేదల సంక్షేమానికి చిరునామా. 2004కు ముందు అప్పటి వాతావరణ పరిస్థితులు.. ప్రభుత్వ నిరాదరణతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకునేవారు. అటువంటి వారి జీవితాల్లో వైఎస్.రాజశేఖరరెడ్డి వెలుగు నింపారు. చంద్రబాబు వ్యవసాయం దండగ అంటే కాదు.. పండగ అని నిరూపించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 6.40 లక్షల మంది రైతులు ఉంటే ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూరేలా చర్యలు చేపట్టారు. రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇచ్చారు. విద్యుత్ బకాయిలు మాఫీ చేశారు. పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులకు వడ్డీ కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్న రైతుల రుణాలను మాఫీ చేశారు. ఆత్మహత్య చేసుకున్న వారికి పరిహారం కింద తక్షణం ఆర్థిక సాయం చేశారు. ఎన్నడూ లేని విధంగా నల్ల బెల్లం రైతులకు గిట్టుబాటు ధర కల్పించారు. ఇతర పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు చేపట్టారు. చంద్రబాబు హయాంలో మూతపడ్డ చెరకు ఫ్యాక్టరీలకు రూ.50 కోట్లు కేటాయించి పునః ప్రారంభించారు. ఆయన మరణం తర్వాత మళ్లీ మూతపడటం తెలిసిందే. వైఎస్.జగన్మోహన్రెడ్డి సీఎం కావడంతో ప్రస్తుతం పునఃప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలావుండగా మదనపల్లెలో మూతపడిన విజయా డెయిరీని 2008లో పునఃప్రారంభానికి చర్యలు చేపట్టారు. 5వేల లీటర్లతో ప్రారంభమైన డెయిరీని 70వేల లీటర్ల స్థాయికి పెంచారు. అపర భగీరథుడు రాయలసీమ రైతుల కలల ప్రాజెక్టు హంద్రీ నీవాకు జీవం పోశారు. 2012 డిసెంబర్ నాటికి పూర్తి చేసి సాగు, తాగునీరు అందించాలని భావించారు. ఆయన అకాల మరణంతో హంద్రీ నీవా పనులు ఆగిపోయాయి. వైఎస్ఆర్ తర్వాత ముగ్గురు సీఎంలు వచ్చినా ఇప్పటికీ పూర్తి చెయ్యలేకపోయారు. అదేవిధంగా గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేసి తాగు సాగునీరు అందించాలని భావించారు. 90వేల ఎకరాలకు సాగు నీరు, వేలాది మంది తాగునీటి సమస్య పరిష్కారం కోసం సోమశిల స్వర్ణముఖి ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టారు. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే గాలేరు నగరి ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. జిల్లా నీటి కష్టాలు తెలుసుకుని కర్నూలు జిల్లా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యం పెంచి తెలుగుగంగకు నీటి కొరత లేకుండా చేశారు. తెలుగు గంగ నీటిని సత్యవేడు, తొట్టంబేడు, వరదయ్యపాలెం, బుచ్చినా యుడు కండ్రిగ పరిధిలోని చెరువులకు నీరు నింపే కార్యక్రమానికి వైఎస్.రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. ఆ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. ఇంకా మల్లిమడుగు, బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఆయనే. పేదలకు పక్కా ఇళ్లు జిల్లాలో వేలాది మంది పేదలు గూడులేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అటువంటి వారి కోసం వైఎస్.రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక ఇందిరమ్మ, రాజీవ్‌గృహకల్ప పేరుతో భారీగా పక్కాగృహాల నిర్మాణం చేపట్టారు. మూడు విడతలుగా జిల్లా వ్యాప్తంగా 3.15 లక్షల మందికి పక్కా గృహాలు నిర్మించి ఇచ్చారు. శ్రీకాళహస్తి పట్టణంలో నిరుపేదల కోసం రాజీవ్‌నగర్ కాలనీ ఏర్పాటు చేసి 11వేల మందికి పట్టాలు ఇచ్చి, పక్కాగృహాలు నిర్మించి ఇచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత చదువులు ఫీజులు చెల్లించలేక చదువు ఆగిపోకూడదన్న ఉద్దేశంతో నాడు వైఎస్.రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించారు. 2004 నుంచి 2008 కాలంలో ఈ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా డిగ్రీ, ఇంజినీరింగ్, ఎంసీఏ, పీజీ, ఎల్ఎల్బీ, ఎంబీఏ, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చదివిన 24 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయిం బర్స్మెంట్ పథకం వర్తింపజేశారు. వైఎస్ కలల ప్రాజెక్టు శ్రీసిటీ ఉపాధి అవకాశాల కల్పన దిశగా వైఎస్.రాజశేఖరరెడ్డి పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అందులో సత్యవేడు వద్ద ఏర్పాటు చేసిన శ్రీసిటీ ముఖ్యమైంది. ఇక్కడ 50వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించారు. మరో 30వేల మందికి ఉపాధి కల్పించేందుకు శ్రీకాళహస్తి సమీపంలో విద్యుత్ పరికరాల తయారీ కేంద్రం (మన్నవరం) మంజూరు చేయించారు. ఆయన మరణంతో ఆ కేంద్రం చెన్నైకి తరలివెళ్లింది. -
కరువు సీమపై ..పచ్చని సంతకం
అభివృద్ధికి రూపం.. సంక్షేమంపై చెరగని సంతకం.. జలయజ్ఞంతో సిరులు కురించిన నేత... ‘అనంత’ గుండె గుడిలో కొలువైన మహానేత... ఆయనే వైఎస్సార్. కరువు సీమలో పచ్చని పొలాలు.. విద్యాలయాలు.. అడుగడుగునా అభివృద్ధి.. ప్రజల మదిలో చెరగని ముద్ర రాజన్న. అందుకే జిల్లా అభివృద్ధిని విశ్లేషించాల్సి వస్తే వైఎస్సార్‌కు ముందు, ఆ తర్వాత అని చెప్పాల్సిన పరిస్థితి. సొంత జిల్లా కడపను మించి ఇక్కడి ప్రజలపై ఆదరాభిమానాలు చూపిన అపర భగీరథుడు. బీళ్లు మురిసేలా.. దాహం తీరేలా అభివృద్ధి ఫలాలను అందించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 70వ జయంతిని పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – సాక్షి ప్రతినిధి, అనంతపురం • హంద్రీ–నీవా సుజల స్రవంతి పేరుతో 2004లో రూ. 6,850 కోట్లతో పథకాన్ని చేపట్టారు. తొలిదశ కింద 1.98 లక్షలు.. రెండో దశ కింద రూ.4.04 లక్షలు కలిపి మొత్తం 6.02 లక్షల ఎకరాలకు సాగునీళ్లిచ్చేలా వైఎస్సార్ ప్రణాళిక సిద్ధం చేశారు. • హంద్రీనీవా కోసం వైఎస్సార్ హయాంలోనే రూ.4,054 కోట్లను ఖర్చుచేశారు. అందువల్లే 2012లోనే కృష్ణాజలాలు జీడిపల్లి రిజర్వాయర్‌కు చేరాయి. • ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు వైఎస్సార్ 421 జీఓ జారీ చేశారు. ఈ జీఓ మేరకు చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.1.50 లక్షల మేర అప్పట్లో పరిహారం ఇచ్చారు. • వేరుశనగ రైతులను ఆదుకునేందుకు 2008లో గ్రామం యూనిట్‌గా పంటల బీమా పథకాన్ని వర్తింపజేశారు. • మడకశిరను విద్యాకేంద్రంగా మార్చారు. వ్యవసాయ, వ్యవసాయ ఇంజనీరింగ్, హార్టికల్చర్, వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలలను ఏర్పాటు చేశారు. రిజర్వేషన్లు లేక అభివృద్ధికి నోచుకోని వక్కలిగ, సాదర, వీరశైవ కులాల వారిని బీసీలుగా గుర్తించి ఆదుకున్నారు. • తాడిపత్రి నియోజకవర్గంలోని సాగునీటి సమస్యలు తీర్చేందుకు రూ.536 కోట్లతో చాగల్లు, పెండేకల్లు, యాడికి కాలువను నిర్మించాలని నిర్ణయించారు. వీటి ద్వారా 50 వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించాలన్న లక్ష్యంతో పనులకు శ్రీకారం చుట్టారు. • హిందూపురం తాగునీటి సమస్య తీర్చేందుకు రూ.650 కోట్ల వ్యయంతో శ్రీరామరెడ్డి తాగునీటి పథకాన్ని చేపట్టారు. 14 వందల కి.మీ పైపులైన్లు వేయించి 2008 డిసెంబర్ 30న ప్రారంభించి ‘పురం’ దాహార్తి తీర్చారు. అనంతపురం జిల్లా కరువుకు చిరునామా. ఏడు దశాబ్దాల స్వాతంత్య్ర భారతావనిలో పాలకులు వస్తున్నారు.. పోతున్నారు కానీ ఇక్కడి ప్రజలు, దారిద్య్ర పరిస్థితులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి పరిష్కారానికి ఉపక్రమించిన నేతలు మాత్రం అరుదు. ఎక్కడైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే అయ్యో అంటాం.. కానీ ఇక్కడ సర్వసాధారణం. ఈ క్రమంలోనే జిల్లా సమస్యలపై వైఎస్సార్ ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. రైతుల కష్టాలు, వ్యవసాయ దీనావస్థకు చలించిపోయారు. నా జీవితం రాజన్న తాత చలువే.. నాకిప్పుడు పదమూడేళ్లు. రాజన్న తాత పేరు ఎక్కడ వినిపించినా మా నాన్న చెప్పే మాటలు వింటుంటే నా జీవితం ఆయన చలువేనన్న విషయం గుర్తుకొస్తుంది. నాకప్పుడు నాలుగు నెలల వయసంట. మెదడు సంబంధ వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉండగా చికిత్స చేయించేందుకు అమ్మానాన్న ఎక్కడెక్కడో చూపించారంట. ఆరోగ్య కుదుటపడకపోగా వయస్సు కూడా పెరుగుతుండటంతో ఎంతో బాధ పడ్డారంట. మాటలు కూడా రాకపోవడంతో ఎన్నో నిద్రలేని రాత్రిళ్లు గడిపారంట. అప్పట్లో రాజన్న తాత ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నాకు మూడుసార్లు ఆపరేషన్ చేశారంట. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది. అందరిలా బడికి పోతున్నా. రాజన్న తాతకు జీవితాంతం రుణపడి ఉంటాం. – అభిషేక్, పెడపల్లి, పుట్టపర్తి మండలం పండుగలా వ్యవ‘సాయం’ 2004లో వైఎస్సార్ అధికారం చేపట్టిన తర్వాత వ్యవసాయ, అనుబంధ రంగాలకు పెద్ద పీట వేశారు. ప్రమాణాస్వీకారం చేసిన మరుక్షణమే విద్యుత్ బిల్లులు మాఫీ చేసి ఉచిత విద్యుత్ సరఫరాకు సంతకం చేయడంతోనే రైతులకు భరోసా లభించింది. జిల్లా రైతులకు సంబంధించిన బకాయిలు రూ.70.65 కోట్లు మాఫీ కావడంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. అప్పట్లో ఉన్న 1.75 లక్షల వ్యవసాయ మోటార్లకు ఉచితంగా కరెంటు ఇచ్చారు. ఆయన ఐదేళ్ల హయాంలో రూ.150 కోట్లు విలువైన ఉచిత కరెంటు రైతులకు అందజేసి వ్యవసాయానికి జీవం పోశారు. వైఎస్ అధికారంలో ఉన్న ఆరేళ్లలో పంట రుణాల కింద 27.37 లక్షల మంది రైతులకు రూ.6,594 కోట్లు అందజేశారు. ఏటా పంట రుణాలు పెంచుతూ, అందులోనూ కొత్త రైతులకు ప్రాధాన్యత ఇవ్వడంతో వ్యవసాయం పండుగలా సాగింది. సకాలంలో పంట రుణాలు చెల్లించిన రైతులకు పావలా వడ్డీ కింద ఐదేళ్లలో 12 లక్షల అకౌంట్లకు రూ.44 కోట్లు అందజేశారు. – అనంతపురం అగ్రికల్చర్ బీమాతో ధీమా చంద్రబాబు హయాంలో మండలం యూనిట్‌గా అమలవుతున్న పంటల బీమా పధకాన్ని రైతులకు ఉపయోగపడేలా గ్రామం యూనిట్‌గా మార్పు చేసి అమలు చేశారు. 2004–2009 మధ్య కాలంలో దెబ్బతిన్న వేరుశనగ పంటకు సంబంధించి పంటల బీమా కింద ఏకంగా రూ.1,138 కోట్లు పరిహారం ఇచ్చారు. 2008లో తీవ్ర వర్షాభావంతో 80 శాతం మేర పంటలు దెబ్బతిన్నాయి. అప్పట్లో జిల్లా వ్యాప్తంగా 4.64 లక్షల మంది రైతులు తమ వాటా కింద రూ.32 కోట్లు ప్రీమియం కట్టారు. గ్రామం యూనిట్‌గా బీమా పథకం కింద 4.59 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.620 కోట్లు పరిహారం విడుదల చేసి పంటలు పండకున్నా ప్రభుత్వం ఉందనే భరోసా కల్పించారు. 2008లో నెలకొన్న తీవ్ర కరువు దృష్ట్యా ప్రకటించిన రుణమాఫీ పథకంలో భాగంగా బ్యాంకులో ఉన్న 3,03,937 మంది రైతులకు సంబంధించి రూ.554.92 కోట్లు రుణాలు ఒకేవిడతలో మాఫీ అయ్యాయి. అప్పటికే బ్యాంకులకు రుణాలు చెల్లించిన రైతులకు ప్రోత్సాహకాల కింద 3,61,269 మంది రైతులకు రూ.5 వేల చొప్పున రూ.174.04 కోట్లు అందజేశారు. 2004 నుంచి 2009 వరకు 28,05,901 మంది రైతులకు 26,02,717 క్వింటాళ్లు విత్తనకాయ పంపిణీ చేశారు. దీని కోసం ఏకంగా రూ.280.88 కోట్లు సబ్సిడీ వర్తింపజేశారు. కంది, ఆముదం లాంటి ఇతర విత్తనాల కోసం రూ.80 కోట్లు ఖర్చు చేశారు. మొత్తంగా రూ.360 కోట్లు విత్తన రాయితీ కల్పించాడు. పండిన వరి, వేరుశనగ, ఇతర పంటలకు కనీస మద్ధతు ధర (ఎంఎస్పీ) కల్పించడంతో రైతులకు గిట్టుబాటు ధరలు లభించాయి. – అనంతపురం అగ్రికల్చర్ కరువు సీమలో ‘పాడి’ సిరులు కరువు సీమ ‘అనంత’లో క్షీరవిప్లవం సృష్టించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుంది. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్... పాడి పరిశ్రమకు చేయూతనిచ్చారు. 2006లో ప్రజాకర్షకమైన పశుక్రాంతి, జీవక్రాంతి లాంటి పథకాలకు రూపకల్పన చేశారు. పాల వెల్లువతోనే పేద వర్గాల జీవణప్రమాణాలు మెరుగుపడతాయని భావించి 50 శాతం రాయితీ వర్తింపజేసి గుజరాత్, హరియానా, తమిళనాడు, కర్నాటక తదితర రాష్ట్రాలకు మేలుజాతి సంకరజాతి, ముర్రా జాతి పాడి ఆవులు, గేదెల పంపిణీకి శ్రీకారం చుట్టారు. 2007, 2008, 2009... కేవలం మూడు సంవత్సరాల్లోనే 50 శాతం రాయితీతో రూ.22 కోట్లు బడ్జెట్ కేటాయించి 7,200 పాడి పశువులు, గేదెలు రైతులు, పేద వర్గాలకు అందజేశారు. ఈ క్రమంలో 2007–10 మధ్య కాలంలో ఏపీ డెయి రీ రోజుకు 60 వేల లీటర్ల పాలు సేక రించి లాభా ల బాట పట్టింది. – అనంతపురం, అగ్రికల్చర్ ‘108’తో పునర్జన్మ శరణార్థుల పాలిట సంజీవినిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ‘108’ మారింది. 2005 ఆగస్టు 15న ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 108 వాహనాలను ప్రవేశపెట్టారు. జిల్లాలో మొదటిదశగా అనంతపురం, గుంతకల్లు, హిందూపురం, ధర్మవరం, కదిరి ప్రాంతాల్లో ప్రారంభించారు. మొత్తంగా 37 వాహనాలను ఏర్పాటు చేశారు. ప్రమాదాలు, గుండెజబ్బులు, ప్రసవాలు ఇలా ఏ సమస్య వచ్చిన 108కు ఫోన్ చేస్తే చాలు వెంటనే సిబ్బంది అక్కడకు చేరుకుని ఆపదలో ఉన్న వారిని ఆస్పత్రికి చేరుస్తూ వచ్చారు. ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం మొదటి ఏడాది మినహా ప్రతి నెలా 5వేల మంది రోగులను ఆస్పత్రికి చేర్చారు. 2006 నుంచి ఈ ఏడాది వరకు 8,23,549 మందిని ఆస్పత్రులకు చేర్చి ప్రాణాలు కాపాడారు. 2007 ఏప్రిల్‌లో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి, వెయ్యి రకాల జబ్బులకు ఉచిత వైద్యం అందించారు. – అనంతపురం సాంకేతిక విద్యా ప్రదాత కరువు సీమలో కల్పతరువుగా జేఎన్టీయూ(ఎ)ను డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తీర్చిదిద్దారు. 2008 ఆగస్టు 18న జేఎన్టీయూ(ఎ)కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ వర్సిటీగా మార్పు చేశారు. అనంతపురం లాంటి వెనుకబడిన జిల్లాలో సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వర్సిటీ పరిధిలో 98 ఇంజినీరింగ్ కళాశాలలు, 33 ఫార్మసీ కళాశాలలు ఉన్నాయి. ఏటా ఒక లక్ష మంది విద్యార్థులు సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే 2007–08 విద్యాసంవత్సరంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. మొదటి ఏడాది రూ.2వేల కోట్లు కేటాయించి బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, డిగ్రీ, పీజీ, బీఈడీ, ఎంఈడీ, ఎంఫిల్ , ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ అగ్రికల్చర్, వంటి కోర్సులను నిరుపేద విద్యార్థులకు చేరువ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో లబ్ధి పొందిన అనేక మంది నేడు ఉన్నత స్థానాల్లో స్ధిరపడ్డారు. జాతీయ స్థాయిలో ఈ పథకం అమలు తీరుతెన్నులపై చర్చ జరిగి, అనేక రాష్ట్రాలు ఈ పథకాన్ని స్ఫూర్తిదాయకంగా అనుసరిస్తున్నాయి. – జేఎన్టీయూ -
ఒక హక్కుగా ..ఒక బాధ్యతగా.. ఓటడుగుతున్నాం.
వైఎస్సార్సీపీ తెలంగాణ మేనిఫెస్టో తెలంగాణ అభివృద్ధి వైఎస్ పుణ్యమే చంద్రబాబు పరిపాలనలో వల్లకాడు టీఆర్ఎస్, బీజేపీలకు పాలన చరిత్ర లేదు టీడీపీ, కాంగ్రెస్ తమ పాలనను చెప్పుకోలేవు పగటికలల సౌధాలతో మభ్యపెడుతున్నాయి జాతీయ ప్రాజెక్టుగా ప్రాణహిత-చేవెళ్ల విద్య, వైద్య రంగాల సమగ్రాభివృద్ధి ‘‘అభివృద్ధి-సంక్షేమం. ఇవి రెండూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్లు. మిగతా పార్టీలకు, వైఎస్సార్సీపీకి మధ్య అనేక తేడాలున్నాయి. తెలంగాణ ఎన్నికల బరిలో ఉన్న మిగతా పార్టీలన్నీ చిటికెల పందిరి వేస్తున్నాయి. పగటికల సౌధాన్ని చూపెడుతున్నాయి. టీడీపీ, కాంగ్రెస్ రెండూ తమ పాలనలో తెలంగాణ బాగుపడిందన్న నినాదంతో ప్రజల ముందుకు రావడానికి ఏమాత్రం సిద్ధంగా లేవు. ఇక టీఆర్ఎస్, బీజేపీలకు పాలించిన చరిత్రే లేదు. వైఎస్సార్ హయూంలోనే మొత్తం తెలంగాణ సమగ్రంగా అభివృద్ధి చెందింది. అందుకే.... ఆ అభివృద్ధిని చూపి ఓటు అడుగుతున్నాం... ప్రజలకు, పల్లెలకు మేలు చేసిన చరిత్రతో ఓటడుగుతున్నాం... ఒక హక్కుగా ఓటడుగుతున్నాం. ఒక బాధ్యతగా ఓటడుగుతున్నాం. ఇది మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరి జీవితాన్నీ మంచిగా మలచిన పార్టీగా అడుగుతున్న ఓటు’’ - వైఎస్సార్సీపీ తొలి సంతకాలివే... ముఖ్యమంత్రిగా తాను తొలి సంతకాలు చేయబోయే పథకాలు, విధానాల గురించి జగన్ వివరించారు. అవి ఆయన మాటల్లోనే.. ‘అమ్మ ఒడి’తో అక్కాచెల్లెళ్లకు భరోసా క్కాచెల్లెమ్మల కోసం తొలి సంతకం పెట్టబోతున్నా. పూట గడవడానికి పనులకు పోవాల్సిన పరిస్థితి ప్రస్తుతముంది. ఒక్క రోజు కూలికెళ్తే రూ.100-150 వస్తుంది. దాంతో మూడు రోజులు గడిచిపోతుంది. నాలుగో రోజు పనికెళ్లకపోతే పూట గడవదు. పిల్లలను కూడా పన్లోకి తీసుకెళ్తే మరో రూ.50 వస్తాయి కదా అనుకునే పరిస్థితి. అలాంటి అక్కాచెల్లెళ్ల జీవితాన్ని మార్చేలా మొదటి సంతకం చేయబోతున్నా. వారు చేయాల్సింది తమ పిల్లలను పనికి కాకుండా బడికి పంపడమే. వారిని డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్ల వంటి పెద్ద చదువులు చదివించే బాధ్యత నాది. అలా బడికి పంపిన అక్కాచెల్లెళ్లకు ఒక బిడ్డకు రూ.500 చొప్పున, ఇద్దరు పిల్లలకు రూ.1000 ప్రతి నెలా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసే ‘అమ్మ ఒడి’ పథకానికి శ్రీకారం చుట్టబోతున్నా. పిల్లలు పై చదువులు చదివి, పెద్ద ఉద్యోగాల్లో చేరి తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలన్నదే నా ఆశ. రూ.700 పించన్ అవ్వా తాతల కోసం మంచి మనవడిలా రెండో సంతకం పెట్టబోతున్నా. వయసు, శరీరం సహకరించకపోతున్నా అవ్వాతాతలు పనికి పోతున్నారు. నేను చాలా గ్రామాల్లో వాళ్లను ఆప్యాయంగా పలకరిస్తే, ‘నాయనా, మీ నాయన పుణ్యంతో ఇస్తున్న రూ.200 పింఛను ఒక పూట భోజనానికే సరిపోతోంది. రెండు పూటలా తినాలంటే పనికి పోవాలి కదా’ అంటున్నారు. అలాంటి అవ్వాతాతలకు భరోసా ఇస్తూ.. దివంగత మహానేత పై నుంచి చూసి గర్వపడేలా రూ.200 పింఛన్‌ను రూ.700 చేస్తా. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి మూడో సంతకం రైతన్నల కోసం. రైతులు రేయింబవళ్లు కష్టపడి పంటలు పండిస్తున్నా మద్దతు ధర లేక, గిట్టుబాటు ధర దొరక్క సతమతమవుతున్నారు. పండిన పంట ధర కాస్తా, వారు అమ్ముకున్న రెండు మాసాలకే రెండింతలవుతోంది. ఇక మీదట రైతన్నలు మద్దతు ధర కోసం ఆందోళన చెందాల్సిన పని లేదు. వారిలో భరోసా నింపేందుకు రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. మద్దతు ధరపై భరోసా ఇస్తా. డ్వాక్రా రుణాలు రద్దు నాలుగో సంతకం మళ్లీ అక్కాచెల్లెళ్ల కోసమే. డ్వాక్రా రుణాలకు నెలకు రూ.2 వేల చొప్పున ప్రతి నెలా ఒకటో తేదీన వాయిదా కట్టకపోతే వడ్డీ మీద వడ్డీ కట్టాల్సిన పరిస్థితి. దాంతో తమ పిల్లలను కూడా పనిలోకి తీసుకెళ్తున్న దుస్థితి. అందుకే వారికి కొత్త జీవితం ఇచ్చేందుకు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని స్పష్టమైన హామీ ఇస్తున్నా. రూ.20 వేల కోట్ల డ్వాక్రా రుణాన్ని కిందా మీదా పడైనా తీరుస్తా. ఏ కార్డు అయినా 24 గంటల్లోనే ఏ వార్డుకు, గ్రామానికి వెళ్లినా, ‘అన్నా మాకు ఇల్లు లేదు, రేషన్‌కార్డు లేదు, పెన్షన్ లేదు’ అని చెబుతున్నారు. ఏ కార్డు కావాలన్నా నాయకుల చుట్టూ తిరగక్కర్లేకుండా మీ గ్రామంలోనే, మీ వార్డులోనే ఒక కార్యాలయం, అందులో కంప్యూటర్, ప్రింటర్ వంటి వన్నీ పెట్టి 24 గంటల్లో ఏ కార్డయినా అందించేలా ఐదో సంతకం పెట్టబోతున్నా. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపు... మీ ఇంట ప్రతి ఒక్కరి భవితకు, తెలంగాణలో మరో చరిత్రకు మేలిమలుపు!’’ అని తెలంగాణ మేనిఫెస్టోలో వైఎస్సార్సీపీ పేర్కొంది. చంద్రబాబు పాలనలో తెలంగాణ ఎలా వల్లకాడుగా మారిందో మేనిఫెస్టో వివరించింది. వైఎస్సార్ హాయంలో తెలంగాణను అభివృద్ధి చేసిన విధానాన్నీ పేర్కొం ది. విభజన బిల్లులో పేర్కొన్న అన్ని హామీలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేసింది. వైఎస్సార్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి తమకు ఓట్లు వేయాలని... అభివృద్ధి-సంక్షేమం అనే రెండు నినాదాలతో ముందుకు సాగుతామని పేర్కొంది. హైదరాబాద్‌కు నౌకాశ్రయంతో అనుసంధానం కోసం హైదరాబాద్ నుంచి మచిలీపట్నం దాకా పారిశ్రామిక కారిడార్ ఏర్పాటును ప్రతిపాదిస్తున్నట్టు వివరించింది. బాబు హయాంలో బోసిపోయిన పల్లెలు... బాబు తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ పల్లెలన్నీ కన్నీరు పెట్టాయని వివరించింది. ‘‘పంటలు పండక, తిండి లేక, కూలీ చేద్దామన్నా పనులు లేక... దారుణ పరిస్థితులుండేవి. ఉన్న ఊళ్లో బతుకుదెరువు లేక బతుకు జీవుడా... అంటూ పల్లె ప్రజలు పొట్ట చేతపట్టుకుని పిల్లాజెల్లతో ముంబై వంటి నగరాలకు వలసలు వెళ్లారు. దుబాయి లాంటి గల్ఫ్ దేశాలకూ వెళ్లారు. ఎందుకంటే బాబు పాలనలో తాగటానికి నీరుండేది కాదు. పైర్లకు సాగునీరు లేదు. వ్యవసాయ బోర్లకు కరెంటుండేది కాదు. ఆ పరిస్థితుల్లో కూడా కరెంటు చార్జీల పేరుతో రైతులను, ప్రజలను బాబు పీల్చి పిప్పి చేశారు. కరువొచ్చి తినడానికి తిండిలేని దయనీయ పరిస్థితుల్లో రైతులుంటే, వ్యవసాయ బోర్లకు కరెంటు బిల్లులు చెల్లించాలంటూ ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి మరీ పోలీసులతో ఒత్తిళ్లు చేయించారు. 14 వేల మంది రైతులపై కేసులు పెట్టించారు. దీనికోసం ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు పెట్టించారు. బిల్లులు కట్టకుంటే గ్రామాలపై పడి రైతుల ఇళ్లల్లో చెం బూ, తపేలా కూడా తీసుకుపోయారు. ఆ అవమానం భరించలేక వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు’’ అని పేర్కొంది. వైఎస్సార్ హయాంలో బంగారు తెలంగాణ తెలంగాణలోని ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికీ వైఎస్ మేలు చేశారని మేనిఫెస్టో గుర్తుచేసింది. ‘‘వైఎస్సార్ ఏనాడూ రాయలసీమ నాయకుడు అనిపించుకోలేదు. ఇంటింటి మనిషిగా పరిపాలన చేశారు. అందుకే వైఎస్ఆర్ హఠాన్మరణంతో ఎక్కువగా తెలంగాణ బిడ్డలే గుండె ఆగి మరణించా రు. తెలంగాణ ప్రజల కష్టాలను, కన్నీళ్లను దగ్గరగా చూడబట్టే వైఎస్ అధికారం చేపట్టగానే ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టారు. అందులో భాగంగానే రైతు రుణాల మాఫీ, విద్యుత్ బకాయిల మాఫీ, సాగుకు 7 గంటల ఉచిత విద్యుత్, జలయజ్ఞం పథకాలను అమలు చేశారు. జలయజ్ఞం కింద శ్రీకారం చుట్టిన 86 ప్రాజెక్టుల్లో సగం తెలంగాణలోనే ఉన్నాయి. ప్రాణహిత-చేవెళ్ల, ఎల్లంపల్లి, దేవాదుల, అలీసాగర్, శ్రీరాంసాగర్, నెట్టెంపాడు, కొయిల్‌సాగర్, భీమా ఎత్తిపోతల పథకాలతో పాటు మరె న్నో ప్రాజెక్టుల నిర్మాణ పనులు ఆయన ఉండగా చకాచకా జరిగాయి. పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల పథకాలకు కేంద్రం నుంచి అనుమతులు కూడా సంపాదించారు. కానీ ఆయన మరణం తర్వాత ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి ఇప్పటి పాలకుల్లో లోపించడం వల్లే ఏ ప్రాజెక్టూ ముందుకు సాగడం లేదు’’ అని మేనిఫెస్టో గుర్తు చేసింది. హామీలన్నీ అమలు చేయాల్సిందే... విభజన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని వైఎస్సార్సీపీ మేనిఫెస్టో డిమాండ్ చేసింది. అవి... 1. రెండు ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి కోసం టాక్స్ ప్రోత్సాహకాలు, ఆర్థిక సహాయం 2. రెండు ప్రాంతాల్లో వేర్వేరుగా గిరిజన వర్సిటీలు 3. తెలంగాణలో హార్టికల్చర్ యూనివర్సిటీ 4. 4 వేల మెగావాట్ల సామర్థ్యమున్న విద్యుత్కేంద్రం 5. ఖమ్మం జిల్లాలో సమీకృత ఉక్కు కర్మాగారం 6. తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ 7. హైదరాబాద్ నుంచి తెలంగాణలోని ముఖ్యనగరాలకు ర్యాపిడ్ రైలు, రోడ్డు కనెక్టివిటీ చరిత్ర వూర్చిన వైఎస్ ఉచిత విద్యుత్ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 28 లక్షల వ్యవసాయ పంపు సెట్లుంటే, వాటిలో 17 లక్షలు తెలంగాణ జిల్లాల్లోనే ఉన్నాయని మేనిఫెస్టో గుర్తు చేసింది. ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిల మాఫీ, 32 లక్షల మంది రైతులకు రూ.5,000 చొప్పున ప్రోత్సాహక రాయితీ.... ఈ మూడు నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రజలు అప్పుల ఊబిలో నుంచి బయట పడగలిగారని పేర్కొంది. ‘‘జిల్లాకో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్న నిర్ణయంలో భాగంగా వైఎస్ న ల్లగొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్‌లలో వర్సిటీలు నెలకొల్పారు. ఆదిలాబాద్ జిల్లా బాసరలో ట్రిపుల్ ఐటీ, మెదక్ జిల్లా కందిలో ఐఐటీ ఏర్పాటు చేసింది బాబు చక్రం తిప్పడం వల్ల కాదు, వైఎస్సార్ ఒత్తిడి తీసుకురావడం వల్ల మాత్రమే! దేశంలోనే తొలిసారిగా మౌలానా ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లో ఏర్పాటైంది. బీబీనగర్ వద్ద నిమ్స్ విశ్వవిద్యాలయం, వరంగల్‌కు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఆదిలాబాద్‌కు వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల, నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏర్పాటు వైఎస్ హయాంలోనే జరిగాయి. దేశంలోనే తొలిసారిగా గిరిజనులకు దాదాపు 13 లక్షల ఎకరాల భూమిని పట్టాలిచ్చి పంపిణీ చేసిందీ అప్పుడే’’ అని మేనిఫెస్టో గుర్తు చేసింది. వ్యవసాయానికి ఇద్దరు మంత్రులు రాష్ట్రంలో ఇద్దరు వ్యవసాయ మంత్రులను నియమిస్తామని వైఎస్సార్సీపీ మేనిఫెస్టో పేర్కొంది. ఒకరు వ్యవసాయోత్పత్తులను, మరొకరు పంట నిల్వ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని వివరించింది. వ్యవసాయోత్పత్తుల నిల్వ కోసం అదనంగా 40 లక్షల చదరపు అడుగుల మేర గిడ్డంగుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించింది. సహకార ఉద్యమ పద్ధతిలో సాగు ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగినా ప్రతి ఎకరాపై రైతుకు లభించే ఆదాయం మా త్రం పెరగడం లేదు. కాబట్టి ప్రతి జిల్లాలో ఒకట్రెండు గ్రామాలను ఎన్నుకుని వాణిజ్య బ్యాం కుల మద్దతుతో సమీకృత విధానం ద్వారా సహకారోద్యమ పద్ధతిలో సాగును ముందుకు తీసుకెళ్తాం. ప్రతి రైతుకూ వ్యవసాయంపై కనీస రాబ డులు, ఆదాయం వచ్చేలా చేసేందుకు వైఎస్సార్సీపీ కట్టుబడి ఉంది’’ అని స్పష్టం చేసింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రాణహిత-చేవెళ్ల కొండల్ని సైతం తొలిచి తెలంగాణలో సాగునీటి సదుపాయం కల్పించేందుకు వైఎస్సార్ భగీరథ ప్రయత్నం చేశారని మేనిఫెస్టో గుర్తు చేసింది. ఆయన మరణానంతరం ఆగిపోయిన, అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి, దాన్ని కేంద్రమే చేపట్టేలా ఒత్తిడి తెస్తామని ప్రకటించింది. ప్రాచీన ఆలయాల అభివృద్ధి తెలంగాణలో ముఖ్యమైన, చారిత్రక ప్రాధాన్యమున్న వేములవాడ, యాదగిరిగుట్ట, బాసర, కొలనుపాక జైన్ మందిర్, కొండగట్టు, కాళేశ్వరం, పాకాల, అలంపూర్, రామప్ప వంటి ఆలయాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది. నాగార్జునసాగర్‌లోని బుద్ధవరం ప్రాజెక్టు, చార్మినార్, కుతుబ్‌షాహీ సమాధులు, కాకతీయ హెరిటేజ్ సర్క్యూట్లను సుందర పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని పేర్కొంది. విద్యుత్ యజ్ఞం తెలంగాణలో వెలుగులు నింపేందుకు విద్యుత్ యజ్ఞాన్ని చేపడతామని వైఎస్సార్సీపీ మేనిఫెస్టో ప్రకటించింది. ‘‘చిన్నపాటి జల, పవన, సౌర విద్యుత్కేంద్రాల వంటి సంప్రదాయేతర ఇంధన వనరులను అభివృద్ధి చేస్తాం. కరీంనగర్లో 700 మెగావాట్లు, శంకర్‌పల్లిలో 1,000 మెగావాట్ల గ్యాస్ ఆధారిత ప్లాంట్లతో పాటు వరంగల్‌లో చెరో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు థర్మల్ ప్లాంట్లు, 1,200 మెగావాట్ల సింగరేణి విద్యుత్ ప్లాంట్లు, ఎన్టీపీసీ తలపెట్టిన 4,000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం’’ అని ప్రకటించింది. వైఎస్సార్ హయాంలో అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి సాధించిందని, ఇప్పుడు దాన్ని అన్ని జిల్లాలకూ విస్తరించాలని మేనిఫోస్టో ఆకాంక్షించింది. వచ్చే పదేళ్లల్లో అక్షరాస్యత రేటును 99 శాతానికి పెంచేందుకు ఉద్యమంలా ఒక కార్యక్రమం చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది. ఆదిలాబాద్ జిల్లా గిరిజనుల విద్యా, ఆరోగ్యాల కోసం మందులు, వైద్యులు, పారా మెడికల్ సిబ్బందితో కూడిన 20 మొబైల్ హెల్త్ వాహనాలు, ప్రతి రెవెన్యూ డివిజన్లో నవోదయ పాఠశాలలు, కేంద్రీయ ప్రమాణాలున్న ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు ప్రారంభిస్తామని చెప్పింది. రూ.100కే 150 యూనిట్ల విద్యుత్ నెలకు 150 యూనిట్ల లోపు వాడకముండే గృహ వినియోగదారులందరికీ కేవలం 100 రూపాయలకే విద్యుత్ సరఫరా చేస్తామని వైఎస్సార్సీపీ హామీ ఇచ్చింది. ఫలితంగా రాష్ట్రంలో కోటి 76 లక్షల మందికిపైగా లబ్ధి చేకూరనుంది. పెరగబోయే చార్జీలతో లెక్కిస్తే వారు ప్రస్తుతం రూ.600కు పైగా చెల్లించాల్సి ఉంటుంది. మర మగ్గాలకు యూనిట్‌కు 1.5 రూపాయలకే కరెంటు ప్రస్తుతం కాటేజీ పరిశ్రమల కింద వచ్చే మర మగ్గాల చేనేత కార్మికులకు యూనిట్ విద్యుత్ ధర రూ.3.75 ఉంది. దాన్ని రూ.4.42కు పెంచేందుకు ఇప్పటికే ఈఆర్సీ వద్ద ప్రతిపాదనలున్నాయి. ఎన్నికలు ముగియగానే చార్జీలు పెరగనున్నాయి. అయితే వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే యూనిట్ చార్జీని రూ.1.5కి తగ్గిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. ప్రార్థనా మందిరాలు, మతపరమైన ఆరాధన కేంద్రాలను కూడా ప్రస్తుతం వాణిజ్య సంస్థలుగానే పరిగణించి యూనిట్‌కు రూ.4.72 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇకపై వాటినీ గృహ వినియోగ కేటగిరీ కిందే పరిగణిస్తామని పార్టీ హామీ ఇచ్చింది.